69 ఏళ్ల వయసులో ఈ పనేంటి స్టార్ సింగర్ ?? నెట్టింట హాట్ టాపిక్

69 ఏళ్ల వయసులో ఈ పనేంటి స్టార్ సింగర్ ?? నెట్టింట హాట్ టాపిక్

Phani CH

|

Updated on: Feb 07, 2025 | 11:54 AM

ఉదిత్ నారాయణ్! బాలీవుడ్ స్టార్ సింగర్. ఇంకో మాట చెప్పాలంటే మెలోడీ సాంగ్స్‌ పాడడంలో ఈయన తోప్‌. బాషా బేధం లేకుండా దాదాపు పాన్ ఇండియా భాషల్లో సాంగ్స్‌ పాడిన చరిత్ర ఈయనది. వయసేమో 69. పాడిన పాటలేమో.. రెండు వేలకు మించి.. అలాంటి ఈ స్టార్ సింగర్ ఇటీవల తరచూ వార్తల్లో చక్కర్లు కొడుతున్నారు.

విమర్శల పాలవుతున్నాడు. ఎందుకంటారా? తన చేసే ఓ పాడు పనితో..! ఇక ఉదిత్ నారాయణ.. ఇటీవల ఒక సంగీత కచేరీ సందర్భంగా ఒక మహిళా అభిమాని పెదవులపై.. ఆమె అనుమతి లేకుండా నేరుగా ముద్దు పెట్టాడు. తను చేసిన ఈ పనితో తీవ్ర విమర్శల పాలయ్యాడు. కొందరు సినీ ప్రముఖులు కూడా ఈ స్టార్ సింగర్ తీరును తప్పు పట్టారు. ఈ క్రమంలోనే తనపై వస్తోన్న విమర్శలపై స్పందించిన ఉదిత్ నారాయణ.. ముద్దు పెట్టే విషయంలో తనకు వేరే ఉద్దేశం లేదని చెప్పాడు. అభిమానులపై తనకున్న ప్రేమను తెలియజేసేందుకే అలా చేశానంటూ క్లారిటీ ఇచ్చారు. అయినా ఉదిత్ పై విమర్శల వర్షం కురూస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ స్టార్ సింగర్ కు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కూడా అనుమతి లేకుండా తన ఫ్యాన్స్‌కు ఈ సింగర్ ముందు పెట్టడం మరో సారి హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఆ వీడియోలోనూ ఉదిత్ నారాయణ్ వేదికపై పాడుతూ కనిపించారు. అదే సమయంలో కొందరు మహిళా అభిమానులు ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఉదిత్ కూడా వారికి ఎంతో ఓపికగా ఫొటోలు, సెల్ఫీలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఒక మహిళా అభిమాని చెంపపై ముద్దు పెట్టాడు ఉదిత్. అలాగే మరో అభిమాని పెదవులపై కూడా ముద్దు పెట్టేశాడు. వేదికపై ఉన్న వారితో పాటు.. ఆ ఈవెంట్లో ఉన్న ఆడియెన్స్‌ను కూడా షాకయ్యేలా చేశాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్న మామ ఇలాకాలో.. ఉపాసన గొప్ప కార్యక్రమం

Pawan Kalyan: ఆ విషయంలో ఫ్యాన్స్ మాటను పవన్ వింటారా ??

టికెట్ల పంచాయతీ.. తెలంగాణలో ఇలా.. ఆంధ్రాలో అలా..!

రూ.100 కోట్లు నష్టం.. పైగా జైలు శిక్ష !! ఇదీ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దీన గాథ

TOP 9 ET News: గొప్ప తండ్రిగా అందరి మనసూ గెలిచిన చరణ్‌