Jump to content

లెబనాన్

వికీపీడియా నుండి
الجمهورية اللبنانية
Al-Jumhūriyyah al-Lubnāniyyah
Lebanese Republic
Flag of Lebanon Lebanon యొక్క చిహ్నం
నినాదం
Kūllūnā li-l-waṭan, li-l-'ula wa-l-'alam  (Arabic)
"We are all for the Country, the Sublime and the Flag!"
జాతీయగీతం
Kulluna lil-watan lil 'ula lil-'alam
Lebanon యొక్క స్థానం
Lebanon యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
 Beirut
33°54′N 35°32′E / 33.900°N 35.533°E / 33.900; 35.533
అధికార భాషలు Arabic
ప్రభుత్వం Republic
 -  President Michel Suleiman
 -  Prime Minister Saad Hariri
Independence
 -  Declared November 26, 1941 
 -  Recognized November 22, 1943 
విస్తీర్ణం
 -  మొత్తం 10,452 కి.మీ² (166th)
4,035 చ.మై 
 -  జలాలు (%) 1.6
జనాభా
 -  July 2007 అంచనా 3,925,502 (128th)
 -  జన సాంద్రత 358 /కి.మీ² (26th)
948 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $21.45 billion (103rd)
 -  తలసరి $5,500 (90th)
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) Increase 0.774 (medium) (78th)
కరెన్సీ Lebanese lira (LL) (LBP)
కాలాంశం EET (UTC+2)
 -  వేసవి (DST) EEST (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .lb
కాలింగ్ కోడ్ +961

లెబనాన్ అరబిక్:لبنان. లెబనీస్ అరబిక్ : అధికారనామం " లెబనాన్ రిపబ్లిక్ " [nb 1]

లెబనీస్ అరబిక్ :, సార్వభౌమాధికారం కలిగిన దేశం. లెబనాల్ ఉత్తర, తూర్పు సరిహద్దులో సిరియా, దక్షిణ సరిహద్దులో ఇజ్రాయిల్ ఉన్నాయి. మధ్యధరా సముద్రతీరంలో ఆరేబియన్ దేశాల మద్య ఉన్నందున లెబనాన్ సుసంపన్నమైన చరిత్ర, సాంస్కృతిక వైభవం, మతం, సంప్రదాయక వైవిధ్యం కలిగి ఉంది. [1] లెబనాన్ లోని నాగరికత సంబంధిత పురాతత్వ సాక్ష్యాలు 7 వేల నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి.[2]

లెబనాన్ కనానిటీల (ఫోయెనిషియన్లు) పూర్వీకప్రాంతం, వారి పాలిత ప్రాంతం. ఇక్కడ దాదాపు 1000 సంవత్సరాల కాలం (క్రీ.పూ. 1550-539) సముద్రతీర సంప్రదాయం అభివృద్ధిచెంది సుసంపన్నగా వర్ధిల్లింది. క్రీ.పూ 64 లో ఈ ప్రాంతం రోమన్లు స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఇది సామ్రాజ్యంలో ప్రధాన కేంద్రంగా (క్రైస్తవ కేంద్రం) మారింది. లెబనాన్ పర్వతశ్రేణిలో రోమన్ సామ్రాజ్యానికి గుర్తుగా " మెరోనైట్ చర్చి " నిర్మించబడింది. ఈ ప్రాంతాన్ని అరబ్ ముస్లిములు ఆక్రమించుకున్నారు. మెరోనైట్లు (లెబనాన్ క్రైస్తవులు) వారి ప్రాంతంలో వారికే ప్రత్యేకమైన మతపరమైన అంతస్తు కలిగి ఉన్నారు. అయినప్పటికీ లెబనాన్ పర్వతశ్రేణిలో సరికొత్తగా డ్రుజ్ మతసంప్రదాయం రూపొందించబడింది. ఈ మతపరమైన విభేదాలు దాదాపు రెండు శతాబ్ధాల కాలం కొనసాగింది. క్రుసేడర్స్ కాలంలో మెరోనైట్లు రోమన్ కాథలిక్ చర్చితో సంబంధాలు పునరుద్ధరించుకొన్నారు. అలాగే వారు రోమ్‌కు రాకపోకలు కొనసాగించారు. వారు లాటిన్లతో ఏర్పరుచుకున్న పరస్పర సంబంధాలు ఈ ప్రాంతంలో ఆధునికశకారంభానికి నాంది అయింది.

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

లెబనాన్ పేరుకు మూలం సెమెటిక్ భాషకు చెందిన ఇబ్న్ (తెల్లని). మంచుతో కప్పబడిన లెబనాన్ పర్వతాల కారణంగా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. [3] ఎబ్లా లైబ్రరీలో ఉన్న పలు వ్రాతల ఆధారంగా ఇది నిరూపించబడింది.[4] క్రీ.పూ 2000 లలో లిఖించబడిన హెబ్రూ బైబిల్‌లో ఇది 70 మార్లు ప్రతిపాదించబడింది. క్రీ.పూ. 2100 గిల్గమేష్ కావ్యంలోని 12 టేబుల్స్‌లో మూడుమార్లు ఇది ప్రతిపాదించబడింది.[5] పురాతన ఈజిప్షియన్ భాషలో " ర్మన్ " అని ప్రతిపాదించబడింది. కనానిటీలు ర బదులుగా ల వాడారు.[6]

చరిత్ర

[మార్చు]

శతాబ్దాలుగా లెబనాన్ ప్రాంతాన్ని ఈజిప్టు సామ్రాజ్యం, అస్సీరియన్ సామ్రాజ్యం, అకెమెనిడ్ సామ్రాజ్యం, హెలెనిస్టిక్ నాగరికత, రోమన్ సామ్రాజ్యం, కింగ్డమ్ ఆర్మేనియా (పురాతనత్వం), సస్సనియన్ సామ్రాజ్యం (పర్షియన్), తూర్పు రోమన్ సామ్రాజ్యం, ముస్లిం మతం సామ్రాజ్యాలు ( అరబ్ ;ఉమయ్యద్, అబ్బాసీ, ఫతిమిడ్), గ్రేట్ సెల్జుక్,మామ్లుక్ సుల్తానేట్ (కైరో), క్రూసేడర్ స్టేట్స్, ట్రిపోలి చే స్థాపించబడిన నాలుగవ టౌలౌస్ రేమండ్ పాలించిన కౌంటీలు (ఈనాటి లెబనాన్ చెందినవి), ఒట్టోమన్ సామ్రాజ్యం మొదలైన సామ్రాజ్యాలు పాలించాయి. పాలించిన సామ్రాజ్యాలు ఈ ప్రాంతంలో తమ శాసనాలు వదిలి వెళ్ళాయి.

పురాతన లెబనాన్

[మార్చు]
Map of Phoenicia and trade routes

Evidence of an early settlement in Lebanon was found in Byblos, which is considered to be one of the oldest continuously inhabited cities in the world. [2] క్రీ.పూ. 5,000 పూర్వంనాటి ఆధారాలు పురాతత్వ పరిశోధకులు చరిత్రకు పూర్వంనాటి గుడెశెల అవశేషాలను కనుగొన్నారు. వాటిలో నలుగగొట్టబడిన సున్నపురాతి గచ్చు, ఆదికాలపు నాటి ఆయుధాలు, సమాధి (నియోలిథిక్ ప్రజలు, చాల్కోలిథిక్ (రాగి యుగం) ఉపయోగించిన) మత్స్యకారులు ఉపయోగించిన కూజాలు లభించాయి. వీరు 7,000 సంవత్సరాలకు పూర్వం మధ్యధరాసముద్రతీరంలో నివసించారు.[7] లెబనాన్ ఉత్తర కనాన్‌లో భాగంగా ఉండి చివరికి కనాటీల సంతతివారికి పూర్వీకభూమిగా ఉంది. సైరస్ ఆవిర్భవించడానికి పూర్వం ఫొయెంషియన్లు మధ్యధరా సముద్ర ప్రాంతం అంతా వ్యాపించి ఉన్నారు.[8] వారు నివసించిన ప్రబల నివాసిత ప్రాంతాలు కార్థేజ్ (ప్రస్తుత తునిషియా, కేడిజ్ (స్పెయిన్))అని పిలిచేవారు. కనాటీలు - ఫొయెనేషియన్లు (పలు ఇతర విషయాలతో అక్షరమాలను కనిపెట్టిన వారని భావిస్తున్నారు). క్రీ.పూ. 539లో సైరస్ ప్రస్తుత లెబనాన్ ప్రాంతం, తూర్పు మధ్యధరా సముద్రంలో అత్యధిక భూభాగాన్ని ఆక్రమించారు.[9] పర్షియన్లు బలవంతంగా కొంతమంది ప్రజలను కార్థేజ్‌కు వలసపోయేలా చేసారు. రెండవ పూనిక్ యుద్ధం వరకు ఈ రాజ్యం శక్తివంతమైన రాజ్యంగా ఉంది. రెండు శతాబ్ధాల పర్షియన్ పాలన తరువాత పురాతన మెసెడోనియన్ల పాలకుడు మహావీరుడు అలెగ్జాండర్ ఈ ప్రాంతం మీద దండెత్తి ప్రముఖ ఫొయెనిషియన్ నగరం తైర్‌ను తగలబెట్టాడు. క్రీ.పూ. 332 అలెగ్జాండర్ ప్రస్తుత లెబనాన్, తూర్పు మధ్యధరా ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు.[9]

మెరోనైట్లు, డ్రుజ్, క్రుసేడ్స్

[మార్చు]
The Fall of Tripoli to the Egyptian Mamluks and destruction of the Crusader state, the County of Tripoli, 1289

