Jump to content

కిర్గిజిస్తాన్

వికీపీడియా నుండి
Кыргыз Республикасы
కిర్గిజ్ రెస్‌పబ్లికాసి
Кыргызская Республика
కిర్‌గిజ్‌స్కాయా రిపబ్లికా
కిర్కిజ్ రిపబ్లిక్
Flag of కిర్గిజ్‌స్తాన్ కిర్గిజ్‌స్తాన్ యొక్క చిహ్నం
నినాదం
ఏమీ లేదు
జాతీయగీతం

కిర్గిజ్‌స్తాన్ యొక్క స్థానం
కిర్గిజ్‌స్తాన్ యొక్క స్థానం
రాజధానిబిష్కేక్
42°52′N 74°36′E / 42.867°N 74.600°E / 42.867; 74.600
అతి పెద్ద నగరం రాజధాని
అధికార భాషలు కిర్గిజ్, రష్యన్ భాష
ప్రజానామము కిర్గిజ్‌స్తానీ
ప్రభుత్వం గణతంత్రం
 -  రాష్ట్రపతి కుర్మాన్ బేగ్ బాకియేవ్
 -  ప్రధానమంత్రి అల్మాస్ బేగ్ అతాంబయేవ్
స్వాతంత్ర్యము సోవియట్ యూనియన్ నుండి 
 -  ప్రకటించుకున్నది 31 ఆగస్టు 1991 
 -  సంపూర్ణమైనది 25 డిసెంబరు 1991 
విస్తీర్ణం
 -  మొత్తం 199,900 కి.మీ² (86వ)
77,181 చ.మై 
 -  జలాలు (%) 3.6
జనాభా
 -  జూలై 2005 అంచనా 5,264,000 (111వ)
 -  1999 జన గణన 4,896,100 
 -  జన సాంద్రత 26 /కి.మీ² (176వ)
67 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $10.764 బిలియన్లు (134వ)
 -  తలసరి $2,150 (140వ)
జినీ? (2003) 30.3 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.705 (medium) (110వ)
కరెన్సీ సోమ్ (KGS)
కాలాంశం కే.జీ.టీ. (UTC+6)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .kg
కాలింగ్ కోడ్ +996

కిర్గిజిస్తాన్ (ఆంగ్లం : Kyrgyzstan) (ఉచ్ఛారణ : ˈkɝːɡɪstæn ) ; కిర్గిజ్ భాష: Кыргызстан, అనేక భాషలలో కిర్గీజియా అని పిలువబడుతుంది.[1] అధికారికంగా మాత్రం కిర్గిజ్ రిపబ్లిక్.[2] మధ్యాసియాకు చెందిన ఒక భూపరివేష్టిత దేశం. కొండలు పర్వతాలతో చుట్టబడియున్నది. ఉత్తరాన కజకస్తాన్, పశ్చిమాన ఉజ్బెకిస్తాన్, నైఋతీదిశన తజకిస్తాన్, తూర్పున చైనాలు సరిహద్దులు కలిగివున్నది. దేశానికి బిష్కెక్ రాజధానిగా ఉంది. కిర్గిజ్ అంటే "నలభై తెగలు". మంగోలులకు వ్యతిరేకంగా కిర్గిజ్ హీరో అయిన మనాస్ నలభై తెగలను ఏకంచేసి, కిర్గిజిస్తాన్ ను ఏకీకృతం చేసాడు. ఈ నలభై తెగలను సూచిస్తూ కిర్గిజిస్తాన్ జాతీయ పతాకంపై నలభై సూర్య కిరణాలు కానవస్తాయి.

2000 సంవత్సరాల పూర్వం నాటి నుండి కిర్గిజిస్తాన్ గురించిన నమోదైన చరిత్ర లభిస్తుంది. కిర్గిజిస్తాన్ వైవిధ్యమైన సంస్కృతులు, సామ్రాజ్యాలతో ముడిపడి ఉంది. అత్యంత ఎత్తైన పర్వతభాగాలతో నిండి ఉన్న ఈ భూభాగం భౌగోళికంగా ఒంటరిగా ఉంటుంది. ఒంటరితనం కిర్గిజిస్తాన్ పురాతనత్వం సంరక్షించడానికి సహకరిస్తుంది. కిర్గిజిస్తాన్ సిల్క్ రోడ్డు మొదలైన పలు చరిత్ర ప్రసిద్ధి చెందిన వాణిజ్య, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన మార్గాలతో ముడివడి ఉంది. ఈ ప్రాంతంలో వంశపారంపర్యంగా పలు రాజవంశాలు, గిరిజన తెగలు నివసించాయి. ఈ ప్రాంతం మీద అధికంగా విదేశీఆధిపత్యం కొనసాగింది. 1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నత తరువాత కిర్గిజిస్తాన్ స్వతంత్ర రాజ్యాంగం ఆరంభం అయింది.

స్వతంత్రం వచ్చిన తరువాత కిర్గిస్తాన్ అధికారికంగా యూనిటరీ పార్లమెంటరీ రిపబ్లిక్ విధానం కలిగి ఉంది. అయినప్పటికీ సంప్రదాయ ప్రజల మద్య ఘర్షణలు [3][4] తిరుగుబాటు,[5] ఆర్ధికసమస్యలు [6][7] ప్రభుత్వాల మార్పిడి,[8] రాజకీయ పార్టీల మద్య గొడవలు [9] కిర్గిజిస్తాన్ " కామంవెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్, ది ఈస్టర్న్ ఎకనమిక్ యూనియన్, కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్, ది సంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్, ది ఆర్గనైజ్ ఏషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపర్ ఏషన్, ది టర్కిక్ కౌంసిల్, ది టర్క్సాయ్ కమ్యూనిటీ, ఐక్యరాజ్యసమిలలో సభ్యత్వం కలిగి ఉంది.

కిర్గిజిస్తాన్‌లో కిర్గిజ్ సంప్రదాయ ప్రజలు 5.7మిలియన్ల ప్రజలతో ఆధిక్యత కలిగి ఉన్నారు. తరువాత స్థానంలో ఉజ్బెకీయులు, రష్యన్లు ఉన్నారు. కిర్గిజ్ భాష అధికారిక భాషగా ఉంది. కిర్గిజ్ భాష ఇతర టర్కీ భాషలతో సమీపసంబంధం కలిగి ఉంటుంది. రష్యన్ భాష అధికంగా వాడుకలో ఉంది. దేశంలో 64% ప్రకటించబడని ముస్లిములు ఉన్నారు. [10] అదనంగా టర్కీ స్థానికులు, కిర్గిజ్ సంప్రదాయం అనుసరిస్తున్న పర్షియన్లు, రష్యన్లు ఉన్నారు.

చరిత్ర

[మార్చు]

పంధొమ్మిదో శతాబ్దం చివర్లో చైనా ప్రభుత్వం 'కిర్గిజియా' ప్రాంతాలను రష్యాకు దత్తత ఇచ్చేసింది. దీన్ని కిర్గిజ్‌ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.రష్యా ఆ నిరసన స్వరాలను బలంగా అణచివేసింది. మాజీ సోవియట్‌ దేశాలన్నింటిలోకీ అత్యంత పేద దేశం కిర్గిస్థాన్‌.కిర్గిస్థాన్‌లో కిర్గిజ్‌ జాతీయులు 70% ఉండగా ఉజ్బెక్‌ జాతీయులు మైనారిటీలు. 50 లక్షల దేశజనాభాలో వీరు 15% ఉంటారు. ఓష్‌, జలాలాబాద్‌లలో ఉజ్బెక్‌ల ప్రాబల్యం ఎక్కువ. ఇది ఉజ్బెకిస్థాన్‌కు ఆనుకునే ఉండటంతో.. ఎప్పటికైనా వీరు ఈ ప్రాంతాన్ని ఉజ్బెక్‌లో కలిపేసేందుకు కుట్రలు పన్నుతారేమోనని స్థానిక్‌ కిర్గిజ్‌ జాతీయులు అనుమానిస్తున్నారు. స్థానిక్‌ కిర్గిజ్‌ జాతీయులు ఉజ్బెక్‌ తెగలపై విరుచుకుపడుతూ.. నరమేధం సృష్టిస్తున్నారు.ఉజ్బెక్‌ జాతీయులంతా నిరాశ్రయులై ప్రాణాలు గుప్పిట పెట్టుకుని.. పెద్దసంఖ్యలో సరిహద్దులు దాటి ఉజ్బెకిస్థాన్‌లోకి వలస పోవటం ఆరంభించారు. శరణార్ధుల సంఖ్య 2 లక్షలు దాటిపోతుండటంతో వీరిని భరించే శక్తి లేదంటూ ఉజ్బెక్‌ ప్రభుత్వం ఇక సరిహద్దులను మూసెయ్యాలని నిర్ణయించుకుంది.

The Turkic Khaganate.

డేవిడ్ సి.కింగ్ అభిప్రాయం అనుసరించి కిర్గిజిస్తాన్‌లో ఆరంభకాలంలో నివసించిన ప్రజలు సింధియన్లు అని భావిస్తున్నారు.[11] సా.శ. 840 లో ఖగనాటే ఉయ్గూర్ సామ్రాజ్యాన్ని ఓడించిన తరువాత కిర్గిజి రాజ్యం విస్తరణ ఉచ్ఛస్థితికి చేరుకుంది.[12] 10వ శతాబ్దం నుండి కిర్గిజ్ తియాన్ షాన్ పర్వతశ్రేణికి వలసవెళ్ళి 200 సంవత్సరాల కాలం ఈ ప్రాంతంమీద ఆధిపత్యం వహించారు. 12 వ శతాబ్దం నాటికి కిర్గిజ్ ప్రజల ఆధిపత్యం మంగోలు ప్రజల ఆధిపత్యం (మంగోలు విస్తరణకు ముందు) కారణంగా అల్టే పర్వతశ్రేణి, సయన్ పర్వతశ్రేణి మద్యప్రాంతానికి పరిమితమైంది. 13వ శతాబ్దంలో మంగోల్ సామ్రాజ్యం విస్తరణ కారణంగా కిర్గిజ్ ప్రజలు దక్షిణప్రాంతానికి వలసవెళ్ళారు. 1207 నాటికి కిర్గిజ్ ప్రజలు ప్రశాంతంగా మంగోల్ సామ్రాజ్యంలో భాగం అయింది.

చైనా ప్రజలు, ముస్లిములు సా.శ. 7-12 శతాబ్ధాలలో కిర్గిజ్ ప్రజలు ఎర్రని వెంట్రుకలు, తెల్లని చర్మం, నీలి కళ్ళు కలిగి ఉంటారని వర్ణించారు. ఈ వర్ణన ఆధారంగా వీరు స్లావిక్ ప్రజలలా " ఇండో - యురేపియన్ " (కుర్గన్ హైపోథిసీస్) ప్రజలని భావిస్తున్నారు.[13][14] సమీపకాల మానవజన్యు శాస్త్రం అనుసరించి కిర్గిజ్ సంతతికి అటోఛ్టోనస్ సైబీరియా ప్రజలు ఆధ్యులని భావిస్తున్నారు.[15] వలసలు, పోటీ, అంతర్జాతి వివాహాలు, ఒకరితో ఒకరు సమానత్వంగా ఉండడం కారణాగా కిర్గిజ్ ప్రజలు ప్రస్తుతం మద్య ఆసియా, ఆగ్నేయ ఆసియా వరకు విస్తరించి ఉన్నారు. మిగిలిన పూర్విక సంప్రదాయాలతో మిశ్రితం అవశం వైవిధ్యమైన పలు తెగలకు చెందిన ప్రజలతో కలిసిపోయిన కారణంగా ప్రస్తుత కిర్గిజ్ ప్రజలలో సామీప్యసంబంధాలున్న పలుభాషలు వాడుకలో ఉన్నాయి.[16][17] ఐరోపా, తూర్పు ప్రాంతాలకు ప్రయాణించే వ్యాపారులకు, ఇతర ప్రజలకు సిల్క్ రోడ్డు ప్రయాణంలో " ఇస్సక్ కుల్ సరసు " ప్రధాన మజిలీగా ఉండేది. 17వ శతాబ్దంలో మంచుక్వింగ్ సామ్రాజ్య పాలనలో కిర్గిజ్ ప్రజలను మంగోల్ ఒయిరాతులు, 19వ శతాబ్దంలో కొకండ్ ఉజ్బెకి ఖనాటేలు ఈ ప్రాంతం నుండి తరిమివేసారు.[18] 19వ శతాబ్దం చివరికి ప్రస్తుత కిర్గిజ్ ప్రాంతంలోని అత్యధికభాగం చైనాకు చెందిన క్వింగ్ సామ్రాజ్యం - రష్యాల మద్య జరిగిన రెండు ఒప్పందాల ద్వారా రష్యాకు స్వాధీనం చేయబడింది. తరువతా ఈ ప్రాంతం రష్యాలోని కిర్గిజియాగా గుర్తించబడింది. 1876 నాటికి కిర్గిజ్ ప్రాంతం రష్యాలో భాగంగా రూపొందించబడింది. రష్యా ఆధిక్యత ఈ ప్రాంతంలో త్సారిస్ట్ అధికారానికి వ్యతిరేకంగా పలు తిరుగుబాట్లకు కారణం అయింది. పలువురు కిర్గిజ్ ప్రజలు పామర్ పర్వతాలు, ఆఫ్ఘంస్థాన్‌కు వలసవెళ్ళేలా చేసింది.

In addition, the suppression of the 1916 rebellion against Russian rule in Central Asia caused many Kyrgyz later to migrate to China.

[19]

Since many ethnic groups in the region were (and still are) split between neighboring states at a time when borders were more porous and less regulated, it was common to move back and forth over the mountains, depending on where life was perceived as better; this might mean better rains for pasture or better government during oppression.

