Jump to content

త్రిపుర ముఖ్యమంత్రుల జాబితా

వికీపీడియా నుండి
త్రిపుర ముఖ్యమంత్రి
Incumbent
మాణిక్ సాహా

since 2022 మే 15
త్రిపుర ప్రభుత్వం
విధంది హానరబుల్ (అధికారిక)
మిస్టర్. ముఖ్యమంత్రి (అనధికారిక)
స్థితిప్రభుత్వ అధిపతి
Abbreviationసి.ఎం.
సభ్యుడుత్రిపుర శాసనసభ
నియామకంత్రిపుర గవర్నర్
కాలవ్యవధిఅసెంబ్లీ విశ్వాసం పై
ముఖ్యమంత్రి పదవీకాలం ఐదు సంవత్సరాలు, ఎటువంటి కాల పరిమితిలకు లోబడి ఉండదు.[1]
ప్రారంభ హోల్డర్సచింద్ర లాల్ సింగ్
నిర్మాణం1 జూలై 1963
(61 సంవత్సరాల క్రితం)
 (1963-07-01)
ఉపఖాళీ

త్రిపుర ముఖ్యమంత్రి త్రిపుర ప్రభుత్వానికి ప్రధాన అధిపతి. భారత రాజ్యాంగం ప్రకారం, త్రిపుర గవర్నరు రాష్ట్ర డి జ్యూర్ హెడ్, అయితే వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. త్రిపుర శాసనసభకు ఎన్నికల తరువాత, గవర్నరు సాధారణంగా అత్యధిక స్థానాలు పొందిన ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు. శాసనసభకు సమష్టిగా బాధ్యత వహించే మంత్రుల మండలి, ముఖ్యమంత్రిని గవర్నరు నియమిస్తాడు. అతనికి శాసనసభలో విశ్వాసం ఉన్నందున, ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. ఎటువంటి కాల పరిమితులకు లోబడి ఉండదు.

1963 నుంచి 2022 నాటికి త్రిపురకు పదిమంది ముఖ్యమంత్రులు పనిచేసారు. మొదటిది భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన సచింద్ర లాల్ సింగ్. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) మాణిక్ సర్కార్ 1998 నుండి 2018 వరకు త్రిపుర ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతని పాలన రాష్ట్ర చరిత్రలో సుదీర్ఘమైంది. బిప్లబ్ కుమార్ దేబ్ తర్వాత మాణిక్ సాహా అధికారంలో ఉన్నారు. ఇద్దరూ భారతీయ జనతా పార్టీకి చెందినవారేకావటం విశేషం.[2] త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా క్రింద ఇవ్వబడింది.

ప్రస్తుత ముఖ్యమంత్రి

[మార్చు]

ప్రస్తుత ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా 11వ ముఖ్యమంత్రిగా 2022 మే 15 నుండి అధికారంలో ఉన్నారు

ముఖ్యమంత్రుల జాబితా

[మార్చు]
పార్టీల రంగు కీ
   వర్తించదు (రాష్ట్రపతి పాలన)
వ. సంఖ్య చిత్తరువు పేరు నియోజకవర్గం పదవీకాలం[3] అసెంబ్లీ

(ఎన్నికలు)

పార్టీ
1 సచింద్ర లాల్ సింగ్ అగర్తలా సదర్ II 1963 జూలై 1 1971 నవంబరు 1 8 సంవత్సరాలు, 123 రోజులు 1వ

(1963 ఎన్నికలు)

కాంగ్రెస్ పార్టీ
2వ

(1967 ఎన్నికలు)

ఖాళీ
(రాష్ట్రపతి పాలన)
వర్తించదు 1971 నవంబరు 1 1972 మార్చి 20 140 రోజులు వర్తించదు
2 సుఖమోయ్ సేన్ గుప్తా అగర్తలా టౌన్ III 1972 మార్చి 20 1977 మార్చి 31 5 సంవత్సరాలు, 11 రోజులు 3వ

(1972 ఎన్నికలు)

కాంగ్రెస్ పార్టీ
3 ప్రఫుల్ల కుమార్ దాస్ బముటియా 1977 ఏప్రిల్ 1 1977 జూలై 25 115 రోజులు కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ
4 రాధికా రంజన్ గుప్తా ఫాటిక్రోయ్ 1977 జూలై 26 1977 నవంబరు 4 101 రోజులు జనతా పార్టీ
ఖాళీ
(రాష్ట్రపతి పాలన)
వర్తించదు 1977 నవంబరు 5 1978 జనవరి 5 61 రోజులు వర్తించదు
5 నృపేన్ చక్రవర్తి ప్రమోదనగర్ 1978 జనవరి 5 1988 ఫిబ్రవరి 5 10 సంవత్సరాలు, 31 రోజులు 4వ