క్రైస్తవ మతఆరంభకాలంలో రోమన్ సామ్రాజ్య పాలనలో ప్రస్తుత లెబనాన్ ప్రాంతం సిరియాలో కొంతభాగం, అనటోలియాలోని అత్యధికభాగం క్రైస్తవానికి ప్రధానకేంద్రాలుగా మారాయి. 4వ శతాబ్దం చివర 5వ శతాబ్దం ఆరంభకాలంలో సన్యాస సంప్రదాయంతో మరాన్ అనే సన్యాసి పేరుతో గ్రామం స్థాపించబడింది. అది మొనోథిజం, అస్కెటిసిజం మీద దృష్టిసారించింది. ఈ గ్రామం మధ్యధారా ప్రాంతంలో లెబనాన్ పర్వతశ్రేణిలో స్థాపించబడింది. మరాన్‌ను అనుసరించే ఆయన సిద్ధాంతాలను ఈప్రాంతంలోని లెబనీయుల మద్య ప్రచారం చేసారు. ఈప్రాంతంలోని క్రైస్తవులను మేరోనైట్లు అని పిలిచేవారు. వీరు రోమన్ అధికారులు మతం పేరుతో చేసే అకృత్యాల నుండి తప్పించుకోవడానికి పర్వతశిఖరాలవైపు తరలి వెళ్ళారు.[10] రోమన్- పర్షియన్ యుద్ధాలు తరచుగా సంభవిస్తూ అవి కొన్ని శతాబ్ధాలకాలం కొనసాగాయి. సస్సనిద్ సామ్రాజ్యం (సాసనిద్ పర్షియన్లు) ప్రస్తుత సస్సనిద్ ప్రాంతాన్ని (619-629) ఆక్రమించుకున్నారు.[11] 7వ శతాబ్దంలో అరబ్ ముస్లిములు సిరియాను ఆక్రమించుకుని బైజాంటిన్ సామ్రాజ్యం స్థానంలో సరికొత్త సామ్రాజ్యం స్థాపించారు. కొత్త పాలనలో అరబిక్, ఇస్లాం అధికారికంగా ఆధిక్యత కలిగి ఉన్నాయి. సాధారణ ప్రజలు మాత్రం క్రైస్తవం నుండి మారడానికి, సిరియా భాషకు అలవాటు పడడానికి కొతసమయం తీసుకున్నారు. లెబనాన్, సిరియాలలో సామ్రాజ్యాలు, పాలకులు మారినప్పటికీ మెరోనైట్ ప్రజలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నారు.

డ్రుజ్

[మార్చు]

11 వ శతాబ్దంలో షియా ఇస్లాం శాఖ నుండి డ్రుజ్ (లెబనాన్) విశ్వాసం జనించింది. కొత్త విశ్వాసానికి లెబనాన్ పర్వతశ్రేణి దక్షిణ ప్రాంతంలో అనుయాయులు అధికరించారు. 14వ శతాబ్దం ఆరంభకాలం నాటికి లెబనాన్ పర్వతశ్రేణి ఉత్తర భాగంలో భూస్వామ్య రాజరిక వ్యవస్థ ఏర్పడింది. మామ్లక్ దాడితో భూస్వామ్య రాజరికానికి ముగింపు వచ్చింది. లెబనాన్ ఉత్తర ప్రాంతంలో మేరోనైట్ ప్రజల సంఖ్య అధికరించింది. ఆధునికశకం వరకు డ్రుజ్ ప్రజలు లెబనాన్ పర్వతశ్రేణి దక్షిణప్రాంతంలో స్థిరపడ్డారు. ప్రస్తుత దక్షిణ లెబనాన్‌లో జబాల్ అమేల్, బాల్బెక్, బెక్వా లోయ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలను మమ్లక్, ఓట్టమన్ సామ్రాజ్యాల ఆధీనంలో షియా భూస్వాములు పాలించారు. సముద్రతీర ప్రాంతాలలో అక్రే (ఇజ్రాయిల్), బెయిరుట్, ఇతర ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలను ముస్లిం కలీఫాలు నేరుగా పాలించారు. ఇక్కడి ప్రజలు అరబ్ సంస్కృతిని స్వీకరించారు.

క్రుసేడర్లు

[మార్చు]

రోమన్ అనటోలియా పతనం తరువాత టర్కీ ముస్లిములు ఈ ప్రాంతం మీద ఆధీనత సాగించారు. 11వ శతాబ్దంలో బైజాంటిన్లు రోం లోని పోప్‌ను సహాయం కొరకు పిలిచారు. ఫలితంగా క్రుసేడర్లు పేరుతో వరుస యుద్ధాలు సంభవించాయి. తూర్పు మధ్యధరా ప్రాంతం లోని బైజాంటిన్ భుభాగాలను (ప్రత్యేకంగా సిరియా, పాలస్తీనాలతో కూడిన భూభాగం) తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సాగించిన క్రుసేడర్ యుద్ధలకు ఫ్రాంకులు నాయకత్వం వహించారు. మొదటి క్రుసేడర్లు జెరుసలేం రాజ్యం, ట్రిపోలి కౌంటీ స్థాపించారు. వీటిని సముద్రతీరంలో రోమన్ కాథలిక్ రాజ్యాలుగా స్థాపించారు.[12] క్రమంగా క్రుసేడర్ల రాజ్యాలు ఈ ప్రాంతం మీద ప్రభావాన్ని కోల్పోయాయి. వారి ప్రభావం పరిమితమైంది. తరువాత మమ్లక్లు ఈ ప్రాంతాన్ని జయించిన తరువాత రెండు శతాబ్దాలు సాగిన క్రుసేడర్ల పాలన ముగింపుకు వచ్చి ఈ ప్రాంతాన్ని తిరిగి ముస్లిములు ఆధీనం చేసుకున్నారు. అయినప్పటికీ క్రుసేడర్లకు ఫ్రాంక్లు (ఫ్రెంచ్), మెరొనైట్ల మద్య సంబంధాలు కొనసాగాయి.

ఓట్టమన్ లెబనాన్, ఫ్రెంచ్ మేండేట్

[మార్చు]
Fakhreddine II Palace, 17th century
1862 map drawn by the French expedition of Beaufort d'Hautpoul, [13] later used as a template for the 1920 borders of Greater Lebanon.[14][15]

ఈకాలంలోనే లెబనాన్ పలుప్రాంతాలుగా విడదీయబడింది. లెబనాన్ పర్వతం ఉత్తర, దక్షిణ ప్రాంతాలు, త్రిపోలి, బాల్బెక్, బెక్వా లోయ, జబెల్ అమెల్ ప్రాంతాలుగా విభజించబడ్డాయి.

లెబనాన్ పర్వత దక్షిణంలో 1590 లో రెండవ ఫాఖర్ - అల్ - దిన్ కార్క్మజ్ పాలకుడయ్యాడు. ఆయన శీఘ్రగతిలో లెబనాన్ పర్వతప్రాంతంలోని షౌఫ్ ప్రాంతంలో ద్రుజ్ రాజకుమారునిగా తన అధికారం సుస్థిరం చేసుకున్నాడు. చివరికి రెండవ ఫాఖర్ - అల్ - దిన్ కార్క్మజ్ పలు ఓట్టమన్ ఉపవిభాగాలకు షంజక్బేని గవర్నర్‌గా నియమించి పన్ను వసూలు బాధ్యత అప్పగించాడు. ఆయన తన అధికార పరిధిని లెబనాన్ పర్వతప్రాంతం అంతటా, సముద్రతీరం వరకు విస్తరించాడు. అలాగే పల్మిరాలో ఒక కోటను నిర్మించాడు.[16] రెండవ ఫాఖర్ - అల్ - దిన్ అధికార విస్తరణ కారణంగా ఆగ్రహించిన ఓట్టమన్ సుల్తాన్ నాల్గవ మురాద్ 1633 లో రెండవ ఫాఖర్ - అల్ - దిన్ మీద దాడి చేసి బంధించి ఇస్తాంబుల్‌లో ఖైదులో ఉంచాడు. తరువాత 1635 ఏప్రిల్‌లో రెండవ ఫాఖర్ - అల్ - దిన్, ఆయన కుమారునితో చేర్చి మరణశిక్షకు గురిచేసాడు. [17] మరణించిన తరువాత మిగిలిన రెండవ ఫాఖర్ - అల్ - దిన్ కుటుంబ సభ్యులు తగ్గించబడిన అధికారంతో ఓట్టమన్ అధికార పర్యవేక్షణలో 17వ శతాబ్దం వరకు పాలించారు.

మాన్ ఎమీర్ మరణించిన తరువాత షాహిబ్ సంతతికి చెందిన పలువురు సభ్యులు 1830 వరకు లెబనాన్ పర్వతప్రాంతాన్ని పాలించారు. 1860లో జాతి వైరాల కారణంగా డ్రుజ్ చేతిలో దాదాపు 10,000 క్రైస్తవులు మరణించారు.[18]

ఓట్టమిన్, యూరప్ ఒప్పందం

[మార్చు]

తరువాత ఓట్టమిన్, ఐరోపా ఒప్పందం కారణంగా 4 శతాబ్ధాల కాలం కొనసాగిన లెబనాన్ ఎమిరేట్ స్థానంలో మౌంట్ లెబనాన్ ముతాసర్రిఫేట్ స్థాపించబడింది. బాల్బెక్, బెక్వా లోయ, జాబల్ అమెల్ ప్రాంతాలను షియా ఫ్యూడల్ కుటుంబాలు పాలించాయి. ప్రత్యేకంగా జబల్ అమెల్ ప్రాంతాన్ని అల్ అలి అల్సాఘీర్ 1865 వరకు పాలించారు. తరువాత ఓట్టమన్ సామ్రాజ్యం ఈప్రాంతాన్ని నేరుగా పాలించింది. ఈ సమయంలో లెబనాన్ జాతీయవాది యూసఫ్ బే కరం లెబనాల్ స్వతంత్రపోరాటంలో ప్రధానపాత్ర వహించాడు.

1920లో మొదటి ప్రపంచయుద్ధం తరువాత " ఫ్రెంచ్ మేండేట్ ఆఫ్ సిరియా అండ్ లెబనాన్ " ఫలితంగా ముతాసర్రిఫేట్ ప్రాంతం, సమీపం లోని కొన్ని షియా, సున్నీ ముస్లిం ప్రాంతాలు గ్రేటర్ లెబనాన్‌లో భాగం అయ్యాయి. లెబనాన్ పర్వతప్రాంతం, బెయిరుత్‌లలో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా దాదాపు 1,00,000 మంది మరణించారు. [19] 1920లో అరబ్ కింగ్డం ఆఫ్ సిరియాలో భాగంగా లెబనాన్ ప్రాంతం విడుదల చేయబడింది.

Roman baths park on the Serail hill, Beirut.