సోవియట్ యూనియన్

[మార్చు]
Bishkek

1919లో సోవియట్ యూనియన్ స్థాపించబడింది. అలాగే కారా- కిర్గిజ్ ఒబ్లాస్ట్ రష్యాలో అంతర్భాగంగా రూపొందించబడింది (రష్యాలో 1920 వరకు కజక్, కిర్గిజ్‌లను ప్రత్యేకించి చూపడానికి కారా- కిర్గిజ్ పదం ఉపయోగంలో ఉంది). 1936 దిసెంబర్‌న కిర్గిజ్ సోవియట్ రిపబ్లిక్ పూర్తిస్థాయి సోవియట్ రిపబ్లిక్‌గా స్థాపించబడింది.

1920 లో కిర్గిజిస్తాన్ సంస్కృతికంగా, విద్యాపరంగా, సాంఘిక జివనవిధానపరంగా అభివృద్ధి చేయబడింది. అక్షరాస్యత గణనీయంగా అభివృద్ధిచెందింది. రష్యన్ భాష బోధనాభాషగా ప్రవేశపెట్టబడుంది. ఆర్థిక, సాంఘిక అభివృద్ధి గుర్తించతగినంతగా జరిగింది. జోసెఫ్ స్టాలిన్ జాతీయవాదం పేరుతో కిర్గిజ్ జాతీయత అణిచివేతకు గురైంది. సోవియట్ యూనియన్ 1920-1953 మద్య స్టాలిన్ ఆధ్వర్యంలో పాలించబడింది.

ఆరంభకాల పరిపాలన పారదర్శకత కిర్గిజిస్తాన్ రాజకీయాలలో కొంత మార్పు తీసుకువచ్చింది. రిపబ్లిక్ ప్రభుత్వానికి ప్రెస్ స్వతంత్రం, కొత్త పబ్లికేషన్ల స్థాపనకు అనుమతి ఇచ్చినప్పటికీ సాహిత్యపరంగా కిర్గిజిస్తాన్ రచయితల యూనియన్, అనధికారిక రాజకీయ కూటములు నిషేధించబడ్డాయి. 1989 సోవియట్ గణాంకాలు ఉత్తరప్రాంత నగరం బిష్కెక్‌లో కిర్గిజ్ సంప్రదాయ ప్రజలు 22% మాత్రమే నివసిస్తున్నారని రష్యన్లు, ఉజ్బెకీయన్లు, స్లావిక్ ప్రజలు 60% నివసిస్తున్నారని తెలిపింది. 36% ప్రజలకు రష్యన్ వాడుక భాషగా ఉందని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.[20]

Soviet cosmonaut Yuri Gagarin on stamp

1990 లో ఉజ్బెకీయులు సంప్రదాయ కిర్గిజ్ ప్రజలమద్య ఘర్షణలు అధికం అయ్యాయి. ఉజ్బెకీయులు అధికంగా ఉన్న దక్షిణ కిర్గిస్తాన్‌లోని ఓష్ ఒబ్లాస్ట్ ప్రాంతంలో ఘర్శ్హణలు అధికం అయ్యాయి. [21] ఉజ్బెకీయులు సమ్యుక్తంగా నివాసగృహ సముదాయాలు నిర్మించడం ఓష్ తిరుగుబాటు (1990) కు దారితీసింది. ఘర్షణల కారణంగా ఈ ప్రాంతంలో కొత్తగా ఎమర్జెంసీ, కర్ఫ్యూ పరిచయం అయ్యాయి.[22] అదే సంవత్సరం ఉత్తర కిర్గిజిస్తాన్‌లోని సంఘటిత వ్యవసాయ కుటుంబంలో 5 వ కుమారునిగా జన్మించిన అస్కర్ అకయేవ్ అధ్యక్షునిగా ఎన్నిక చేయబడ్డాడు. తరువాత కిర్గిజిస్తాన్ డెమొక్రటిక్ ఉద్యమం రాజకీయ మద్దతుతో అభివృద్ధి తీవ్రం అయింది. 1990 డిసెంబరులో సుప్రీం సోవియట్ రిపబ్లిక్ ఆఫ్ కిర్గిజిస్తాన్‌గా మార్చడానికి ఓటు వేసింది. 1993 లో ఇది కిర్గిజ్ రిపబ్లిక్ అయింది. తరువాత జనవరి అకయేవ్ కొత్త ప్రభుత్వ విధానం ప్రవేశపెట్టాడు. అలాగే యువ రాజకీయ సంస్కరణా వాదులతో కొత్త ప్రభుత్వ అధికారులను నియమించాడు. 1991లో రాజధాని పేరు ఫ్రంజ్ స్థానంలో పురాతన బిష్కెక్ గా మార్చబడింది.1991లో స్వతంత్ర కిర్గిజిస్తాన్ అవతరించింది.

1991 ఆగస్టు 19న స్టేట్ ఎమర్జెంసీ కమిటీ మాస్కోలో ఏర్పా టు చేసిన తరువాత అకయేవ్‌ను కిర్గిజిస్తాన్ అధూక్షపదవి నుండి తొలగించాలని ప్రతిపాదించబడింది. తరువాత వారం అద్యక్షుడు అకయేవ్, ఉపాద్యక్షుడు జర్మన్ కుజ్నెత్సోవ్ సోవియట్ కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా పత్రాలను సమర్పించారు.తరువాత మొత్తం బ్యూరో, సెక్రటరేట్ రాజీనామా చేసింది. తరువాత సోవియ ట్ యూనియన్ రద్దు చేయబడి 1991 ఆగస్టు 31న స్వతంత్ర " కిర్గిజ్ రిపబ్లిక్ " అవతరించింది.

స్వతంత్రం

[మార్చు]

1991 అక్టోబరులో అకయేవ్ స్వతంత్ర రిపబ్లిక్ అధ్యక్షుడిగా 95% ఓట్లతో ఎన్నిక చేయబడ్డాడు. అదే సంవత్సరం సరికొత్తగా రూపొందించబడిన 7 రిపబ్లిక్ ప్రతినిధులతో " ట్రీటీ ఆఫ్ ది న్యూ ఎకనమిక్ కమ్యూనిటీ " మీద సంతకం చేసాడు. చివరిగా 1991 డిసెంబరు 21న కిర్గిజిస్తాన్ ఇతర 4 మద్య ఆసియా రిపబ్లిక్‌లతో కలిసి " కామంవెల్త్ ఆఫ్ ఇండిపెండెంటు స్టేట్స్ "తో కలుపబడింది. 1991 డిసెంబర్ 25 నుండి కిర్గిజిస్తాన్ సంపూర్ణ స్వతంత్రం పిందింది. 1991 డిసెంబర్ 26న సోవియట్ యూనియన్ పూర్తిగా పతనం అయింది. 1992లో కిర్గిజిస్తాన్ మిగిలిన మద్య ఆదియా రిపబ్లిక్కులతో కలిసి ఐఖ్యరాజ్యసమితి, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో- ఆపరేషన్ ఇన్ ఐరోపా " లలో కలిసింది. 1993 మే 5న అధికారిక రిపబ్లిక్ ఆఫ్ కిర్గిజిస్తాన్ నుండి కిర్గిజ్ రిపబ్లిక్ గా మార్చబడింది.

విప్లవాలు

[మార్చు]

2005 లో పార్లమెంటు ఎన్నికల తరువాత ఏప్రిల్ 4న అధ్యక్షుడు అస్కర్ అకయేవ్ రాజీనామా కోరుతూ " తులిప్ విప్లవం " తలెత్తింది. ప్రతిపక్ష పార్టీలు కూటమిగాచేరి అధ్యక్షుడు కుమాన్ బకియేవ్, ప్రధానమంత్రి ఫెలిక్స్ కులోవ్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఊరేగింపు సమయంలో దేశరాజధాని దోపిడీ చేయబడింది. రాజకీయ స్థిరత్వం అస్పష్టంగా ఉన్న సమయంలో వివిధ గుంపులు, సంఘర్షణలు అధికారం కొరకు నేరాలకు పాల్పడ్డారు. 2005 మార్చిలో ఎన్నికచేయబడిన 75 మంది పార్లమెంటు సభ్యులలో ముగ్గురు హత్యచేయబడ్డారు. 2006 మే 10న మరొక సభ్యుడు హత్యచేయబడిన సోదరుని స్థానంలో పోటీచేసి విజయం సాధించిన తరువాత హత్యచేయబడ్డాడు. నలుగురు ప్రధాన చట్టవిరోధమైన వ్యాపారంలో సంబంధం ఉందని నేరం అరోపించబడిన వారే. మూస:According to whom 2010 ఏప్రిల్ 26న తలాస్ నగరంలో " కిర్గిజిస్తాన్ విప్లవం 2010 " తలెత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లంచం, అధికరిస్తున్న జీవనవ్యయం గురించి అభిప్రాయం వెలిబుచ్చిన తరువాత ఈ విప్లవం తలెత్తింది. విప్లవదారులు అధ్యక్షుడు బకియేవ్ కార్యాలయాల, ప్రభుత్వ రేడియో, దూరదర్శన్ కార్యాలయాల మీద దాడిజరిగింది. ఇంటీరియర్ మినిస్టర్ మొలోడొమ కొంగతియేవ్ మీద దాడి జరిగినట్లు వార్తలు ప్రచురించబడ్డాయి. 2010 ఏప్రిల్‌ 7న అధ్యక్షుడు బకయేవ్ ఎమర్జెంసీ ప్రకటించాడు. పోలీస్, స్పెషల్ సర్వీసులు ప్రతిపక్షనాయకులను ఖైదుచేసాయి. ప్రతిగా విప్లవదారులు ఇంటర్నల్ సెల్యూరిటీ హెడ్‌క్వార్లు, రాజధాని బిష్కెక్ లోని టెలివిజన్ కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నారు. [ఆధారం చూపాలి] కిర్గిజిస్తాన్ ప్రభుత్వ అధికారుల నివేదికలు రాజధానిలో 75 మంది చంపబడ్డారని 458 మంది తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చేర్చబడ్డారని తెలియజేసాయి. .[23] మునుపటి విదేశాంగమంత్రి రోజా ఒతంబయేవా నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబడి ప్రభుత్వ సౌకర్యాలు, మాధ్యమం స్వాధీనం చేసుకున్నది. బికియేవ్ మాత్రం పదవికి రాజీనామా చేయలేదు.[24][25] అధూక్షుడు బకియేవ్ జలాల్- అబాద్ లోని తన నివాసానికి తిరిగి వచ్చి పత్రికాసమావేశం ఏర్పాటుచేసి 2010 ఏప్రిల్ 10న పదవికి రాజీనామా చేసాడు.[26] 2010 ఏప్రిల్ 15న బకియేవ్ భార్య, ఇద్దరు పిల్లలతో దేశం విడిచి కజకస్తాన్కు పారిపోయాడు. ప్రభుత్వాధికారులు బకియేవ్ దేశం విడిచిపోయే ముందు రాజీనామాచేసాడని ప్రకటించారు.[27] ప్రధానమంత్రి దనియార్ రష్యా తిరుగుబాటుదారులకు మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. ఆరోపణను రష్యన్ ప్రధానమంత్రి వ్లాదిమిర్ పుతిన్ ఖండించాడు. ప్రతిపక్షాలు యు.ఎస్. ఆధీనంలోని మనాస్ ఎయిర్ బేస్ మూసివేయాలని పిలుపు ఇచ్చారు.[28] రష్యా అధ్యక్షుడు ద్మిత్రి మెద్వెదేవ్ రష్యన్ ప్రజల రక్షణ కొరకు ఆదేశాలు జారీచేస్తూ కిర్గిజిస్తాన్‌లోని రష్యన్ ప్రాంతాలకు సెక్యూరిటీని బలపరచాలని ఆదేశించాడు. రష్యన్ కార్యాలయాల మీద దాడి జరగవచ్చని సందేహించడమే ఇందుకు కారణం. 2010 జూన్ 11 న ఒష్ ప్రాంతంలో కిర్గిజ్, ఉజ్బెకీయుల మద్య " ది 2010 సౌత్ కిర్గిజిస్తాన్ ఎత్నిక్ క్లాషెస్ " సంభవించాయి. సంఘర్షణలు అంతర్యుద్ధానికి దారి తీస్తాయని భయాందోళనలు మొదలైయ్యాయి.[29][30]

Nomads in Kyrgyzstan

పరిస్థితి నియంత్రించడం అసాధ్యమని భావించి ఆపత్కాల నాయకుడు ఒతంబయేవ రష్యా అధ్యక్షుడు ద్మిత్రి మెద్వెదేవ్‌కు రష్యన్ సైనికులను పంపి పరిస్థితిని అదుపుచేయమని లేఖ వ్రాసాడు. రష్యా నుండి అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి కుదరదని సమాధానం పంపబడింది. సంఘర్షణల కారణంగా ఆహారం, ఇతర నిత్యావసరాల కొరత ఏర్పడింది. సంఘర్షణలలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,685 మంది ప్రజలు గాయపడ్డారు. as of 12 జూన్ 2010[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]]. రష్యా ప్రభుత్వం మానవీయ సహకారం అందించింది. [31] ప్రాంతీయ సమాచారం ఆధారంగా రెండు ప్రాంతీయ ఇది సమూహాలమద్య సంభవించిన సంఘర్షణగా అభివర్ణించబడింది. సంప్రదాయ కిర్గిజ్ ప్రజలు నగరంలో ప్రవేశించడానికి ఆయుధదళాలు సహకరించాయని రిపోర్టులు వివరిస్తున్నాయి. ప్రభుత్వం అరోపణలను తిరస్కరించాయి. [31] తిరుగుబాటుదారులు పొరుగు ప్రాంతాలకు విస్తరించింది. ప్రభుత్వం దక్షిణప్రాంతంలోని జలాల్- అబాద్ ప్రాంతంలో ఎమర్జెంసీ ప్రకటించింది. పరిస్థితి అదుపులోకి తీసుకురావ డానికి ఆపత్కాల ప్రభుత్వం సెక్యూరిటీ ఫోర్స్‌కు తుపాకి షూటింగ్ అధికారం ఇచ్చింది. రష్యన్ సౌకర్యాలను రక్షించడానికి బెటాలియన్ పంపాలని రష్యా ప్రభుత్వం విశ్చయించుకుంది.[32]

