Jump to content

సాతారా

అక్షాంశ రేఖాంశాలు: 17°41′17″N 74°00′22″E / 17.688°N 74.006°E / 17.688; 74.006
వికీపీడియా నుండి
సాతారా
నగరం
सातारा
సాతారా is located in Maharashtra
సాతారా
సాతారా
మహారాష్ట్ర పటంలో నగర స్థానం
Coordinates: 17°41′17″N 74°00′22″E / 17.688°N 74.006°E / 17.688; 74.006
దేశం India
రాష్ట్రంమహారాష్ట్ర
జిల్లాసతారా
Established16వ శతాబ్దం
Founded byషాహు 1
Named forసాత్ తారా అనే ఏడు దుర్గాలు
విస్తీర్ణం
 • Total22.42 కి.మీ2 (8.66 చ. మై)
Elevation
742 మీ (2,434 అ.)
జనాభా
 (2011)
 • Total3,26,079
భాషలు
 • అధికారికమరాఠీ
Time zoneUTC+5:30 (IST)
PIN
415001, 415002, 415003, 415004, 415005, 415006
Telephone code02162
Vehicle registrationMH-11

సాతారా, మహారాష్ట్రలోని సాతారా జిల్లా ముఖ్యపట్టణం. ఇది కృష్ణా నది, వెన్నా నదుల సంగమం వద్ద ఉంది.[1] ఈ నగరాన్ని 16 వ శతాబ్దంలో స్థాపించారు. ఇది ఛత్రపతి షాహుజీ-1 కి రాజధానిగా ఉండేది. ఏడు (సాత్) దుర్గాల (తారా) నగరంగా దీనికి ఈ పేరు వచ్చింది.

భౌగోళికం

[మార్చు]
పంచగని దృశ్యం

సతార పట్తణం 17°41′N 73°59′E / 17.68°N 73.98°E / 17.68; 73.98 వద్ద ఉంది.[2] అజింక్యతారా దుర్గపు వాలులో నగరం నెలకొని ఉంది.[3] దక్కను పీఠభూమికి పశ్చిమ ప్రాంతంలో ఉంది.[4] కాస్ పీఠభూమి నగరం నుండి 25 కి.మీ. దూరంలో ఉంది.[5] ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటి. స్థానికంగా దీన్ని కాస్ పత్థర్ అని అంటారు.

చరిత్ర

[మార్చు]

దక్కన్‌పై మొట్టమొదటి ముస్లిం దండయాత్ర 1296లో జరిగింది. 1636లో నిజాం షాహీ రాజవంశం అంతమైంది. 1663లో ఛత్రపతి శివాజీ పరాలి, సాతారా కోటలను జయించాడు. శివాజీ మరణం తరువాత, మరాఠా సామ్రాజ్యానికి వారసుడైన షాహు శివాజీని, ఏడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మొఘలులు బంధించారు. 1700లో తన తండ్రి మరణించే వరకు అతను వారి ఖైదీ గానే ఉన్నాడు. అతడి సవతి తమ్ముడు, మహారాణి తారాబాయి కుమారుడు అయిన షాహూ శంభాజీని ఆమె ఛత్రపతి మహారాజ్‌గా ప్రకటించి తాను రాజప్రతినిధిగా పరిపాలన చేపట్టింది. 1707లో కొన్ని ముందస్తు షరతులతో మొఘలులు షాహూని విడుదల చేశారు. ఔరంగజేబు కుమారుడు ముహమ్మద్ ఆజం షా 6 నెలల ముట్టడి తర్వాత సాతారా కోట అజింక్యతరను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత 1706లో దీన్ని తిరిగి పరశురామ్ ప్రతినిధి చేజిక్కించుకున్నాడు. 1708లో ఛత్రపతి శంభాజీ కుమారుడు ఛత్రపతి షాహూకు సాతారా కోటలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఛత్రపతి శివాజీ ప్రత్యక్ష వారసులు సాతారాలో నివసిస్తున్నారు. ఛత్రపతి ఉదయన్‌రాజే భోంస్లే శివాజీ 13వ వారసుడు.[6]

క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో సాతారాలో షాడో ప్రభుత్వాన్ని స్థాపించారు.[7]

జనాభా వివరాలు

[మార్చు]

2011 జనగణన ప్రకారం, [8] సాతారాలో జనాభా 1,20,079. ఇందులో 61,129 మంది పురుషులు కాగా 59,066 మంది స్త్రీలు - పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. సాతారా సగటు అక్షరాస్యత 80%. ఇది జాతీయ సగటు 74% కంటే ఎక్కువ: పురుషులలో అక్షరాస్యత 84% కాగా, స్త్రీలలో ఇది 76%. సాతారా జనాభాలో 10% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. మరాఠీ విస్తృతంగా మాట్లాడే భాష. జనాభాలో 1.5% మంది హిందీ మాట్లాడుతారు. మహారాష్ట్ర రాష్ట్ర లింగ నిష్పత్తి 883 కాగా, సాతారాలో ఇది 881.