1920 సెప్టెంబరు 1 న ఫ్రాన్స్ తిరిగి గ్రేటర్ లెబనాన్‌ను స్థాపించింది. తరువాత మౌతసర్రిఫియా పాలన తొలగించి లెబనాన్ రాజ్యంలోని పలు ప్రాంతాలను సిరియాకు అప్పగించింది.[20] లెబనాన్ అధికంగా క్రైస్తవ (అధికంగా మేరోనైట్ క్రైస్తవులు, స్వల్పంగా గ్రీక్ అర్థడాక్స్ ఉన్న) దేశం. అయినా లెబనాన్‌లో ముస్లిం, డ్రుజ్ ఆధిక్యత కలిగిన ప్రాంతాలు చేర్చబడ్డాయి. [ఆధారం చూపాలి] 1926 సెప్టెంబరు 1న ఫ్రాన్స్ " లెబనాని రిపబ్లిక్ " స్థాపించింది. 1926 మే 25 న లెబనాన్ పార్లమెంట్ ప్రభుత్వంతో కూడిన స్వతంత్ర రాజ్యాంగ విధానం స్వీకరించింది.

స్వతంత్రం

[మార్చు]
Martyrs' Square in Beirut during celebrations marking the release by the French of Lebanon's government from Rashayya prison on 22 November 1943

జర్మనీ ఫ్రాన్స్‌ను ఓడించిన తరువాత లెబనాన్‌కు స్వతంత్రం లభించింది.[21] జనరల్ హెంరి డెంత్జ్ లెబనాన్ స్వతంత్ర పోరాటంలో ప్రముఖపాత్ర వహించాడు. 1941 లో విచీ అథారిటీలు జర్మనీ విమానాల ప్రవేశానికి అవకాశం కల్పించింది. ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఇరాక్‌కు సిరియా మీదుగా యుద్ధసామాగ్రి సరఫరా చేయబడింది. విచీ ప్రభుత్వం బలహీనతను ఆధారంగా చేదుకుని జర్మనీ నాజీలు లెబనాన్, సిరియాల మీద ఆధీనత బలపరచుకోవడం బ్రిటిష్ ప్రభుత్వాన్ని కలవరపెట్టింది. అందువలన బ్రిటిష్ సిరియా, లెబనాన్ మీద సైన్యాలను మళ్ళించింది. [ఆధారం చూపాలి]

లెబనాన్‌లో యుద్ధం ముగిసిన తరువాత " జనరల్ చార్లెస్ డీ గౌల్లె " ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. లెబనాన్ లోపలి, వెలుపలి వత్తిడి కారణంగా డీ గౌల్లే లెబనాన్ స్వాతంత్ర్యాన్ని గుర్తించాడు. 1941 నవంబరు 26 న జనరల్ జార్జెస్ కాట్రౌక్స్ లెబనాన్‌కు ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి స్వతంత్రం లభించిందని ప్రకటించాడు. లెబనాన్ ప్రభుత్వానికి 1943 లో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఫ్రెంచ్ ప్రతిచర్యగా లెబనాన్ ప్రభుత్వాధికారులను ఖైదు చేసింది. అంతర్జాతీయ వత్తిడి కారణంగా 1943 నవంబరు 22 న లెబనాన్ అధికారులను విడుదల చేసింది. రెండవ ప్రపంచయుద్ధం ముగిసే వరకు ప్రపంచ యుద్ధం సంకీర్ణ దేశాలు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపుకు వచ్చే నాటికి ఫ్రెంచ్ మేండేట్ ముగిసింది.[22] 1945 అక్టోబరు 24 నుండి యు.ఎన్. అధికారికంగా ఉనికిలోకి వచ్చింది. సిరియా, లెబనాన్ యు.ఎన్ ఫండింగ్ దేశాలు అయ్యాయి. ఫ్రెంచ్ మేండేట్ ముగింపుకు వచ్చిన తరువాత రెండు దేశాలలు చట్టబద్ధంగా స్వతంత్రదేశాలు అయ్యాయి.[23] 1946లో చివరి ఫ్రెంచ్ దళాలు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళాయి.

1943 నుండి లెబనాన్ అధ్యక్షుడుగా మేరోనైట్ క్రైస్తవుడు, పార్లమెంట్ సభాపతిగా షియా ముస్లిం, ప్రధానమంత్రిగా సున్నీ ముస్లిం, ఉపసభాపతి, ఉపప్రధానులుగా గ్రీక్ ఆర్ధడాక్స్ నియమించబడడం ఆనవాయితీగా ఉంది..[24] స్వతంత్రం వచ్చిన తరువాత లెనాన్ రాజకీయ స్థిరత్వం, రాజకీయ అల్లర్లు మారిమారి వస్తూ ఉన్నాయి. బెయిరుత్ ప్రాంతంలో ఆర్థిక, వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతూ ఉంది.[25] 1948 మేలో లెబనాన్ ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా పొరుగున ఉన్న అరబ్ దేశాలకు మద్దతు ఇచ్చింది. [26] లెబనాన్ ఆర్టిల్లరీ ఫైర్, ఆర్మొర్డ్ కార్లు, వాలంటీర్లు, లాజిస్టికల్ సరఫారే చేసి సహకరించింది. [27] యుద్ధం కారణంగా 1,00,000 పాలస్తీనియన్లు లెబనాన్‌కు పారిపోయారు. యుద్ధం ముగిసిన తరువాత ఇజ్రాయిల్ పాలస్తీనీయులను దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు. [28] ప్రస్తుతం లొంబోలో 4,00,000 ఆశ్రితులు ఉన్నారు. వీరిలో సగం మంది కేంపులలో ఉన్నారు.[29] 1958 లో లెబనానీ ముస్లిములు లెబనాన్‌ను " యునైట్ అరబ్ రిపబ్లిక్ "లో సభ్యదేశంగా చేయడానికి ప్రయత్నించినప్పుడు లెబనాన్‌లో క్రైస్తవ తిరుగుబాటు తలెత్తింది. చమౌన్ అభ్యర్ధన మీద 500 మంది యునైటెడ్ స్టేట్స్ నావికాదళం బేయిరుత్ వచ్చి చేరారు. రాజకీయ సంఘర్షణ తరువాత జనరల్ ఫౌద్ చెహాబ్ నాయకత్వంలో తిరిగి ప్రభుత్వం రూపొందించబడింది. జోర్డాన్ బ్లాక్ సెప్టెంబరు తరువాత పలువురు పాలస్తీన్ తిరుగుబాటుదారులు లెబనాన్‌కు చేరుకున్నారు. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రేల్ కు వ్యతిరేకంగా పాలస్తీనా తిరుగుబాటు అధికం అయింది. ఇది లెబనాన్‌లో ఉద్రిక్తత అధికం అవడానికి కారణం అయింది.

అంతర్యుద్ధం, ఆక్రమణ

[మార్చు]
The Green Line that separated west and east Beirut, 1982

1975 లో సంఘర్షణలు అధికమై లెబనాన్‌లో పెద్ద ఎత్తున అంతర్యుద్ధం తలెత్తింది. " లెబనీస్ సివిల్ వార్ " కారణంగా క్రైస్తవులందరినీ సమైక్యం చేసింది. క్రైస్తవులందరూ కలిసి పి.ఎల్.ఒ. లెఫ్ట్ వింగ్, డ్రుజ్, ముస్లిం తిరుగుబాటుదారులను ఎదుర్కొన్నారు. 1976లో లెబనీస్ అధ్యక్షుడు ఎలియాస్ సారిక్స్ క్రైస్తవులకు తరఫున జోక్యంచేసుకుని శాంతిని రక్షించమని సిరియా సైన్యాలను అభ్యర్థించారు.[30] 1978 అక్టోబరులో అరబ్ లీగ్ " సిరియన్ అరబ్ డిటరెంట్ ఫోర్స్ " స్థాపించడానికి అంగీకరించింది.[31] 1982 లో లెబనాన్ నుండి పి.ఎ.ఒ. ఇజ్రాయిల్ మీద దండయాత్ర చేసింది. అమెరికా, ఫ్రెంచ్, ఇటాలియన్‌లతో చేరిన లెబనాన్ సమైక్యదళాలు బెయిరుత్‌ను ఆక్రమించుకుని పి.ఎల్.ఒ. లను వెలుపలికి తరమడానికి సహకరించారు. 1982 సెప్టెంబరు బషీర్ జెమాయేల్ కాల్చివేయబడిన తరువాత మూకుమ్మడి హత్యాకాండ [32] సబ్రా, షతిల మూకుమ్మడి హత్యాకాండ [33] , శరణార్ధుల శిబిరాల మీద దాడి తరువాత తరువాత పి.ఎల్.ఒ దళాలు తిరిగి లెబనాన్‌లో ప్రవేశించాయి. [34] 1984 లో సంకీర్ణదళాలు వెనుకకు తీసుకొనబడ్డాయి.[35] 1988 సెప్టెంబరున క్రైస్తవులు, సిరియన్లు, ముస్లిముల మద్య విభేదాలు తలెత్తిన కారణంగా జెమాయేల్ తరువాత అధ్యక్షుని ఎన్నుకొనడంలో పార్లమెంటు విఫలం అయింది. సమస్యను పరిష్కరించడానికి 1989 లో అరబ్ లీగ్ సమ్మిట్ " సౌదీ- మొరాకన్ - అల్జీరియన్ కమీటీని " ఏర్పాటుచేసింది. 1989 సెప్టెంబరు 16న కమిటీ శాంతి ప్రణాళిక అందరికీ ఆమోదం అయింది. యుద్ధవిరమణ ప్రకటించబడింది. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు తిరిగి తెరవబడ్డాయి. శరణార్ధులు తిరిగి దేశం చేరుకున్నారు.[31] అదే మాసం లెబనాన్ పార్లమెంట్ " తాయిఫ్ అగ్రిమెంట్ "కు అంగీకారం తెలిపింది.[31] 1990 లో 16 సంవత్సరాలు కొనసాగిన యుద్ధం ముగింపుకు వచ్చింది. యుద్ధం ఫలితంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్థినష్టం సంభవించాయి. దేశ ఆర్థికస్థితి దిగజారింది. యుద్ధంలో 1,50,000 మంది మరణించారు, 2,00,000 మంది గాయపడ్డారు.[36] దాదాపు ఒక మిలియన్ ప్రజలు స్వస్థాలను వదిలిపోయారు. వారిలో కొందరు తిరిగి రానే లేదు.[37] లెబనాన్‌లో పలు భాగాలు శిథిలం అయ్యాయి.[38] తాయిఫ్ అగ్రిమెంటు పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. లెబనాన్ రాజకీయాలు మత ప్రాతిపదికలో విడదీయబడుతూనే ఉన్నాయి.