Kyrgyz family in the village of Sary-Mogol, Osh province

ఒతంబయేవ బకియేవ్ కుటుంబం రెచ్చగొట్టడం కారణంగా అల్లర్లు అదుపుతప్పాయని ఆరోపించాడు.[33] ఎ.ఎఫ్.పి రిపోర్ట్ నగరమంతా పొగ తెరలా కప్పింది" అని వివరించాయి. పొరుగున ఉన్న ఉజ్బెకిస్తాన్ అధికారులు తిరుగుబాటుదారుల నుండి తప్పించుకోవడానికి 30,000 మంది ఉజ్బెకియన్లు సరిహద్దును దాటారని వెల్లడించారు.[32] 2010 జూన్ 14 నాటికి ఓష్ నగరంలో ప్రశాంతి నెలకొన్నది. జలాల్- అబాద్‌లో మాత్రం అల్లర్లు కొనసాగాయి. ప్రాంతమంతా ఎమర్జెంసీ ప్రకటించబడింది. ఉజ్బెకియన్లు అల్లరి మూకలు దాడిచేస్తారన్న భయంతో తమ గృహాలను వదిలి వెళ్ళడానికి నిరాకరించారు. పరిస్థితి చక్కదిద్దడానికి ఐక్యరాజ్యసమితి దూతలను పంపాలని నిశ్చయించింది.[34] ఆపత్కాల ప్రభుత్వప్రతినిధి తెమిర్ సరియేవ్ ప్రాంతీయంగా సంభవించిన ఘర్షణలను ప్రభుత్వం అదుపు చేయలేకపోయింది. హింసను అదుపుచేయడానికి తగినత సెక్యూరిటీ దళాలు లేవని కూడా చెప్పాడు. 2010 జూన్ 14న కిర్గిజిస్తాన్ అభ్యర్ధనను రష్యా పరిశీలిస్తున్నట్లు మాధ్యమం వివరించింది. " కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ " కొరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబడింది. కిర్గిజ్ ప్రభుత్వం, కిర్గిజ్ అధ్యక్షుడు రోజా ఓతంబయేవ పరిస్థితిని అదుపుచేయడానికి రష్యా సైనికదళం అవసరం లేదని ప్రకటించారు. 2010 జూన్ 15కు 170 మంది మరణించారని ప్రకటిచారు. అయినప్పటికీ రెడ్ క్రాస్ సొసైటీ మరణాలసంఖ్య తగ్గించబడిందని అభిప్రాయం వెలువరించింది. ఉజ్బకియన్లు తమకు రక్షణ తగినంత లేకుంటే ఓష్ లోని ఆయిల్ దిపోను తగులబెడతామని బెదిరించారు. ప్రణాళికా బద్ధంగా కొందరిని గురిచేసి దాడులు జరిగాయని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది.[35]

Children of Kyrgyzstan

విచారణ

[మార్చు]

2010 ఆగస్టు 2న కిర్గుజ్ ప్రభుత్వకమిషన్ సంఘర్ష్ణల మూల కారణం గురించి విచారణ ప్రారంభించింది. కమిషన్ సభ్యులకు మునుపటి పార్లమెంటు స్పీకర్ అబ్ద్యగని ఎర్కెబయేవ్ నాయకత్వం వహించాడు. ఆయన ఉజ్బెకియన్ల ఆధిక్యత కలిగిన మాడీ, షార్క్, కిర్గిజ్ ఓష్ ఒబ్లాస్ట్ లోని కారా- సూ ప్రాంతంలోని కారా- కిష్తక్ ప్రజలతో విడిగా సమావేశమయ్యాడు. జాతీయ కమిషన్‌లోని పలు సంప్రదాయ సమూహాలకు చెందిన ప్రతినిధులను అధ్యక్షుని డిక్రీతో నియమించబడింది. అధ్యక్షుడు రోజా ఒతంబయేవ 2010 ఆగస్టున సంఘర్షణలమూలకారణం తెలుసుకోవడానికి అంతర్జాతీయ కమిషన్ ఏర్పాటు చేయబందని ప్రకటించాడు.[36]

కమీషన్ రిపోర్ట్

[మార్చు]

2011 జనవరిలో కమిషన్ రిపోర్టు విడుదల చేయబడింది. " దక్షిణ కిర్గిజిస్తాన్‌లో సంభవించిన ప్రణాళికాబద్ధమైన బృహత్తర ప్రణాళికతో రెచ్చగొట్టి కిర్గిజిస్తాన్ చీలిక, ప్రజల ఐక్యతను చెడగొట్టడానికి ఈ సంఘర్షణలు ప్రేరించబడ్డాయని " కమిషన్ రిపోర్టు తెలియజేసింది.[37]

రాజకీయాలు

[మార్చు]
President Askar Akayev (1990–2005) with U.S. president George W. Bush, 22 September 2002
PM and President Kurmanbek Bakiyev (2005–2010) on a meeting with U.S. Defense Secretary Donald Rumsfeld, 26 July 2005
President Almazbek Atambayev (2011–) and Russian president Vladimir Putin, 16 March 2015

1993-2010 కిర్గిజిస్తాన్ రాజ్యాంగం " డెమొక్రటిక్ యూనికేమరల్ రిపబ్లిక్ "గా రూపొందించాలని సుప్రీం కౌంసిలర్, వైస్ చైర్ లతో చేరిన ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ నిర్ణయించబడింది. ప్రస్తుత పార్లమెంటు యూనికేమరల్. జ్యూడీషియల్ శాఖ ఆధ్వర్యంలో సుప్రీం కోర్ట్, లోకల్ కోర్టులు, చీఫ్ ప్రాసి క్యూటర్ పనిచేస్తుంటారు.

అల్లర్లు

[మార్చు]

2002 మార్చిలో దక్షిణ జిల్లా అక్సిలో ప్రతిపక్ష నాయకుడు పోలీస్ కాల్చివేతకు గురైన విషయమై 5 మంది సభ్యులు వ్యాఖ్యానించారు. తరువాత దేశవ్యాప్త తిరుగుబాటుకు ఇది కారణం అయింది. అధ్యక్షుడు అస్కర్ అకయేవ్ రాజ్యాంగ సంస్కరణలు చేపట్టాడు. సివిల్, సోషల్ ప్రతినిధులు పల్గొన్న రిఫరెండంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి.

చట్ట సవరణ

[మార్చు]

రాజ్యాంగ సవరణలు ప్రజాభిప్రాయం ద్వారా ఆమోదించబడ్డాయి. సవరణలు అధ్యక్షుని అధికారం శక్తివంతమై పార్లమెంటు, కాంస్టిట్యూషనల్ కోర్టు అధికారాన్ని బలహీనపరిచాయి. 2005 లో 75 మంది సభ్యులు కలిగిన పార్లమెంటుకు కొత్తగా నిర్వహించబడిన ఎన్నికల ఫలితాలను లంచగొండితనం నిర్ణయించిందని చాలామంది అభిప్రాయపడ్డారు. తరువాత మార్చి 24న సంభవించిన ఘోరమైన తిరుగుబాటు కారణంగా అధ్యక్షుడు అకయేవ్ తన కుటుంబంతో దేశం వదిలి పారిపోయాడు. కుర్మంబెక్ బకియేవ్ తాత్కాలిక అధ్యక్షునిగా నియమించబడ్డాడు.

ఎన్నికలు

[మార్చు]

2005 జూలై 10న తాత్కాలిక అధ్యక్షుడు బకియేవ్ కిర్గిజ్ అధ్యక్షునిగా 88,9% ఓట్ల మెజారిటీతో ఎన్నిక చేయబడ్డాడు. అయినప్పటికీ అధ్యక్షునికి క్రమంగా ప్రజాదరణ క్షీణించడం మొదలైంది. సోవియట్ యూనియన్ పాలన నుండి దేశాన్ని పీడిస్తున్న లంచగొండితనం సమస్యను పరిష్కరించలేక పోవడం అందుకు ప్రధాన కారణం అయింది. అలాగే పలు పార్లమెంటు సభ్యుల హత్యలు కూడా రాజకీయ అశాంతికి కారణం అయింది. అధ్యక్షుడు బకియేవ్‌కు వ్యతిరేకంగా బృహత్తర తిరుగుబాటు ఎదురైంది. అధ్యక్షుడు ఎన్నికసమయంలో చేసిన వాగ్ధానాలను వెరవేర్చడంలో విఫలత చెందాడని ప్రతిపక్షాలు ఆరోపించాయి. రాజ్యాంగ సంస్కరణలు, అధ్యక్షునికి ఉన్న అధికారం పార్లమెంటుకు తరలించడానికి ప్రయత్నించలేదన్నది ఆరోపణలలో భాగం అయ్యాయి.[38]

సభ్యత్వం

[మార్చు]

కిర్గిజిస్తాన్ " ది ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కార్పొరేషన్ ఇన్ ఐరోపా " (శాంతి, పారదర్శకత, యురేషియాలో మానహక్కుల పరిరక్షణ కొరకు 56 దేశాలు భాస్వామ్యం వహిస్తున్న సమాఖ్య)లో సభ్యత్వం కలిగి ఉంది. ఒ.ఎస్.సి.ఇలో భాగస్వామ్యం వహిస్తున్న దేశంగా యు.ఎస్. హెల్సికి కమీషన్ ఆదేశానుసారం కిర్గిజిస్తాన్ అంతర్జాతీయ నిర్ణయాధికారం ఉంటుంది.[39] 2009లో అధ్యక్షుడు కుర్మంబెక్ బకియేవ్ మనాస్ ఎయిర్ బేస్ (కిర్గిజిస్తాన్ లోని ఒకే ఒక ఎయిర్ బేస్ ) మూసివేయాలని ప్రకటించాడు. [40] 2009 ఫిబ్రవరిలో ఎయిర్ బేస్ మూసివేయాలన్న ఆదేశం అమలు చేయబడింది.[41] తరువాత రష్యా, అమెరికన్ దూతలు మద్య రాజీ ప్రయత్నాలు జరిగాయి. 2009 జూన్‌న నిర్ణయం వెనక్కి తీసుకొనబడింది. కొత్త ఒప్పందం అనుసరించి అమెరికా ఎయిర్ బేస్ మనాస్ తిరిగి పనిచేయడం ఆరంభం అయింది. అప్పటి నుండి వార్షిక లీజు 17.4 మిలియన్ల నుండి 60 మిలియన్లకు అధికరించబడింది.[42]

లంచం

[మార్చు]

అత్యధికంగా లంచాల సమస్యతో బాధించబడుతున్న 20 దేశాలలో కిర్గిజిస్తాన్ ఒకటి. 2008 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఆఫ్ కిర్గిజిస్తాన్ 1.8 (స్కేల్ 0 అత్యధిక లంచం నుండి 10 అత్యల్ప లంచం) ఉంది.[43]

2010 తిరుగుబాటు

[మార్చు]

2010లో కిర్గిజిస్తాన్‌లో " 2010 కిర్గిజిస్తాని రివల్యూషన్" పేరిట తిరుగుబాటు తలెత్తింది. ఇందుకు అధ్యక్షుడు కుర్మంబెక్ బకియేవ్, ఆయన కుమారుడు మాగ్జిం బకియేవ్,[44] సోదరుడు జనిష్ బకియేవ్ కారణమని భావిస్తున్నారు. తరువాత అధ్యక్షుడు బకియేవ్ తన బంధువులతో పారిపోయి బెలారస్‌లో ఆశ్రయం పొందాడు. రోజా ఒతంబయేవ ఆప్త్కాల అధ్యక్షునిగా నియమించబడింది. తరువాత ఆమె 2011 వరకు కిర్గిజిస్తాన్ అధ్యక్ష ఎన్నిక గురించి ప్రకటించలేదు. నవంబరులో నిర్వహించబడున ఎన్నికలలో అతంబయేవ్ అధ్యక్షునిగా ఎన్నిక చేయబడి 2011 డిసెంబరు 1 న పదవీ స్వీకారం చేసాడు. అలాగే ఒమర్బెక్ బబనోవ్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నుకొనబడ్డాడు.

.

మానవ హక్కులు

[మార్చు]

2010లో " సౌత్ కిర్గిజిస్తాన్ రాయిట్స్ " సందర్ర్భంలో డజన్ల కొద్దీ ఉజ్బెక్ మతస్థులను, కమ్యూనిటీ లీడర్లను ఖైదు చేసినప్పుడు మానవహక్కుల సంరక్షకులు ఆందోళనకు గురైయ్యారు. ఖైదు చేయబడిన వారిలో పత్రికావిలేఖరి, మానవహక్కుల సంరక్షకుడు అయిన " అజింఖాన్ అస్కరోవ్ కూడా ఉన్నాడు. [45]2013 జూన్‌లో 23 సంవత్సరాలకు లోపున్న స్త్రీలు తల్లితండ్రులు లేక గార్డియన్ లేకుండా విదేశీ ప్రయాణానికి అనుమతి తిరస్కరిస్తూ చట్టం అమలు చేయబడింది. .[46] 2014లో కిర్గిజిస్తాన్ గే - హక్కులకు ఉద్యమకారులకు వ్యతిరేకంగా జైలుదండన అమలు చేసిన సమయంలో అమెరికన్ దౌత్యకార్యాలయం నుండి ఆందోళన ఎదురైంది.[47]

సైన్యం

[మార్చు]
Kyrgyzstan soldiers conducting mine sweeping exercises.

