Jump to content

కంబోడియా

వికీపీడియా నుండి

Preăh Réachéanachâkr Kâmpŭchea
Kingdom of Cambodia
Flag of Cambodia
నినాదం

"Nation, Religion, King"
జాతీయగీతం
Nokoreach
Cambodia యొక్క స్థానం
Cambodia యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
Phnom Penh
11°33′N 104°55′E / 11.550°N 104.917°E / 11.550; 104.917
అధికార భాషలు Khmer
ప్రభుత్వం Democratic constitutional monarchy
 -  King Norodom Sihamoni
 -  Prime Minister Hun Sen
Independence
 -  from France 1953 
 -  from Vietnam 1989 
విస్తీర్ణం
 -  మొత్తం 181,035 కి.మీ² (89th)
69,898 చ.మై 
 -  జలాలు (%) 2.5
జనాభా
 -  July 2006 అంచనా 13,971,000 (63rd)
 -  1998 జన గణన 11,437,656 
 -  జన సాంద్రత 78 /కి.మీ² (112th)
201 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $36.82 billion (89th)
 -  తలసరి $2,600 (133rd)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase0.583 (medium) (129th)
కరెన్సీ Riel (៛)1 (KHR)
కాలాంశం (UTC+7)
 -  వేసవి (DST)  (UTC+7)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .kh
కాలింగ్ కోడ్ +855
1 Local currency, although US dollars are widely used.

ప్రవేశిక

కంబోడియా (కంపూచియా), ఆధికారికంగా కంపూచియా సామ్రాజ్యము అని గుర్తించబడే ఈ దేశం ఆగ్నేయ ఆసియా లోని ఇండోనీషియా ద్వీపకల్పానికి దక్షిణంగా ఉంది. ఈ దేశం మొత్తం భూ వైశాల్యం 181,035 చదరపు కిలోమీటర్లు. కాంబోడియా వాయవ్య సరిహద్దులలో థాయ్ లాండ్, ఈశాన్యంలో లావోస్ తూర్పున వియత్నాం, ఆగ్నేయంలో థాయ్ లాండ్ జలసంధి ఉన్నాయి. 1.48 కోట్ల జనాభా కలిగిన కంబోడియా ప్రపంచంలో జనసాంద్రత లో 68వ స్థానంలో ఉన్నది. కంబోడియా అధికార మతం " తెరవాడ బౌద్ధమతం". తెరవాడ బౌద్ధమతాన్ని దేశ జనాభాలో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. దేశంలోని అల్పసంఖ్యాకులు వియత్నామీయులు, చైనీయులు, చాములు మరియు 30 రకాల గిరిజనులు మొదలైన వారు. దేశరాజధాని మరియు దేశంలోని అతి పెద్ద నగరమైన " నాంఫెన్" కాంబోడియా సాంస్కృతిక, రాజకీయ మరియు ఆర్ధిక కేంద్రమని చెప్పవచ్చు. రాచరిక విధానం అనుసరిస్తున్న దేశమిది. రాజ సింహాసన మండలి చేత ఎన్నుకొనబడిన అధిపతి రాజ్యనిర్వహణ బాధ్యత వహిస్తాడు. ప్రభుత్వ అధ్యక్షుడు అయిన " హన్ సెన్" కంబోడియాను 25 సంవత్సరాల నుంచి పాలన చేస్తూ, దక్షిణాసియాలోనే దీర్ఘకాల పాలకుడిగా ప్రసిద్ధి చెందాడు.

కంపూచియా పురాతన నామము " కాంభోజ". 802 లో రెండవ జయవర్మ స్వయంగా తనకు తాను రాజుగా ప్రకటించుకోవడంతో ఖైమర్ సామ్రాజ్యం అంకురించింది. ఖైమర్ సామ్రాజ్యం దిగ్విజయంగా సమర్థులైన రాజులతో 600 సంవత్సరాల కాలం కొనసాగింది. ఖైమర్ సామ్రాజ్య కాలంలో కేంద్రీకృత అధికారం మరియు విస్తార సంపదలతో కంబోడియా దక్షిణాసియా దేశాలలో ఆధిపత్యం సాధించింది. ఆంకర్ వాట్ వంటి హిందూరాజుల కాలంలో ప్రపంచ ప్రసిద్ధ దేవాలయాల నిర్మాణం జరిగింది. దక్షిణాసియాలో హిందూమతం విస్తరణకు ఈ ఆలయాలు తార్కాణంగా నిలిచాయి. తరువాత ఇక్కడ బౌద్ధమతం విస్తరించింది. 15 వ శతాబ్దం లో ఆంకర్ పతనమై "ఆయుధాయ" సామ్రాజ్యం అవతరించిన తరువాత కంబోడియా 19 శతాబ్దం మధ్యకాలంలో ఫ్రెంచి వలసలు ఆరంభం అయ్యే వరకు పొరుగు రాజ్యాలతో కలిసి సామంతరాజ్యంగా ఉండిపోయింది. 1953 లో కంబోడియా స్వతంత్ర రాజ్యంగా అవతరించింది.

వియత్నాం యుద్ధం కంపూచియాయా వరకు విస్తరించిన తరువాత అవతరించిన " ఖేమర్ రోగ్ " పార్టీ, 1975 నాటికి కంబోడియాను వశపరచుకుకుంది. కొన్ని సంవత్సరాల తరువాత కంబోడియా తిరిగి సోషలిస్ట్ భావ ప్రభావితమైన " పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కంబోడియా" తో విలీనమైంది. 1993 వరకూ ఇలా కొనసాగిన తరువాత, ఏకాంతం వీడి 1993 లో యుద్ధవినాశిత దేశమైన కంబోడియా సమైక్య సామ్రాజ్యంగా అవతరించింది. దశాబ్దాల అంతర్యుద్ధం తరువాత దేశం శరవేగంగా ఆర్ధికరంగం మరియు మానవ వనరుల అభివృద్ధి సాధించింది. ఆసియాలో అత్యున్నత ఆర్ధిక ఫలితాలు సాధించిన దేశాలలో కంబోడియా ఒకటి. గడిచిన 10 సంవత్సరాలలో కంబోడియా సాధించిన ఆర్ధిక ప్రగతి 6%. వస్త్రపరిశ్రమ, వ్యవసాయం, నిర్మాణరంగం, దుస్తుల తయారీ మరియు పర్యటక రంగాలలో కంబోడియా తగినంత ప్రగతిని సాధించింది. 2001 లో కంబోడియా జలభాగంలో చమురు మరియు సహజ వాయువుల నిక్షేపాలు కనుగొనబడ్డాయి. వీటి నుండి 2013 నుండి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభమవుతుంది. కంబోడియా ఆర్ధిక రంగాన్ని చమురు ఉత్పత్తులు శక్తివంతంగా ప్రభావిం చేయనున్నాయి.

"కంపూచియా సామ్రాజ్యము" : ఇది ఆగ్నేయాసియా లోని ఇండోచైనా భూభాగం లోని దక్షిణ ప్రాంతానికి చెందిన ఒక దేశం. ఈ దేశపు మొత్తం విస్తీర్ణం 1,81,035 చదరపు కిలోమీటర్లు. తూర్పున వియత్నాం, నైరుతి లో థాయిలాండ్, ఈశాన్యం లో లావోస్, వాయువ్యం లో థాయిలాండ్ జలసంధి దేశానికి సరిహద్దులు. 1.48 కోట్ల జనాభా లో 95% మంది బౌద్ధ మతావలంబకులు. కంపూచియా ప్రాచీన నామం "కాంభోజ". లింకు పేరు

చరిత్ర

ప్రస్తుత కంబోడియాలో హిమయుగానికి చెందిన మానవులు నివసించారని భావిస్తున్నారు. ఖచ్చితమైన కాలనిర్ణయం చేయని ఖనిజము, ఖనిజ శిలలు మరియు గులకరాయితో చేసిన పనిముట్లు "మెకాంగ్" నదీతీరంలో ఉన్న ఎగువప్రదేశాలలో లభించాయి. ప్రస్తుతం ఈ ప్రదేశాలు క్రాటీ భూభాగం లోనూ, కేంపాట్ భూభాగం లోను మరియు ట్రెంగ్ భూభాగంలోనూ లభించాయి. స్వల్పమైన కొన్ని పురాతత్వపరిశోధనలు హోలోసిన్ ప్రాంతంలో కొన్ని వేట సమూహాలు నివసించినట్లు వివరిస్తున్నాయి. కంబోడియాలోని "ఎల్ ఆంగ్ స్పీన్ " గుహను కంబోడియా యొక్క అతిపురాతన ప్రదేశంగా భావిస్తున్నారు. " "హోబినియన్" కాలానికి చెందిన ఈ ప్రాంతం ప్రస్తుతం "బాటంబాంగ్ " ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో త్రవ్వకాలలో దిగువ పొరలలో లభించిన రేడియో కార్బన్ క్రీ.పూ 6000 కాలం నాటివని భావిస్తున్నారు. అదే ప్రాంతపు పైపొరలలో నియోలిథిక్ యుక్తితో మారుదల చేబడిన పాత్రలను కంబోడియా యొక్క అతిపురాతన మట్టి పాత్రలుగా భావిస్తున్నారు.

పురాతత్వపరిశోధకుల రికార్డులు హోలోసిన్ మరియు ఇనుప యుగం మధ్యకాలం పరిమితమైనదని భావిస్తున్నారు. 1877లో మొదటిసారిగా పరిశోధనలు ప్రారంభించిన ప్రదేశం అయినప్పటికీ కాలనిర్ణయం చేయబడని ఇతర చారిత్రక పూర్వపు ప్రదేశం సంరాంగ్ సేన్ (ఈ ప్రదేశం పురాతన రాజధాని ఉడాంగ్ సమీపంలో ఉంది) మరియు " బాంటీ మీంచీ" ఉత్తరభూభాగంలో ఉన్న ఫంస్నై. రత్నకిరి వద్ద గని త్రవ్వకాలలో చారిత్రక పూర్వక కళాకృతులు అనేకం లభిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ 1950 తరువాత వియత్నాం సమీపప్రాంతం మరియు మెమాట్ వద్ద ఉన్న ఎర్రమట్టిలో లభించిన గుండ్రని మట్టి పాత్రలు అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాటి ఉపయోగం మరియు కాలం ఇప్పటికీ వివాదాంశమైనా, ఇవి సుమారు క్రీ.పూ 2000 సంవత్సరానికి చెందినవై ఉండవచ్చని భావిస్తున్నారు.

కంపూచియా పురాతన చరిత్రలో అతి ముఖ్యమైన విషయం మొదటిసారిగా వ్యవసాయం ఆరంభించిన ప్రవేశం కొంచెం ఆలస్యంగా జరగటం. క్రీ.పూ 3000 సంవత్సరాలలో కంబోడియాలో వ్యవసాయం ఆరంభం అయింది. ఆధునిక కాల థాయ్‍లాండ్ "కోరత్ పీఠభూమి " వద్ద లభించిన ఇనుప సామాను క్రీ.పూ 500 నాటివని భావిస్తున్నారు. కంబోడియా లోని ఇనుప యుగపు నిర్మాణాలు బాక్‍సెయి చంక్రాంగ్ మరియు అంకోరియన్ ఆలయాల కింద లభించాయి. అదే సమయం లో అంకోర్ వాయవ్యంలో ఉన్న లోవియా ప్రాంతంలో గుండ్రని మట్టిపాత్రలు లభించాయి. ఆహారం లభ్యత, వ్యాపారం, సాంస్కృతిక సంబంధాలు మరియు శ్రామిక నిర్వహణ గురించి తెలుసుకోవడానికి త్రవ్వకాలు మరింత ఉపకరిస్తాయి. కంబోడియాకు క్రీ.పూ 4వ శతాబ్దానికి ముందే భారతదేశంతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు.

