Jump to content

మహాత్మా గాంధీ రోడ్ (విజయవాడ)

వికీపీడియా నుండి
Bandar Road in 2014

మహాత్మా గాంధీ రోడ్ ( MG రోడ్) నకు మరొక ప్రముఖ పేరు బందరు రోడ్, 'భారతీయ నగరములలో ఒకటి అయిన విజయవాడలో ఒక ప్రధాన రహదారిగా ఉంది.[1] ఈ రోడ్డు లీలా మహల్ థియేటర్ వద్ద మొదలవుతూ, మచిలీపట్నం వరకు సాగుతుంది, దాదాపు బందరు కాలువకు సమాంతరంగా నడుస్తూ కొనసాగుతుంది. ఈ బందరు రోడ్ రహదారికి సమాంతరంగా, నేషనల్ హైవే 9 (భారతదేశం) బందరు కాలువకు మరొక వైపు నడుస్తూ (సాగుతూ) బెంజ్ సర్కిల్ వద్ద బందరు రోడ్ లోకి విలీనం అవుతుంది., నిజానికి ప్రస్తుత మచిలీపట్నం యొక్క పూర్వపు నామము బందరు. అందువల్ల బందరు రోడ్ పేరుతో వాడుకలోకి వచ్చింది. ఈ రోడ్డు సరాసరి ఏకంగా బందరులో కలుస్తుంది. దీని అధికారిక పేరు ఇరవయ్యో శతాబ్దంలో భారతీయ స్వాతంత్ర్య ఉద్యమం స్ఫూర్తి దాయక నాయకుడు మహాత్మా నుండి వచ్చింది.

చరిత్ర

[మార్చు]
Bandar Road in Vijayawada

బందరు రోడ్ యొక్క మొత్తం పొడవు రాఘవయ్య పార్క్, బెంజ్ సర్కిల్ మధ్య 100 అడుగుల వెడల్పుతో ఉంది. ఇది అంతటా ఒకే వెడల్పుతో లేదు.[2][3]. ఈ రహదారి యొక్క సృష్టి వల్ల విజయవాడ భూభాగం మార్పు, మల్టీప్లెక్స్, ప్రముఖ బిల్డింగ్ నిర్మాణం కోసం ఉత్ప్రేరకంగా ఉంటోంది.

వివాదం

[మార్చు]

ఎటువంటి హెచ్చరిక లేకుండా డిసెంబరు 2005 లో, విజయవాడ నగరం అధికారులు 120 అడుగుల రోడ్డు పెంచడానికి నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం వల్ల ఆకాశవాణి (ఆల్ ఇండియా ఎయిర్) రేడియో స్టేషను యొక్క ఒక గోడ తక్షణ కూల్చివేత, దగ్గరన ఉన్న ఒక బస్సు ఆశ్రయం చేరి ఉంది. ఈ రహదారి విస్తరణ వల్ల రేడియో స్టేషను కోల్పోయిన స్థలమునకు (411 గజాలు) బదులుగా ఆస్తి యొక్క తగిన ద్రవ్య పరిహారం, తక్షణం గోడ పునర్నిర్మాణం చేయాలని నగరపాలక సంస్థ కౌన్సిల్ లో తీర్మానము చేయడము జరిగింది.[4].

సూచనలు

[మార్చు]
  1. Pradesh, Andhra. "The Widening of MG Road May Take Six More Months" The Hindu. The Hindu, 17 July 2006. Web. 5 Oct. 2014
  2. Pradesh, Andhra. "The Widening of MG Road May Take Six More Months." The Hindu. The Hindu, 17 July 2006. Web. 5 Oct. 2014.<http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/widening-of-mg-road-may-take-six-more-months/article3106378.ece>.
  3. "The Changing Face of Vijayawada." The Hindu. The Hindu, 13 Dec. 2011. Web. 5 Oct. 2014. <http://www.thehindu.com/todays-paper/tp-features/tp-editorialfeatures/the-changing-face-of-vijayawada/article2710243.ece>.
  4. Pradesh, Andhra. "Row Over Demolition of AIR Station's Compound Wall." The Hindu. The Hindu, 13 Dec. 2013. Web. 5 Oct. 2014. <http://www.thehindu.com/2005/12/13/stories/2005121320690300.htm>.