సోవియట్ యూనియన్ పతనం తరువాత కిర్గిజిస్తాన్ సైన్యం రూపొందించబడింది. ఇందులో కిర్గిజిస్తాన్ గ్రౌండ్ ఫోర్స్, కిర్గిజిస్తాన్ ఫోర్స్ (బార్డర్ గార్డ్) అనే విభాగాలు ఉన్నాయి. కిర్గిజిస్తాన్ సైన్యం యు.ఎస్. ఆర్ండ్ ఫోర్స్‌తో కలిసి పనిచేస్తుంది. 2014 వరకు బిష్కెక్ సమీపంలో మనాస్ అంతర్జాతీయ విమానాశ్రయం " ట్రాంసిస్ట్ సెంటర్ ఆఫ్ మనాస్ " పేరుతో యు.ఎస్ ఆర్ండ్ ఫోర్స్ పనిచేస్తుంది.[48] సమీపకాలంలో ఆర్ండ్ ఫోర్స్ రష్యాతో సత్సంబంధాలు అభివృద్ధి చేస్తూ ఉంది. ఉదాహరణగా కిర్గిజిస్తాన్ 1బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో ఆధునికీకరణ, రష్యన్ సైనిక బృందాలతో భాగస్వామ్యం వహిస్తూ శిక్షణ తీసుకునే ఒప్పందం మీద సంతకం చేసింది.[49]" ది ఏజెంసీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ " మిలటరీతో కలిసి సేవలూందిస్తుంది. ఇది దేశాంతర్గత తీవ్రవాదం నియంత్రణ ప్రత్యేక దళాన్ని పర్యవేక్షించే బాధ్యతకూడా వహిస్తుంది. ఈ యూనిట్‌ను ఇతర సోవియట్ దేశాలలో (రష్యా, ఉజ్బెకిస్తాన్) ఉన్నట్లు అల్ఫ్తా అంటారు. పోలీస్ వ్యవస్థ, సరిహద్దు దళాలను ఇంటీరియర్ మినిస్టరీ నియంత్రిస్తుంది.

నిర్వహణా విభాగాలు

[మార్చు]

కిర్గిజిస్తాన్ 7 విభాగాలుగా (ఒబ్లాస్ట్) విభజించబడింది. వీటిని నియమించబడిన గవర్నర్లు నిర్వహిస్తుంటారు. రాజధాని బిష్కెక్, రెండవ పెద్ద నగరం ఓష్ నగరాలు స్వతంత్ర నగరాలు (షార్) నిర్వహించబడుతుంటాయి. ప్రాంతాలు, స్వతంత్ర నగరాలు:-

  1. బిష్కెక్
  2. బత్కెన్ ప్రాంతం
  3. చుయ్ ప్రాంతం
  4. జలాల్- అబాద్ ప్రాంతం
  5. నర్యన్ ప్రాంతం
  6. ఓష్ ప్రాంతం
  7. తలాస్ ప్రాంతం
  8. ఓష్

ఒక్కొక ప్రాంతంలో ప్రభుత్వ అధికారుల (అకింస్) నిర్వహణలో ఉండే పలు జిల్లాలు (రైయాంస్) ఉన్నాయి. గ్రామీణ కమ్యూనిటీలు (అయి) లలో 20 చిన్న నివాస సముదాయాలు (గ్రామాలు) ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలకు ఎన్నిక చేబడిన మేయర్లు, కౌంసిల్స్ ఉంటారు.

భౌగోళికం

[మార్చు]
A map of Kyrgyzstan.
Kyrgyzstan's topography.
The Tian Shan mountain range in Kyrgyzstan.
On the southern shore of Issyk Kul lake, Issyk Kul Region.

కిర్గిజిస్తాన్ ఒక భూబంధిత దేశం. సరిహద్దులలో కజకస్తాన్, చైనా,తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు ఉన్నాయి. కిర్గిజిస్తాన్ 39-44 డిగ్రీల ఉత్తర అక్షాణ్శంలోనూ, 69-81 డిగ్రీల తూర్పు రేఖాంశంలోనూ ఉంది. ప్రపంచంలో సముద్రానికి అతిదూరంలో ఉన్న ప్రత్యేక దేశం కిర్గిజిస్తాన్. దేశంలోని నదులన్నీ " ఎండోర్హెయిక్ బేసిన్ " (సముద్రానికి చేరని క్లోస్డ్ డ్రైనేజ్) లోకి ప్రవహిస్తున్నాయి. తియాన్ షాహ్ పర్వతశ్రేణి 80% వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది. కిర్గిజిస్తాన్ " మద్య ఆసియా స్విడ్జర్ లాండ్ " అని అభివర్ణించబడుతుంది. [50] మిగిలిన ప్రాంతం లోయలు, నదీముఖద్వారాలు ఆక్రమించిఉన్నాయి.

తియాన్ షాన్ వాయవ్యంలో ఇస్సిక్ కుల్ సరసు ఉంది. ఇది కిర్గిజిస్తాన్ అతిపెద్ద సరసుగా గుర్తించబడుతుంది. అలాగే పపంచంలోని పర్వతసరసులలో ఇది రెండవదని (మొదటి స్థానంలో టిటికకా సరసు ఉంది) భావిస్తున్నారు. కక్షాల్- టూ పర్వతశ్రేణిలో చైనా సరిహద్దులో ఉన్న శిఖరం దేశంలోని అతిపెద్ద పర్వతశిఖరంగా గుర్తించబడుతుంది. జెంఘిస్ శిఖరం (ఎత్తు 7439 మీ) అత్యంత ఎత్తైనదని భావిస్తున్నారు. శీతాకాలంలో హిమపాతం అధికంగా ఉంటుంది. హిమపాతం వసంతకాలంలో వరదలకు కారణం ఔతుంది. వరదలు దిగువప్రాంతాలలో అత్యధిక విధ్వంసం సృష్టిస్తుంది. నదీప్రహాలతో పర్వతశ్రేణిలో హైడ్రో - ఎలెక్ట్రిసిటీ ఉత్పత్తిచేయబడుతుంది.

ఖనిజాలు

[మార్చు]

కిర్గిజిస్తాన్ గణనీయమైన బంగారం, అరుదైన లోహపు నిల్వలు కలిగి ఉంది. పర్వతమయమైన దేశంలో 8% కంటే తక్కువగా వ్యవసాయభూములు ఉన్నాయి. వ్యవసాయభూములు ఉత్తరంలోని దిగువ లోయలు, ఫెర్గన లోయ అంచులలో ఉన్నాయి.

నగరాలు

[మార్చు]

ఉత్తర కిర్గిజిస్తాన్‌లో ఉన్న బిష్కెక్ నగరం రాజధాని నగరం, అతిపెద్ద నగరంగా గుర్తించబడుతుంది. 2005 గణాంకాలు అనుసరించి నగర జనసంఖ్య 9,00,000. రెండవ స్థానంలో ఓష్ నగరం ఉంది. ఇది ఫెర్గన లోయలో ఉజ్బెకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. ప్రధాన నది కారా దర్యా ఇది పశ్చిమంగా ప్రవహించి ఫెర్గనా లోయల గుండా ప్రవహించి ఉజ్బెజిస్తాన్ సరిహద్దుప్రక్కగా ప్రవహిస్తూ కిర్గిజ్ నదిలో సంగమిస్తుంది. సిర్ దర్యా నదీ సంగమం నుండి నదీ జలం ఆరల్ సీలో సంగమిస్తుంది. నదీ జలాలు ఉత్తర కజకస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్‌లోని పత్తిపంటలకు నీరు అందిస్తుంది. ఈ నది కజకస్తాన్‌లో ప్రవేశించే ముందుగా కొంత దూరం కిర్గిజిస్తాన్‌లో ప్రవహిస్తుంది.

వాతావరణం

[మార్చు]

భౌగోళిక వైవిధ్యం కారణంగా వాతావరణం కూడా వైవిధ్యంగా ఉంటుంది. నైరుతీ ఫెర్గ్నా లోయలలో సబ్ట్రాపికల్ వాతావరణం ఉంటుంది. వేసవిలో అధికమైన ఉష్ణోగ్రత ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. ఉత్తర పర్వతపాద ప్రాంతం ఉష్ణప్రాంతాలుగా ఉంటాయి. తియాన్ షన్ డ్రై కాంటినెంటల్ వాతావరణం, పోలార్ వాతావరణం ఉంటుంది. ఇక్కడ వాతావరణ వైవిధ్యం ఎత్తును అనుసరించి వేరుపడుతూ ఉంటాయి. అతిశీతల ప్రాంతంలో శీతాకాల ఉష్ణోగ్రత సంవత్సరంలో జీరో కంటే తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలోని కొన్ని ఎడారి ప్రాంతాలలో నిరంతర హిమపాతం ఉంటుంది.

స్వదేశీ, విదేశీ

[మార్చు]

దేశంలో స్వదేశీ, విదేశీలో చొచ్చుకుపోయిన భూభాగాలు ఉన్నాయి. కిర్గిజిస్తాన్‌కు చెందిన అతిచిన్న గ్రామం బరాక్ ఉజ్బెకిస్తాన్‌లో చొచ్చుకుపోయి ఉంది. [51] ఫెర్గనా లోయలోని ఈ గ్రామజనాభా 627. గ్రామం చుట్టూ ఉజ్బెకిస్తాన్ భూభాగం ఉంది. ఇది కిర్గిజిస్తాన్ లోని ఓష్, ఉజ్బెకిస్తాన్ లోని ఖొద్జాబాద్ నగరం మద్య ఉన్న రహదారి సమీపంలో ఉంది. ఇది అందిజాన్ సమీపంలో ఉజ్బెక్- కిర్గిజ్ సరిహద్దుకు వాయవ్యంలో ఉంది.[52] బరాక్ కారా- సూ జిల్లాలో భాగంగా ఉంది.

అలాగే కిర్గిజిస్తాన్‌లోకి చొచ్చుకుని ఉన్న 4 ఉజ్బెకిప్రాంతాలు ఉన్నాయి. వాటిలో రెండు పట్టణాలు. ఒకటి సోఖ్ జిల్లాలో ఉంది వైశాల్యం 325 చ.కి.మీ., 1993 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 42,800. వీరిలో 99% తజికిస్తాన్ ప్రజలు మిగిలిన వారు ఉజ్బెకీయులు ఉన్నారు. రెండవది, షోహీమర్దన్ (దీనిని షాహీమర్దన్, షోహీమర్దన్, షాహ్- ఇ- మర్దన్ అని కూడా అంటారు. 1993 గణాంకాలను అనుసరించి 5,100 జనసంఖ్య ఉన్న పట్టణంలో 91% ఉజ్బెకీయులు మిగిలిన వారు కిర్గిజ్ ప్రజలు ఉన్నారు. మిగిలిన రెండు చోంగ్ - కారా (3కి.మీ పొడవు, 1కి.మీ వెడల్పు), జంగీ అయ్యల్ (2 చ.కి.మీ వైశాల్యం) ప్రాంతాలు. చాంగ్- కారా సోఖ్ నదీతీరంలో ఉంది. ఇది ఉజ్బెక్ సరిహద్దు, సోఖ్ ఎంక్లేవ్ సమీపంలో ఉంది. జాంగీ అయ్యల్ బత్కెన్‌కు 60కి.మీ దూరంలో ఉంది. ఇది కిర్గిజ్- ఉజ్బెక్ సరిహద్దులో ఖల్మియాన్ సమీపంలో ఉంది.

కిర్గిజిస్తాన్‌లో రెండు తజికిస్తాన్ ఎంక్లేవ్స్ ఉన్నాయి. 130 చ.కి.మీ వైశాల్యం ఉన్న వొరుఖ్ ప్రాంతం జనసంఖ్య 23,000 - 29,000 ఉందని అంచనా. 95% తజకీలు, 5% కిర్గిజీ ప్రజలు నివసిస్తున్న 17 గ్రామాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇస్ఫరాకు 45 కి.మీ దూరంలో కరాఫ్షిన్ తీరంలో ఉంది. రెండవది కర్గిజ్ లోని కైరగచ్ వద్ద ఉన్న వలసప్రజల ప్రాంతం.

ఆర్ధికం

[మార్చు]
A proportional representation of Kyrgyzstan 's exports.
Old and new Bishkek buildings

" ది నేషనల్ బ్యాంక్ ఆఫ్ ది కిర్గిజ్ రిపబ్లిక్ " కిర్గిజ్స్తాన్ సెంట్రల్ బ్యాంక్‌గా సేవలు అందిస్తుంది. మునుపటి సోవియట్ యూనియన్‌లోని బీదరికం అధికంగా ఉన్న దేశాలలో కిర్గిజిస్తాన్ రెండవస్థానంలో ఉంది. ప్రస్తుతం మద్య ఆసియా దేశాలలో రెండవ బీదదేశంగా ఉంది. 2011 వరల్డ్ ఫేస్ బుక్ అనుసరించి దేశజనాభాలో మూడవ వంతు ప్రజలు దారిద్యరేఖకు దిగువన ఉన్నారని తెలుస్తుంది.[53] యు.ఎన్.డి.పి నివేదిక అనుసరించి బీదరికం అభివృద్ధి చెందుతూ ఉందని భావిస్తున్నారు: 2009 లోని 31% ప్రజలు దారిద్యరేఖకు దిగువన ఉన్నారని 2011 నాటికి 37% ప్రజలు దారిద్యరేఖకు దిగువన ఉన్నారని తెలుస్తుంది.[54] పశ్చిమ దేశాల మదుపుదార్ల మద్దతు, ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ది వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవెలెప్మెంటు " వంటి ఆర్ధిక శక్తుల మద్దతు ఉన్నప్పటికీ కిర్గిజిస్తాన్ ఆర్ధికసమస్యలను ఎదుర్కొంటూనే ఉంది.

పొదుపు

[మార్చు]

ఆర్ధిక సమస్యలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం వ్యయం తగ్గించింది. సబ్సిడీలకు ముగింపు పలికి " వాల్యూ ఏడెడ్ టాక్స్" విలువ ఆధారిత పన్ను విధించడం ఆరంభించింది. మొత్తంగా ప్రభుత్వం మార్కెట్ ఎకనమీ మార్పిడి వైపు అడుగులు వేస్తుంది. ఆర్థికరంగం క్రమబద్ధీకరణ, సంస్కరణల ద్వారా ప్రభుత్వం స్థిరమైన ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తుంది. 1998 డిసెంబరు ఆర్థిక సంస్కరణలు కిర్గిజిస్తాన్‌ను " వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ "కు చేరువ చేసింది.