అంకోరియా ముందు శకం మరియు అంకోరియా శకం

3వ, 4వ మరియు 5వ శతాబ్దాలలో ఫ్యూనన్ అతడి తరువాత పాలకుడైన చెన్లా ప్రస్తుత కంబోడియా మరియు దక్షిణ వియత్నాం లను పాలించారు. 2,000 కంటే అధిక కాలం కంబోడియా మీద భారత్ ప్రభావం ఉంటూ వచ్చింది. ఆ ప్రభావం ఇక్కడి నుండి ఇతర దక్షిణాసియా దేశాలైన థాయ్‌లాండ్ మరియు లావోస్‌కు చేరింది. క్రీ.శ.1వ శతాబ్దిలోనూ, క్రీ.శ.4వ శతాబ్దిలోనూ రెండుమార్లు హిందువులు భారతదేశం నుంచి కంబోడియాకు పెద్దసంఖ్యలో వలసవచ్చారు. 7-13 శతాబ్దాల నడుమ ఈ ప్రాంతంలో సంస్కృత భాష, దేవనాగరి లిపి వ్యవహారంలో ఉండేవి. హిందేదేవాలయాలు అనేకం నిర్మింపబడ్డాయి.[1]. కొన్ని రాజ్యాంగ చరిత్రలు మరియు చైనీయుల చారిత్రక రచనలు, సామంతరాజులు సమర్పించిన కప్పముల ఆధారాలు ఈ విషయం నిర్ధారిస్తున్నాయి. ఫ్యూనన్ పాలిత భూభాగంలో ఓడరేవు ఉన్నదని విశ్వసించబడుతుంది. అలెగ్జాండ్రియా కి చెందిన జియోగ్రాఫర్ " క్లౌడియస్ టోల్మీ " ఆ ఓడరేవు పేరు " కట్టిగారా " అని సూచించాడు. చైనీస్ చారిత్రకాధారాలు ఆ రేవు 690 లో మరణించిన మొదటి జయవర్మ కాలంలో నిర్మించబడిందని సూచిస్తున్నారు. ఈ గందరగోళం లో ఇది చెన్లా పాలిత భూభాగంలో ఉండవచ్చని చెన్లా జలభాగం మరొక సామంత రాజు పాలిత భూభాగమై ఉండచ్చని భావించబడుతుంది. క్రీ.శ.5వ శతాబ్దంలో జయవర్మ అనే రాజు భారతదేశం నుంచి నాగసేనుడనే బౌద్ధభిక్షువును రప్పించి దేశంలో బౌద్ధమతాన్ని వ్యాపింపజేశారు[1].

చెన్లా సామ్రాజ్య అవశేషాల నుండి 802 లో రెండవ జయవర్మ చేత స్థాపించబడిన ఖైమర్ సామ్రాజ్యం స్థాపించబడిన తరువాత జావా నుండి స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి తనకు తాను దేవరాజుగా ప్రకటించాడు. అతడు, అతడి అనుయాయుల మతారాధనా వ్యవస్థ దేవ-రాజుగా ప్రకటించిన తరువాత సామ్రాజ్య విస్తరణ కొరకు 9వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు నిరంతరాయంగా యుద్ధాలను కొనసాగించారు. 13వ శతాబ్దంలో శ్రీలంకకు చెందిన సన్యాసులు దక్షిణాసియా దేశాలలో తరవాడ బుద్ధిజం ప్రవేశపెట్టారు. ఈ మతం విస్తరించి హిందూ ఇజం మరియు మహాయాన మతలను క్షీణింపజేసి తెరవాడ బుద్ధిజాన్ని ఆంకోర్ ప్రధాన మతంగా మారింది.

12వ శతాబ్దంలో దక్షిణాసియా దేశాలలో ఖైమర్ సామ్రాజ్యమే అన్నింటి కంటే పెద్దది. సామ్రాజ్యపు రాజ్యాధికార కేంద్రం ఆంకోర్ నగరం. ఇక్కడ జెనిత్ సామ్రాజ్య కాలంలో వరుస నిర్మాణాలు నిర్మించబడ్డాయి. 2007లో అంతర్జాతీయ పరిశోధన విద్యార్ధుల బృందం తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు మరియు ఇతర ఆధునిక సాంకేతిక వ్యూహాలు 1,150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఆంకోర్ పారిశ్రామిక నగారా అవతరణ ముందే అవతరించిన నగరాలలో ఆంకోర్ అతి పెద్ద నగరమని నిర్ధారించబడింది. ఈ నగరం 10 లక్షల మంది ప్రజలు నివసించడానికి తగిన సౌకర్యాలు కలిగి ఉన్నదని భావిస్తున్నారు. ప్రఖ్యాతి చెందిన, అతిచక్కగా నిర్వహించబడుతున్న మతపరమైన ఆలయాలు ఇప్పటికీ కంబోడియా స్మారక చిహ్నాలుగా నిలిచి కంపూచియా గతవైభవాన్ని చాటిచెబుతున్నాయి. సామ్రాజ్యం క్షీణించినా, 15వ శతాబ్దంలో పతనమయే వరకు ఈ ప్రాంతంలో గుర్తించతగిన శక్తిగా నిలిచింది.

కంపూచియా చీకటి శకం

పొరుగు రాజ్యాల వరుస యుద్ధాల తరువాత ఆంకోర్ 1452లో ఆయుత్తయా సాంరాజ్యం వశమైంది. అయినప్పటికీ జీవావరణ వైఫల్యం, మైలికసైకర్య నిర్మాణాల లేమి కారణంగా ఆయుత్తయా సాంరాజ్యం ఆంకోరును వదిలివేసింది. క్రమంగా సాంరాజ్య అంతర్గత వ్యవహారాలు పొరుగు రాజ్యాల నియంత్రణలోకి పోయిన కారణంగా ఆర్ధిక, సాంఘిక మరియు సాంస్కృతిక స్థంభన కొంతకాలంపాటు కొనసాగింది. ఈ సమయంలో ఘాడంగా కీరబడిన ఖైమర్ స్మారకనిర్మాణం నిలిచిపోయింది. పాత విశ్వాసాలైన మహాయాన బుద్ధిజం మరియు దేవ-రాజు యొక్క హిందూ ఆశ్రమాల నిర్మాణం తెరవాడ బుద్ధిజం ఆశయాలు భర్తీచెయ్యబడ్డాయి.

న్యాయసభ రాజధాని అయిన లాంగ్‌వెక్‌కు తరలించబడింది. సాంరాజ్యం తన వైభవాన్ని తిరిగి పొందడానికి సముద్రవాణిజ్య అభివృద్ధి వైపు దృష్ఠి సారించింది. కంబోడియాను మొదటిసారిగా గుర్తించిన యూరపియన్ దేశాలలో పోర్చుగీస్ మొదటిది. పోర్చుగీసు మరియు స్పెయిన్ యాత్రికులు ఈ నగరాన్ని వర్ణిస్తూ సంపద మరియు విదేశీ వాణిజ్యం కేందీకృతమైన ప్రాంతం అని పేర్కొన్నారు. కోతకాలమే సాగినా ఆయుత్తయా మరియు వియత్నాంతో సాగిన నిరంర యుద్ధాల కారణంగా 1594 నాటికి ఆంకోర్ అధిక భాగం లాంగ్‌వెక్‌లోని కొంతభాగం ఆయుత్తయా రాజైన నరేసుయన్ చేత మరియు ఆక్రమించబడడమే కాక నాశనం చెయ్యబడింది. 1618లో ఖైమర్ కొత్తరాజధానిగా లాంగ్‌వెక్ దక్షిణంగా ఉడాంగ్ స్థాపించబడింది. కాని సామంతరాజులు మాత్రం కొంతకాలం స్వాతంత్రం అనుభవించిన తరువాత సియామీస్ మరియు వియత్నామీస్ పాలెగాండ్లుగా మారి తరువాత మూడిశతాబ్ధాల కాలం తమ ఉనికి కాపాడుకున్నారు.

19వ శతాబ్ధంలో కంబోడియాను తమ ఆధిపత్యంలోకి తీసుకోవడానికి సియామీ మరియు వియత్నాం మధ్య భేదాభిప్రాయాలు చెలరేగాయి. ఫలితంగా ఒక సందర్భంలో వియత్నాం అధికారులు ఖేమరును తమ ఆధిపత్యం అంగీకరించమని వత్తిడి తీసుకువచ్చారు. ఇది వియత్నాంకు ఎదురుగా పలు తిరుగుబాటుచర్యలు అధికం కావడమేగాక తాయ్‌లాండ్ సహాయం అర్ధించడానికి దారితీసింది. 1841-1845 వరకు సాగిన సియామీ తాయ్‌లాండ్ యుద్ధం కంబోడియా మీద ఉమ్మడి ఆధిపత్యం వహించాలన్న ఒప్పందంతో ముగుసింది. తరువాత ఇది చివరకు కంబోడియా రక్షణ బాధ్యత ఫ్రెంచ్‌కు స్వాధీనం చేసే ఒప్పందం మీద మొదటి నోరోడం రాజు సంతకం చేయడానికి దారితీసింది.

ఫ్రెంచి వలస రాజ్యం

1863లో థాయ్‌లాండ్ చేత నోరోడం రాజు నియమించబడ్డాడు. కంబోడియా థాయ్ మరియు వియత్నాం నుండి రక్షణ కోరడంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ చెలరేగింది. 1863 లో రాజు ఫ్రెంచి రాజ్యాంగంతో కుదిరిన ఒప్పందం మీద సంతకం చేసాడు. ఈ ఒప్పందం మూలంగా కంబోడియా ఫ్రెంచి ప్రభుత్వ సార్వభౌమాధిపత్యం నుండి విడుదల అయింది. బదులుగా బత్తంబాంగ్ మరియు సీంరిప్లో భూభాగాలు థాయ్‌లాండ్‌ కు వశమయ్యాయి. 1906 లో థాయ్‌లాండ్ మరియు ఫ్రాన్స్ మధ్య జరిగిన భూభాగం తిరిగి కంబోడియా వశమైంది. 1863 నుండి 1993 వరకు కంబోడియా రక్షణ బాధ్యత ఫ్రాన్సు వహించింది. కంబోడియా జనసంఖ్య 9,46,000 నుండి 57,00,000 కు వృద్ధి చెందింది. 1904 లో థాయ్‌లాండ్ రాజు మరణించగానే ఫ్రెంచి ప్రభుత్వం రాజ్యంగంలో జోక్యం చేసుకుని, నూర్‌డం సోదరుడిని రాజ్యాసింహాసనం మీద కూర్చోబెట్టింది. 1941లో మొనివోగ్ సిసోవాత్ కుమారుని మృత్యువు తరువాత సింహాసనం ఖాళీగా ఉండిపోయింది. సిసోవాత్ కుమారుని స్వాతంత్ర్యేచ్ఛ కారణంగా ఫ్రెంచి ప్రభుత్వం అతడిని సింహాసనం అధిష్టించడానికి ఆడ్డుకట్ట వేసింది. బదులుగా నోరోడం మనుమడైన సిసోవాత్‌ను సింహాసం అధిష్టింప చేసారు. ఫ్రెంచి ప్రభుత్వం అతడు తమకు లోబడి ఉంటాడని భావించడమే ఇందుకు కారణం. అయినప్పటికీ అది పొరబాటని ఋజువైంది. ఏది ఏమైనప్పటికీ 1953 నవంబర్ నాటికి రాజు నోరోడం సిసోవాత్ పాలనలో కంబోడియా ఫ్రాంసు నుండి స్వతంత్రం పొందింది.