వెనుతిరుగుట, తరువాత పరిణామం

[మార్చు]
Demonstrators calling for the withdrawal of Syrian forces.

2000 లలో హఫెజ్- అల్- అస్సద్ మరణించడం, దక్షిణ లెబనాన్ నుండి ఇజ్రాయిల్ దళాలు వెనుదిరగండం సంభవించిన తరువాత లెబనాన్ రాజకీయాలలో గణనీయమైన మార్పు సంభవించింది. సిరియన్ సైన్యాల ఉనికి విమర్శకు గురైంది వారిని ప్రకలుకూడా అడ్డగించారు.[39] 2005 ఫిబ్రవరి 14న మునుపటి ప్రధానమంత్రి రఫిక్ హరిరి కారు బాంబిగ్ దాడిద్వారా హతమార్చబడ్డాడు.[40] ఒకవైపు మార్చి 8 అలయంస్, సిరియన్ అఫ్హికారులు కాల్చివేత నేపథ్యంలో మొసాద్ ఉన్నాడని ఆరోపించారు.[41] దాడి చేసినందుకు " మార్చి 14 అలయంస్ " సిరియాను నిందించింది.[42] హరిరి కాల్చివేత తరువాత వరుసగా పలు హత్యలు జరిగాయి. ఫలితంగా లెబనాన్ ప్రముఖులు పలువురు మరణించారు.[nb 2] వరుస హత్యలు ఫలితంగా లెబనాన్ నుండి సిరియా సైన్యం వైదొలగాలని నిర్భంధిస్తూ " సెడార్ రివల్యూషన్ "కు తలెత్తింది. వత్తిడి కారణంగా సిరియా సైన్యం లెబనాన్ వదిలి వెనుదిరిగాయి.[43] 2005 ఏప్రిల్ 26 నాటికి సిరియా సైన్యం సిరియాకు తిరిగి చేరుకుంది.[44]" యునైటెడ్ నేషంస్ సెక్యూరిటీ కౌంసిల్ రిసొల్యూషన్ 1595 " హత్యల విచారణకు పిలుపు ఇచ్చారు.[45]" యు.ఎన్. ఇంటర్నేషనల్ ఇంవెస్టిగేషన్ కమిషన్ " 2005 అక్టోబరు 20న కేసు వివరాలు ప్రచురించింది. అందులో సిరియన్, లెబనాన్ నేరపరిశోధనశాఖ హత్యాకాండలకు నేపథ్యంలో పనిచేసిందని సందేహం వెలిబుచ్చింది.[46][47][48][49] 2006 జూలై 12 న హెజ్బుల్లాహ్ ఇజ్రాయిల్ భూభాగం మీద వరిసగా రాకెట్ దాడులకు నాయకత్వం వహించి ముగ్గురు ఇజ్రాయిల్ సైనికులను చంపి ఇద్దరిని బంధించారు. [50] ప్రతిస్పందనగా ఇజ్రాయిల్ లెబనాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్, ఆఋటిల్లరీ దాడి చేసింది. అలాగే దక్షిణ లెబనాన్ మీద భూమార్గంలో దాడిచేసింది. యునైటెడ్ నేషంస్ సెక్యూరిటీ కౌంసిల్ రిసొల్యూషన్ 1071 తరువాత 2006 ఆగస్టు 14న సంఘర్షణలు ముగింపుకు వచ్చాయి. తరువాత యుద్ధ విరమణ ప్రకటించబడింది.[51] సంఘర్షణలో 1,191 లెబనానీలు [52] 160 ఇజ్రాయిలిలు [53] మరణించారు. బేయిరుత్ శివారు ప్రాంతాలు ఇజ్రాయిల్ ఎయిర్ దాడి కారణంగా ధ్వంశం అయింది.[54] 2007 లో నాహర్ అల్- బారెడ్ శరణార్ధుల కేంపు లెబనాన్ సంఘర్షణకు కేంద్రంగా మారింది. లెబనాన్ సైన్యం, ఫతాహ్ అల్ - ఇస్లాం మద్య జరిగిన సంఘర్షణలో 169 మంది సైనికులు, 287 ఇంసర్జెంట్లు, 47 మంది పౌరులు మరణించారు.[55]

Syrian refugees in Lebanon.

లెబనాన్ ప్రభుత్వం తిరుగుబాటు ప్రయత్నం హింసాత్మకంగా మారిందని ఖండించుంది.[56] సంఘర్షణ కారణంగా 62 మంది మరణించారు. [57] 2008 మే 21న " దోహ్రా అగ్రిమెంట్ " మీద సంతకం చేయబడిన తరువాత యుద్ధం ముగింపుకు వచ్చింది. [57][58] అలాగే 18 మాసాల రాజకీయపక్షపాతం ముగింపుకు వచ్చింది. [59] తరువాత " మైకేల్ సులేమాన్ " అద్యక్షుడు అయ్యాడు. సమైక్య ప్రభుత్వం స్థాపించబడింది. ప్రతిపక్షాలకు వీటో అధికారం ఇవ్వబడింది.[58] ప్రతిపక్షాలకు ఈ ఒప్పందం ఒక విజయం అయింది. ప్రభుత్వం ప్రతిపక్షాల షరతులకు అంగీకారం తెలిపింది.[57] 2011 జనవరిలో లెబనాన్ ప్రభుత్వం (2009) పతనం అయింది.[60] పార్లమెంటు హజ్బొల్లా నాయకత్వంలోని లెబనాన్ ప్రభుత్వానికి " నజిబ్ మికతి"ని ప్రధానిగా ఎన్నిక చేసి కొత్త ప్రభుత్వం రూపొందించే బాధ్యత అప్పగించింది.[61] హజబొల్లా నాయకుడు హాసన్ నసరల్లాహ్ హరిరి కాల్చివేతకు ఇజ్రాయిల్ కారణమని సూచించాడు. [62]

Saint Nicholas stairs, Achrafieh

2012 లో సిరియన్ సివిల్ యుద్ధం లెబనాన్‌లో కూడా ప్రకంపనలు సృష్టించింది. సిరియన్ అంతర్యుద్ధం కారణంగా లెబనాన్ లోని ట్రిపోలీ లోని సున్నీ ముస్లిములు, అలవిటీస్ హింసాత్మకచర్యలు తలెత్తాయి.[63] 2013 ఆగస్టు 6 న లెబనాన్‌లో 6,77,702 కంటే అధికమైన శరణార్ధులు ప్రవేశించారు. [64] సిరియన్ శరణార్ధుల సంఖ్య క్రమంగా అధికం అయింది. లెబనాన్ ఫోర్సెస్ పార్టీ, కతీబ్ పార్టీ, ఫ్రీ పేట్రియాటిక్ మూవ్మెంట్ మతప్రాతిపదికన లెబనాన్ ప్రభుత్వం రక్షణ గురించి ఆందోళనపడ్డాయి.[65]

భౌగోళికం

[మార్చు]
Kadisha Valley
Lebanon from space. Snow cover can be seen on the western and eastern mountain ranges

లెబనాన్ పశ్చిమ ఆసియాలో 33 - 35 ఉత్తర అక్షాంశం, 35-37 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.[66] లెబనాన్ వైశాల్యం 10,452 చదరపు కిలోమీటర్లు (4,036 చ. మై.) ఇందులో {{convert|10230|భూభాగం. లెబనాన్ లోని పశ్చిమంలో ఉన్న మధ్యధరా సముద్రతీరం పొడవు 225 కిలోమీటర్లు (140 మై.) ఉత్తర, తూర్పులోని సిరియా సరిహద్దు పొడవు 375 కిలోమీటర్లు (233 మై.)దక్షిణంలోని ఇజ్రాయి సరిహద్దు పొడవు 79 కిలోమీటర్లు (49 మై.) ఉంది. long border with Israel to the south.[67][68] లెబనాన్ భౌగోళికంగా 4 ప్రత్యేక విభాగాలుగా విభజించబడింది. (సముద్రతీర మైదానాలు, లెబనాన్ పర్వతశ్రేణి, బెక్వా లోయ, యాంతి - లెబనాన్ పర్వతశ్రేణి.

సన్నని, అంతరాలు కలిగి ఉన్న సముద్రతీర మైదానాలు. సముద్రతీరంలో సారవంతమైన పంటభూములు, ఇసుక, రాతి ప్రాంతాలు ఉన్నాయి. సముద్రతీరానికి సమాంతరంగా నిటారుగా పెరిగిన లెబనాన్ పర్వతశ్రేణి ఉన్నాయి. పర్వతశ్రేణి వెడల్పు 10కి.మీ నుండి 56 కి.మీ వరకు విస్తరించి ఉంది. లెబనాన్ పర్వత శిఖరం సముద్రమట్టానికి 3,088 మీ. ఎత్తున ఉంటుంది. దక్షిణంలో సన్నినే పర్వతప్రాంతంలో సముద్రమట్టానికి 2,695 మీ ఎత్తు ఉంటుంది. పశ్చిమంలో లెబనాన్ పర్వత శ్రేణి, తూర్పున యాంతి లెబనాన్ పర్వతశ్రేణి మధ్యన బెక్వా లోయా ప్రాంతం (గ్రేట్ రిఫ్ట్ లోయలో ఇది భాగం) ఉంది. లోయ పొడవు 180 కి.మీ. వెడల్పు 26 కి.మీ. ఉంది. ఇక్కడ సారవంతమైన పంటభూములు ఉన్నాయి. యాంతి లెబనాన్ పర్వతశ్రేణి లెబనాన్ పర్వతశ్రేణికి సమాంతరంగా ఉంటుంది. ఇందులోని ఎత్తైన శిఖరం అయిన హెర్మాన్ పర్వతం ఎత్తు 2,814 మీ ఉంటుంది.[67] లెబనాన్ పర్వతాలు సీజనల్ శెలఏర్లు, నిరంతరం ప్రవహించే శెలయేర్లు ఉన్నాయి. బాల్బెక్ పశ్చిమంలో ఉన్న బెక్వా లోయలో జన్మించి ప్రవహిస్తున్న లితాని నది పొడవు 145 కి.మీ. ఇది మధ్యధరా సముద్రంలో సంగమిస్తుంది.[67] లెబనాన్‌లో ప్రయాణానికి అనువుగా ఉన్న 16 నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో 13 నదులు లెబనాన్ పర్వతశ్రేణి పశ్చిమ ముఖంలో జన్మిస్తున్నాయి. ఇవి అన్ని మధ్యధరా సముద్రంలో సంగమిస్తున్నాయి. మిగిలిన 3 బెక్వా నదిలో జన్మిస్తున్నాయి.[69]

వాతావరణం

[మార్చు]

లెబనాన్‌లో మితమైన మధ్యధరా సముద్రతీర వాతావరణం కలిగి ఉంటుంది. శీతాకాలం సాధారణంగా చలిగా ఉంటుంది. వేసవి వేడి, తేమగా ఉంటుంది. ఎత్తైన ప్రాంతాలలో శీతాకాల వాతావరణం గడ్డకట్టే అంత చల్లగా అత్యధిక హిమపాతం ఉంటుంది. ఈ హిమం వేసవి ఆరంభం వరకు ఉంటుంది. [67][70] లెబనాన్ అధికంగా వర్షపాతాన్ని అందుకుంటూ ఉంది. ఎత్తైన పర్వత శిఖరాలు అడ్డుకుంటున్న కారణంగా ఈశాన్య ౠతుపవనాలలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. [71]

పర్యావరణం

[మార్చు]
The Lebanon cedar is the national emblem of Lebanon.