(1977 ఎన్నికలు)

సిపిఐ (ఎం)
5వ

(1983 ఎన్నికలు)

6 సుధీర్ రాజన్ మజుందార్ టౌన్ బోర్దోవాలి 1988 ఫిబ్రవరి 5 1992 ఫిబ్రవరి 19 4 సంవత్సరాలు, 14 రోజులు 6వ

(1988 ఎన్నికలు)

కాంగ్రెస్ పార్టీ
7 సమీర్ రాజన్ బర్మన్ బిషాల్‌గఢ్ 1992 ఫిబ్రవరి 19 1993 మార్చి 10 1 సంవత్సరం, 19 రోజులు
ఖాళీ
(రాష్ట్రపతి పాలన)
వర్తించదు 1993 మార్చి 11 1993 ఏప్రిల్ 10 30 రోజులు వర్తించదు
8 దశరథ్ దేబ్ రామచంద్రఘాట్ 1993 ఏప్రిల్ 10 1998 మార్చి 11 4 సంవత్సరాలు, 335 రోజులు 7వ

(1993 ఎన్నికలు)

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)
9 మాణిక్ సర్కార్ ధన్‌పూర్ 1998 మార్చి 11 2003 మార్చి 7 19 సంవత్సరాలు, 363 రోజులు 8వ

(1998 ఎన్నికలు)

2003 మార్చి 7 2008 మార్చి 10 9వ

(2003 ఎన్నికలు)

2008 మార్చి 10 2013 మార్చి 6 10వ

(2008 ఎన్నికలు)

2013 మార్చి 6 2018 మార్చి 9[4] 11వ

(2013 ఎన్నికలు)

10 విప్లవ్‌కుమార్ దేవ్ బనమాలిపూర్ 2018 మార్చి 9 2022 మే 14 4 సంవత్సరాలు, 66 రోజులు 12వ
(2018 ఎన్నికలు
భారతీయ జనతా పార్టీ
11 మానిక్ సాహా టౌన్ బోర్డోవాలి 2022 మే 15 అధికారంలో ఉన్నారు 2 సంవత్సరాలు, 224 రోజులు
13వ

(2023 ఎన్నికలు)

గణాంకాలు

[మార్చు]

ముఖ్యమంత్రి జాబితా

[మార్చు]
వ.సంఖ్య ముఖ్యమంత్రి పార్టీ పదవీకాలం
సుదీర్ఘ నిరంతర పదం ముఖ్యమంత్రి పదవి మొత్తం వ్యవధి
1 మాణిక్ సర్కార్ CPI(M) 19 సంవత్సరాలు, 363 రోజులు 19 సంవత్సరాల, 363 రోజులు
2 నృపేన్ చక్రవర్తి CPI(M) 10 సంవత్సరాల, 31 రోజులు 10 సంవత్సరాల, 31 రోజులు
3 సచింద్ర లాల్ సింగ్ INC 8 సంవత్సరాల, 123 రోజులు 8 సంవత్సరాల, 123 రోజులు
4 దశరథ్ దేబ్ CPI(M) 4 సంవత్సరాల, 335 రోజులు 4 సంవత్సరాల, 335 రోజులు
5 బిప్లబ్ కుమార్ దేబ్ BJP 4 సంవత్సరాల, 67 రోజులు 4 సంవత్సరాల, 67 రోజులు
6 సుఖమోయ్ సేన్ గుప్తా INC 5 సంవత్సరాల, 12 రోజులు 5 సంవత్సరాల, 12 రోజులు
7 సుధీర్ రంజన్ మజుందార్ INC(I) 4 సంవత్సరాల, 14 రోజులు 4 సంవత్సరాల, 14 రోజులు
8 సమీర్ రంజన్ బర్మాన్ INC(I) 1 సంవత్సరం, 19 రోజులు 1 సంవత్సరం, 19 రోజులు
9 మాణిక్ సాహా BJP 2 సంవత్సరాలు, 224 రోజులు 2 సంవత్సరాలు, 224 రోజులు
10 ప్రఫుల్ల కుమార్ దాస్ Congress for Democracy 116 రోజులు 116 రోజులు
11 రాధికా రంజన్ గుప్తా JP 101 రోజులు 101 రోజులు

మూలాలు

[మార్చు]
  1. Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies for the specific case of Tripura as well.
  2. "Manik Saha to become new CM of Tripura". google.com. Retrieved 2022-05-14.
  3. Former Chief Ministers of Tripura. Government of Tripura. Retrieved on 21 August 2013.
  4. Karmakar, Rahul (4 March 2018). "Manik Sarkar resigns in Tripura, BJP to take over on March 8". The Hindu.

వెలుపలి లంకెలు

[మార్చు]