![ప్రభాస్](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/11/prabhas-150-150.png)
ప్రభాస్
రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్‌గా ప్రస్తుతం సత్తా చాటుతున్నాడు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ కెరియర్ మారిపోయిందని చెప్పవచ్చు. అప్పటి వరకు మాస్ హీరోగా ఉన్న ప్రభాస్.. బాహుబలి మూవీతో పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఆదిపురుష్ మూవీతో హీరోగా తనకున్న ఇమేజ్‌ను 360 డిగ్రీలు మార్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు రెబల్ స్టార్ మూవీస్ బిజినెస్ రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లకు చేరుకుందంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అభిమానులు ప్రభాస్‌ను డార్లింగ్‌గా పిలుచుకుంటారు.
1979 అక్టోబర్ 23న మద్రాసులో జన్మించారు ప్రభాస్. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు వారి కుటుంబ స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు ప్రభాస్. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర, అడవి రాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు సినిమాలు టాలీవుడ్‌లో యంగ్ రెబల్ స్టార్ రేంజ్‌ను పెంచేశాయి. బిల్లా, ఏక్ నిరంజన్, డార్టింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, రెబెల్, మిర్చి మూవీస్‌తో టాలీవుడ్‌లో టాప్ యంగ్ హీరోస్ సరసన నిలిచాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. డిసెంబరు 22న రిలీజ్ కానున్న సాలార్‌తో పాటు ప్రాజెక్ట్ కె, స్పిరిట్ పాన్ ఇండియా మూవీస్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి.
కృష్ణంరాజుకు ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తేలు. దీంతో కృష్ణంరాజు సోదరుడు సూర్యనారాయణ రాజు కుమారుడైన ప్రభాస్.. కృష్ణంరాజు నటవారసుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ అవడానికి సోదరుడి కుమారుడే అయినా.. వీరిద్దరి మధ్య తండ్రీ కొడుకుల అనుబంధమే కొనసాగేది. అంతగా తన నట వారసుడి గురించి కృష్ణంరాజు.. గర్వపడేవారు. ప్రభాస్, కృష్ణంరాజు కలసి రెబల్ సినిమాలో కూడా యాక్ట్ చేశారు. ఇందులో తండ్రీకొడుకులుగా వారు నటించారు. నిజజీవితంలో కృష్ణంరాజు ప్రభాస్ కు పెదనాన్న కాగా.. ఈ చిత్రంలో మాత్రం.. ఇద్దరూ తండ్రీకొడుకుల్లా చేసిన నటన రెబల్ ఫ్యామిలీ ఫ్యాన్స్ కి ఒక విజువల్ ఫీస్ట్‌గా నిలిచింది. ఒకానొక సమయంలో ప్రభాస్ అల్టిమేట్ యాక్టింగ్ స్కిల్స్ తో హాలీవుడ్ రేంజ్ కి చేరారని స్వయానా కృష్ణంరాజు ఎంతో గర్వంగా చెప్పుకున్నారు.
Prabhas: డెసిషన్ తీసుకున్న ప్రభాస్… అంతా కొలిక్కి వచ్చేసినట్టేనా
నిన్నటిదాకా ఒక తీరు.. ఇవాళ ఇంకో తీరు అని అంటున్నారు డార్లింగ్ ప్రభాస్. కొత్త ఏడాది సరికొత్త రూల్స్ తో ముందుకు సాగుదామని ఫిక్సయ్యారు. అందులో భాగంగానే ఒన్ బై ఒన్ అంటున్నారు. హమ్మయ్య డార్లింగ్ డెసిషన్ వల్ల ఫస్ట్ బెనిఫిట్ నాకే అని ఊపిరి పీల్చుకుంటున్నారు మారుతి. ఇంతకీ డార్లింగ్ డెసిషన్ ఏంటి అంటారా? చూసేద్దాం వచ్చేయండి..
- Lakshminarayana Varanasi, Editor - TV9 ET
- Updated on: Feb 7, 2025
- 1:56 pm
Movie Updates: డార్లింగ్ గురించి పృథ్విరాజ్.. టాక్సిక్‌లో ఆ స్టార్ హీరోయిన్..
ప్రభాస్ చాలా సింపుల్‌గా ఉంటారన్నారు నటుడు పృథ్విరాజ్ సుకుమారన్. యష్ హీరోగా నటిస్తున్న సినిమా టాక్సిక్ నుంచి క్రేజీ అప్డేట్. తన భార్య శోభతకు తెలుగు నేటివిటీ అంటే చాలా ఇష్టమని తెలిపారు హీరో నాగచైతన్య. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన సినిమా చావా. ఇలాంటి కొన్ని సినిమా అప్డేట్స్ ఎంతో ఈరోజు చూద్దాం..