పురాత కాలంలో లెబనాన్ దట్టమైన అరణ్యాలతో కప్పబడి (అధికంగా సెడార్ చెట్లు ఉన్నాయి) ఉంది.[72] ప్రస్యుతం లెబనాన్ భూభాగంలో 13% అరణ్యాలు ఉన్నాయి.[73] దీర్ఘమైన పొడిగా ఉండే వేసవి కారణంగా కార్చిచ్చు ప్రమాదం అధికంగా ఉంటుంది.[74] దీర్ఘకాలంగా దోపిడీ కారణంగా సెడార్ చెట్లు క్షీణిస్తున్నాయి. చెట్లను రక్షించడానికి కొత్తగా చెట్లను నాటడానికి ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి. లెబనాన్ ప్రభుత్వం సెడార్ చెట్లను రక్షించడానికి వన్యసంరక్షణా ప్రాంతాలు ఏర్పాటు చేస్తుంది. లెబనాన్‌లో షౌఫ్ బయోస్ఫేర్ రిజర్వ్, ది జాజ్ సెడార్ రిజర్వ్, ది టన్నౌరీ రిజర్వ్, ది అమౌయా, ది ఫారెస్ట్ ఆఫ్ సెడార్ ఆఫ్ గాడ్ మొదలైన వన్యసంరక్షణ ప్రాంతాలు ఉన్నాయి.[75][76][77] 2010 లో పర్యావరణ మంత్రుత్వ శాఖ 10 సంవత్సరాల ప్రణాళికతో జాతీయ అరణ్యభుభాగాన్ని 20% అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు ఆరంభించింది. ఈ ప్రణాళికలో భాగంగా వార్షికంగా ఒక మిలియన్ సెడార్ చెట్లను నాటాలని నిర్ణయించారు.[78] యునైటెడ్ ఏజంసీ ఫర్ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంటు స్థాపించిన ప్రణాళికను యునైటెడ్ స్టేట్స్ ఫారెస్ట్ సర్వీసెస్ లెబనాన్ రీ ఫారెస్టేషన్ ఇంషియేటివ్ ద్వారా ప్రారంభించింది. ఈ ప్రణాళికలో భాగంగా సెడార్, పైన్, అడవి బాదాం, జునిపర్, ఫిర్, ఓక్, ఇతర మొక్కలను లెబనాన్‌లోని 10 ప్రాంతాలలో నాటాలనుకుంటున్నారు.[78]

ఆర్ధికం

[మార్చు]
Graphical depiction of Lebanon 's product exports in 28 color-coded categories.

లెబనాన్ ఆర్థికరంగం స్వయప్రతిపత్తి విధానం అనుసరిస్తుంది.[79] ఆర్థికరగం అధికంగా డాలర్ ఆధారితంగా ఉంది.[79] విదేశీవాణిజ్యంలో లెబనాన్ ప్రభుత్వ జోక్యం పరిమితంగా ఉంటుంది.[79] 2008 లో లెబనాన్ ఆర్థికం 8% అభివృద్ధిచెందింది. 2009 లో ఆర్థికరగం 9% అభివృద్ధిచెందింది.[80] 2010 జి.డి.పి. అభివృద్ధి 7.5%. 2011 జి.డి.పి అభివృద్ధి 1.5%.ఐ.ఎం.ఎఫ్. అంచనా ఆధారంగా 2011 నామినల్ జి.డి.పి 41.5 అమెరికన్ డాలర్లు . [79] అరబ్ ప్రపంచంలో నెలకొన్న రాజకీయ, రక్షణ అస్థిరత (ప్రత్యేకంగా సిరియాలో) లెబనాన్ ఆర్థికరంగం, దేశీయ వాణిజ్యం మీద ప్రతికూల ప్రభావం చూపింది.[79] లెబనాన్ ప్రభుత్వౠణాలు అత్యధికంగా ఉన్నాయి. ప్రభుత్వానికి విదేశీ నిధిసహాయం ఆవశ్యకత కలిగి ఉంది.[79] 2010 ప్రభుత్వ ఋణం జి.డి.పి కంటే 150.7 % అధికం. జి.డి.పి. శాతంతో పోల్చితే లెబనాన్ ఋణం ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. 2009 లో ప్రభుత్వ ఋణం 154.8% ఉంది.[81] లెబనాన్ వాణిజ్యరంగంలో లెబనాన్ నగర పౌరులు అధికంగా భాగస్వామ్యం వహిస్తున్నారు. [82] వలసల కారణంగా కూడా లెబనాన్ వాణిజ్యరంగం ప్రపంచం అంతటా వ్యాపించింది. [83] లెబనాన్ విదేశీ వ్యాపార పెట్టుబడుల మొత్తం 8.2 బిలియన్ల అమెరికన్ డాలర్లు. [84] దేశ ఆర్థికంలో ఇది 5 వ భాగం.[85] అరబ్ ప్రపంచంలో నైపుణ్యం కలిగిన శ్రమికులు లెబనాన్‌లో అధికంగా ఉన్నారు. [86] 2011 లో లెబనాన్‌లో వ్యాపారాభివృద్ధిని ప్రోత్సహించడానికి " ఇంవెస్ట్మెంటు డెవెలెప్మెంటు అథారిటీ ఆఫ్ లెబనాన్ " స్థాపించబడింది. [87] లెబనాన్ వ్యవసాయ రంగం దేశంలో మొత్తం శ్రామికశక్తిలో 12% మందికి ఉపాధికలిగిస్తుంది.[88] 2011 లో లెబనాన్ జి.డి.పి.లో వ్యవసాయరంగం 5.9% భాగస్వామ్యం వహిస్తుంది.[89] అరబ్ ప్రపంచంలో లెబనాన్ అత్యధిక వ్యవసాయ యోగ్యమైన భూభాగం కలిగి ఉంది.[90] ప్రధానంగా ఆఫిల్, పీచెస్, ఆరంజ్, నిమ్మకాయలు పండించబడుతున్నాయి.[91] లెబనాన్ కమ్మోడిటీ మార్కెట్ గణనీయమైన బంగారు నాణ్యాల ఉత్పత్తి చేస్తుంది. వీటిని ఏ విదేశానికైనా ఎగుమతి చేయవచ్చని " ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాంస్పోర్టేషన్ అసోసేషన్ " స్టాండర్డ్స్ తెలియజేస్తుంది.[92] లెబనాన్, సైప్రస్, ఇజ్రాయిల్, ఈజిప్ట్ సముద్రతీరంలో సమీపకాలంలో పెట్రోలియం నిలువలు కనుగొనబడ్డాయి. పెట్రోలియం వెలికితీతకు ఈజిప్ట్, సైప్రస్ దేశాలతో చర్చలు జరుపుతూ ఉన్నారు. లెబనాన్, సైప్రస్‌ను వేరుచేస్తున్న సముద్రభాగంలో గణనీయమైన క్రూడయిల్, సహజవాయువు నిలువలు ఉన్నాయని భావిస్తున్నారు.[93] లెబనాన్ చిన్నతరహా పరిశ్రమలను మాత్రమే కలిగి ఉంది. విదేశాల నుండి దిగుమతి వేసుకున్న విడిభాగాలతో వస్తువులను తయారు చేసి ప్యాకింగ్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. 2004 లో 24% ఉపాధి కల్పిస్తూ పారిశ్రామిక రంగం ద్వితీయ స్థానంలో నిలిచింది.[88] పారిశ్రామిక రంగం జి.డి.పి.లో 21% భాగస్వామ్యం వహిస్తుంది.[91] సేవారంగం దాదాపు 65% మందికి ఉపాధి కల్పిస్తుంది. [88] సేవారంగం లెబనాన్ వార్షిక జి.డి.పి.లో 67.3% భాగస్వామ్యం వహిస్తుంది.[91] లెబనాన్‌లో నెలకొన్న రాజకీయ అశాంతి కారణంగా పర్యాటకరంగం, బ్యాంక్ంగ్ రంగం దెబ్బతిన్నది.[94] లెబనాన్ బ్యాంకులు భద్రతకు, లిక్విడిటీకి పేరుగాంచాయి. [95] 2008లో అభివృద్ధి దశలో సాగిన దేశంగా లెబనాన్ ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది.[96]

సిరియా సంక్షోభం

[మార్చు]

సిరియన్ సంక్షోభం లెబనాన్ ఆర్థికరంగం, ఫైనాంస్ రంగం మీద తీవ్రమైన ప్రభావం చూపాయి. లెబనాన్‌లో నివసిస్తున్న సిరియా శరణార్ధులు శ్రామికరంగంలో లెబనాన్ శ్రామికులతో పోటీపడుతున్నారు. ఫలితంగా గత మూడు సంవత్సరాలలో నిరుద్యోగం మూడురెట్లు అధికం అయింది. 2014 నాటికి నిరుద్యోగం 20% నికి చేరుకుంది. నైపుణ్యత తక్కువైన శ్రామికులు 14% వేతనం నష్టపోతున్నారు. పేదరికం ముడురెట్లు అధికం అయింది. సిరియన్ శరణార్ధుల కారణంగా ప్రభుత్వానికి 4.5 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయభారం అధికరించింది.[97]