స్వాతంత్ర్యం మరియు వియత్నాం యుద్ధం

నోరోడం సింహానౌక్ సామ్రాజ్యంలో కంబోడియా సామంత రాజ్యం అయింది. . ఫ్రెంచి ఇండో చైనాకు స్వాతంత్ర్యం లభించగానే వియత్నాంకు బహూకరించబడిన మెకాంగ్‌ను తిరిగి పొందవచ్చు అన్న ఆశను వదులుకుంది. 1698 నుండి ఖేమర్ సామ్రాజ్యంలోని కొంత భాగం వియత్నాం ఆధీనంలో ఉంది. దశాబ్దాల క్రితమే ఈ భూగం వియత్నాం అనుమతితో రెండవ చెయ్ చేత రాజు ఆధీనంలో ఉంటూ వచ్చింది. ఖేమర్ రోగ్ ఈ భూభాగాన్ని తిరిగి స్వాధీన పరచుకోవడానికి చేసిన ప్రయత్నం కంపూచియా మీద వియత్నాం దండయాత్ర మరియు ఖేమర్ ఆక్రమణకు దారి తీసింది.

1955 సింహానౌక్ తన తండ్రి కోరిక మీద, రాజ్యాధికారం వదిలి రాజకీయాలలో పాలుపంచుకుని ఎన్నికలు నిర్వహించి ప్రధానమంత్రిని ఎన్నుకున్నాడు. 1960 లో తండ్రి మరణించిన తరువాత సింహానౌక్ రాజ్యనాయకునిగా మారి, ప్రిన్స్ బిరుదాన్ని స్వీకరించాడు. వియత్నాం యుద్ధం తీవ్రమైంది. సింహానౌక్ కమ్యూనిస్టు పార్టీకి అనుకూలం అని భావిస్తున్నప్పటికీ, ఆధికారికంగా ప్రచ్చన్న యుద్ధంలో మధ్యస్థ విధానం స్వీకరించాడు. సింహనౌక్ కంబోడియాను కమ్యూనిస్టులకు శరణాలయంగా అనుమతించి, వారి సైన్యాలకు మార్గాలను ఇతర వసతులను సమకూర్చి, దక్షిణ వియత్నాంలో యుద్ధం చేయడానికి అనుకూల పరిస్థితి కల్పించాడు. ఈ విధానం కంబోడియన్లను అవమానానికి గురిచేసింది. 1967లో వాషింగ్టన్ పత్రికావిలేఖరి స్టాన్లీ కార్నోవ్‌తో కంబోడియలను చంపకుండా వియత్నాం కమ్యూనిస్ట్ శరణాలయాల మీద బాంబులు వేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పాడు. 1968లో ఈ సందేశం అలాగే అప్పటి యు.ఎస్ అధ్యక్షుడైన జాన్‌సన్ కార్యాలయానికి చేరింది. సింహానౌక్ పాలనా విధానాలు, అమెరికా పక్షం వహించడం వంటివి ప్రభుత్వం మరియు సైన్యంలో అలజడికి కారణం అయింది.

ఖేమర్ రిపబ్లిక్ (1970-1975)

1970లో సింహానౌక్ బీజింగ్ విజయం తరువాత ప్రధానమంత్రి జనరల్ లాన్ నోల్ మరియు ప్రిన్‌స్ సిసోవాత్ మాతక్ నాయకత్వంలో నిర్వహించిన సైనిక చర్యతో పదవీభ్రష్టుడు అయ్యాడు. ఈ ఆకస్మిక తిరుగుబాటులో యు.ఎస్ ప్రభావం ఉన్నట్లు ఆధారాలు ఏవీ లేవు. ఏది ఏమైనప్పటికీ తిరుగుబాటు తరువాత కొత్త ప్రభుత్వం అమెరికా మద్దతు సంపాదించడానికి వియత్నాం కమ్యూనిస్టులను కంబోడియాను వదిలి వెళ్ళమని ఆదేశించాడు. ఉత్తర వియత్నాం ప్రజలు కాంగ్రెస్ నిరాశతో తమ శరణాలయాలను సహాయక మార్గాలను అలాగే కాపాడుకుని కొత్త ప్రభుత్వం మీద దాడులు ప్రారంభించాయి. రాజు తన ప్రభుత్వం పతనం కాకుండా కాపాడడానికి తన అనుయాయులను అప్రమత్తం చేసాడు. త్వరగా ఖేమర్ రోగ్ తిరుగుబాటుదారులు రాజును తమ మద్దతు దారుగా వాడుకోవడం మొదలుపెట్టారు. 1970-1972 మధ్య కంబోడియా ప్రభుత్వం మరియు సైన్యం మరియు ఉత్తర వియత్నాం మధ్య కలహాలు కొనసాగాయి. కంబోడియా మీద అధికారం సంపాదించిన వియత్నాం కమ్యూనిస్టులు విధించిన కొత్త నిబంధనలను కంబోడియా కమ్యూనిస్టులు అధిగమించారు. వియత్నాం కాంగ్రెస్ మరియు ఖేమర్ రోగ్ లను నియంత్రించడానికి 1969-1973 వియత్నాం రిపబ్లిక్ మరియు యు.ఎస్ సైన్యాలు కంబోడియా మీద బాంబు దాడి చేసాయి.

దక్షిణ వియత్నాం మరియు యు.ఎస్ సైన్యాలు చెప్పతగినన్ని ఉపకరణాలను స్వాధీనం చేసుకోవడం లేక నాశనం చేయడం వంటివి చేసాయి. ఉత్తర వియత్నాం సైన్యాలు తప్పించుకునే మార్గం లేక కంబోడియాలో చొచ్చుకు పోయాయి. ఉత్తర వియత్నాం సైన్యాలు తమమీద కంబోడియన్ సైన్యాలు చేసిన చిన్నతరహా సమాచర మార్గాల మీద చేసిన దాడిని తిప్పికొట్టాయి.

ఖేమర్ రిపబ్లిక్ నాయకత్వం అనైక్యతతో బలహీనపడసాగింది. లాన్ నోల్, సింహానౌక్స్ బంధువు సిరిక్ మాతక్ మరియు నేషనల్ అసెంబ్లీ నాయకుడైన టాం అనే మూడు వైవిద్యమైన విధానాల బృందాలుగా విడిపోయాయి. 1972లో లాన్ నోల్ ఆధిపత్యానికి రాగలిగాడు. మిగిలిన ఇద్దరు అతడి స్థానానికి రావడానికి తయారుగా లేకపోవడమే ఇందుకు కారణం. రాజ్యాంగం ఎన్నికవిధానాన్ని స్వీకరించి నిర్వహించిన ఎన్నికలలో లాన్ నోల్ అధ్యక్షపీఠాన్ని అలంకరించాడు. అయినప్పటికీ అనైక్యత కారణంగా తలెత్తిన 30,000 మంది సైనికులను నేషనల్ కంబాట్ ఫోర్స్‌కు తరలించడం , లంచగొండితనం పెరిగిపోవడం వంటివి రాజ్యాంగ నిర్వహణ మరియు సైన్యం బలహీనపడడానికి దారితీసింది.

కంబోడియాలో కమ్యూనిస్టులు ఉత్తర వియత్నాం సైన్య సహకారంతో తిరుగుబాటును తీవ్రం చేసారు. పాల్ పాట్ శారీ వియత్నాం వద్ద శిక్షణ పొందిన కమ్యూనిస్టులను గురించి నొక్కివక్కాణిస్తూ వారిని ప్రక్షాళన చేసాడు. అదేసమయం కమ్యూనిస్ట్ పార్టీ కంప్యూచియా బలంపుంజుకుని స్వతంత్రంగా వ్యవహరించసాగారు. 1973లో సి.పి.కె వియత్నాం సైనిక సహాయం లేకుండానే ప్రభుత్వ సైన్యాలతో యుద్ధాలు కొనసాగించారు. క్రమంగా కమ్యూనిస్టులు కంబోడియా లోని 60% భూభాగం మరియు 25% ప్రజల మీద ఆధిపత్యం సాధించారు. తిరుగుబాటు దారులతో ప్రభుత్వం సాగించిన మూడు రాజీ ప్రయత్నాలు వైఫల్యం అయ్యాయి. అయినప్పటికీ 1974 లో కమ్యూనిస్టులు బహిరంగంగా పాలనా పరమైన విభాగాలు చేసారు. ఎన్.వి.ఎ యుద్ధశక్తులు దక్షిణ వియత్నాంకు తరలి వెళ్ళాయి. లాన్ నోల్ అధికారం నగరం వెలుపల కొన్ని ప్రదేశాలకు పరిమితం అయింది. 20,00,000 యుద్ధ శరణార్ధులు నాంపెన్ నగరం ఇతర నగరాలలో నివసించసాగారు.

1975 నూతన సంవత్సర ప్రారంభంలో అనైతికంగా సాగించిన 117 రోజుల భయంకర యుద్ధం తరువాత ఖేమర్ రిపబ్లిక్ పతనం అయింది. వరుసగా నాంఫెన్ నగరం చుట్టూ సాగించిన దాడులు రిపబ్లికన్ సైన్యాలను సమూలంగా తుడిచిపెట్టాయి. ఇతర సి.పి.కె బృందాలు మెకాంగ్ మార్గం లోని సైనిక శిబిరాలను స్వాధీనం చేసుకున్నాయి. యు.ఎస్. మిషన్ కంపూచియా నుండి ఖాళీ చేయబడిన 5 రోజుల తరువాత 1975 ఏప్రిల్ 17న నాంఫెన్ వద్ద లాన్ నోల్ ప్రభుత్వం లొంగిపోయింది.

ఖేమర్ రోగ్ పాలన

1975 పాల్ పాట్ అధికారం చేజిక్కించుకుని దేశం అధికారిక నామాన్ని " డెమొక్రటిక్ కంపూచియా" గా మార్చాడు. కొత్తరాజ్యాంగం మావోయిస్ట్ చైనా విధానాలను అనుసరించసాగింది. నగరంలోని ప్రజలను బలవంతంగా ఖాళీచేయించి దూరప్రాంత ప్రణాళికలలో పనిచేయడానికి తరలించారు. వారు 11వ శతాబ్దపు నమూనా తరహా వ్యవసాయం తిరిగి నిర్మించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. పాశ్చాత్య వైద్యవిధానం విడిచిపెట్టబడింది. దేవాలయాలు, గ్రంథాలయాలు అలాగే పాశ్చాత్యం అనుకున్న ప్రతివస్తువు ధ్వంసం చేయబడింది.

