ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ | |
---|---|
ఏ.పి.సి.ఆర్.డి.ఎ జోనల్ కార్యాలయం , అమరావతి రాజధాని ప్రాంతం | |
సంస్థ అవలోకనం | |
స్థాపనం | ఏర్పడింది - 2014, విరమణ=2020, పునరుద్ధరించింది=2021 |
పూర్వపు ఏజెన్సీలు | విజిటిఎం పట్టణాభివృద్ధి సంస్థ ఎ,ఎం.ఆర్.,డి.ఎ |
Superseding agency | ఎ.పి.సి.ఆర్..డి.ఎ |
అధికార పరిధి | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
ప్రధాన కార్యాలయం | విజయవాడ 16°30′50″N 80°37′31″E / 16.51389°N 80.62528°E |
Ministers responsible | నారా చంద్రబాబునాయుడు, , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పొంగూరు నారాయణ, , మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి |
ఏజెన్సీ కార్యనిర్వాహకుడు/ | పి. లక్ష్మీ నరసింహం, (ఐ.ఎ.ఎస్), , కమీషనర్ |
వెబ్‌సైటు | |
https://crda.ap.gov.in/apcrdav2/views/home.aspx |
అమరావతి ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సంక్షిప్తంగా APCRDA అంటారు ), అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం డెవలప్మెంట్ అథారిటీ చట్టం, 2014 ప్రకారం విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థానంలో 2014 డిసెంబరు 30న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది.[1][2][3] ఈ సంస్థ రాజధాని ప్రాంతం అభివృద్ధి ప్రాంతంలో నిర్మాణ పనులపై ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, రాజధాని ప్రాంతంలో పట్టణ సేవలును పర్యవేక్షిస్తుంది.[4]
దీని అధికార పరిధి గుంటూరు, కృష్ణా జిల్లాలలో 8,352.69 కి.మీ2 (3,224.99 చ. మై.) మేర విస్తరించి ఉంది. అమరావతి నగరం కూడా ఈ అథారిటీ క్రిందికి వస్తుంది.[5][6] గుంటూరు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు దీని పరిధికిందకు వస్తాయి.అలాగే పల్నాడు, బాపట్ల జిల్లాలలోని కొన్ని మండలాలు పాక్షికంగా దీనిపరిధిలోకి వస్తాయి.
చరిత్ర
[మార్చు]APCRDAని గతంలో కొన్నాళ్ళపాటు AMDA అని అన్నారు. మునుపటిది VGTM అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (VGTM UDA), ఇది 1978లో 1,954 km2 (754 sq mi) వైశాల్యంతో ఏర్పడింది.[7] 2012 లో దీన్ని 7,063 km2 (2,727 sq mi) కి విస్తరించారు.[8] ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత దీనిని APCRDA గా పేరు మార్చారు.[9] అథారిటీ ప్రధాన కార్యాలయం విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో ఉంది.[10] దీని పరిధిలో ఇది తుళ్లూరు, అనంతవరం మందడం వద్ద మూడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను కలిగి ఉంది.[11] ప్రాధికార సంస్థ పూర్వ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 8,352.69 కిమీ2 (3,224.99 చదరపు మైళ్ళు) విస్తరించి ఉంది.[9] ఇందులో 217 చ.కి.మీ ల రాష్ట్ర రాజధాని అమరావతి అధికార పరిధి కూడా భాగం.[12]
రాజధాని వికేంద్రీకరణ వివాదం వలన, ఈ సంస్థ కొన్నాళ్ల పాటు అస్థిత్వం కోల్పోయి, రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేసుకున్నందు వలన మళ్ళీ ఉనికిలోకి వచ్చింది.
ఎ.ఎం.ఆర్.డి.ఎ
[మార్చు]అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ ఏరియా దీనిని 2020 ఆగస్ఠులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం శాసనసభలో ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టాన్ని ఆమోదించింది. ఇది అమరావతిని శాసన రాజధానిగా పరిమితం చేయడంతోపాటు, వైజాగ్‌ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా పేర్కొంది.[13] ఆ విధంగా ప్రభుత్వం మూడు రాజధాని నగరాల కోసం ప్రణాళిక సిద్దం చేయడం వల్ల APCRDA రద్దు చేయబడి, అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ ఏరియా (AMRDA) ఏర్పాటుకు దారితీసింది.[14] ఈ నిర్ణయానికి దారితీసిన సంఘటనలు అమరావతి రైతుల నుండి విస్తృతమైన, నిరంతర నిరసనలకు దారితీశాయి.[15] ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాలు చేశారు, కోర్టు విచారణ పూర్తయ్యే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు విచారణ తుది దశకు చేరుకోగానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆ చట్టాన్ని ఉపసంహరించుకుంది. తన ప్రభుత్వం మెరుగైన, పూర్తి బిల్లును తీసుకువస్తుందని ఆసంందర్బంలో ముఖ్యమంత్రి చెప్పారు[16] AMRDA జిఒను ఉపసంహరించుకోవడంతో ఎపిసిఆర్‌డిఎను పునరుద్ధరించారు.