అంతర్యుద్ధాలు

[మార్చు]
Lebanese real GDP growth

1975-1990 అంతర్యుద్ధం లెబనాన్ ఆర్థికరంగం, మౌలికనిర్మాలను విధ్వంసం చేసింది.[98] అంతర్యుద్ధం లెబనాన్ ఉత్పత్తిని సగానికి సగం తగ్గించినా లెబనాన్‌ను దిగుమతులకు, బ్యాంకింగ్‌కు కేంద్రం చేసింది.[81] గణనీయంగా శాంతి నెలకొన్న తరువాత బేయిరుత్ తిరిగి ప్రభుత్వనిర్వహణ మీద పట్టు సాధించి పంజులు వసూలు చేసి నౌకారంగం, ప్రభుత్వ వసతులను మెరుగుపరుచుంది. ఆర్థికరంగం పునరుద్ధరించబడింది. బ్యాంకింగ్ రంగం అభివృద్ధి చెందింది. చిన్న, మద్యతరహా పరిశ్రమలు, బ్యాంకింగ్, ఉత్పత్తి, ఎగుమతులు అభివృద్ధి చెందాయి. లెబనాన్ విదేశీనిధులకు సహాయనిధి ఆధారంగా ఉంది.[99] 2006 జూలై వరకు లెబనాన్ రాజకీయాలు గణనీయంగా స్థిరపడ్డాయి. బేయిరుత్ పునర్నిర్మాణం దాదాపు పూర్తి అయింది.[100] పర్యాటకుల సంఖ్య గణనీయంగా అభివృద్ధి చెందింది.[101] ఆర్థికరంగం అభివృద్ధిచెందింది. బ్యాంకింగ్ పెట్టుబడులు 75 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరింది.[102] మార్కెట్ కేపిటలైజేషన్ ఉన్నత స్థాయిని చేరుకుంది. 2006 నాటికి పెట్టుబడి 10 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది.[102] 2006 లో ఒక మాసం కొనసాగిన యుద్ధం లెబనాన్ ఆర్థికరంగం మీద తీవ్రమైన ప్రభావం చూపింది. ప్రత్యేకంగా పర్యాటకరంగం మీద ఈ ప్రభావం అధికం అయింది. [103] 2008 నాటికి లెబనాన్ మౌలిక సదుపాయాలు పునర్నిర్మించబడ్డాయి. ప్రధానంగా రియల్ ఎస్టేట్, పర్యాటకరంగం అభివృద్ధి చెందింది..[104]

పర్యాటకం

[మార్చు]
Baalbek, temple of Jupiter

పర్యాటకరంగం ప్రభుత్వ జి.డి.పి.లో 10% భాగస్వామ్యం వహిస్తుంది.[105] 2008లో లెబనాన్ 13,33,000 మంది పర్యాటకులను ఆకర్షించింది. ఇది 191 దేశాలలో లెబనాన్‌ను 79వ స్థానంలో నిలిపింది.[106] 2009 లో ఆదరణ, నైట్ లైఫ్ ప్రాతిపదికన బేయిరుత్ నగరం ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉందని న్యూయార్క్ టైంస్ వర్గీకరించింది.[107] 2010 జనవరిలో పర్యాటక మంత్రిత్వశాఖ 2009 లో లెబనాన్‌ను 18,51,081 పర్యాటకులు సందర్శించారని ప్రకటించింది. 2008 కంటే పర్యాటకుల సంఖ్య 39% అధికం అయింది.[108] 2009 లో లెబనాన్ అత్యధిక సంఖ్యలో పర్యాటకులకు ఆహ్వానం పలికింది.[109] 2010 నాటికి పర్యాటకుల సంఖ్య 2 మిలియన్లకు చేరుకుంది. అయినప్పటికీ 2012 నాటికి పర్యాటకుల సంఖ్య 37% క్షీణించింది. పొరుగున ఉన్న సిరియా అంతర్యుద్ధం లెబనాన్ పర్యాటకరంగం మీద తీవ్ర ప్రభావం చూపింది.[105] లెబనాన్ సందర్శించే పర్యాటకులలో సౌదీ అరేబియన్లు, జోర్డానియన్లు, జపానీయులు అధికంగా ఉన్నారు.[110] సమీపకాలంలో లెబనాన్ సందర్శించడానికి జపానీయులు అధికంగా రావడం కారణంగా జపాన్ ఆహారాలకు లెబనాన్‌లో ప్రాబల్యం అధికం అయింది.[111]

సినిమారంగం

[మార్చు]
  1. నాడిన్ లబాకి: లెబనీస్ చలనచిత్ర నటి, దర్శకురాలు.

గణాంకాలు

[మార్చు]
Artisan in Tripoli, Lebanon

2010 జూలైన గణాంకాలను అనుసరించి లెబనాన్ జనసంఖ్య 41,25,247.[81] మతప్రాతిపదికన రూపొందించ ప్రభుత్వంలో సమస్యలు తలెత్తగలవని భావించడం కారణంగా 1932 నుండి అధికారిక గణాంకాలు సేకరించబడలేదు.[112] సంప్రదాయపరంగా లెబనాన్ ప్రజలు అరేబియన్లుగా భావించబడుతున్నారు. వాస్తవంగా లెబనాన్ ప్రజలు ఆక్రమణలు, దాడులు, స్థిరపడడం కారణంగా లెబనాన్‌లో వివిధజాతుల ప్రజలు నివసిస్తున్నారు.[113] సంప్రదాయ, భాషా, మత, ఆధిక్యత కారణంగా దేశంలో రాజకీయ అశాంతి నెలెకొన్నది. అయినప్పటికీ లెబనాన్ చరిత్రలో మత వైవిధ్యత స్వల్ప సంఘర్షణలకు మాత్రమే కారణంగా ఉంది.[113] 1971 నుండి 2004 వరకు జనసఖ్యాభివృద్ధి 1.75% ఉంది. 2004 లో షియా ఇస్లాం ఫర్టిలిటీ 2.4%, సున్నీ ఇస్లాం ఫర్టిలిటీ 1.76%, మేరోనైట్ ఫర్టిలిటీ1.61%.[114] లెబనాన్ వరుస వలసలకు సాక్ష్యంగా నిలిచింది. 1975-2011 మద్య లెబనాన్ నుండి వలస పోయినవారి సంఖ్య 18,00,000.[114] మిలియన్ల మంది లెబనానీయులు ప్రపంచం అంతటా విస్తరించి ఉన్నారు. వీరిలో క్రైస్తవులు అధికంగా ఉన్నారు.[115] ప్రత్యేకంగా అధికంగా లాటిన్ అమెరికాకు వలసవెళ్ళారు.[116] బ్రెజిల్‌లో అధికసంఖ్యలో బహిష్కృత ప్రజలు ఉన్నారు.[117] పశ్చిమాఫ్రికాకు కూడా అధికసంఖ్యలో లెబనీయులు వలస పోయారు.[118] ప్రత్యేకంగా ఐవరీ సముద్రతీరంలో లెబనానీయులు నివసిస్తున్నారు.[119] సెనెగల్‌లో దాదాపు 30,000 మంది లెబనాన్ ప్రజలు నివసిస్తున్నారు.[120] ఆస్ట్రేలియాలో 2,70,000 మంది లెబనాన్ ప్రజలు ఉన్నారు.[121] కెనడాలో లెబనాన్ సంతతికి చెందిన ప్రజలు 2,50,000-7,00,000 పనిచేస్తున్నారు. అదనంగా బహ్రయిన్, కువైట్, ఓమన్, కతర్ మొదలైన గల్ఫ్ దేశాలలో కూడా (దాదాపు 25,000) లెబనీయులు పనిచేస్తున్నారు.[122] సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ దేశాలు కూడా లెబనీయులకు ఆశ్రయం ఇస్తున్నాయి. As of 2012, అలాగే లెబనాన్‌లో 16,00,000 మంది శరణార్ధులు, శరణుకోరే పాలస్తీనా ప్రజలు 4,49,957,[81] శరణుకోరే ఇరాక్ ప్రజలు 5,986[ఆధారం చూపాలి], శరణుకోరే సిరియా ప్రజలు [81][123], శరణుకోరే సూడాన్ ప్రజలు 4,000 ఉన్నారు. శరణార్ధుల ప్రధాన ఆదాయం కొరకు యునైటెడ్ నేషంస్ రిలీఫ్ ఫండ్, ఏజంసీ ఫర్ పాలస్తీన్ రెఫ్యూజీ నియర్ ఇన్ ది ఈస్ట్ మీద ఆధారపడుతూ 5,00,000 మంది సిరియన్ గెస్ట్ వర్కర్లతో పోటీ పడుతూ ఉన్నారు.[124] ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ వెస్టర్న్ ఆసియా ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ నివేదిక అనుసరించి 71% సిరియన్ శరణార్ధులు పేదరికంలో జీవిస్తున్నారని భావిస్తున్నారు.[97] ఐక్యరాజ్యసమితి చివరి అంచనా ఆధారంగా లెబనాన్‌లో నివసిస్తున్న సిరియన్ శరణార్ధుల సంఖ్య 12,50,000 ..[64] గత మూడు దశాబ్ధాలుగా దేశంలో వినాశకరమైన, దీర్ఘకాల సంఘర్షణలు తలెత్తాయి. లెబనానియులలో అత్యధికులు సంఘర్షణలచేత బాధింపుకు గురైయ్యారు. 75% లెబనానీయులను సంఘర్షణలు నేరుగా బాధించాయి. మిగిలినవారు కూడా పలువిధాలైన సమస్యలను ఎదుర్కొన్నారు. మొత్తంగా 96% ప్రజలను సంఘర్షణలు బాధించాయి.[125]