ఖేమర్ రోగ్ పాలనలో 10-30 లక్షలమంది చంపబడ్డారని అంచనా. సాధారణంగా 20 లక్షలమంది అని చెప్తుంటారు. జనసంఖ్యలో నాలుగవ భాగం చంపబడ్డారని అంచనా. ఈ సమయంలో మరుభూములు మరియు చెరసాలలు అభివృద్ధి చెందాయి. టౌల్ స్లెగ్ చెరసాల మూకుమ్మడి హేయమైన హత్యలకు గుర్తుగా చరిత్రలో మిగిలి పోయింది. లక్షలమంది ప్రజలు సరిహద్దులుదాటి థాయ్‌లాండ్ చేరుకున్నారు. భూభాగంలో సంప్రదాయక అల్పసంఖ్యాకులను గురి చేసుకుని దాడులు కొనసాగాయి. ఇందులో చం ముస్లిములు తీవ్రమైన ప్రక్షాళనకు గురి అయ్యారు. వారి జనసంఖ్యలో సగం మంది అంతమయ్యారు.

కంబోడియాలో 1960లో 4,25,000 మంది చైనీయులు నివసించారు. 1984 లో ఖేమర్ మరణాల తరువాత ప్రజలు వలస కారణంగా జనసంఖ్యలో 61,400 చైనీయులు మాత్రమే దేశంలో మిగిలి పోయారు. ఖేమర్ కాలంలో 1970 లో స్వదేశానికి తిరిగి వెళ్ళమని బలవంతం చేసిన కారణంగా కంబోడియాలో వియత్నాం సంఖ్య తగ్గుముఖం పట్టింది. 1969లో 2,25,000-3,00,000 వరకు ఉన్న వియత్నామీయుల సంఖ్య 1984 నాటికి 56,000 చేరుకున్నది. ఏది ఏమైనప్పటికీ బాధితులలో అధికభాగం అల్పసంఖ్యాక సాంప్రదాయకులు మాత్రమే కాదు, వైద్యులు, న్యాయవాదులు మరియు ఉపాధ్యాయులు వంటి వృత్తి నిపుణులు కూడా గురిచెయ్యబడ్డారు.

వియత్నామీయుల ఆక్రమణ మరియు బదిలి

1978 నవంబర్‌లో ఖేమర్ రోగ్ సరిహద్దులలో దాడులకు ప్రతిచర్యగా వియత్నామీయులు కంబోడియా మీద దాడులు కొనసాగించారు. పాల్ పాట్ మరియు టా మోక్ చర్యల కారణంగా కంబోడియాకు పారిపోయి వచ్చి ఖేమర్ రోగ్ నాయకత్వం వహించిన వియత్నాం ప్రజలు 1951లో కంప్యూచియన్ పీపుల్స్ రిపలికన్ పార్టీ స్థాపించారు. ఈ పార్టీ గతంలో సోవియట్ స్టేట్ నాయకత్వంలో పనిచేసింది. ఈ పార్టీ వియత్నాం సైనిక శిబిరాలను ఆక్రమించుకుని వారిని నెం పెన్‌కు తరలి పోయేలా చేసింది. దీనికి ఆయుధసరఫరా వియత్నాం మరియు సోవొయట్ యూనియన్ ను.ండి వచ్చిచేరేవి.

1989లో పారిస్‌లో ప్రారంభమైన కంబోడియా శాంతి ప్రయత్నాలు 1991 లో ఫలించి సమగ్రమైన శాంతి ఒప్పందం జరిగింది. ఐఖ్యరాజ్యసమితి యుద్ధవిరమణ, నిరాయుధీకరణ మరియు శరణార్ధులకు సహాయం చేయమంటూ ఆదేశం జారీ చేసింది. 1993లో నోరోడం సిహానౌక్ కంబోడియా రాజుగా నియమించబడ్డాడు. అయినప్పటికీ యు.ఎన్.టి.ఎ.సి ఎన్నికలు నిర్వహించే వరకు అధికారం మొత్తం ప్రభుత్వాధికారుల ఆధీనంలో ఉంది. 1997లో సహ ప్రధానమంత్రి హన్ సెన్ నాయకత్వంలో ప్రభుత్వంలోని నాన్‌కమ్యూనిస్ట్ ప్రతినిధుల మీద తిరుగుబాటు చేసే వరకు కంబోడియాలో సాగిన స్థిరత్వం ఒక్కసారిగా కదిలిపోయింది. పలు నాన్ కమ్యూనిస్ట్ ప్రయొనిధులను హన్ సెన్ సైన్యాలు హతమార్చారు. తరువాతి కాలంలో సాగిన పునర్నిర్మాణ ప్రయత్నాలు ఫలించి పలుపార్టీల మిశ్రిత స్వాతంత్ర రాజ్య స్థాపన ద్వారా రాజకీయ స్థిరత్వం ఏర్పడింది. 2010 లో ఖేమర్ రోగ్ సభ్యుడైన కెక్ ల్యూ రాజు యుద్ధనేరస్థుడిగా గుర్తించబడ్డాడు. కెక్ ల్యూ రాజు మీద మోపబడిన " ఎస్21 ఎక్స్‌టెర్మినేషన్ కేంప్ " ఏర్పాటుకు ఆదేశించడంలో అతడి పాత్ర మరియు మానవ హక్కుల అతిక్రమణ మొదలైనవి ప్రధానమైనవి. ఆయనకు జీవిత ఖైదు విధించబడిణ్ంది. ముందటి ఖేమర్ రోగ్ మూకుమ్మడి మారణఖాండల మీద అదనపు చర్యలను హన్ సెన్ వ్యతిరేకించాడు. అందుకు ఆయన దేశంలో రాజకీయ అస్థిరత్వం నివారించడానికి ఇలా వ్యతిరేకించానని చెప్పాడు.

రాజకీ యాలు

1993 లో కంబోడియా జాతీయ రాజకీయాలు ఒక రూపానికి చచ్చయి. ప్రభుత్వం రాజ్యాంగ సార్వభౌమత్వంతో శాసనసభ ప్రాతినిధ్య రాజ్యాంగ విధానం ఏర్పాటి చేసుకున్నది. ప్రభుత్వాధికారిగా హన్ సెన్ నాయకత్వంలో 1985 నుండి ప్రధానమంత్రి కార్యాలయం నిర్వహించబడింది. కంబోడియా రాజు (ప్రస్థుతం నోరోడం సిహమోని) రాధ్ట్రపతి ఎన్నిక చెయ్యబడ్డాడు. జాతీయ శాసనసభ సలహా మరియు అనుమతితో రాజు ప్రధానమంత్రిని నియమిస్తాడు.

ప్రధానమంత్రి మరియు మంత్రులుగా పదవులలో నియమించబడిన మంత్రులు ప్రభుత్వ నిర్వహణాకార్యక్రమాలు పంచుకుంటారు. రాజ్యాధికారం కంబోడియా శాసనసభ మరియు నిర్వహణాధికారులకు పంచుకుంటారు. కంబోడియా పార్లమెటులో దిగువ సభ మరియు ఎగువసభ అనే రెండు విభాగాలు కలిగి ఉంటుంది. 123 సభ్యులు కలిగిన సెనేట్ సభ్యులు 5 సంవత్సరాలు పాలనాధికారంతో ఎన్నిక చెయ్యబడతారు.

2004 అక్టోబర్ తొమ్మిది మంది సభ్యులు కలిగిన త్రోన్-కౌంసిల్ నోరోడం సిహమోనిను రాజుగా ఎన్నిక చేసింది. ఎన్నికలో భాగంగా ఒక వారం మునుపే నోరోడం సిహానౌక్ పదవి నుండి తొలగించబడ్డాడు. సిహామోని ఎన్నిక ప్రధానమంత్రి హన్ సెన్ మరియు నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అయిన ప్రింస్ నోరోడం రణారిద్ధ్‌ల ఆమోదం పొందింది. 2004 అక్టోబర్ 29న నెం పెన్‌లో రాజును సింహాసనాధిష్ఠుని చేసారు.

కంబోడియాలో పాలనా పార్టీల్లలో కంబోడియన్ పీపుల్స్ పార్టీ ప్రధమ స్థానంలో ఉంది. 73 సభ్యులు కలిగిన సి.పి.పి పార్టీ దిగువ మరియు ఎగువ సభలను నియత్రిస్తుంది. ది నేషనల్ అసెంబ్లీ స్థానాలు 43. నేషనల్ అసెంబ్లీలో 26 స్థానాలు సెనేట్‌లో 2 స్థానాలు కలిగిన " ది అపోజిషన్ శాం రెయ్ంసీ పార్టీ " కండోయిలో రెండవ రాజకీయ పార్టీగా గుర్తింపు కలిగి ఉంది.

కంబోడియాలో హంసేన్ ఆయన ప్రభుత్వం చాలా వివాదాస్పదమైన అంశంగా మారింది. వియత్నామీయులు దేశం విడిచి పోయే ముందు క్రూరతతో అవసరమైన సమయాలలో అణిచివేతలో నేర్పరి అయిన కఠినమైన వ్యక్తిగా వ్యవహరిస్తున్న హంసేన్‌ను ఖేమర్ రోగ్ కమాండర్‌గా నియమించారు. 1997లో ఉపప్రధాని అయిన "ప్రింస్ నొరోడం రణరిద్ధ్" రాజకీయంగా శక్తి పుంజుకుంటున్నాడన్న భ్జితితో హంసేన్ రణరిద్ధ్ అతడి మద్దతుదార్లను ఆణచడానికి సైన్యాన్ని ఉపయోగించాడు. ఈ సంఘర్షణ కారణంగా రణరిద్ధ్ పారిస్‌కు పారిపోయాడు. హంసేన్ మిగిలిన తిరుగుబాటుదారులను ఖైదు చేసి క్రూరంగా హింసించడమే కాక కొందరికి మరణశిక్ష విధించాడు.

కంబోడియాలో చెలరేగుతున్న రాజకీయ హింసే కాక ప్రభుత్వం లంచగొండితనం అనే నిందను ఎదుర్కొంటున్నది. వేలమంది గ్రామస్థులను తరిమి కొట్టీ వారు నివదిస్తున్న ప్రదేశాన్ని విదేశీయులకు విక్రయిస్తున్నారన్న నిందతో చమురు నిక్షేపాలను వెలికి తీసే నిమిత్తం లంచం తీసుకుని అనుమతులు ఒస్తున్నారని నింద కూడా తోడైంది. కంబోడియా నిరంతరంగా ప్రపంచదేశాలలో అత్యధికంగా లంచగొండి తనం ప్రబలిన దేశాలలో ఒకటిగా భావించబడుతుంది.