ఆర్ధికపతనం

[మార్చు]

సోవియట్ యూనియన్ పతనం తరువాత కిర్గిజిస్తాన్ ఆర్థికవ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. ఫలితంగా కిర్గిజిస్తాన్ మార్కెట్ నష్టాలలో కూరుకుపోయింది. 1990 లో 98% కిర్గిజిస్తాన్ ఎగుమతులు సోవియట్ యూనియన్ ఇతరప్రాంతాలకు చేరాయి. 1990 నాటికి కిర్గిజిస్తాన్ ఆర్థికవ్యవస్థ సోవియట్ యూనియన్ ఇతర రిపబ్లిక్‌లకంటే అభివృద్ధి పధంలో సాగింది. యుద్ధం కారణంగా ఆర్మేనియా, తజికిస్తాన్, అజర్‌బైజాన్ ఫ్యాక్టరీలు, స్టేట్ సంస్థలు పతనం అయ్యాయి. సోవియట్ యూనియన్ సంప్రదాయ మార్కెట్ వ్యవస్థను కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా కిర్గిజిస్తాన్ ఆర్థికవ్యవస్థ అభివృద్ధి పధంలో సాగుతుంది.[55][56]

వ్యవసాయం

[మార్చు]

వ్యవసాయం కిర్గిజిస్తాన్ ఆర్థికవ్యవస్థలో ముఖ్యపాత్ర వహిస్తుంది. 1990 లో ప్రైవేట్ వ్యవసాయదారులు ఉత్పత్తిలో మూడవ వంతు లేక సగం అందించారు. 2000 నాటికి వ్యవసాయ ఆదాయం జి.డి.పిలో 35.6 % భాగాన్ని భర్తీ చేసింది. అలాగే దేశ ప్రజలలో సగం మందికి ఉపాధి కల్పిస్తుంది. కిర్గిజిస్తాన్ ప్రాంతం పర్వతమయం. అది పశువుల పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. పశువుల పెంపకం ద్వారా ఉన్ని, మాంసం, పాల ఉత్పత్తులు ఆర్థికావసరాలు భర్తీచేస్తున్నాయి. కిర్గిజిస్తాన్‌లో గోధుమ, చెరకు, ఉర్లగడ్డలు, పత్తి, పొగాకు, కూరగాయలు, పండ్లు ప్రధానంగా పండించబడుతున్నాయి. దిగుమతి చేయబడుతున్న ఆహారం, పెట్రోలు ధరలు చాలా అధికంగా ఉంటాయి. వ్యవసాయపనులు అధికంగా గుర్రాలతో, చేతితో చేస్తుంటారు. వ్యవసాయ ఉత్పత్తుల విధానం పారిశ్రామిక ఆదాయంలో ప్రధానపాత్ర వహిస్తుంది. వ్యవసాయం విదేశీపెట్టుబడులను ఆకర్షించడంలో ప్రాధాన్యత వహిస్తుంది.

The Dordoy Bazaar.

ఖనిజాలు

[మార్చు]

కిర్గిజిస్తాన్ ఖనిజాల నిల్వలలో సుసంపన్నమై ఉంది. అయినప్పటికీ పెట్రోలియం, సహజవాయు నిలువలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. కిర్గిజిస్తాన్ పెట్రోలియం, సహజవాయువును దిగుమతి చేసుకుంటుంది. దేశంలో బొగ్గు, బంగారం, యురేనియం, ఆంటీమోని ఇతర విలువైన ఖనిజాలు లభిస్తున్నాయి. మెటలర్జీ ప్రాధానమైన పరిశ్రమగా ఉంది. ప్రభుత్వం మెటలర్జీలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. ప్రభుత్వం ఖనిజాల వెలికితీతకు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. కుంతర్ గోల్డ్ గనుల నుండి బంగారం వెలికితీతకు, తయారీకి ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. దేశంలోని విస్తారమైన జలవనరులు, పర్వతమయ భూభాగం కారణంగా జల విద్యుత్తు ఉత్పత్తి, ఎగుమతి సుసాధ్యమైంది.

కరెంసీ

[మార్చు]

ప్రాంతీయ దేశ ఎకనమీని కియోక్స్ అంటారు. ప్రాంతీయ వ్యాపారం బజార్లలో, గ్రామాలలోని కియోక్స్ లలో జరుగుతుంది. దేశంలో వ్యాపారం గణనీయంగా క్రమరహితంగా ఉంటుంది. దేశంలోని సుదూర గ్రామాలలో నిత్యావసర వస్తువుల కొరత అధికంగా ఉంటుంది. గ్రామప్రాంతాలలో అధికమైన కుటుంబాలు ఆహారౌత్పత్తిలో స్వయంసమృద్ధమై ఉంటాయి. గ్రామీణ, నగరప్రాంత ఆర్థికంలో ఇది ప్రధాన వ్యత్యాసంగా ఉంటుంది.

ఎగుమతులు దిగుమతులు

[మార్చు]

కిర్గిజిస్తాన్ నుండి ప్రధానంగా లోహాలు, ఖనిజాలు, ఉన్ని వస్తువులు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, విద్యుత్తు, కొన్ని ఇంజనీరింగ్ వస్తువులు ఎగుమతి చేయబడుతున్నాయి. పెట్రోలియం, సహజవాయువు, ఫెర్రోమెటల్, రసాయనాలు, మిషనరీ, చెక్క, పేపర్ ఇత్పత్తులు, కొన్ని ఆహారాలు, నిర్మాణావసర వస్తువులు దిగుమతి చేయబడుత్య్న్నాయి. కిర్గిజిస్తాన్‌కు జర్మన్, రష్యా, కజకస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనాలతో వ్యాపారసంబంధాలు ఉన్నాయి. " వరల్డ్ ఎకనమిక్ ఫొరం నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ "లో కిర్గిజిస్తాన్ టెలికమ్యూనికేషంస్ ఇంఫ్రాస్ట్రక్చర్ మద్య ఆసియాలో చివరిస్తానంలో ఉంది. 2014లో మొత్తం జాబితాలో కిర్గిజిస్తాన్ 118వ స్థానంలో ఉంది.

గణాంకాలు

[మార్చు]
A population pyramid showing Kyrgyzstan's age distribution (2005).

2013 గణాంకాలను అనుసరించి కిర్గిజిస్తాన్ జసంఖ్య 5.6మిలియన్లు.[57] వీరిలో 34.4% 15 సంవత్సరాలకు లోపు వయసున్న వారు, 6.2% 65 వయసుకంటే అధిక వయసు కలిగిన ప్రజలున్నారు. ప్రజలలో మూడవ వంతు నగరాలలో నివసిస్తున్నారు. రెండు వంతుల ప్రజలు గ్రామీణప్రాంతాలలో నివసిస్తున్నారు. జనసాంధ్రత 1 చ.కి.మీకి 25 మంది ఉన్నారు.

సంప్రదాయ సమూహాలు

[మార్చు]

2013 గణాంకాలను అనుసరించి దేశంలో కిర్గిజీలు, టర్కీ ప్రజలు అధికంగా (72%), ఇతర సంప్రదాయాలకు చెందిన ప్రజలలో రష్యన్లు 9% (ఉత్తర ప్రాంతంలో ఉన్నారు), ఉజ్బెకియన్లు 14.5% (దక్షిణ ప్రాంతంలో ఉన్నారు), అల్పసంఖ్యాకులలో డంగన్లు (1.9%), ఉయ్ఘూర్ ప్రజలు (1.1%), తజిక్ ప్రజలు (1.1%), కజకియన్లు (0.7%), ఉక్రెయనీయులు (0.5%) ఇతర సంప్రదాయాలకు చెందిన ప్రజలు (1.7%) ఉన్నారు. దేశంలో మొత్తం 80 సంప్రదాయాలకు చెందిన ప్రజలు ఉన్నారు.[58] చారిత్రకంగా కిర్గిజ్ ప్రజలు సగం నోమాడిక్ సంస్కృతిని అనుసరించేవారు. వీరు యుర్త్ అనబడే గుండ్రని గుడిసెలలో నివసించే వారు. అలాగే గొర్రెలు, గుర్రాలు, యాక్ ల పెంపకం చేపడుతుంటారు. నోమాడిక్ సంస్కృతి పశువుల మందలున్న కుటుంబాలు సీజన్‌వారీగా పశువుల మేత కొరకు వేసవిలో ఉన్నత పర్వతశ్రేణిలో నడిపించింది. స్థిరంగా నివసించే ఉజ్బెకియన్లు, తజకియన్లు దిగువన ఫెర్గనా లోయలలోని నీటిపారుదల సౌకర్యం ఉన్న వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలకు తరలి వెళ్ళారు.[59] స్వతంత్రం తరువాత కిర్గిజిస్తాన్ సంప్రదాయ సంకీర్ణంలో మార్పులు సంభవిస్తున్నాయి.[60] 1970 లో 50% ఉన్న కిర్గిజ్ ప్రజలు 2013 నాటికి 70% చేరింది. రష్యన్లు, ఉజ్బెకియన్లు, జర్మన్లు తాతర్లు 35% నుండి 10% చేరుకున్నారు.[57] సంప్రదాయ రష్యన్లు 29.2% (1970) నుండి 1989 నాటికి 21.5%కి చేరుకున్నారు.[61] 1991 నుండి అధికసంఖ్యలో జర్మన్లు (1989 లో జర్మన్ల సంఖ్య 1,01,000 ) జర్మనీకి వలస వెళ్ళడం ఆరంభం అయింది.[62] 1990 లో 6,00,000 మంది అల్పసంఖ్యాక సంప్రదాయానికి చెందిన ప్రజలు దేశం వదిలి వెళ్ళారు. [21]

కిర్గిజిస్తాన్ సంప్రదాయ సమూహాల ఆధారిత జనసంఖ్య జాబితా 1924- 2014 :-
సంప్రదాయం
సమూహం
గణాంకాలు 19261 గణాంకాలు census 19593 గణాంకాలు census 19896 గణాంకాలు census 19997 గణాంకాలు census 20147
సంఖ్య % సంఖ్య % సంఖ్య % సంఖ్య % సంఖ్య %
కిర్గిజ్ ప్రజలు 661,171 66.6 836,831 40.5 2,229,663 52.4 3,128,147 64.9 4,193,850 72.6
ఉజ్బెకియన్లు 110,463 11.1 218,640 10.6 550,096 12.9 664,950 13.8 836,065 14.4
రష్యన్లు 116,436 11.7 623,562 30.2 916,558 21.5 603,201 12.5 369,939 6.4
1 వనరులు:.[63] 3 వనరులు :.[64] 6 వనరులు :.[65] 7 వనరులు :.[66]

భాషలు

[మార్చు]

మునుపటి సోవియట్ యూనియన్ రిపబ్లిక్కులలో కిర్గిజిస్తాన్ ఒకటి. ప్రస్తుతం మద్య ఆసియా దేశాలలో కిర్గిజిస్తాన్‌ ఒకటి. దేశంలో రష్యా భాష అధికారభాషగా ఉంది. 1991 సెప్టెంబరు నుండి కిర్గిజ్ భాషకూడా అధికార భాష చేయబడింది. కిర్గుజ్ భాష టర్కిక్ భాషలలో ఒకటైన కిప్చక్ భాషా శాఖలలో ఒకటిగా భావిస్తున్నారు. కిర్గిజ్ కజకస్తాన్, కరకల్పక్, నొగే తాతర్ భాషలకు సమీపంలో ఉంటుంది. 20వ శతాబ్దం వరకు దీనిని వ్రాయడానికి అరబిక్ లిపిని వాడేవారు. 1928 నుండి కిర్గిజ్ భాష వ్రాయడానికి లాటిన్ ఆల్ఫబేట్ ప్రవేశపెట్టబడి వాడుకలోకి తీసుకురాబడింది. 1941లో లాటిన్ లిపి స్థానంలో సిరిలిక్ లిపి వాడుకలోకి తీసుకురాబడింది. 2009 గంణాంకాలను అనుసరించి [67] 4.1 మిలియన్ ప్రజలకు కిర్గిజ్ భాష, 2.5 మిలియన్ల ప్రజలకు రష్యా భాష వాడుకలో ఉన్నయని అంచనా. వాడుకలో ఉన్న ప్రాంతీయ భాషలలో ఉజ్బెకి రెండవ స్థానంలో ఉంది. తరువాత స్థానాలలో రష్యా, కజక్, ఉజ్బెకి, ఆంగ్లం భాషలు ఉన్నాయి. పలు వ్యాపార, రాజకీయ వ్యవహారాలకు రష్యా భాషను వాడుతుంటారు. కిర్గిజ్ గృహాలలో అధికంగా వాడుకభాషగా ఉంది. దీనిని అరుదుగా సమావేశాలలో మాట్లాడుతుంటారు. కిర్గిజ్ భాష ప్రస్తుతం పార్లమెంటు వివాదాలలో వాడుకలో ఉన్నప్పటికీ కిర్గిజ్ తెలియని ప్రజలకు అనువాదం చేయవలసిన అవసరం ఏర్పడుతూ ఉంది.