మూలాలు

[మార్చు]
  1. McGowen, Afaf Sabeh (1989). "Historical Setting". In Collelo, Thomas (ed.). Lebanon: A Country Study. Area Handbook Series (3rd ed.). Washington, D.C.: The Division. OCLC 18907889. Retrieved 24 July 2009.
  2. 2.0 2.1 Dumper, Michael; Stanley, Bruce E.; Abu-Lughod, Janet L. (2006). Cities of the Middle East and North Africa. ABC-CLIO. p. 104. ISBN 1-57607-919-8. Archaeological excavations at Byblos (Jbeil) indicate that the site has been continually inhabited since at least 5000 B.C.
  3. Room, Adrian (2005). Placenames of the World: Origins and Meanings of the Names for 6,621 Countries, Cities, Territories, Natural Features and Historic Sites (2nd ed.). McFarland. pp. 214–216. ISBN 978-0-7864-2248-7.
  4. Metzger, Bruce M.; Coogan, Michael D. (2004). The Oxford guide to people and places of the Bible. Oxford University Press. p. 178. ISBN 0-19-517610-3.
  5. Bienkowski, Piotr; Millard, Alan Ralph (2000). Dictionary of the ancient Near East. University of Pennsylvania Press. p. 178. ISBN 978-0-8122-3557-9.
  6. Ross, Kelley L. "The Pronunciation of Ancient Egyptian". The Proceedings of the Friesian School, Fourth Series. Friesian School. Retrieved 20 January 2009.
  7. "Archaeological Virtual Tours: Byblos". Destinationlebanon.gov.lb. Archived from the original on 23 February 2008. Retrieved 14 October 2008.
  8. "Lebanon in Ancient Times". About.com. 13 April 2012. Archived from the original on 11 మే 2011. Retrieved 17 January 2013.
  9. 9.0 9.1 "Global Security Watch—Lebanon: A Reference Handbook: A Reference Handbook". Retrieved 25 December 2014.
  10. Dalrymple, William (1997). From the Holy Mountain: A Journey Among the Christians of the Middle East. Vintage Books (Random House). p. 305. ISBN 9780307948922.
  11. "Colonialism". Retrieved 25 December 2014.
  12. Hillenbrand, Carole (2000). The Crusades: Islamic Perspectives. Psychology Press. pp. 20–21. ISBN 978-1-57958-354-5.
  13. Hakim, Carol (2013). The Origins of the Lebanese National Idea, 1840–1920. University of California Press. p. 287. ISBN 978-0-520-27341-2. Retrieved 2 April 2013.
  14. Firro, Kais (8 February 2003). Inventing Lebanon: Nationalism and the State Under the Mandate. I.B.Tauris. p. 18. ISBN 978-1-86064-857-1. Retrieved 2 April 2013.
  15. Tetz Rooke (2013). "Writing the Boundary: "Khitat al-Shăm" by Muhammad Kurd ʹAli". In Hiroyuki (ed.). Concept Of Territory In Islamic Thought. Routledge. p. 178. ISBN 978-1-136-18453-6. His [(Thongchai Winichakul's)] study shows that the modern map in some cases predicted the nation instead of just recording it; rather than describing existing borders it created the reality it was assumed to depict. The power of the map over the mind was great:"[H]ow could a nation resist being found if a nineteenth-century map had predicted it?" In the Middle East, Lebanon seems to offer a corresponding example. When the idea of a Greater Lebanon in 1908 was put forward in a book by Bulus Nujaym, a Lebanese Maronite writing under the pseudonym of M. Jouplain, he suggested that the natural boundaries of Lebanon were exactly the same as drawn in the 1861 and 1863 staff maps of the French military expedition to Syria, maps that added territories on the northern, eastern and southern borders, plus the city of Beirut, to the Mutasarrifiyya of Mount Lebanon. In this case, too, the prior existence of a European military map seems to have created a fact on the ground.
  16. Gorton, T.J. (25 April 2013). Renaissance Emir. Quartet Books. pp. 160–161. ISBN 9780704372979.
  17. Gorton, T.J. (25 April 2013). Renaissance Emir. Quartet Books. pp. 195–210. ISBN 9780704372979.
  18. "Lebanon". Library of Congress Country Studies. December 1987.
  19. Saadi, Abdul-Ilah (12 February 2008). "Dreaming of Greater Syria". Al Jazeera.
  20. Beggiani, Chorbishop Seely. "Aspects of Maronite History (Part Eleven) The twentieth century in Western Asia". Stmaron.org. Archived from the original on 29 జూన్ 2006. Retrieved 17 January 2013.
  21. "Glossary: Cross-Channel invasion". Public Broadcasting Service. Retrieved 17 October 2009.
  22. Mandates, Dependencies and Trusteeship, by H. Duncan Hall, Carnegie Endowment, 1948, pages 265-266
  23. "History of the United Nations". United Nations.
  24. Harb, Imad (March 2006). "Lebanon's Confessionalism: Problems and Prospects". USIPeace Briefing. United States Institute of Peace. Archived from the original on 9 July 2008. Retrieved 20 January 2009.
  25. "Background Note: Lebanon". Bureau of Near Eastern Affairs. U.S. Department of State. January 2009. Retrieved 31 January 2010.
  26. Morris 2008, p. 524.
  27. Morris 2008, p. 259.
  28. "Lebanon Exiled and suffering: Palestinian refugees in Lebanon" (in amn). Amnesty International. 2007. Archived from the original on 11 డిసెంబరు 2013. Retrieved 18 October 2013.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  29. al-Issawi, Omar (4 August 2009). "Lebanon's Palestinian refugees". Al Jazeera. Retrieved 21 August 2009.
  30. Toaldo, Mattia. The Origins of the US War on Terror: Lebanon, Libya and American intervention in the Middle East. Routledge. p. 45. ISBN 041568501X. Retrieved 14 June 2015.
  31. 31.0 31.1 31.2 "Country Profile: Lebanon". British Foreign & Commonwealth Office. Archived from the original on 2013-01-17. Retrieved 5 ఏప్రిల్ 2016.
  32. Noam Chomsky, Edward W. Said (1999): Fateful Triangle: The United States, Israel, and the Palestinians, South End Press, 1999, pp. 184–185
  33. Fisk, Robert (28 November 2001). "Sabra and Chatila Massacres After 19 years, The Truth at Last?". CounterPunch. Archived from the original on 17 ఆగస్టు 2011. Retrieved 1 July 2013.
  34. The War of the Camps, Journal of Palestine Studies, Vol. 16, No. 1 (Autumn, 1986), pp. 191–194
  35. BBC NEWS | Middle East | Excerpts: Bin Laden video
  36. Wood, Josh (12 July 2012). "After 2 Decades, Scars of Lebanon's Civil War Block Path to Dialogue". The New York Times.
  37. "Lebanon: Haven for foreign militants". UN IRIN news. 17 May 2007. Retrieved 17 January 2013.
  38. Salem, Paul (1 November 2006). "The Future of Lebanon". Council on Foreign Relations. Archived from the original on 8 నవంబరు 2006. Retrieved 17 January 2013.
  39. Mroue, Bassem. "Lebanese mark uprising against Syria's domination". Deseret News. Archived from the original on 20 జనవరి 2013. Retrieved 17 January 2013.
  40. Ross, Oakland (9 October 2007). "Language of murder makes itself understood". Toronto Star. Retrieved 2 February 2009. Like a wound that just won't heal, a large expanse patch of fresh asphalt still mottles the grey surface of Rue Minet el-Hosn, where the street veers west around St. George Bay. The patch marks the exact spot where a massive truck bomb exploded 14 February 2005, killing prime minister Rafik Hariri and 22 others and gouging a deep crater in the road.
  41. "Reactions to Former Lebanese PM Al-Hariri's Assassination". Middle East Media Research Institute. Retrieved 17 January 2013.
  42. "Recent background on Syria's presence in Lebanon". CBC News Indepth. 30 January 2007. Archived from the original on 19 నవంబరు 2012. Retrieved 17 January 2013.
  43. "Syria begins Lebanon withdrawal". BBC News. 12 March 2005. Retrieved 11 December 2006.
  44. "Last Syrian troops leave Lebanon". Web.archive.org. Archived from the original on 26 July 2008. Retrieved 17 January 2013.
  45. "Press Release SC/8353" (Press release). United Nations – Security Council. 7 April 2005. Retrieved 19 January 2009.
  46. Hoge, Warren (20 October 2005). "Syria Involved in Killing Lebanon's Ex-Premier, U.N. Report Says". The New York Times.
  47. Mehlis, Detlev (19 October 2005). "Report of the International Independent Investigation Commission established pursuant to Security Council resolution 1595". United Nations Information System on the Question of Palestine. Archived from the original on 28 February 2008. Retrieved 2 February 2009. It is the Commission's view that the assassination of 14 February 2005 was carried out by a group with an extensive organization and considerable resources and capabilities. [...] Building on the findings of the Commission and Lebanese investigations to date and on the basis of the material and documentary evidence collected, and the leads pursued until now, there is converging evidence pointing at both Lebanese and Syrian involvement in this terrorist act.
  48. మూస:UN document
  49. "Report of the International Independent Investigation Commission established pursuant to Security Council resolution 1595". United Nations. Retrieved 5 May 2012.
  50. Myre, Greg; Erlanger, Steven (12 July 2006). "Clashes spread to Lebanon as Hezbollah raids Israel – Africa & Middle East – International Herald Tribune". The New York Times.
  51. "Security Council calls for end to hostilities between Hizbollah, Israel". UN – Security Council, Department of Public Information. 11 August 2006. Retrieved 19 January 2009.
  52. "Lebanon Under Siege". 27 September 2006. Archived from the original on 27 సెప్టెంబరు 2006. Retrieved 5 ఏప్రిల్ 2016.
  53. "Israel-Hizbullah conflict: Victims of rocket attacks and IDF casualties July–Aug 2006". Mfa.gov.il. Retrieved 5 May 2012.
  54. "Israeli warplanes hit Beirut suburb". CNN. 13 July 2006.
  55. "Life set to get harder for Nahr al-Bared refugees". UN IRIN newsg. 5 November 2008. Retrieved 17 January 2013.
  56. Martínez, Beatriz; Francesco Volpicella (September 2008). "Walking the tight wire – Conversations on the May 2008 Lebanese crisis". Transnational Institute. Retrieved 9 May 2010.