విదేశీసంబంధాలు

కంబోడియాకు ఐక్యరాజ్యసమితి , ప్రపంచ బ్యాంక్ మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి సభ్యత్వం ఉంది. కంబోడియాకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ సభ్యత్వం కూడా ఉంది. 2004 అక్టోబర్ 13 న ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యత్వం తీసుకున్నది. 2005 నవంబర్ 23 న మలేషియాలో జరిగిన తూర్పాసియా శిఖరాగ్రసమావేశం ప్రారంభోత్సవానికి హాజర్ అయింది. కంబోడియా తన అణుశక్తి ఏజంసీ సభ్యత్వం తిరిగి తీసుకున్నది. ఐ.ఎ.ఐ.ఇ లో మొదటి సభ్యత్వం తీసుకుని 1958 ఫిబ్రవరి 6న సభ్యత్వం రద్దు చేసుకున్నది. కంబోడియా పలు దేశాలతో దౌత్యసంబంధాలను ఏర్పరచుకుంది. కంబోడియా ప్రభుత్వ నివేదికలో దేశంలో ఇరవై దౌత్యకార్యాలున్నట్లు పేర్కొన్నది. పారిస్ శాంతి ఒప్పందంలో ముఖ్యపాత్ర వహించిన దేశాలు మరియు సరిహద్దు దేశాలైన యు.ఎస్, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, యురేపియన్ యూనియన్, జపాన్ మరియు రష్యా వంటి దేశాలు దౌత్యసంబంధా ఉన్న దేశాలలో కొన్ని. కంబోడియాకు తన విదేశీ సంబంధాల కారణంగా పలు సేవా సంస్థలు సాంఘిక, ఆర్ధిక మరియు పౌర సంబంధిత అవసరాలకు తగిన మార్గదశం లభిస్తుంది.

సమీపకాలంలో కంబోడియా మరియు యు.ఎస్ మధ్య పరస్పర సంబంధాలు మెరుగయ్యాయి. కంబోడియాలో తీవ్రవాదం, దౌత్యపరమైన సంబంధాలను నిర్మాణాత్మకంగా అభివృద్ధిచేయడం, మానవహక్కుల పరిరక్షణ, ఆర్ధికాభివృద్ధిని వేగవంతం చేయడం, లంచగొండితనం నిర్మూలన, ఖేమర్ రోగ్ పాలన సమయంలో వియత్నాం యుద్ధంలో తప్పిపోయిన అమెరికన్ల వివరాలను కనిపెట్టడానికి సంపూర్జ్ణ సహకారానికి బాధ్యత వహించి ఆసమయంలో తీవ్రహింసకు పాల్పడిన వారిని అంతర్జాతీయ మానవీయ చట్టపరిధిలోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి యు.ఎస్ ప్రభుత్వం అవసరమైన మద్దతు అందిస్తుంది. ప్రచ్చన్న యుద్ధం తరువాత కంబోడియాలోని భౌగోళిక ఆసక్తిని చైనా పూర్తిగా మార్చుకున్నది. నోరోడం సిహానౌక్ రాజు మరణానికి ముందే కంబోడియా అతడి మీద చెప్పుకోతగినంత నియంత్రణను సాధించింది. అలాగే కంబోడియా సీనియర్ ప్రభుత్వ సభ్యులు మరియు చైనా సాంప్రదాయక ప్రజలను తమ అధికార పరిధిలోకి తీసుకురాగలిగింది. 1993లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కంబోడియా ఎన్నికలు నిర్వహించిన తరువాత కంబోడొయా పునర్నిర్మాణానికి అవసరమైన ఆర్ధిక సాయం అందించడంలో జపాన్ ప్రధాన పాత్ర వహించింది. జపాన్ కంబోడియాకు 1992 నుండి 120 కోట్ల అమెరికన్ డాలర్ల సహాయం అందించి ఆర్ధిక సహాయం అందించిన దేశాలలో ప్రధమ స్థానంలో నిలిచింది. కంబోడియా పొరుగు దేశాలు, పారిస్ శాంతి ఒప్పంద సమయంలో సహకరించిన దేశాలు,

1970-1990 వరకూ సాగిన హింసాయుత ఆణిచివేతల కాలంలో కంబోడియాకు సరిహద్దు ప్రాంతాలతో సరిహద్దుల గురించిన వివాదాలు ఉంటూ వచ్చాయి. వియత్నాం సరిహద్దులు, కొన్ని దీవులు, సముద్రజల సరిహద్దులు మరియు తాయ్ లాండ్ సరిహద్దుల విషయంలో ఒక అంగీకారానికి రాలేని వివాదాల ఉన్నాయి. ప్రీష్ విహార్ ఆలయం ఆనుకుని ఉన్న ప్రాంతాల హురించి కంబోడియా మరియు తాయ్ లాండ్ సైన్యాల మధ్య ఘర్షణ ఇరుదేశాల సంబంధాలను నాశనం చేసాయడానికి దారి తీసాయి. 1962లో అంత్ర్జాతీయ న్యాయస్థానం ఆలయాన్ని కంబోడియాకు బహుమతిగా ఇచ్చినప్పటికీ సమీపప్రాంల గురించిన వివరణ మాత్రం అస్పధ్టంగా ఉన్నది. ఇరుదేశాలు కాల్పులు మొదటి పెట్టిన విష్యంలో ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఒకతి భూభాగంలోకి వేరొకరిని ప్రవేశించడానికి అనుమతి నిరస్కరించారు.

భౌగోళికం

కంబోడియా వైశాల్యం 181,035 చదరపు కిలోమీటర్లు. కంబోడియా ఉత్తర మరియు పడమర దిశలో తాయ్‌లాండ్, ఈశాన్యంలో లావోస్ మరియు తూర్పు మరియు ఈశాన్యంలో వియత్నాం ఉన్నాయి. తాయ్‌లాండ్ ఖాతం మరియు (గల్ఫ్) తీరం వెంట కంబోడియా సముద్రతీరం పొడవు 443 కిలోమీటర్లు.

కంబోడియా భూభాగం చుట్టూ కొండలూ పర్వతాలతో పరివేష్టితమైన మైదాన భూములు కేంద్రితమైనట్లు ఉంటుంది. అంటే చుట్టూ కొండలు కేంద్రంలో దిగువగా మైదానం ఉంటున్నదన్న మాట. చిన్న కొండలు కలిగిన దిగువప్రాంతంలో టోనిల్ శాప్ (గ్రేట్ లేక్) మరియు కొంచెం ఎగువన మెకాంగ్ నదీ మైదానం ఉన్నాయి. కేంద్రంలో ఉన్న మైదానాలలో సముద్రమట్టానికి 200 అడుగుల ఎత్తు వరకు పలుచని అడవులు విస్తరించి ఉంటాయి. కంబోడియా ఉత్తరంలో ఇసుకరాళ్ళతో నిండిన 200 చదరపు మైళ్ళ వరకూ విస్తరించిన కొండ ప్రాంతం ఉంటుంది. దేశానికి తూర్పుదిశలో పడమట నుండి తూర్పు దిశగా 600 నుండి 1,800 అడుగుల వరకూ విస్తరించి ఉన్న కొండప్రాంతం ఉంటుంది.

దేశం తూర్పు భూభాగం నుండి దక్షిణ తీరం వైపు మెకాంగ్ నది ప్రవహిస్తూ ఉంటుంది. మెకాంగ్ తూర్పు వైపు భూమి మెల్లగా ఎగువభాగంగా మారుతూ ఉంటుంది. ఈ భూములలో కొంతభాగం అడవులతో కూడిన పర్వతాలు, మరికొంత భాగం ఎగువ పీఠభూములుగా మారుతూ వియత్నాం మరియు లావోస్ వరకు విస్తరించి ఉంటుంది. కంబోడియా వాయవ్యం వైపు ఎగువ భూమిలు క్రావన్ పర్వతాలు మరియు డాంరీ పర్వతాలు ఉన్నాయి. ఇతర ఎగువ భూములు తాయ్‌లాండ్ ఖాతం మరియు టోనెల్ శాప్‌గా విస్తరించి ఉన్నాయి. సుదూరంలో నిర్మానుష్యంగా ఉండే ఈ భూభాగంలో సముద్రమట్టానికి 5,949 అడుగుల ఎత్తులో కంబోడియాలో ఎత్తైన " నోం ఔరల్ " శిఖరం ఉంది.

కంబోడియాలో ప్రత్యేత కలిగిన భూభాగం టోనెల్ శాప్‌ జలాశయం. ఎండా కాలంలో ఈ సరసు విస్తీర్ణం 2,590 చదరపు కిలోమీటర్లు. వర్షాకాలం ఈ జలాశయ విస్తీర్ణం 24,605 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. కంబోడియాలో జనసాంద్రత అధికం ఉన్న ఈ భూములలో వరి అధికంగా పండించబడుతుంది. ఈ భూగంలో అధికభాగం జీవావరణ అభయ భుమిగా రక్షించబడుతూ ఉంది.

వాతావరణం

ఎలుగుబంటు ( సన్‌బీర్)

కంబోడియా వాతావరణం: వర్షపాతాలు ఆధిక్యత వహించే దక్షిణాసియా వాతావరణం కలిగి ఉంటుంది. సీజన్ వాతావరణ వ్యత్యాసాలను ప్రతిబింబించే ఉష్ణమండల వాతావరణం ఇక్కడి ప్రత్యేకత.

కంబోడియా వాతావరణంలో ఉష్ణోగ్రతలు 21 - 35 ఫారెన్‌హీట్ డిగ్రీలు ఉంటుంది. హిందూ మహాసముద్రం నుండి వీచే దక్షిణాసియా ౠతుపవనాలు దేశోలోకి ప్రవేశించడంతో తేమతో నిండిన వాయువులు మే నుండి అక్టోబర్ వరకు వీస్తూ దేశంలో వర్షపాతానికి కారణం ఔతాయి. పొడి వాతావరణ సమయాలలో ఈశాన్య ౠతుపవనాలు నవంబర్ నుండి మార్చ్ వరకు కొనసాగుతుంటాయి.

కంబోడియాలో రెండు ప్రత్యేక సీజన్లు ఉంటాయి. ఒకటి మే నుండి అక్టోబరు వరకు ఉంటుంది. ఈ సమయంలో అత్యధిక తేమతో ఉష్ణోగ్రత 22 నుండి 1 డిగ్రీల సెల్షియస్ వరకు పతనం అవుతుంది. పొడి వాతావరణం నవంబరు నుండి ఏప్రిలు వరకు కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. వరదలు ప్రతి సంవత్సరం సామాన్యమే. అయినా 2001-2002 లో సంభవించిన వరదలు అధిక నష్టం కలిగించాయి.

