ఎనుముల రేవంత్ రెడ్డి

ఎనుముల రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్‌గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ పీసీసీ చీఫ్‌‌గా ఉన్న రేవంత్ రెడ్డి.. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు తెలంగాణలో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం మల్కాజిగిరి నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఉన్న వారిలో అగ్రస్థానం రేవంత్‌దే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.

రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మేనకోడలు గీతను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది.

విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇంకా చదవండి

Telangana Cabinet Expansion: కౌంట్ డౌన్‌ షురూ..! రేవంత్ కేబినెట్ 2.0లో ఉండేదెవరు..?

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటై 14 నెలలు గడచిపోయింది. ఇప్పటికీ సీఎం 11 మంది మంత్రివర్గ సహచరులతోనే పాలన కొనసాగిస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన రేవంత్‌కి కేబినెట్‌లో ఫుల్ టీమ్‌ ఏర్పాటు చేసుకునేందుకు పార్టీ హై కమాండ్ ఓకే చెప్పిందా? హైకమండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేవంత్ కేబినెట్ 2.0లో ఉండేదెవరు?.. అనేది హాట్ టాపిక్ గా మారింది.

Telangana: చేసిన పని చెప్పుకుందాం.. రాహుల్, ఖార్గేలతో భారీ సభలకు కాంగ్రెస్ ఫ్లాన్..!

ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు అధ్యయనం కోసం అక్టోబర్ 11న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్‌ను నియమించింది తెలంగాణ సర్కార్‌. క సభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌కు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

Telangana: జంప్‌ జిలానీలకు కొత్త టెన్షన్‌..! కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

బీఆర్ఎస్‌ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, సంజయ్‌ కుమార్‌, ప్రకాశ్‌ గౌడ్‌, గూడెం మహిపాల్‌ రెడ్డి, అరికెపూడి గాంధీకి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలన్నారు.

Telangana: ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే లేఖ రాసిన సొంత పార్టీ ఎమ్మెల్యే.. ఏమని తెలుసా..?

తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ రగడ కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఎమ్మెల్యేల సమావేశం వాస్తవమే అని అనిరుధ్ క్లారిటీ ఇస్తే.. అందులో తాను పాల్గొన లేదని వరంగల్ వెస్ట్ ఎమ్మె్ల్యే నాయిని రాజేందర్ రెడ్డి చెప్తున్నారు. తాను పాల్గొనకున్నా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అయినా ఎమ్మెల్యేలు భేటీ అయితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

Telangana: విద్యా ప్రమాణాల పెంపునకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాల విద్యలో AI

ఇప్పుడు ప్రపంచం అంతా టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది. ఈ సమయంలో విద్యార్థులకు డిజిటల్‌ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ ఎడ్యుకేషన్ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది.

రాందేవ్ 25 ఏళ్ల కష్టానికి నిదర్శనమే ఈ ఎక్స్ పీరియం పార్క్ : మెగాస్టార్ చిరంజీవి

చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో రామడుగు రాందేవ్ రావు ఎక్స్‌పీరియం పార్క్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, సీఎం రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

BJP vs Congress: తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ..! కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం

తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ తెగడం లేదు. ఈ వ్యవహారంపై ఇటు కాంగ్రెస్‌..అటు బీజేపీ నేతలు తగ్గేదే లేదంటూ కౌంటర్లు విసురుతున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానిది..ముమ్మాటికి వివక్షే అని మండిపడుతోంది కాంగ్రెస్‌ పార్టీ. అటు బీజేపీ మాత్రం..లిస్ట్‌ పంపించినంత మాత్రాన అనర్హులకు అవార్డులు ఇవ్వాలా అంటూ ప్రశ్నిస్తోంది..?

Telangana: తెలంగాణ ప్రజలకు పండగలాంటి వార్త.. నేడే అకౌంట్లలో నగదు జమ.. డిటైల్స్ ఇదిగో

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డు జారీ పథకాలను గణతంత్ర దినోత్సవం నాడు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.. అయితే.. ఈ నాలుగు పథకాలు జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని ప్రతి మండలంలోని ఒక్కో గ్రామంలో ఇవ్వాల్టి (జనవరి 27) నుంచి అమలుకానున్నాయి..

ప్రజాసేవ చేయడానికి పదవులు అవసరం లేదు.. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసి తీరుతాంః రేవంత్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నారాయణ పేట జిల్లా కోస్గీ మండలం చంద్రవంచ గ్రామంలో ప్రజాపాలన కొత్త పథకాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రామ లబ్దిదారులకు రైతు భరోసా,ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులను ముఖ్యమంత్రి అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సహా ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

Revanth Reddy: రిపబ్లిక్‌డే సందర్భంగా అదిరిపోయే న్యూస్.. తెలంగాణలో నాలుగు పథకాలకు శ్రీకారం..

తెలంగాణలో నేడు పథకాల జాతర మొదలుకానుంది. రాష్ట్రంలో గేమ్‌ ఛేంజర్‌గా భావిస్తోన్న నాలుగు పథకాలకు నారాయణపేట జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే అన్నిజిల్లాలో ఏర్పాట్లను పూర్తిచేశారు అధికారులు. నేటినుంచి రాష్ట్రంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని మంత్రులు పేర్కొంటున్నారు.