  57. 57.0 57.1 57.2 Worth, Robert; Nada Bakri (16 May 2008). "Feuding Political Camps in Lebanon Agree to Talk to End Impasse". The New York Times. Retrieved 19 October 2009.
  58. 58.0 58.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Global Politician అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  59. Abdallah, Hussein (22 May 2008). "Lebanese rivals set to elect president after historic accord". The Daily Star. Archived from the original on 5 March 2009. Retrieved 19 October 2009.
  60. "Hezbollah and allies topple Lebanese unity government". BBC. 12 January 2011. Retrieved 12 January 2011.
  61. Bakri, Nada (12 January 2011). "Resignations Deepen Crisis for Lebanon". The New York Times. Retrieved 12 January 2011.
  62. "Hezbollah chief: Israel killed Hariri". CNN. 9 August 2010. Archived from the original on 16 జనవరి 2013. Retrieved 17 January 2013.
  63. Cave, Damien (23 August 2012). "Syrian War Plays Out Along a Street in Lebanon". The New York Times.
  64. 64.0 64.1 "Syria Regional Refugee Response – Lebanon". UNHCR. Archived from the original on 2015-09-22. Retrieved 2016-04-05.
  65. Kverme, Kai (14 February 2013). "The Refugee Factor". SADA. Retrieved 14 February 2013.
  66. Egyptian Journal of Geology - Volume 42, Issue 1 - Page 263, 1998
  67. 67.0 67.1 67.2 67.3 Etheredge, Laura S (2011). Syria, Lebanon, and Jordan – Middle East: region in transition. The Rosen Publishing Group. pp. 85–159. ISBN 978-1-61530-414-1.
  68. Philps, Alan (19 June 2000). "Israel's Withdrawal from Lebanon Given UN's Endorsement". The Daily Telegraph. Archived from the original on 22 ఫిబ్రవరి 2009. Retrieved 17 January 2013.
  69. ECODIT (October 2005). "National action plan for the reduction of pollution into the mediterranean sea from land based sources" (PDF). Lebanese ministry of the environment. Retrieved 31 January 2012.[permanent dead link]
  70. (Bonechi et al.) (2004) Golden Book Lebanon, p. 3, Florence, Italy: Casa Editrice Bonechi. ISBN 88-476-1489-9
  71. "Lebanon – Climate". Country Studies US. Retrieved 17 January 2013.
  72. "Lebanon Cedar – Cedrus libani". Blue Planet Biomes. Retrieved 17 January 2013.
  73. The world bank (2012). "Lebanon | Data". Data indicators by country. The World Bank. Retrieved 13 January 2012.
  74. Alami, Mona (30 July 2009). "Global Warming Makes Mischief Worse". Inter Press Service. Archived from the original on 12 జూన్ 2010. Retrieved 9 ఏప్రిల్ 2016.
  75. Talhouk, S. N. & Zurayk, S. 2003. Conifer conservation in Lebanon. Acta Hort. 615: 411–414.
  76. Semaan, M. & Haber, R. 2003. In situ conservation on Cedrus libani in Lebanon. Acta Hort. 615: 415–417.
  77. Khaldoun Baz (10 August 2011). "Cedars of Lebanon Nature Reserve". Shoufcedar.org. Retrieved 5 May 2012.
  78. 78.0 78.1 "Lebanon begins landmark reforestation campaign". The Daily Star. 26 November 2011. Retrieved 17 January 2013.
  79. 79.0 79.1 79.2 79.3 79.4 79.5 "Doing Business in Lebanon". Export.gov. Retrieved 17 January 2013.
  80. Bayoumy, Yara (2 February 2010). "Lebanon central bank sees GDP growth topping 5 percent in 2010". Beirut Online. Reuters. Archived from the original on 13 జనవరి 2012. Retrieved 1 March 2010.
  81. 81.0 81.1 81.2 81.3 81.4 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; cia అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  82. "Header: People, 4th paragraph". U.S. Department of State. Archived from the original on 10 ఫిబ్రవరి 2007. Retrieved 17 January 2013.
  83. "Background Note: Lebanon" (PDF). washingtoninstitute.org. Archived from the original (PDF) on 25 March 2009. Retrieved 17 January 2013.
  84. "Lebanon – Facts and Figures". Iom.int. Archived from the original on 11 జూన్ 2008. Retrieved 17 January 2013.
  85. "Facts on Lebanon's economy". Reuters. Retrieved 17 January 2013.
  86. United Nations Population Fund. "Lebanon – Overview". Archived from the original on 2008-02-07. Retrieved 2016-04-09.
  87. "Investment Law No.360". Archived from the original on 21 జూలై 2011. Retrieved 29 July 2011.
  88. 88.0 88.1 88.2 Jean Hayek et al, 1999. The Structure, Properties, and Main Foundations of the Lebanese Economy. In The Scientific Series in Geography, Grade 11, 110–114. Beirut: Dar Habib.
  89. "Agriculture, value added (% of GDP)". World Bank.
  90. "Federal Research Division of the Library of Congress, U.S.A. 1986–1988". Countrystudies.us. 13 June 1978. Retrieved 17 January 2013.
  91. 91.0 91.1 91.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; dos-2010-03-22 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  92. "IATA – Lebanon Customs, Currency & Airport Tax regulations details". Archived from the original on 2014-02-03. Retrieved 2016-04-09.
  93. "The Next Big Lebanon-Israel Flare-Up: Gas". Time. 6 April 2011. Archived from the original on 10 ఏప్రిల్ 2011. Retrieved 9 ఏప్రిల్ 2016.
  94. "Lebanon" (Governmental). Canadian International Development Agency. Government of Canada. 28 May 2009. Archived from the original on 30 మే 2008. Retrieved 24 August 2009.
  95. "Lebanon 'immune' to financial crisis". BBC News. 5 December 2008. Retrieved 28 January 2010.
  96. Cooper, Kathryn (5 October 2008). "Where on earth can you make a decent return?". The Sunday Times. London. Archived from the original on 25 మే 2010. Retrieved 28 January 2010.
  97. 97.0 97.1 Fanack. "Lebanon: Syrian Refugees Cost the Economy $4.5 Billion Every Year". Fanack.com. Archived from the original on 14 జూలై 2015. Retrieved 14 July 2015.
  98. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Stinson అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  99. "CIA World Factbook 2001" (PDF). Archived from the original (PDF) on 4 June 2007. Retrieved 17 January 2013.
  100. "Deconstructing Beirut's Reconstruction: 1990–2000". Center for the Study of the Built Environment. Archived from the original on 25 July 2011. Retrieved 31 October 2006.
  101. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; tourism అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  102. 102.0 102.1 "Lebanon Economic Report: 2nd quarter, 2006" (PDF). Bank Audi. Archived from the original (PDF) on 23 November 2008. Retrieved 17 January 2013.
  103. "Impact of the July Offensive on the Public Finances in 2006" (PDF). Lebanese Ministry of Finance. Archived from the original (PDF) on 25 మార్చి 2009. Retrieved 17 January 2013.
  104. Joseph S. Mayton (28 September 2007). "Saudi Arabia Key Contributor To Lebanon's Reconstruction". Cyprus News. Archived from the original on 28 September 2007. Retrieved 17 January 2013.
  105. 105.0 105.1 "Lebanon's tourists: Can they be lured back?". The Economist. 11 January 2013.
  106. "Tourist arrivals statistics – Countries Compared". NationMaster. Retrieved 4 November 2011.
  107. Zach Wise and Miki Meek/The New York Times (11 January 2009). "The 44 Places to Go in 2009 – Interactive Graphic". The New York Times. Retrieved 21 December 2010.
  108. "Ministry of Tourism :: Destination Lebanon". Lebanon-tourism.gov.lb. Archived from the original on 11 January 2010. Retrieved 7 January 2012.
  109. "Lebanon Says 2009 Was Best on Record for Tourism". ABC News. Associated Press. 19 January 2010. Archived from the original on 22 January 2010. Retrieved 1 February 2010.
  110. Qiblawi, Tamara (16 July 2011). "Hospitality revenues plunge 40 percent in 2011". The Daily Star. Archived from the original on 16 July 2011. Retrieved 4 November 2011.
  111. "Lebanese Cuisine With a Japanese Twist". Embassy of Japan in Lebanon. 12 September 2012. Archived from the original on 27 డిసెంబరు 2012. Retrieved 12 December 2012.
  112. United Nations High Commissioner for Refugees. "Lebanon : Overview Minority Rights Group International". World Directory of Minorities and Indigenous Peoples. Archived from the original on 17 జనవరి 2013. Retrieved 17 January 2013.
  113. 113.0 113.1 Jamie Stokes (June 2009). Encyclopedia of the Peoples of Africa and the Middle East: L to Z. Infobase Publishing. p. 406. ISBN 978-0-8160-7158-6. Retrieved 11 December 2011.
  114. 114.0 114.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; demo-reality అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  115. "Senior Seminar: Transnational Migration and Diasporic Communities". Hamline University. Archived from the original on 15 January 2009. Retrieved 17 January 2013.
  116. "The world's successful diasporas". Management Today. Retrieved 17 January 2013.
  117. Marina Sarruf. "Brazil Has More Lebanese than Lebanon". Web.archive.org. Archived from the original on 13 October 2006. Retrieved 17 January 2013.
  118. "Tenacity and risk – the Lebanese in West Africa". BBC News. 10 January 2010.
  119. "Ivory Coast – The Levantine Community". Countrystudies.us. Retrieved 17 January 2013.
  120. Schwarz, Naomi. "Lebanese Immigrants Boost West African Commerce". Web.archive.org. Archived from the original on 23 March 2008. Retrieved 17 January 2013.
  121. Price, Charles. "Australian Population: Ethnic Origins" (PDF). Archived from the original (PDF) on 19 July 2011. Retrieved 17 January 2013.
  122. "Qatar´s population by nationality". Archived from the original on 21 డిసెంబరు 2014. Retrieved 21 December 2014.
  123. "Registered Syrian refugees in surrounding states triple in three months". UNHCR – United Nations Refugee Agency. 2 October 2012. Retrieved 10 October 2012.
  124. "Lebanon-Syria: Wretched conditions for Syrian workers". IRIN. 13 April 2009. Retrieved 17 January 2013.
  125. "Lebanon, Opinion survey 2009" (PDF). ICRC and Ipsos. Retrieved 17 January 2013.[permanent dead link]


ఉల్లేఖన లోపం: "nb" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="nb"/> ట్యాగు కనబడలేదు