పర్యావరణం

భారత దేశపు ఏనుగు

కంబోడియాలో అనేకరకాల జంతువులు మరియు మొక్కలు ఉన్నాయి. ఇక్కడ 212 క్షీరదాల జాతులు, 536 పక్షి జాతులు, 850 మంచినీటి చేపజాతులు (టోన్‌లే శాప్ సరసు ప్రాంతం ) మరియి 435 సముద్రజాతి చేపలు ఉన్నాయి. పర్యావరణ వైవిద్యం అధికంగా టోన్‌లే శాప్ సరస్సు దాని పరిసరప్రాంతంలో ఉన్నాయి. టోన్‌లేశాప్ జీవావరణ అభయప్రదేశం టోన్‌లే సరస్సు ప్రాంతంలో సమైక్య పర్యావరణ బాధ్యతలు చేపట్టింది. ఇది సరస్సు మరియు ఇతర భూభాలను పరిరక్షిస్తుంది. కాంపాంగ్ తాం, సియం రీప్, బాటంబాంగ్, పర్సాట్, కాంపాంగ్ చన్నగ్, బెంటీ మీంచీ, పైలిన్, ఒద్దర్ మీంచీ మరియు ప్రియా విహార్ అనే భూభాగాలు పర్యావరణ రక్షిత భూములుగా సంరక్షించబడుతున్నాయి. 1997 లో యునెస్కో దీనిని పర్యావరణ రక్షితంగా గుర్తించింది. ఇతర ముఖ్య ప్రదేశాలు మండోల్‌కిరిలో ఉన్న డ్రై ఫారెస్ట్ మరియు నేం సాంకోస్ శరణాలయాలు.

అంతర్జాతీయ సహజ ప్రకృతి రక్షణ నిధి సంస్థ కంబోడియాలోని ఆరు భూభాగాలను సంరక్షించతగినవిగా గుర్తించింది. అవి వరుసగా కారడమం పర్వత వర్షారణ్యాలు, సెంట్రల్ ఇండోచీనా డ్రై ఫారెస్ట్, ఆగ్నేయ ఇండోచీనా డ్రై ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్, సౌత్ అన్నామిటీ మోంటేన్ వర్షారణ్యాలు, టోన్‌లే శాప్ ఫ్రెష్ వాటర్ స్వాంప్ ఫారెస్ట్ మరియు టోన్‌లే సాప్-మెకాంగ్ పీట్ స్వాంప్ అరణ్యం.

ప్రపంచంలో అడవుల నరికివేత శాతం అధికంగా ఉన్న దేశాలలో కంపూచియా ఒకటి. 1969 లో కంబోడియా ముఖ్య అరణ్యాల వైశాల్యం 70% ఉండగా 2001 నాటికి 3.1% కి చేరింది. కంబోడియా మొత్తంలో 1990 మరియు 2005 మధ్య కాలంలో 25,000 చదరపు కిలోమీటర్ల నుండి 3,340 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది. 2007 నుండి 3,320 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ అయింది. చట్టవిరుద్ధంగా అరణ్యాలను నరికి ఆదాయం చేసుకుంటున్న కారణంగా కంబోడియా అరణ్యాలు అపాయకరమైన క్షీణ స్థితికి చేరుకున్నాయి.

ఆర్ధికం

2011 లో కంబోడియా తలసరి ఆదాయం 470-1040 అమెరికన్ డాలర్లు. కంబోడియా తలసరి ఆదాయం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఇతరదేశాలతో పోల్చి చూసినప్పుడు ఇది తక్కువ అనే చెప్పాలి. మారుమూల పల్లెలలో ఉన్న ప్రజలు జీవనోపాధికి వ్యవసాయం మరియు తత్సంబంధిత రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. కంబోడియా ప్రధాన ఉతోత్తులు బియ్యం, చేపలు, కొయ్య, దుస్తులు మరియు రబ్బర్. ది ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ కంబోడియాలో 750 కంటే అధికమైన సాంప్రదాయక రీతులలో వరివంగండాలను రైతులకు పరిచయం చేసింది. ఈ సంస్థ ఫిలిప్పైన్‌లో ఉన్న విత్తనాల బ్యాంక్ ద్వారా కంబోడియాకు విత్తనాల సరఫరా చేస్తున్నది. ఈ సంస్థ వివిధ జాతుల వరివంగడాలకు సంబంధించిన విత్తనాలను 1960 నుండి సేకరిస్తున్నది.

కంబోడియా సరాసరి జి.డి.పి అభివృద్ధి 2001-2010 మధ్యకాలంలో 7.7% కు చేరుకున్నది. ఈ అభివృద్ధి కంబోడియాను వేగవంతంగా జి.డి.పి అభివృద్ధి చెందుతున్న పది ప్రపంచదేశాలలో ఒకటిగా గుర్తింపు తీసుకువచ్చుంది. కంబోడియా పర్యాటకరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ కంబోడియా ఆర్ధికరంగంలో ముఖ్యపాత్ర వహిస్తున్నది. 1997 నాటికి 2,19,000 వేలమంది పర్యాటకులు కంబోడియాను సందర్శించగా 2007 నాటికి ఈ సంఖ్య 20,00,000 కు చేరుకున్నది. 2004 నాటికి ద్రవ్యోల్బణం శాతం 1.7% అలాగే ఎగుమతులు 160 కోట్ల అమెరికన్ డాలర్లు.

కంబోడియా విదేశీపెట్టుబడులకు అత్యంత అనుకూల దేశం. చైనా 2011 మొదటి ఏడు మాసాలలో 360 ప్రణాళికలలో 800 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాలని ప్రణాళిక వేసుకున్నది. అంతే కాక కంబోడియాకు అత్యధికంగా ఆర్ధిక సహాయం చేస్తున్న దేశాలలో చైనా ఒకటి. 2007లో 6 కోట్ల మిలియన్ డాలర్లు, 2008లో 26కోట్ల డాలర్ల ఆర్ధిక సాయం అందించింది. నేషనల్ బ్యాంక్ ఆఫ్ కంబోడియా దేశం ప్రధాన బ్యాంకుగా దేశంలోని బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రిస్తుంది. అలాగే విదేశీ పెట్టుబడుల అభివృద్ధికి బాధ్యత వహిస్తుంది.

2012 లో నేషనల్ బ్యాంక్ ఆఫ్ కంబోడియా ఆధ్వర్యంలో క్రెడిట్ బ్యూరో కంబోడియా స్థాపించబడింది. కంబోడియాలోని మైక్రో ఫైనాంస్ సంస్థలన్ని ఖచ్చితమైన చట్టబద్ఫ్హమైన నివేదిక సమర్పించాలని కోరితున్న తరుణంలో క్రెడిట్ బ్యూరో సభ్యుల అకౌంట్ విషయంలో అదనంగా స్పష్ఠత కబరిస్తూ ఉన్నది.

ఎన్.జి సెక్టర్ మరియు మైక్రో ఫైనాంస్ సంస్థలు ప్రస్థుతం చట్టరీత్యా ఖచ్వితమైన వ్యాపార లావాదేవి వివరాలు అందించాలని కోరబడుతున్నాయి. కంబోడియాలోని వృద్ధులు ముఖ్యంగా వయోవృద్దులు నిరక్షరాశ్యత కంబోడియాకు పెద్ద సవాలుగా నిలిచింది. కంబోడియాలోని సిదూరమైన గ్రామాలలో మౌళిక సదుపాయాల కొరత ఉంది. రాజకీయ అస్థిరత మరియు ప్రభుత్వరంగంలో నెలకొన్న లంచగొండితనం విదేశీపెట్టుబడిదారులను అధర్యపరచడమే కాక విదేశీసహాయాన్ని ఆలస్యం చేస్తున్నది. అయినప్పటికీ కంబోడియా అనేక షాయదేశాల నుండి సహాయం అందుకుంటుంది. ఆసియన్ డెవలెప్మెంట్ బ్యాంక్ ప్రత్యేకంగా కంబోడియాలో 85 కోట్ల అమెరికన్ డాలర్లను లోను రూపంలో అందిస్తున్న తరుణంలో నిధిసహాయ దేశాలు 50.4 కోట్ల అమెరికన్ డాలర్ల సహాయం అందించాయి.

పర్యాటకం

కంబోడియాలో టెక్స్‌టైల్ పరిశ్రమ తర్వాత పెద్దదిగా చెప్పుకోతగిన పరిశ్రమ పర్యాటకమనే చెప్పాలి. కంబోడియా ఆదాయయ వనరులలో పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం రెండవ స్థానంలో ఉన్నది. 2007లో సందర్శకుల రాక 20 లక్షలు. 2006తో పోల్చి చూసినట్లైతే ఇది 18.5% అధికం. 49% పర్యాటకులు సియాం రీప్ మార్గంలో నెం ఫేన్ మరియు ఇతర ప్రదేశాలకు సందర్శనార్ధం చేరుకుంటారు. సిహానౌక్ లోని కేంపాట్ మరియు కెప్ ప్రాంతాలలో ఉన్న పలు ముఖ్య సముద్రతీరాలు, అతిధిగృహాలు మరియు బొకొర్ హిల్ ఇతర పర్యాటక ఆకర్షణలలో ముఖ్యమైవి. వార్షికంగా పర్యాటకుల రాకలో అభివృద్ధి కనిపిస్తుంది. 2007లో కంబోడియాను సందర్శించిన అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 1,18,183. 2009లో అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 21,61,577 .

పర్యాటకులలో అధిక సంఖ్య జపానీయులు, చైనీయులు, ఫిలిప్పైన్లు, సౌత్ కొరియన్లు, ఫ్రెంచ్ మరియు అమెరికన్లదని అంచనా. 2007లో పర్యాటకరంగం ద్వారా కంబోడియాకు 140 కోట్ల ఆదాయం వచ్చిందని అంచనా. కంబోడియా ఆదాయంలో ఇది 10%. . 2010 నాటికి విదేశీ పర్యాటకుల సంఖ్య 30 లక్షలకు 2015 నాటికి ఈ సంఖ్య 50 లక్షలకు చేరుకుంటుందని చైనా దినపత్రిక పేర్కొన్నది. సియాం భూభాగంలో ఉన్న ది ఆంకోర్ వాట్ హిస్టారికల్ పార్క్, సిహానౌక్ సముద్రతీరాలు మరియు రాజధాని నెం పెన్ మొదలైనవి విదేశీ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.

కంబోడియా సావనీర్ పరిశ్రమ ప్రధాన ప్రదేశాలలో అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించింది. ఉత్పత్తి చేస్తున్న సవనీర్లు అధికమౌతున్న పర్యాటకుల సంఖ్య అవసరానికి తగినంతగా అందడంలేదు. అధికంగా చైనా, తాయ్‌లాండ్ మరియు వియత్నాం దేశాల ఉత్పత్తులు విక్రయించబడుతున్నాయి. క్రమా వంటి సంప్రదాయక వసువులు కూడా అధికంగా విక్రయించబడే వస్తువులలో ఒకటి.