పరిపాలన
[మార్చు]పరిపాలనమండలి
[మార్చు]- ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఛైర్మన్
- మంత్రి, మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ, వైస్ ఛైర్మన్
- మంత్రి, ఆర్థికశాఖ, సభ్యుడు
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ), సభ్యుడు
- ప్రిన్సిపాల్ కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ, సభ్యుడు
- ప్రిన్సిపాల్ కార్యదర్శి, ఆర్థికశాఖ, సభ్యుడు
- ప్రిన్సిపాల్ కార్యదర్శి, రవాణా, రోడ్స్, భవనాలు శాఖ, సభ్యుడు
- ప్రిన్సిపాల్ కార్యదర్శి, శక్తి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్, సభ్యుడు
- ప్రిన్సిపాల్ కార్యదర్శి, పర్యావరణ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, సభ్యుడు
- ప్రిన్సిపాల్ కార్యదర్శి, పంచాయితీ రాజ్ శాఖ, సభ్యుడు
- కమిషనర్, కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, మెంబర్ కన్వీనర్
కార్య నిర్వాహక కమిటీ
[మార్చు]- ప్రిన్సిపాల్ కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ చైర్మన్
- ప్రిన్సిపాల్ కార్యదర్శి, ఆర్థికశాఖ, సభ్యుడు
- కమిషనర్, కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ), మెంబర్ కన్వీనర్‌గా
అధికారులు
[మార్చు]ఈ సంస్థ మొదటి కమిషనర్‌గా శ్రీకాంత్ నాగులపల్లి (ఐఎఎస్) పనిచేశాడు.ప్రస్తుత కమిషనర్‌గా భాస్కర్ కాటంనేని (ఐఎఎస్) అధికారంలో ఉన్నారు.[17]
కమీషనర్
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-24. Retrieved 2016-08-17.
- ↑ "Capital Region Development Authority comes into being". The Hindu. 30 December 2014. Retrieved 6 January 2015.
- ↑ "3-decade-old VGTMUDA to be dissolved". The Hans India. 20 November 2014. Retrieved 6 January 2015.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-02-29. Retrieved 2016-08-20.
- ↑ Subba Rao, GVR (23 September 2015). "Capital region expands as CRDA redraws boundaries". The Hindu. Vijayawada. Retrieved 23 September 2015.
- ↑ "Andhra Pradesh Capital Region Development Authority Act, 2014" (PDF). News19. Municipal Administration and Urban Development Department. 30 December 2014. Archived from the original (PDF) on 18 ఫిబ్రవరి 2015. Retrieved 9 February 2015.
- ↑ "Welcome to VGTM UDA". VGTM Urban Development Authority. Archived from the original on 16 May 2014. Retrieved 14 January 2019.
- ↑ Sandeep Kumar, S. (27 September 2014). "VGTM master plan hits roadblock". The Hindu. Vijayawada. Retrieved 14 January 2019.
- ↑ 9.0 9.1 Subba Rao, GVR (23 September 2015). "Capital region expands as CRDA redraws boundaries". The Hindu. Vijayawada. Retrieved 23 September 2015.
- ↑ "APCRDA to conduct awareness sessions on HappyNest booking". The New Indian Express. Vijayawada. 6 December 2018. Retrieved 10 June 2019.
- ↑ "Offices Address". crda.ap.gov.in. Retrieved 2019-01-14.[permanent dead link]
- ↑ "Declaration of A.P. Capital City Area" (PDF). Andhra Pradesh Capital Region Development Authority. Municipal Administration and Urban Development Department, Andhra Pradesh. 9 June 2015. p. 3. Archived from the original (PDF) on 8 July 2018. Retrieved 10 June 2019.
- ↑ "YS Jaganmohan Reddy's three-capital plan on track as Andhra Pradesh governor gives nod to two bills". Archived from the original on 1 August 2020. Retrieved 1 August 2020.
- ↑ "Bill for three capitals for Andhra Pradesh gets Governor's nod". Mumbai Mirror.
- ↑ Sudhir, Uma (13 January 2020). "Won't celebrate harvest festival, say Amaravati farmers amid protests". NDTV. Archived from the original on 14 April 2021. Retrieved 28 February 2021.
- ↑ "Andhra Pradesh withdraws controversial 3-capital bill". NDTV.com. Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.
- ↑ ttps://crda.ap.gov.in/APCRDAv2/Views/ourteam.aspx