భాష పేరు ప్రాంతీయ వాడుకరులు రెండవ భాషగా వాడుకరులు మొత్తం వాడుకరులు
కిర్గిజ్ 3,830,556 271,187 4,121,743
రష్యన్ 482,243 2,109,393 2,591,636
ఉజ్బెకి 772,561 97,753 870,314
ఆగ్లం 28,416 28,416
ఫ్రెంచ్ 641 641
జర్మన్ 10 10
ఇతర భాషలు 277,433 31,411
Karakol Dungan Mosque

కిర్గిజిస్తాన్‌లో ఇస్లాం ప్రధానమతంగా ఉంది. దేశంలోని ప్రజలలో 80% ముస్లిములు ఉన్నారు, 17% ప్రజలు రష్యన్ ఆర్థడాక్స్ అనుసరిస్తున్నారు, 3% ప్రజలు ఇతరమతావలంబకులు ఉన్నారు.[68] 2009 ప్యూ రీసెర్చ్ సెంటర్ రిపోర్ట్ ముస్లిములు 86% ఉన్నారని తెలియజేస్తుంది.[69] ముస్లిములలో అధికం నాన్ డినామినేషన్ ముస్లిములు 64%, 23% సున్ని ముస్లిములు (హనాఫీ స్కూల్‌కు చెందిన వారు).[70] కిర్గిజిస్తాన్‌లో అహమ్మదీయ ముస్లిములు ఉన్నారు.[71] సోవియట్ పాలనలో నాస్థికం ప్రోత్సహించబడింది. ఇస్లాం క్రమంగా రాజకీయాలలో ప్రభావితం ఔతున్నప్పటికీ ప్రస్తుతం కిర్గిజిస్తాన్ లౌకిక రాజ్యంగా ఉంది.[72] ప్రస్తుతం ప్రభుత్వం అధికారికంగా ప్రజలకు హజ్ (మక్కా యాత్ర) యాత్రాసౌకర్యం కలిగిస్తుంది. కిర్గిజిస్తాన్‌లో ఇస్లాం భక్తి కంటే సాంస్కృతిక నేపథ్యం కలిగి ఉంది. ప్రముఖులు కొందరు మతవిలువలను తిరిగి అభివృద్ధి చేయాలని సూచించారు.[72]

Bishkek Orthodox Church

అధ్యక్షుడు అస్కర్ అకయేవ్ కుమార్తె బర్మెట్ అకయేవ్ 2007 జూలైలో జరిగిన ముఖాముఖిలో దేశంలో ఇస్లాం తిరిగి వేళ్ళూనుతూ ఉందని అభిప్రాయం వెలిబుచ్చింది. [73] సమీపకాలంలో పలు మసీదులు నిర్మించబడడం అందుకు నిదర్శనమని ఇస్లాం మతన్ని భక్తిపూర్వకంగా ఆచరించే ప్రజలసంఖ్య అధికమౌతూ ఉందని ఇది చెడ్డ విషయం కాదని ఇది సమాజాన్ని మరింత పరిశుద్ధంగా, నీతివంతంగా మారుస్తుందని అభిప్రాయం వెలివుచ్చింది.[73] ఇస్లాం, ఆర్థడాక్స్ ఇస్లాంకంటే వ్యత్యాసమైన సుఫీ ఇజం కూడా కిర్గిజిస్తాన్‌లో ఆచరణలో ఉంది.[74]

Mosque under construction in Kyrgyzstan

కిర్గిజిస్తాన్‌లో ఆచరణలో ఉన్న ఇతర మతాలలో వైవిధ్యమైన క్రైస్తవ మతాలైన రష్యన్ ఆర్థడాక్స్, ఉక్రెయిన్ ఆర్థడాక్స్ ప్రధానమైనవి. వీటిని రష్యన్లు, ఉక్రెయిన్లు ఆచరిస్తున్నారు. అల్పసంఖ్యాకులుగా ఉన్న జర్మనులు కూడా క్రైస్తవమతాన్ని ఆచరిస్తున్నారు. వీరు అధికంగా లూథరన్, అనబాప్తిస్టులు అలాగే రోమన్ కాథలిక్కులు (దాదాపు 600 మంది) ఉన్నారు. [75][76] దేశంలో కొంతమంది నాస్థికులు కూడా ఉన్నారు. కొంతమంది బౌద్ధులు కూడా ఉన్నారు. బౌద్ధులు మతపతాకాలను పవిత్రవృక్షానికి కట్టే ఆచారాన్ని అవలంబిస్తుంటారు. ఈ అలవాటు సూఫీ ఇస్లాం మతంలోకి చేరిందని కొందరు భావిస్తున్నారు.[77] కిర్గిజిస్తాన్‌లో స్వల్పసంఖ్యలో బుఖారియన్ యూదులు కూడా ఉన్నారు. సోవియట్ యూనియన్ పతనం తరువాత వీరిలో అత్యధికులు ఇతర దేశాలకు (ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయేల్) పారిపోయారు. అలాగే స్వల్పంగా ఉన్న అష్కెనజీ యూదులు ఉన్నారు. వారు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో వీరు ఐరోపా‌కు పారిపోయారు. [ఆధారం చూపాలి]2008 నవంబరు 6న కిర్గిజిస్తాన్ పార్లమెంటు మతంగా గుర్తించడానికి అనుయాయులు 10-200 మంది ఉండాలని ప్రతిపాదించింది. నమోదుచేయమడని మతసంస్థలను నిషేధించింది. అలాగే పాఠశాలలో మతాన్ని బోధించడాన్ని కూడా నిషేధించింది. చట్టం అమలు కొరకు 2009 జనవరిలో అధ్యక్షుడు కుర్మంబెక్ బకయేవ్ సంతకం చేసాడు.[78]

సంస్కృతి

[మార్చు]
Musicians playing traditional Kyrgyz music.
  • మనాస్ : ఒక పద్యకావ్యం.
  • జమీల్యా: చింగిజ్ ఐత్ మాతోవ్ రాసిన నవల.
  • కొముజ్: మూడు తంత్రులు సంగీత పరికరం.
  • టష్ క్యిజ్ : పొడవైన ఎబ్రాయిడరీ వాల్ హ్యాంగింగ్స్
  • ష్రిడాక్: షాడో- పెయిర్స్‌తో చేయబడిన చదునైన కుషన్లు.[79]
  • ఫాల్కంరి
  • ఫెల్టుతో చేసిన వస్త్రాలు

సంప్రదాయం

[మార్చు]

జనవరి 1 న ఆంగ్లకొత్తసంవత్సరం జరుపుకుంటారు. కిర్గిజీలు తమ కొత్తసంవత్సరం నౌరుజ్‌ను చంద్రమాసం అనుసరించి జరుపుకుంటారు. స్ప్రింగ్ శలవురోజు విందులు, వినోదాలతో జరుపుకుంటారు. ఈ పండుగలో గుర్రాల క్రీడలు ( బుజ్కషి లేక ఉలక్ టర్తిష్) కూడా ఉత్సాహంగా నిర్వహిస్తుంటారు. చట్టవిరుద్ధమైనా ఇప్పటికీ వధువును బలాత్కారంగా తీసుకుపోవడం కిర్గిజ్ ప్రజలలో ఆచారంగా ఉంది.[80] వధువుని బలాత్కారంగా తీసుకుపోయే ఆచారం చర్చనీయాంశంగా ఉంది. పెద్దలు నిశ్చయించిన వివాహాలలో ఈ ఆచారం కారణాంగా ఒక్కొకసారి అయోమయం నెలకొంటున్నది. ఇష్టం లేని వివాహం తప్పించుకోవడానికి వధువులు కిడ్నాప్ చేసే ఆచారాన్ని ఒక్కొకసారి అనుకూలంగా తీసుకోవడంతో అయోమయం నెలకొంటున్నది.[81]

ఝండా

[మార్చు]

కిర్గిజిస్తాన్ జాతీయఝండాలో 40 పసుపుపచ్చని సూర్యకిరణాలు కిర్గిజిస్తాన్‌లోని 40 సంప్రదాయ సమూహాలకు ప్రతీకలుగా ఉంటయి. రష్యా ఆక్రమణ సోవియట్ యూనియన్ రూపొందక ముందు కిర్గిజిస్తాన్‌లో 40 సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసించే వారు.లోపల ఉండే మాటలు " కిర్గిజ్ మకుటం " అనేమాటను సూచిస్తాయి. ఇది సంప్రదాయ కిర్గిజ్ నిర్మాణాలలో పొందుపరచడం గమనించవచ్చు. ఝండాలోని ఎర్రని భాగం శాంతి, పారదర్శకతకు చిహ్నంగా ఉంటుంది.

Hunting with an eagle

గుర్రపు స్వారీ

[మార్చు]

కిర్గిజిస్తాన్ జాతీయక్రీడలలో గుర్రపు స్వారీ ప్రధాన్యత వహిస్తుంది. గుర్రపుస్వారీ (బుజ్కషి లేక ఉలక్ తార్తిష్) మద్య ఆసియాలో చాలా ప్రాబల్యత సంతరించుకుంది. ఇది ఒక టీం క్రీడ. ఇది పోలో, రగ్బీ ఫుట్ బాల్ మిశ్రితంగా ఉంటుంది. రెండు బృందాలు శిరోరహిత మేక శరీరాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోటీ పడడం ఈ క్రీడ ప్రధానాంశంగా ఉంటుంది. రెండు బృందాలు ప్రత్యర్థి గీతను దాటి వారి గోల్ లోపల మేక శరీరాన్ని చేర్చడానికి ప్రయత్నిస్తాయి. లక్ష్యాన్ని సాధించిన బృందం విజేతలుగా ప్రకటించబడతారు.

గుర్రాల సంబంధిత ఇతర క్రీడలు:-

  • ఎత్ చబిష్- లాంగ్ డిస్టెంస్ గుర్రపు స్వారీ. కొన్నిమార్లు దూరం 50కి.మీ కంటే అధికంగా ఉంటుంది.
  • జుంబీ అత్మై-
  • కిజ్ కూమై -
  • ఊడరిష్-
  • త్యిన్ ఎమ్మీ -
Southern shore of Issyk Kul Lake.

ప్రభుత్వ శలవులు

[మార్చు]
  • కిర్గిజిస్తాన్ ప్రభుత్వ శలవుదినాల జాబితా:-
  • 1 జనవరి –కొత్త సంవత్సరం
  • 7 జనవరి – ఆర్ధడాక్స్ క్రిస్మస్
  • 23 ఫిబ్రవరి –ఫాదర్ లాండ్ డిఫెండర్స్ డే
  • 8 మార్చి – వుమంస్ డే
  • 21 మార్చి –నూరుజ్ పర్షియన్ న్యూ ఇయర్ - స్ప్రింగ్ ఫెస్టివల్
  • 24 మార్చి –డే ఆఫ్ నేషనల్ రివల్యూషన్
  • 1 మే – లేబర్ డే
  • 5 మే –కాంస్టిట్యూషన్ డే
  • 8 మే –రిమెంబరెంస్ డే
  • 9 మే –విక్టరీ డే (రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన రోజు)
  • 31 ఆగస్టు –ఇండిపెండెంస్ డే Independence Day
  • 7 నవంబరు –డే ఆఫ్ ది అక్టోబరు రివల్యూషన్ (గ్రేట్ అక్టోబరు సోషలిస్ట్ రివల్యూషన్)
Issyk Kul Lake

ముస్లిం పర్వదినాలైన (ఒరోజో ఎయిట్, కుర్మన్ ఎయిట్ ) లకు శలవు ఉంటుంది.

పర్యాటకం

[మార్చు]

కిర్గిజిస్తాన్ లోని ప్రబల పర్యాటక కేంద్రాలలో ఇస్సిక్ కుల్ సరసు ఒకటి. దేశ ఉత్తర ప్రాంతంలో పలు హోటళ్ళు, విశ్రాంతి గృహాలు, బోర్డింగ్ హౌసులు, శానిటోరియాలు ఉన్నాయి. చోలాపాన్- ఆటా బీచ్ అత్యంత ప్రజాదరణ కలిగి ఉంది. సమీపంలోని కారా- ఒయి (డోలింకా) బొస్తేరి, కొరుంది కూడా పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి. 2006-2007 లో సరసును 1 మిలియన్ కంటే అధికమైన పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఆర్థిక, రాజకీయ అస్థిరత కారణంగా సమీపకాలంలో పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఉంది. [82] ట్రెక్కింగ్, కేంపింగ్ వంటి ఆకర్షణలు కూడా పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తుంటాయి. సదరన్ ఓష్ ప్రాంతం కేంపింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. నర్యన్ నగరం, తొరుగర్ట్ పాస్, కారాకొల్ పరిసర ప్రాంతాలు ఇస్సిక్ - కుల్ ప్రాంతం కూడా పర్యాటక ఆకర్షణగా ఉన్నాయి.[ఆధారం చూపాలి] బిష్కెక్, ప్రధాన నగరాల నుండి పర్యాటక సంస్థలు ప్రాంతీయ గైడులు, పోర్టర్లను నియమించుకుని పర్యటనలను నిర్వహిస్తుంటారు. స్కీయింగ్ కూడా పర్యాటక ఆసక్తులలో ఒకటిగా ఉంది. బిష్కెక్ సమీపంలో 45కి.మీ దూరంలో తొగుజ్ బులాక్ స్కీయింగ్ బేస్ ఉంది. ఇది ఇస్సిక్ ఆటా లోయలో ఉంది. కారకోల్ వెలుపల ఉన్న ది కారకీల్ లోయ నేషనల్ పార్క్ సమీపంలో ఒక స్కీయింగ్ బేస్ ఉంది. ఇక్కడ మూడు టీ బార్లు, నాణ్యమైన స్కీయింగ్ ఉపకరణాలు బాడుగకు లభిస్తాయి.