సెరామిక్ వసువులు :-

  • సోప్, మైనపువత్తి, స్పెసీస్.
  • వుడ్ కార్వింగ్, లక్క వస్తువులు, వెండిపూత పూసిన వస్తువులు,
  • రైస్ వైన్ నింపిన పెయింట్ చేసిన బాటిల్స్,

గణాంకాలు

2010 గణాంకాలను అనుసరించి కంబోడియా జనసంఖ్య 1,48,05,358 అని అంచనా. 90% కంబోడియా ప్రజలు ఖేమర్ వంశావళికి చెందిన వారు. వీరంతా కంబోడియా అధికార భాష అయిన ఖేమర్ భాషను మాట్లాడుతుంటారు. కంబోడియా జనసంఖ్య అధికంగా స్థానికులే. కంబోడియా అల్పసంఖ్యాకులలో 5% వియత్నామీయులు, 1% చైనీయులు. దేశంలో జననాల నిష్పత్తి 1000:25.6 (ప్రతి వెయ్యిమందికి 25.6). జననాల అభివృద్ధి శాతం 1.7%. ఇది సౌత్ కొరియా, తాయ్‌లాండ్ మరియు భారతదేశం కంటే అధికం. ఖేమర్ భాష " మాన్- ఖేమర్ " భాషా ఉప కుటుంబానికి చెందిన భాష ఆస్ట్రోయాదియాటిక్ భాషా బృందానికి చెందినది. కంబోడియన్ వయోవృద్ధులు ఒకప్పటి ఇండోచైనా అధికార భాష అయిన ఫ్రెంచ్ ఇప్పటికీ మాట్లాడితున్నారు. ఫ్రాన్స్ దేశం స్థాపించిన పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో ఇప్పటికీ ఫ్రెంచ్ అనుసంధాన భాషగా ఉన్నది. కంబోడియాలో ఇప్పటికీ ప్రభుత్వకార్యాలయాలలో ప్రధానంగా న్యాయస్థానాలలో ఉపయోగిస్తున్న ఫ్రెంచ్ యాస ఇక్కడ ఒకప్పుడు రాజ్యమేలిన ఫ్రెంచ్ వాతి ఙాపకార్ధంగా మిగిలి పోయింది.

సమీప దశాబ్ధాలలో కంబోడియన్ యువత ప్రధానంగా వ్యాపారుల కుటుంబాలకు చెందిన వారు ఆంగ్లభాషాధ్యయనం పట్ల ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన నగరాలలో మరియు పర్యాటక ప్రదేశాలలో అత్యధికంగా ఆంగ్లభాషను మాట్లాడడం పలు పాఠశాలలలో మరియు నేర్పించడం చేస్తున్నారు. ఆంగ్లభాష మాట్లాడే దేశాల నుండి పర్యాటకులు అత్యధికంగా వస్తూ ఉండడమే ఇందుకు కారణం. సుదూరం ప్రదేశాలలో కూడా అత్యధికంగా యువత కొంత ఆంగ్లభాషను మాట్లాడగలుగుతున్నారు. అధికమైన పిల్లలు విద్యను అభ్యసిస్తున్న పగోడాలలో సన్యాసుల చేత ఆంగ్లభాష నేర్పించబడుతుంది. అంతర్యుద్ధం మరియు మూకుమ్మడి హత్యలు కంబోడియా జనసంఖ్యను బాధించిన కారణంగా జనాభాలో 50% కంటే అధికులు 22 వయసు కంటే తక్కువ వయసున్న వారే. మెకాంగ్ భూభాగంలో స్త్రీ: పురుష నిష్పత్తి 1.4:1 ఉండగా కంబోడియన్‌లో స్త్రీ:పురుష నిష్పత్తి 1.6:1.

మతము

కంబోడియాలో 95% కంటే అధికులు తెరవాడ బుద్ధమతాన్ని అనుసరిస్తున్నారు. దేశంమంతా వ్యాపించిన తెరవాడ బుద్ధసంప్రదాయాలు అన్ని ప్రాంతాలలో బలంగా ఉంది. దేశమంతటా 4,392 బుద్ధ మఠాలు ఉన్నాయి. ఖేమర్ సంస్కృతిక ప్రజలలో అత్యధికులు బుద్ధమతస్థులే. బుద్ధమతం, సంప్రదాయక ఆచారాలు కంబోడియన్ల దైనందిక జీవితంలో ఒక భాగమే. నిబద్ధమైన బుద్ధిజం సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతి కంబోడియా చిహ్నంగా భావించబడుతుంది. కంబోడియా లోని మతం బుద్ధిజంతో సహా 1970 ఆఖరి దశలో ఖేమర్ రోగ్ పాలనలో అణచివేతకు గురైనప్పటికీ ప్రస్థుతం పునరుజ్జీవం చెందుతూ ఉంది.

కంబోడియాలోని అల్పసంఖ్యాకులలో అధికులైన చాంస్ మరియు మలాయ్ ప్రజలు ఇస్లాం మతావలంబీకులు. ముస్లిములలో అధికులు సున్నీలు. వీరు అధికంగా కాంపాంగ్ చాం భూభాగంలో ఉన్నారు. ప్రస్తుతం దేశంలో 3 లక్షల కంటే అధిక సంఖ్యలో ముస్లిములు ఉన్నారు. కంబోడియన్లలో 1% ప్రజలు క్రైస్తవులుగా గుర్తింపబడ్డారు. ఇతరులలో బాప్తిస్టులు, ది క్రిస్టియన్ మిషనరీకి చెందిన మెథడిస్టులు, జెహోవాలు విట్నెస్, అపోస్టోలిక్ మరియు యునైటెడ్ పెంటకోస్తులుస్ మరియు చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సన్యాసులు ఉన్నారు. కంబోడియాలో ఉన్న వియత్నామీయులు మరియు చైనీయులలో అత్యధికులు మహాయాన బుద్ధిజాన్ని అవలంబిస్తున్నారు. జానపద కథానాయకులు మరియు పూర్వీకులు స్తుతించటం కన్ఫుసియనిజం మరియు చైనీస్ బౌద్దమతం టావోయిజం మిశ్రమముగా ఇతర మతాచారాలు, కూడా ఆచరించబడతాయి.

విద్య

కంబోడియా విద్యారంగానికి అవసరమైన విధానాలు మరియు మార్గదర్శకాల బాధ్యత " ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, యూత్ అండ్ స్పోర్ట్స్ " వహిస్తున్నది. విద్యావిధానం అధికంగా వికేంద్రీకృతం చేయబడింది. ఇవి ప్రభుత్వం, కేంద్రం, ప్రాంతాలు మరియు జిల్లాలు వాటి నిర్వహణ బాధ్యత వహిస్తాయి. కంబోడియా ప్రభుత్వం 9 సంవత్సరాల నిర్బంధ విద్యావిధానాన్ని ప్రకటించింది. ప్రాథమిక విద్యా విధానం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాల స్థాయి విద్య అందించే హామీ ఇస్తుంది.

2008 కంబోడియన్ గణాంకాలను అనుసరించి కంబోడియా అక్షరాశ్యతా శాతం 77.6% . వీరిలో ప్రుషుల అక్షరాశ్యత 85.1% , స్త్రీల అక్షరాశ్యత 70.9%. 15-24 మధ్య వయస్కులైన పురుషుల అక్షరాశ్యత 89%. అదే వయసున్న స్త్రీల అక్షరాశ్యత 86%. కంబోడియన్ విద్యావిధానం అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నది. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలలో పరొస్థితిలో మెరుగైన మార్పులు కనిపిస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలలో విద్యార్ధుల ప్రవేశంలో అభివృద్ధి కనిపిస్తుంది. ప్రసిద్ధి చెదిన కంబోడియన్ విశ్వవిద్యాలయాలు నెం పెన్ లోనే ఉన్నాయి. కంబోడియాలో విద్య బౌద్ధమఠాలలో బోధించబడడం ఒక సంప్రదాయకంగా ఆచరించబడుతుంది. ఖేమర్ రోగ్ పాలనాకాలంలో కంబోడియాలో విద్యావిధానం గుర్తించతగినంతగా దెబ్బతిన్నది.

ఆరోగ్యం

కంబోడియా ఆరోగ్య సంరక్షణ నాణ్యతలో 2010 నుండి అభివృద్ధి కనిపిస్తుంది. 1999లో సరాసరి వయోపరిమితి 49.8 నుండి 46.8 సంవత్సారాలకు క్షీణించిన స్థితి నుండి 2010 నాటికి స్త్రీల వయోపరిమితిలో కొనసాగిన అభివృద్ధి కారణంగా వయసు 60 నుండి 65కు చేరుకున్నది. కంబోడియాలో ప్రజలకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్యుల నుండి ఉచిత వైద్యసేవలు అందడం ప్రత్యేకత. కంబోడియాలో దూరప్రాంతాలలో సహితం వైద్యసేవలు అభివృద్ధి చెందాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. రాయల్ కంబోడియన్ గవర్నమెంట్ ఆరోగ్యసంరక్షణా విధానాల మెరుగుకు ప్రణాళికా బద్ధంగా కృషిచేసి ఎయిడ్స్ , మలేరియా మరియు ఇతర వ్యాధులలో అప్రమత్తత కలిగించాలని యోచిస్తుంది.

కంబోడియాలో 1993 శిశుమరణాలు 1,000 మందికి 115 ఉండగా 2009 నాటికి 54 కు చేరుకున్నది. అదేసమయం 5 సంవత్సరాలు లోబడిన శిశుమరణాలు 1,000 మందికి 181 నుండి 115 కు చేరుకున్నది. రత్నకిరి 22.9% శిశుమరణాలతో ఆరోగ్యపరంగా దిగువన ఉన్నది.

యు.ఎన్.ఐ.ఎస్.ఎఫ్ నివేదికలు మందుపాతరలు అధికంగా ఉన్న ప్రపంచదేశాలలో కంబోడియా 3 వ స్థానంలో ఉన్నదని తెలియజేస్తున్నాయి. 1970 నుండి కంబోడియాలోని పేలకుండా మిగిలిపోయిన మందుపాతరలు 60,000 మంది ప్రజల మరణానికి అంతకంటే అధికమైన వారు గాయపడడానికి కారణం అయ్యాయి. వీరిలో అధికులు పొలాలలో ఆడుకుంటున్న పిల్లలు మరియు పశువులను మేపుతున్న పిల్లలు కావడం విచారకరం. బాంబుల ప్రేలుడుకు గాయపడి అవయవాలను కోల్పోయిన పెద్దలు కొందరు జీవనాధారానికి భిక్షాటన మీద ఆధారపడడం విచారకరం. ఏదిఏమైనప్పటికీ మందుపాతరల సంఖ్య క్రమంగా క్షీణిస్తూ ఉండడం గమనార్హం. 2005లో 800 ఉన్న మందుపాతరల మరణాలు 2006 నాటికి 400మరణాలు, 2007 నాటికి (170 మరణాలు, 38 గాయపడడం) 208 మరణాలు, 2008 నాటికి 271 మరణాలు, 2009 నాటికి 243 మరణాలు, 2010 నాటికి 286 మరణాలు సంభవించాయి. 2010 మే మాసంలో పాలిన్ భూభాగంలో ఏంటీ-టాంక్ లాండ్ మైన్ కారణంగా రెండు ప్రమాదాలు మరియు నవంబర్‌లో బాటంబాంగ్ భూగంలో ఒకటి జరిగాయి. 2011లో 211 మరణాలు సంభవించగా 2012లో 104 మరణాలు సంభవించాయి. 2011లో బాటంబాంగ్‌లో సంభవింవిన మరణాల శాతం 27%.