శీతోష్ణస్థితి

[మార్చు]

సాతారా నగరంలో ఉష్ణమండల తడి, పొడి శీతోష్ణస్థితి ఉంటుంది (కొప్పెన్ వాతావరణ వర్గీకరణ: Aw). నగరం చుట్టూ ఉన్న ఎత్తైన పర్వతాలు నగర శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తాయి. నగరంలో ఏడాదికి 900 మిమీ నుండి 1,500 మిమీ వరకు వర్షపాతం ఉంటుంది.

శీతోష్ణస్థితి డేటా - Satara (1981–2010, extremes 1933–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 35.8
(96.4)
38.0
(100.4)
40.5
(104.9)
41.9
(107.4)
42.1
(107.8)
40.9
(105.6)
33.5
(92.3)
35.2
(95.4)
34.6
(94.3)
37.7
(99.9)
36.0
(96.8)
34.0
(93.2)
42.1
(107.8)
సగటు అధిక °C (°F) 29.8
(85.6)
32.4
(90.3)
35.4
(95.7)
37.2
(99.0)
36.6
(97.9)
30.4
(86.7)
27.0
(80.6)
26.5
(79.7)
28.9
(84.0)
30.9
(87.6)
30.1
(86.2)
29.3
(84.7)
31.2
(88.2)
సగటు అల్ప °C (°F) 12.8
(55.0)
14.2
(57.6)
18.1
(64.6)
21.1
(70.0)
22.7
(72.9)
22.5
(72.5)
21.8
(71.2)
21.2
(70.2)
20.5
(68.9)
19.2
(66.6)
15.9
(60.6)
13.3
(55.9)
18.6
(65.5)
అత్యల్ప రికార్డు °C (°F) 4.8
(40.6)
5.8
(42.4)
9.1
(48.4)
12.3
(54.1)
15.2
(59.4)
18.0
(64.4)
19.0
(66.2)
14.5
(58.1)
14.5
(58.1)
13.2
(55.8)
9.0
(48.2)
7.3
(45.1)
4.8
(40.6)
సగటు వర్షపాతం mm (inches) 1.1
(0.04)
0.2
(0.01)
5.1
(0.20)
20.2
(0.80)
27.2
(1.07)
199.7
(7.86)
224.9
(8.85)
172.1
(6.78)
124.1
(4.89)
100.6
(3.96)
21.6
(0.85)
8.7
(0.34)
905.3
(35.64)
సగటు వర్షపాతపు రోజులు 0.1 0.1 0.3 1.4 2.1 10.9 15.3 12.8 8.1 5.5 1.5 0.4 58.7
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 36 29 28 34 44 70 78 79 71 56 47 41 51
Source 1: India Meteorological Department[9][10]
Source 2: Government of Maharashtra[11]

రవాణా

[మార్చు]

జాతీయ రహదారి 48 (గతంలో జా.ర 4) సాతారా గుండా పోతుంది.[12]

పర్యాటక ప్రదేశాలు

[మార్చు]
  • పంచగని
  • మహాబలేశ్వర్
  • పటేశ్వర్
  • అజింక్యతారా (మంగళాదేవి మందిరం)
  • యవతేశ్వర్
  • కాస్ సరస్సు
  • బమ్నోలి
  • సజ్జన్ గడ్
  • తోసేఘర్ జలపాతం
  • చల్కెవాడి
  • వందగిరి, కళ్యాణగడ్ కోటలు
  • మయాని పక్షి ఉద్యానవనం
  • కొయనా ఆనకట్ట

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Chisholm, Hugh, ed. (1911). "Satara" . ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 24 (11th ed.). Cambridge University Press. p. 227.
  2. "Maps, Weather, and Airports for Satara, India". Fallingrain.com. Retrieved 18 August 2017.
  3. "Groundwater Surveys and Development Agency Website".
  4. "GEOGRAPHICAL FEATURES OF SATARA DISTRICT" (PDF).
  5. "Official Website Of Kaas". www.kas.ind.in. Retrieved 2020-01-16.
  6. "Satara District : Historical reference". www.satara.gov.in.
  7. Swami, V.N. (2020). Vidyabharti D.C.C. Bank (Bank clerk examination) (in మరాఠీ). Latur, Maharashtra, India: Vidyabharti Publication. p. 191.
  8. Cities having population 1 lakh and above. Censusindia.gov.in
  9. "Station: Satara Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 685–686. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 10 April 2020.
  10. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M152. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 10 April 2020.
  11. "Climate". Government of Maharashtra. Retrieved 10 April 2020.
  12. "Satara District Map". Mapsofindia.com. Retrieved 31 March 2015.

బయటి లింకులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]