సంగటి
స్వరూపం
(రాగిసంగటి నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
మూలము | |
---|---|
ఇతర పేర్లు | రాగి సంగటి రాగి ముద్ద |
మూలస్థానం | భారతదేశం |
ప్రదేశం లేదా రాష్ట్రం | రాయలసీమ కర్ణాటక తమిళనాడు |
వంటకం వివరాలు | |
వడ్డించే విధానం | భోజనము |
వడ్డించే ఉష్ణోగ్రత | వేడి వేడి |
ప్రధానపదార్థాలు | రాగులు |
సంగటి లేదా రాగిముద్ద రాయలసీమ, కర్ణాటక వంటకాల్లో అత్యంత ప్రముఖ మైనది, ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. దీనిని సాధారణంగా మధ్యాహ్న భోజనంగా తీసుకుంటారు.రాగులతో చేయబడు వంటకం. రాయలసీమ, కర్ణాటక ప్రాంతాలలో ఎక్కువగా చేయబడుతుంది. వైఎస్ఆర్ జిల్లాలో రాగిముద్దలకి ప్రత్యేక హోటళ్ళు (సంగటి హోటళ్ళు) ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఆహారంపై అవగాహన పెరగటం, మధుమేహులు అన్నానికి ప్రత్యామ్నాయంగా వాడటం వలన బెంగుళూరులోని పెద్ద పెద్ద హోటళ్ళలో కూడా లభ్యమవుతోంది.
కావలసిన పదార్ధాలు
[మార్చు](అంచనాలు మాత్రమే)
- బియ్యం నూకలు : 500 గ్రాములు.
- రాగి పిండి : 400 గ్రాములు.
- ఉప్పు : తగినంత
తయారీ
[మార్చు]- ముందు రోజు రాత్రి నూకలను నీళ్లలో వేసి బాగా నానపెట్టుకోవాలి.
- ఉదయం నానిన నూకలకు నీరు బాగా చేర్చి పొయ్యి పై పెట్టి బాగా ఉడికించాలి. నూకలు బాగా ఉడికి జావలా అవుతాయి.
- తరువాత పొయ్యి మీద నుండి గిన్నె దించి రాగి పిండిని బాగా కలపాలి. ఈ కలిపేటప్పుడు పిండి ముద్దలుముద్దలుగా ఉండకూడదు.
- మొత్తం రాగిపిండి జావలో కలిసిపోయి ముద్దగా అవతుంది.
- దీనిని తగినంత పరిమాణాలలో ముద్దలుగా చేసి వడ్డించాలి
కూర
[మార్చు]- సంగటి లోనికి శాఖాహారులకు నెయ్యు, వేరుశెనగ పచ్చడి కూరగా చాలా బాగుంటుంది.
- మాంసాహారులకు తలకూర, బోటీ కూర ఉంటే రుచికరంగా ఉంటుంది.
ముఖ్య గమనిక
[మార్చు]- సంగటిని వేడిగానే ఆరగించాలి. చల్లారినచో కేవలం మజ్జిగలో కలుపుకుని తినగలము. వేరే కూరలలో తినలేము.
- జొన్నరొట్టె వలె రాగిముద్దలోకి ఏదైననూ తినవచ్చును.ఎండాకాలములో ఈ ఆహారము ఆరోగ్యానికి చాలా మంచిది.