- Prudvi Battula
- Updated on: Feb 7, 2025
- 7:44 am
Prabhas : ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! ప్రభాస్‌కు జోడీగా సాయి పల్లవి.. ఏ సినిమాలోనంటే
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి బిజీగా ఉన్నాడు. రీసెంట్ డేస్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో సూపర్ హిట్ ఆ అందుకున్నాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
- Rajeev Rayala
- Updated on: Feb 6, 2025
- 3:05 pm
Police Story: ఖాకీ డ్రెస్ వేస్తున్న హీరోలు.. పోలీస్ స్టోరీస్‌కు పునర్వైభవం..
హీరో పోలీస్ అయితే.. స్టోరీ వర్కవుట్ అయితే.. బాక్సాఫీస్ బద్ధలే. అందుకే టాలీవుడ్‌లో నెవర్ ఎండింగ్ ట్రెండింగ్ స్టోరీ అంటే ఖాకీ కథలే. తాజాగా ఈ పోలీస్ స్టోరీస్‌కు పునర్వైభవం వస్తుంది. పెద్దా చిన్నా తేడా లేదు.. అందరూ మళ్లీ ఖాకీ డ్రెస్ వేస్తున్నారు. మరి ఈ మధ్యే వచ్చిన.. ఇప్పుడొస్తున్న.. త్వరలోనే రాబోతున్న ఆ పోలీస్ స్టోరీస్‌పై ఓ లుక్ వేద్దామా..?
- Prudvi Battula
- Updated on: Feb 5, 2025
- 1:37 pm
‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ రివీల్.. పోస్టర్ అదిరిందిగా..!
మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా కన్నప్ప. ఈ మూవీలో వివిధ భాషలకు చెందిన అగ్ర సినీతారలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో శివపార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. ఇటీవల వీరిద్దరి పోస్టర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు.
- Phani CH
- Updated on: Feb 4, 2025
- 7:34 pm
Prabhas: ఆ పోస్ట్‌లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. షాకింగ్ విషయం చెప్పిన పృథ్వీరాజ్ సుకుమారన్
సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు పాన్ ఇండియా స్టార్ నటుడు ప్రభాస్. ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేతిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలున్నాయి. 2023లో డార్లింగ్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. కానీ 2024లో మళ్లీ కల్కి సినిమా మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
- Rajeev Rayala
- Updated on: Feb 4, 2025
- 2:02 pm
Kannappa: ‘రుద్ర’గా ప్రభాస్.. కన్నప్పకు స్టార్ పవర్ ఎంతవరకు హెల్ప్ కానుంది..?
మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న ‘కన్నప్ప’ గురించి దేశం అంతా మాట్లాడుకుంటుంది. మామూలుగా అయితే మంచు విష్ణు సినిమా గురించి ఇంత డిస్కషన్ జరగదు. కానీ కన్నప్ప కోసం చాలా చేస్తున్నాడు విష్ణు. ఒకే చోటికి చాలా మంది హీరోలను తీసుకొస్తున్నాడు. అందులో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ అంతా ఉన్నారు. అందుకే కన్నప్ప డిస్కషన్ పాయింట్‌గా మారుతుంది.
- Prudvi Battula
- Updated on: Feb 4, 2025
- 11:00 am
Prabhas: వారెవ్వా.. పోస్టర్ అదిరిందిగా.. కన్నప్ప నుంచి ప్రభాస్ పోస్టర్ రిలీజ్..
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న సినిమా కన్నప్ప. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్, మోహన్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు పోస్టర్స్ విడుదలయ్యాయి. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సైతం రిలీజ్ అయ్యింది.
- Rajitha Chanti
- Updated on: Feb 3, 2025
- 11:29 am
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. స్పిరిట్ షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్! రిలీజ్ ఎప్పుడంటే?
కల్కి తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలోనే హను రాఘవ పూడి సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు డార్లింగ్. దీంతో పాటు స్పిరిట్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.
- Basha Shek
- Updated on: Jan 31, 2025
- 4:58 pm
Prabhas: కొత్త హీరోయిన్‌కు ఆతిథ్యం ఇచ్చిన ప్రభాస్.. మురిసిపోయిన ఇమాన్వీ..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డార్లింగ్ త్వరలోనే రాజాసాబ్ సినిమాతో అడియన్స్ ముందుకు రానున్నాడు. అలాగే మరిన్ని సినిమా షూటింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ప్రభాస్ గురించి హీరోయిన్ ఇమాన్వీ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసింది.
- Rajitha Chanti
- Updated on: Jan 31, 2025
- 3:25 pm