క్రీడలు

[మార్చు]
Kyrgyzstan in red against Japan

కిర్గిజిస్తాన్‌లో అసోసియేషన్ ఫుట్ బాల్ క్రీడకు ఆదరణ అధికంగా ఉంది. 1992లో సోవియట్ యూనియన్ నుండి విడిపోయిన తరువాత కిర్గిజ్ ప్రభుత్వం " ఫుట్ బాల్ ఆఫ్ కిర్గిజ్ రిపబ్లిక్ " స్థాపించింది. దీనిని " కిర్గిజిస్తాన్ నేషనల్ ఫుట్ బాల్ టీం " నిర్వహిస్తుంది.[83] కిర్గిజిస్తాన్‌లో రెస్ట్లింగ్ కూడా చాలా ప్రాబల్యత సంతరించుకుంది. " 2008 సమ్మర్ ఒలింపిక్ గేంస్ "లో కిర్గిజిస్తాన్‌కు చెందిన ఇద్దరు అథ్లెట్లు " గ్రెకో- రోమంరెస్ట్లింగ్ " పోటీలలో పతకాలు సాధించారు. (కనత్బెక్ బెగలియేవ్; రజితం, రుస్లన్ తియుమెంబయేవ్; కాంశ్యం)[84] ఐస్ హాకీ కిర్గిజిస్తాన్‌లో ప్రబలమైన క్రీడ కానప్పటికీ 2009లో మొదటి కిర్గిజిస్తాన్ చాంపియన్‌షిప్ ఐస్ హాకీ " నిర్వహించబడింది. 2011 లో " కిర్గిజిస్తాన్ మెంస్ నేషనల్ ఐస్ హాకీటీం " 2011 ఆసియన్ వింటర్ గేంస్‌లో మొత్తం ఆరు పోటీలలో విజయం సాధించింది. కిర్గిజిస్తాన్ ఐస్ హాకీ టీం భాగస్వామ్యం వహించిన ప్రధాన అంతర్జాతీయ పోటీ ఇదే.[85] 2011 జూలైలో " కిర్గిజిస్తాన్ మెంస్ ఐస్ హాకీటీం " ఐ.ఐ.హెచ్.ఎఫ్ లో చేర్చబడింది. దేశంలో బాండీ ప్రాబల్యత సంతరించుకుంటూ ఉంది. కిర్గిజ్ నేషనల్ టీం ఆసియన్ వింటర్ గేంస్‌లో మొదటి పతకం (కాంశ్య పతకం) సాధించింది. 2012లో " బాండీ వరల్డ్ చాంపియన్‌షిప్ 2012 " మొదటిసారిగా పోటీ చేసింది.[86]

విద్య

[మార్చు]

కిర్గిజిస్తాన్ విద్యావిధానంలో ప్రాథమిక (1-4 తరగతులు), మాధ్యమిక (5-11 తరగతులు కొన్నిమార్లు 12) ఉంటాయి. ఇవి ఒకే స్కూల్‌లో రెండు విభాగాలుగా ఉంటాయి. పిల్లలు సాధారణంగా 7వ సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలలో ప్రవేశిస్తారు. ప్రతి ఒక్క విద్యార్థి 9 వ తరగతి వరకు పూర్తిచేసిన తరువాత సర్టిఫికేట్‌ పొందాలి. 10-11 తరగతులు విద్యార్థులు స్వేచ్ఛగా నిర్ణయించవచ్చు. అయినప్పటికీ డిగ్రీ పూర్తిచేయడానికి, స్కూల్ డిప్లొమా పొందడానికి 10-11 తరగతులు పూర్తిచేయవలసినది తప్పనిసరి. గ్రాజ్యుయేషన్ సాధించాలంటే 11 పూర్తిచేసి తరువాత 4 మాండేటరీ స్టేట్ ఎగ్జాంస్ (గణితం, చరిత్ర, విదేశీభాధ) పాస్ చేయాలి. బిష్కెక్‌లో 77 పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. మిగిన దేశంలో 200 పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. 55 హయ్యర్ ఎజ్యుకేషన్ ఇంస్టిట్యూట్లు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 37 సంస్థలను ప్రభుత్వం నిర్వహిస్తుంది.

కిర్గిజిస్తాన్‌లోని ఉన్నత విద్యాసంస్థలు:-

  • ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ కిర్గిజిస్తాన్.
  • యూనివర్శిటీ ఆఫ్ ఆసియా.
  • అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ సెంట్రల్ ఆసియా.
  • బిష్కెక్ హ్యూమనిటీస్ యూనివర్శిటీ.
  • ఇంటర్నేషనల్ అటతర్క్ - అలతూ యూనివర్శిటీ.
  • యూనివర్శిటీ ఆఫ్ ఎకనమీ అండ్ ఎంటర్ప్రైస్.
  • కిర్గిజిస్తాన్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ కంస్ట్రక్షన్, ట్రాంస్పోర్ట్ అండ్ ఆర్కిటెక్చర్,
  • కిర్గిజ్ నేషనల్ యూనివర్శిటీ.
  • కిర్గిజ్ టెక్నికల్ యూనివర్శిటీ.
  • కిర్గిజ్ స్టేట్ పెదగాజికల్ యూనివర్శిటీ, ఫార్మర్లీ అరబయేవ్ కిర్గిజ్ స్టేట్ యూనివర్శిటీ.
  • కిర్గిజ్ రష్యన్ స్లావోనిక్ యూనివర్శిటీ.
  • కిర్గిజ్ - రష్యన్ స్టేట్ యూనివర్శిటీ.
  • కిర్గిజ్- టర్కిష్ మనాస్ యూనివర్శిటీ.[87]
  • సోషల్ యూనివర్శిటీ (గతంలో కిర్గిజ్ - ఉజ్బెక్ యూనివర్శిటీ)
  • మొస్కొవ్ ఇంస్టిట్యూట్ ఆఫ్ లా అండ్ ఎంటర్ప్రైజ్.
  • ఓష్ స్టేట్ యూనివర్శిటీ.
  • ఓష్ టెక్నాలజీ యూనివర్శిటీ.
  • ప్లాటో యూనివర్శిటీ ఆఫ్ మేనేజ్మెంటు అండ్ డిజైన్.
  • ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్.

రవాణా

[మార్చు]
Bishkek West Bus Terminal

కిర్గిజిస్తాన్ రవాణా వ్యవస్థ దేశభౌగోళిక పరిస్థితి కారణంగా పరిమితంగా ఉంటుంది. నిటారుగా ఉండే లోయలలో రహదార్లు మెలికలు తిరుగుతూ 3,000 మీటర్ల ఎత్తైన పర్వతమార్గాలను అధిగమిస్తూ ఉంటాయి. రహదార్ల మీద తరచుగా కొండచరియలు విరిగిపడడం, మంచు పేరుకుపోవడం వంటి సమస్యలు ఎదురౌతూ ఉంటాయి. అత్యంత ఎత్తైన ప్రాంతాలు, అత్యంత దూరమైన ప్రాంతాలలో రవాణా శీతాకాలంలో నిలిపివేయబడుతుంది.

సోవియట్ యూనియన్ కాలంలో నిర్మించబడిన పలు రహదారి, రైలు మార్గాలు అంతర్జాతీయ సరిహద్దులను దాటుతున్న కారణంగా సరిహద్దు విధులను అనుసరించవలసిన కారణంగా ప్రయాణకాలం అధికం ఔతూ ఉంటుంది. ఇప్పటికీ రవాణా కొరకు గుర్రాలను ఉపయోంగిచడం వాడుకలో ఉంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో ఇది అధికంగా ఉంది. కిర్గిజిస్తాన్ రహదార్లు అన్ని ప్రాంతాలకు చేరేలా విస్తరించబడలేదు కనుక మోటర్ వాహనాలు చేరలేని ప్రాంతాలకు గుర్రాలు ప్రయాణం చేస్తుంటాయి. అంతే కాక దిగుమతి చేసుకునే పెట్రోలు వ్యయం అధికం కనుక గుర్రాల రవాణా అందుబాటులో ఉంటుంది కనుక గుర్రాల రవాణాకు గ్రామీణ ప్రాంతాలలో ఆదరణ అధికంగా ఉంది.

విమానాశ్రయాలు

[మార్చు]

సోవియట్ పాలన ముగింపు సమయంలో దేశంలో 50 విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్పులు ఉన్నాయి. వీటిలో అత్యధికం చైనా సమీపంలో ఉన్న సరిహద్దు రక్షణ కొరకు నిర్మించబడ్డాయి. ప్రస్తుతం వాటిలో కొన్ని మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. " కిర్గిజిస్తాన్ ఎయిర్ కంపనీ " చైనా, రష్యా, ఇతర ప్రాంతీయ దేశాలకు ప్రయాణ సౌకర్యం కలిగిస్తుంది.

  • మనాస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ : ఇది బిష్కెక్ సమీపంలో ఉంది. ఇది దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడ నుండి మాస్కో, తాష్కెంటు, ఆల్మటీ, బీజింగ్, ఉరుంక్వి, ఇస్తాంబుల్, లండన్, బకు, దుబాయ్ లకు (2012 ఫిబ్రవరి 7 నుండి) ప్రయాణ సౌకర్యం ఉంది.
  • ఓష్ ఎయిర్ పోర్ట్ :-ఇది దక్షిణ ప్రాంతంలోని ప్రధాన విమానాశ్రయం. ఇక్కడి నుండి బిష్కెక్‌కు దినసరి విమానసేవలు లభిస్తుంటాయి.
  • జలాల్- అబాద్ - విమానాశ్రయం :- ఇక్కడ నుండి బిష్కెక్‌కు దినసరి విమానసేవలు లభిస్తాయి. కిర్గిజిస్తాన్ ప్రభుత్వం బి.ఎ.ఇ. - 146 ఎయిర్ క్రాఫ్ట్‌లను వేసవి కాలంలో నడుపుతూ ఉంది.
  • సోయియట్ పాలనా కాలంలో నిర్మించబడి మూతబడకుండా అరుదుగా ఉపయోగిస్తున్న విమానాశ్రయాలు ఉన్నాయి. బిష్కెక్ సమీపంలోని " కాంత్ ఎయిర్ బేస్ " మిలటరీ ఉపయోగానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు.

వాయుమార్గం రద్దు

[మార్చు]

యురేపియన్ యూనియన్ ఎయిర్ కారియర్లను నిషేధించిన దేశాల జాబితాలో కిర్గిజిస్తాన్ ఒకటి. కిర్గిజిస్తాన్‌లో నమోదు చేయబడిన విమానాలు ఏవీ యురేపియన్ యూనియన్ వాయు మార్గంలో ప్రవేశించరాదన్నది ఇందుకు అర్ధం. యురేపియన్ యూనియన్ రక్షణ కొరకు యురేపియన్ రెగ్యులేషన్ ద్వారా ఇలాంటి ఏర్పాటు చేయబడింది. [88]

రైల్వేలు

[మార్చు]

ఉత్తర ప్రాంతంలో ఉన్న చుయ్ లోయ, దక్షిణ ప్రాంతంలో ఉన్న ఫెర్ఘనా లోయ మద్య ఆసియాలోని సోవియట్ యూనియన్ రైలు మార్గాలకు ముగింపు కేంద్రాలుగా ఉన్నాయి. స్వంతంత్రం తరువాత సంభవించిన అత్యవసర పరిస్థితిలో పోస్ట్ సోవియట్ దేశాల రైలు మార్గాలు నిర్వహణా సరిహద్దులను త్రోసి వేస్తూ దేశాల సరిహద్దులు దాటుతూ నిర్మించబడ్డాయి. అందువలన ట్రాఫిక్ కూడా చాలా తగ్గింది. కిర్గిజిస్తాన్‌లో ఉన్న చిన్న రైలు మార్గాల (బ్రాడ్ గేజ్) పొడవు 130 కి.మీ. ఉత్తరంలో ఉన్న బాలిక్చి నుండి ఓష్ ద్వారా చైనాలో ప్రవేశించడానికి రైలు మార్గం విస్తరించాలన్న ఆలోచలనలకు బృహత్తర వ్యయం అడ్డుకట్ట వేస్తుంది.

పొరుగు దేశాలతో రైలు మార్గాల అనుసంధానం

[మార్చు]
  • ట్రాంస్పోర్ట్ ఇన్ కజకస్తాన్ - ఉంది- బిష్కెక్ బ్రాంచ్.
  • ట్రాంస్పోర్ట్ ఇన్ ఉజ్బెకిస్తాన్ - ఉంది- ఓష్ బ్రాంచ్.
  • ట్రాంస్పోర్ట్ ఇన్ తజికిస్తాన్ - లేదు -
  • ట్రాంస్పోర్ట్ ఇన్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా - లేదు-

రహదారి మార్గం

[మార్చు]
Street scene in Osh.

సమీపకాలంలో " ఆసియన్ డెవెలెప్మెంటు బ్యాంక్" మద్దతుతో బిష్కెక్ నుండి ఓష్ వరకు రహదారి నిర్మాణం పూర్తిచేయబడింది. దేశంలోని రెండు ప్రధాన నగరాల మద్య రవాణాను ఈ మార్గం సులువు చేస్తుంది. ఉత్తరదిశలో ఉన్న చుయ్ లోయ, ఫెర్గనా లోయల మద్య ప్రయాణం ఈ రహదారి మార్గం సుగమం చేసింది. ఓష్ నుండి చైనా వరకు రహదారి మార్గం నిర్మించడానికి యోచిస్తున్నారు.

  • టోటల్: 34,000 వీటిలో 140 కి.మీ ఎక్స్ప్రెస్ మార్గం.
  • పేవ్మెంటు : 22,600 కి.మీ.
  • పేవ్మెంటు లేనిది : 7,700. (అస్థిరత, తడి వాతావరణం కారణంగా ప్రయాణానికి అననుకూలంగా ఉంటాయి)

జలమార్గాలు

[మార్చు]

కిర్గిజిస్తాన్‌లో జలమార్గ రవాణా " ఇస్సుక్ కుల్ సరసు"లో మాత్రమే ఉంది. అయినప్పటికీ సోవియట్ యూనియన్ పతనం తరువాత అది క్షీణిస్తుంది.

నౌకాశ్రయాలు

[మార్చు]

బలిక్చి (యసిక్- కోల్- రిబాచ్ యె) ఇస్సిక్ కుల్ సరసు వద్ద.

