Jump to content

ఎగ్ ఫ్రైడ్ రైస్

వికీపీడియా నుండి
(ఫ్రైడ్ రైస్ నుండి దారిమార్పు చెందింది)
ఫ్రైడ్ రైస్, ప్రముఖ ఆసియా వంటకం

పిల్లలు, పెద్దలు బాగా ఇష్టపడి తినే కోడి గుడ్లతో తయారు చేసే ఒక వంటకం ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ వంటకం తయారీకి అవసరమైన వస్తువులు, తయారు చేసే విధానం ఈ క్రింద ఇవ్వబడింది.

కావలసిన పదార్థాలు

[మార్చు]

తయారీ

[మార్చు]
గుడ్లు పగులకొట్టి సొనను ఒక గిన్నెలో ఉంచుకోవాలి. టమాటా -1, ఉల్లిపాయలు -3, పచ్చిమిర్చి -4, కొత్తిమీర -1 చిన్నకట్ట, కరివేపాకు - 3 రెమ్మలు సన్నగా తరిగి ఒక కప్పులో ఉంచుకోవాలి.

ముందుగా ఒక టేబుల్ స్పూన్ నూనె బాణలిలో వేసి కాగిన తరువాత దానిలో గుడ్ల సొన వేసి ముక్కలు ముక్కలు అయ్యేలా తిప్పుకుంటూ వేపుకోవాలి. తరువాత వేగుతున్నప్పుడే ఉప్పు వేసి కలిపి చిన్న చిన్న ముక్కలు అయ్యేలా కట్ చేయాలి. తరువాత ఆ ముక్కలను (పొరుటు) ఒక గిన్నెలోకి మార్చుకొని పక్కనుంచుకోవాలి.

తరువాత అదే బానలిలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి కాగనిచ్చి తరువాత అందులో సన్నగా కట్ చేసిన అనియన్లు దోరగా వేంచుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకులు వేసి వేంచుకోవాలి. తరువాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి బాగా మగ్గె వరకు వేంచుకోవాలి. తరువాత కొత్తిమేర వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత అల్లం వెల్లులి పేస్టు వేసుకొని పచ్చి వాసన పోయేవరకు మరో రెండు నిమిషాలు వేంచుకోవాలి. తరువాత పసుపు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నప్పుడు కారం తక్కువగా వేసుకోవచ్చు లేదా వేసుకోకుండా ఉండవచ్చు. తరువాత ఉప్పు సరిపడినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత చిల్లి పేస్టు, టమాటా సాస్ కూడా ఇష్టమైతే వేసుకోవచ్చు. తరువాత ముందుగా సిద్ధంగా ఉంచుకొని ఉన్న అన్నాన్ని ఈ మిశ్రమంలో వేసుకొని మసాలా మొత్తం అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి. తరువాత ముందుగా సిద్ధం చేసుకొని ఉంచుకొన్న కోడి గుడ్డు ముక్కలను (పొరుటు) ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత కొత్తిమీర అలంకరించుకోవాలి, అంతే "ఎగ్ ఫ్రైడ్ రైస్" రెడీ.

ఇతర ఫ్రైడ్ రైస్‌లు

[మార్చు]

ఇంకా ఇతర ఫ్రైడ్ రైస్‌లను కూరగాయలతో, పుట్టగొడుగులతో, మాంసంతో కూడా తయారు చేస్తారు.

చైనీస్ ఫ్రైడ్ రైస్ వంట వీడియో

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బిర్యాని

బయటి లింకులు

[మార్చు]