మూలాలు

[మార్చు]
  1. Or /kɪrɡɪˈstɑːn/ kir-gi-STAHN-', or with the stress on the first syllable. See J. C. Wells, Longman Pronunciation Dictionary, 3rd ed. (Harlow, England: Pearson Education Ltd., 2008).
  2. "BBC News – Kyrgyzstan profile – Leaders". Bbc.co.uk. 14 December 2011. Retrieved 26 March 2013.
  3. "Investigating Kyrgyzstan's ethnic violence: Bloody business". The Economist. 12 May 2011. Retrieved 26 March 2013.
  4. "Foreigners in Kyrgyzstan: 'Will We Be Banned, Too?'". EurasiaNet.org. 15 June 2011. Retrieved 26 March 2013.
  5. "Kyrgyz private armies incite "permanent revolution" — RT". Rt.com. 17 March 2012. Retrieved 26 March 2013.
  6. "Kyrgyzstan: Economy globalEDGE: Your source for Global Business Knowledge". Globaledge.msu.edu. 20 December 1998. Retrieved 26 March 2013.
  7. "Kyrgyz Republic Economy: Population, GDP, Inflation, Business, Trade, FDI, Corruption". Heritage.org. Archived from the original on 25 ఫిబ్రవరి 2021. Retrieved 26 March 2013.
  8. "BBC News – Kyrgyzstan profile – Timeline". Bbc.co.uk. 10 October 2012. Retrieved 26 March 2013.
  9. "Kyrgyz Unrest". EurasiaNet.org. Retrieved 26 March 2013.
  10. "Chapter 1: Religious Affiliation". The World's Muslims: Unity and Diversity. Pew Research Center's Religion & Public Life Project. 9 August 2012. Retrieved 4 September 2013
  11. King, David C (2005). Kyrgyzstan. Marshall Cavendish. p. 144. ISBN 0-7614-2013-4.
  12. "Kyrgyzstan timeline". BBC News. 12 June 2010.
  13. Mirfatyh Zakiev, Origins of the Turks and Tatars, Part Two, Third Chapter, sections 109–100, 2002. Retrieved on 15 May 2009
  14. V.V. Bartold, The Kyrgyz: A Historical Essay, Frunze, 1927. Reprinted in V.V. Bartold, Collected Works, Volume II, Part 1, Izd. Vostochnoi Literatury, Moscow, 1963, p. 480 (in Russian)
  15. Wells, R. S.; Yuldasheva, N.; Ruzibakiev, R.; Underhill, P. A.; Evseeva, I.; Blue-Smith, J.; Jin, L.; Su, B.; Pitchappan, R.; Shanmugalakshmi, S.; Balakrishnan, K.; Read, M.; Pearson, N. M.; Zerjal, T.; Webster, M. T.; Zholoshvili, I.; Jamarjashvili, E.; Gambarov, S.; Nikbin, B.; Dostiev, A.; Aknazarov, O.; Zalloua, P.; Tsoy, I.; Kitaev, M.; Mirrakhimov, M.; Chariev, A.; Bodmer, W. F. (2001). "The Eurasian Heartland: A continental perspective on Y-chromosome diversity". Proceedings of the National Academy of Sciences. 98 (18): 10244–10249. doi:10.1073/pnas.171305098. PMC 56946. PMID 11526236.
  16. "Kyrgyzstan". Encyclopædia Britannica. 2010. Retrieved 14 April 2010.
  17. Zerjal, T.; Wells, R. S.; Yuldasheva, N.; Ruzibakiev, R.; Tyler-Smith, C. (2002). "A Genetic Landscape Reshaped by Recent Events: Y-Chromosomal Insights into Central Asia". The American Journal of Human Genetics. 71 (3): 466–82. doi:10.1086/342096. PMC 419996. PMID 12145751.
  18. "Kyrgyzstan–Mongol Domination" Library of Congress Country Studies.
  19. "Uzbekistan – The Jadidists and Basmachis". Library of Congress Country Studies.
  20. Djumataeva, Venera (11 December 2009). "1989 Kyrgyz Protests Verged On Ethnic Conflict". Rferl.org.
  21. 21.0 21.1 "KYRGYZSTAN: Economic disparities driving inter-ethnic conflict". IRIN Asia. 15 February 2006.
  22. "Ethnic Uzbeks in Kyrgyzstan Voice Complaints Over Discrimination, Corruption Archived 2010-06-14 at the Wayback Machine". EurasiaNet.org. 24 January 2006.
  23. Tkachenko, Maxim (9 April 2010). "Kyrgyz president says he won't resign". CNN. Retrieved 17 April 2010.
  24. "Expert: Kyrgysztan could face civil war". UPI.com. 9 April 2010. Retrieved 17 April 2010.
  25. AFP (10 April 2010). "Ousted Kyrgyz president is offered 'safe passage'". asiaone. Archived from the original on 14 డిసెంబరు 2013. Retrieved 9 August 2013.
  26. "Kyrgyz President Bakiyev 'will resign if safe'". BBC News. 13 April 2010. Retrieved 17 April 2010.
  27. "Ousted Kyrgyz president quits, leaves country". CNN. 16 April 2010.
  28. Leonard, Peter (7 April 2010). "Kyrgyz Opposition Controls Government Building". The Associated Press via ABC News. Archived from the original on 11 ఏప్రిల్ 2010. Retrieved 31 అక్టోబరు 2015.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  29. "There are clashes in the Kyrgyzstan again". BBC. 11 June 2010. Retrieved 11 June 2010.
  30. Shuster, Simon. (1 August 2010) "Signs of Uzbek Persecution Rising in Kyrgyzstan" Archived 2013-08-17 at the Wayback Machine. Time.com. Retrieved on 6 December 2013.
  31. 31.0 31.1 "Kyrgyz president asks for Russian help". BBC. 12 June 2010. Retrieved 12 June 2010.
  32. 32.0 32.1 "Situation worsens in Kyrgyzstan". bbc.co.uk. 13 June 2010. Retrieved 13 June 2010.
  33. "Ousted Kyrgyz President's family blamed". Associated Press via The Indian Express. 12 June 2010. Retrieved 13 June 2010.
  34. "Osh gets relatively calmer but Jalalabad flares up". BBC. 14 June 2010. Retrieved 14 June 2010.
  35. "UN and Russian aid arrives". BBC. 16 June 2010. Retrieved 16 June 2010.
  36. Kyrgyz Commission Begins Investigating Ethnic Clashes. Rferl.org (2 August 2010). Retrieved on 6 December 2013.
  37. Siegel, Matt and Namatabayeva, Tolkun (5 August 2010) Attempted coup rocks tense Kyrgyzstan Archived 2014-02-27 at the Wayback Machine. AFP.
  38. "Clashes erupt in Kyrgyz capital". BBC Online. 7 November 2006. Retrieved 21 November 2007.
  39. "Refworld | Demand for prior approval of RFE/RL programmes called "intolerable"". United Nations High Commissioner for Refugees. 17 December 2008. Retrieved 17 April 2010.
  40. "Proposal to close the Manas Air Base". BBC News. 4 February 2009. Retrieved 2 May 2010.
  41. Kyrgyz Parliament Approves U.S. base closure. Associated Press. 19 February 2009
  42. Schwirtz, Michael and Levy, Clifford J. (23 June 2009) In Reversal, Kyrgyzstan Won't Close a U.S. Base. New York Times
  43. "2008 Corruption Perception Index". Transparency International. Archived from the original on 11 మార్చి 2009. Retrieved 14 March 2009.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  44. "Maksim Bakiyev tracked not only in Bishkek, but also in the States?" Archived 2015-12-12 at the Wayback Machine. Ferghana Information agency, Moscow. 16 October 2012.
  45. Kramer, Andrew E. (1 July 2010). "Uzbeks Accused of Inciting Violence in Kyrgyzstan". The New York Times. Retrieved 16 April 2011.
  46. Kyrgyzstan Passes Controversial Girl Travel Ban. EurasiaNet.org (13 June 2013). Retrieved on 2 October 2014.
  47. "Kyrgyzstan moves towards adoption of Russia's anti-gay law". The Guardian. Retrieved 17 October 2014.
  48. Vandiver, John (5 February 2014). "First troops move through new US transit point in Romania". www.stripes.com. Stars and Stripes. Retrieved 5 February 2014.
  49. Ott, Stephanie (18 September 2014). "Russia tightens control over Kyrgyzstan". The Guardian.
  50. Escobar, Pepe (26 March 2005). "The Tulip Revolution takes root". Asia Times Online. Archived from the original on 20 నవంబరు 2015. Retrieved 1 నవంబరు 2015.
  51. The exclave of Barak, Kyrgyzstan in Uzbekistan. Retrieved on 2 May 2009
  52. Map showing the location of the Kyrgyz exclave Barak. Retrieved on 2 May 2009
  53. CIA World Factbook. "Percentage of population below the poverty line by country" Archived 2016-12-21 at the Wayback Machine. Cia.gov. Retrieved on 6 December 2013.
  54. "The Level of Poverty in Kyrgyzstan Will Continue to Grow". The Gazette of Central Asia. Satrapia. 24 December 2012. Archived from the original on 28 సెప్టెంబరు 2013. Retrieved 1 నవంబరు 2015.
  55. "Kyrgyz unrest plays into regional rivalry". Reuters. 8 April 2010.
  56. "Kyrgyzstan: Returning Labor Migrants are a Cause for Concern". EurasiaNet.org. 2 April 2009. Archived from the original on 11 మే 2011. Retrieved 1 నవంబరు 2015.
  57. 57.0 57.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; census అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  58. "10 Things You Need To Know About The Ethnic Unrest In Kyrgyzstan". RFERL. 14 June 2010.
  59. "Kyrgyzstan – population". Library of Congress Country Studies.  This article incorporates text from this source, which is in the public domain.
  60. "KYRGYZSTAN: Focus on post-Akayev Russian exodus". IRIN Asia. 19 April 2005.
  61. Flynn, Moya (1994). Migrant resettlement in the Russian federation: reconstructing 'homes' and 'homelands'. p. 15. ISBN 1-84331-117-8.
  62. Kokaisl, Petr (2009). The Kyrgyz – Children of Manas. Кыргыздар – Манастын балдары. NOSTALGIE Praha. p. 132. ISBN 978-80-254-6365-9.
  63. http://demoscope.ru/weekly/ssp/rus_nac_26.php
  64. http://demoscope.ru/weekly/ssp/sng_nac_59.php
  65. http://demoscope.ru/weekly/ssp/sng_nac_89.php
  66. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-11-13. Retrieved 2015-11-01.
  67. "Перепись населения и жилищного фонда Кыргызской Республики (Population and Housing Census of the Kyrgyz Republic), 2009". NSC of Kyrgyzstan. Archived from the original on 21 జనవరి 2013. Retrieved 9 October 2012.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  68. "Kyrgyzstan". State.gov. Retrieved 17 April 2010.
  69. MAPPING THE GLOBAL MUSLIM POPULATION Archived 2011-05-19 at the Wayback Machine. A Report on the Size and Distribution of the World’s Muslim Population. Pew Research Center. October 2009
  70. Pew Forum on Religious & Public life. 9 August 2012. Retrieved 29 October 2013.
  71. "Kyrgyz Officials Reject Muslim Sect". RFE/RL. 6 January 2012. Archived from the original on 7 జనవరి 2012. Retrieved 6 June 2014.
  72. 72.0 72.1 "ISN Security Watch – Islam exerts growing influence on Kyrgyz politics". Isn.ethz.ch. Archived from the original on 16 మార్చి 2008. Retrieved 2 May 2010.
  73. 73.0 73.1 "EurasiaNet Civil Society – Kyrgyzstan: Time to Ponder a Federal System – Ex-President's Daughter". Eurasianet.org. 17 July 2007. Archived from the original on 6 నవంబరు 2010. Retrieved 2 May 2010.
  74. "Religion and expressive culture – Kyrgyz". Everyculture.com. Archived from the original on 17 జనవరి 2010. Retrieved 2 May 2010.
  75. "Kirguistán la Iglesia renace con 600 católicos". ZENIT. 2 October 2008. Archived from the original on 7 అక్టోబరు 2008. Retrieved 1 నవంబరు 2015.
  76. "Religion in Kyrgyzstan". Asia.msu.edu. 4 March 2010. Archived from the original on 2 జూలై 2007. Retrieved 1 నవంబరు 2015.
  77. Shaikh Muhammad Bin Jamil Zeno, Muhammad Bin Jamil Zeno, 2006, pg. 264
  78. "Human Rights Activists Condemn New Religion Law". Eurasianet.org. 16 January 2009. Archived from the original on 29 ఏప్రిల్ 2009. Retrieved 2 May 2010.
  79. Aidar, Iliyas. "Kyrgyz Style – Production – Souvenirs". Kyrgyzstyle.kg. Archived from the original on 11 నవంబరు 2006. Retrieved 2 May 2010.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  80. Lom, Petr (March 2004). "Synopsis of "The Kidnapped Bride"". Frontline/World.
  81. "Reconciled to Violence: State Failure to Stop Domestic Abuse and Abduction of Women in Kyrgyzstan" Archived 2016-03-04 at the Wayback Machine. Human Rights Watch Report. September 2006, Vol. 18, No.9.
  82. "Issyk-Kul: Chasing short-term profit". New Eurasia. Retrieved 3 May 2011.
  83. "Kyrgyzstan". FIFA. Archived from the original on 12 డిసెంబరు 2018. Retrieved 3 May 2011.
  84. "Kyrgyzstan Olympic Medals". USATODAY. 16 September 2008. Retrieved 3 May 2011.
  85. Lundqvist, Henrik (5 February 2011). "Kyrgyzstan wins the Asian Winter Games Premier Division 2011". EuroHockey.
  86. Team picture with Japan after their first meeting in the World Championships Archived 2012-08-19 at the Wayback Machine. bandy.or.jp.
  87. "Kyrgyz-Turkish MANAS University". Manas.kg. Retrieved 12 December 2018.
  88. "List of banned E.U. air carriers". Retrieved 2 May 2010.

బయటి లింకులు

[మార్చు]
Government