సంస్కృతి

కంబోడియాలో అనుసరిస్తున్న పలువిధానాలలో తరవాడ బుద్ధిజం, హిందూయిజం, ఫ్రెంచ్ కాఅనిజం, అంకోరియన్ సస్కృతి మరియు ప్రపంచ ఆధునీకరణ వంటివి కంబోడియన్ సంస్కృతి ప్రభావితమై ఉంది. కంబోడియన్ మినినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కంబోడియన్ సంస్కృతి అభివృద్ధి మరియు ప్రచారాలకు బాధ్యత వహిస్తున్నది. కంబోడియన్ సంస్ఖృతిలో దిగువ ప్రాంతాలలో నివసిస్తున్న స్వలపసంఖాక ప్రజలే కాక సాంస్కృతిక వైవిద్యమున్న 20 గిరిజన జాతులు ( సంఘటితంగా వీటిని ఖేమర్ లోయూ అంటారు ) భాగం వహిస్తాయి. నోరోడం సియోనాక్ ఒకప్పుడు దిగువ మరియో ఎగువ ప్రాంతాల మధ్య సంఘీభావాన్ని ప్రోత్సహించాడు. దూరప్రాంతాలలో నివసిస్తున్న కంబోడియన్లు క్రామా అనబడే కండువాను తలపాగాలాగా ధరించే వారు. క్రామా కంబోడియన్ దుస్తుల సంస్కృతిలో ఒక భాగంగా ఉంటూ వారికి సమైగ్ర చిహ్నంలా ఉంటుంది. కంబోడియన్లు ఒకరికి ఒకరు నమస్కారం (సాంపీహ్) చెప్పడం ద్వారా గౌరవాన్ని ప్రదర్శిస్తారు. ఖేమర్ సాంరాజ్యం కాలంలో విస్తరింపజేసిన ఖేమర్ సంప్రదాయంలో ప్రత్యేకమైన నృత్యరీతులున్నాయి. నిర్మాణశైలి, శిల్పం చరిత్ర కాలమంతా పొరుగున ఉన్న లావోస్ మరియు తాయ్‌లాండ్ ప్రజలతో పరస్పరం మార్పిడి జరుగుతూ వచ్చింది. ఖేమర్ సంస్కృతి ప్రతిబింబించే నిర్మాణాలలో ఆంకర్ వాట్ (ఆంకర్ అంటే నగరం వాట్ అంటే ఆలయం ) ఇప్పటికీ సంరక్షించబడుతున్న నిర్మాణాలలో ఒకటిగా నిదర్శనంగా నిలిచింది. అంకోరియన్ శకంలో ఖేమర్ శైలిలో నిర్మించబడిన వందలాది ఆలయాలు నగరంలోనూ పరిసర ప్రాంతాలలోనూ కనిపెట్టబడ్డాయి.

ఖేమర్ ప్రజలందరిలో సమాచారం ట్రాలీవ్స్(తాళపత్రాలు) లో లిఖించి సంరక్షించే విధానం కనిపిస్తుంది. తాళపత్ర గ్రంథాలలో ఖేమర్ ప్రజల పురాణలు లిఖించబడ్డాయి. రామాయణం, బుద్ధిజం ప్రాచీన గాధ మరియు ప్రర్ధనా గ్రంథాలు తాళపత్ర గ్రంథాల రూపంలో లిఖించి సరక్షించబడుతున్నాయి. ఈ గ్రంథాలను ప్రజలు బహుజాగరూకతతో భద్రపరచి సంరక్షిస్తుంటారు. గ్రంథాలను వాతావరణం మరియు తడి నుండి కాపాడడానికి వస్త్రాలలో చుట్టి బధ్రపరుస్తుంటారు.

బాన్ ఓం టీక్ ( పడవల పోటీల ఉత్సవం) ప్రతి సంవత్సరం ప్రజలు ఉత్సాహంగా జరఉకునే ఉత్సవాలలో ఒకటి. ఇది వర్షాకాలం ముగిసే తరుజ్ణంలో నిర్వహించబడుతుంది. మెకాంక్ నదీ ప్రవాహం వెనకకు తగ్గి తన సాధారణ పరిష్తితికి చేరుకున్న సమయంలో ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవంలో 10% కంబోడియన్లు ఈ క్రీడలలో పాల్గొనడం విశేషం. ఈ ఉత్సవాన్ని చంద్రునికి కృతఙత తెలపుతూ, బాణసంచా కాలచడం చూసి ఆనందించడం, భోజనం చేయడం మరియు పడవపోటీలలో పాల్గొనడం వంటి కారూక్రమాలు ప్రజలను ఉత్సాహభరితమైన సంబరాలలో ముంచెత్తి ఆనందభరితులను చేస్తుంది. కోడిపందాలు, సూకర్ మరియు ఫుట్‌బాల్ క్రీడను పోలిన " కికింగ్ ఏ సే " క్రీడలు కంబోడియన్ ప్రజాదరణ పొందిన క్రీలలో కొన్ని. సంప్రదాయక భారతీయ కేలండర్ మరియు తెరవాడ బుద్ధిజం కలయికతో కంబోడియన్లు తమ కొత్త సంవత్సరాన్ని ఏప్రెల్ మాసంలో ప్రధాన పండుగగా జరుపుకుంటారు. సరికొత్త కళాకారులలో గాయకుడు సిన్ సిసామౌత్, రాస్ సెరెసౌతియా వంటివారు దేశానికి సరికొత్త శైలిలో సగీతం అందిస్తున్నారు.

ఆహార సంస్కృతి

ఆగ్నేయాసియా దేశాలన్నింటిలో మాదిరిగా కంబోడియాలో కూడా ప్రధాన ఆహారం బియ్యం. మెకాంగ్ నది మరియు టాన్‌లే శాప్ లలో లభించే చాపలు కూడా ప్రధాన ఆహారంగా భోజనంలో చోటు చేసుకుంటుంది. 2000 లో దేశం సరాసరి చేపల సరఫరా ఒక్కొక్కరికి సంవత్సరానికి 20 కిలోలు ఒకరోజుకు 2 ఔంసులు ఉంటుందని అంచనా. కొన్ని చేపలు అధిక కాలం నిలువచేయడానికి ప్రాహాక్ కు పంపబడతాయి. కంబోడియా ఆహారాలలో సీజనల్ పండ్లు , సూపులు మరియు నూడిల్స్ చోటు చేసుకుంటాయి. వంటలలో ఉపయోగించే ప్రధాన పదార్ధాలు కాఫిర్ లైం, లెమన్ గ్రాస్, తెల్లగడ్డలు, చేపల సాస్, సోయా సాస్, కూర, చింతపండు, అల్లం, గుల్లచేప సాస్, కొబ్బరిపాలు మరియు నల్ల మిరియాలు. రుచికరమైన వంటలలో కొన్ని నం బంజాక్, అమోక్, ఆపింగ్. కంబోడియన్ వంటలలో ఫ్రెంచ్ ప్రభావం ఉన్నందువలన వారి వంటలలో " రెడ్ కర్రీ విత్ టోస్టెడ్ బాగ్యూట్టి బ్రెడ్ " కూడా ఒకటిగా ఉంటుంది. కాల్చిన బాగ్యూట్టి బ్రెడ్ ముక్కలను కూరలో ముంచి తింటుంటారు. కంబోడియన్ రెడ్ కర్రీ (ఎర్ర కూర)ను అన్నం మరియు బియ్యంపు పిండి నూడిల్స్ తో చేర్చి తింటారు. కంబోడియన్ల ప్రియమైన వంటకాలలో క్వే ట్యో, వేగించిన తెల్లగడ్డలు చేర్చిన పంది మాంసం నూడిల్స్ సూప్, స్కాలియన్లు, ఎర్రగడ్డ కాడలు, ఎద్దు మాంసపు ఉండలు, రొయ్యలు, పంది కాలేయం మరియు పాలకూర మొదలైనవి. పొరుగున ఉన్న తాయ్‌లాండ్ మరియు వియత్నాం వంటలకు అంతర్జాతీయంగా ఉన్న ఆదరణతో పోల్చితే కంబోడియన్ వంటలకు ప్రపంచానికి అంతగా పరిచయం లేనివే అని తెలుస్తుంది.

నృత్యం

సంప్రదాయక కంబోడియన్ సంగీతం ఖేమర్ సాంరాజ్యానికి ఉన్నంత ప్రాచీన చరిత్ర కలిగి ఉంది. మహోరీ బృందాలు నిర్వహించే అప్సర నృత్యం వంటి రాచరిక నృత్యాలు కంబోడియన్ సాంస్కృతిక చిహ్నాలుగా గుర్తించబడతాయి. చాపీ మరియు ఆయీ వంటి పలు జానపద నృత్యరీతులు కంబోడియన్ సంస్కృతిలో భాగమే. వయోధిక ప్రజలలో ప్రబలంగా ఉన్న " ఫార్మర్ " అనే ఒకేవ్యక్తి ప్రదర్శించే కళాప్రక్రియలో కళాకారుడు కంబోడియన్ గిటార్(చాపెల్) మీటుతూ కాపెల్లా శ్లోకాలు ఆలపిస్తుంటారు. ఇందులో గీతాలు అధికంగా నీతి మరియు మతపరమైనవిగా ఉంటాయి. యై కళాప్రక్రియ హస్యభరితమైన రీతిలో స్త్రీ లేక పురుషుల చేత ప్రదర్శించబడుతుంది. అది తరచుగా పద్యరూపంలో ఉంటుంది. ఇవి వ్రాయబడినవి లేక స్వయంకల్పిత అథారూపాలుగా ఉంటాయి. ఇది యుగళంగా ప్రదర్శించే సమయంలో స్త్రీ పురుషులు మారి మారి కథను చెబుతూ ఉంటారు. ఒకరి శ్లోకాలకు ఒకరు సమాధానంగా శ్లోకం చెప్పడం అలాగే ప్రేక్షకులకు వినోదం కలిగించడానికి అడ్డుప్రశ్నలు వేయడం ఇందులో భాగంగా ఉంటాయి. ప్లెంగ్ కాహ్ (ఇది " వివాహ సంగీతం " ) ఇది బృందంగా ఆలపించబడే సంగీతం. కొన్ని రోజుల పాటు సాగే ఖేమర్ వివాహాలలో వివిధ సంప్రదాయక సంబంధాలలో భాగమైన ఈ సంగీతంలో కంబోడియన్ ప్రజాదరణ పొందిన సంగీతాన్ని విదేశీ సంగీతవాయిద్యాలను మీటబడుతుంది.

ప్రబలమైన కంబోడియన్ ప్రదర్శనలో విదేశీశైలి సంగీత వాద్యాలను లేక సంప్రదాయక సంగీత వాయిద్యాలను మిశ్రితమైన వాయిద్యాలను మీటుతూ ప్రదర్శిస్తారు. పాఠశాల నృత్యాలు మరియు సంగీతాలకు శైలో రూపకల్పన చేయబడుతుంది. 1960-1970 మధ్యకాలం నుండి క్రూనర్ సిన్ సియామౌత్ మరియు రాస్ సెరిసోతియా శైలి సంగీతం కంబోడియా సంప్రదాయక పాప్ సంగీతంగా భావించబడుతుంది. ఖేమర్ రోగ్ తిరుగుబాటు కాలంలో 1960-1970 కి చెదిన సంప్రదాయక మరియు పాపులర్ గాయకులు వధించబడడం, పస్తులు లేక పనిభారం చేత మరణించారు. అలాగే ఆ కాలానికి చెందిన మూల టేపులు ధ్వంశం చేయబడ్డాయి. మరి కొన్ని కనిపించకుండా పోయాయి.

1980 లో కియో సూరత్ ( అమెరికాలో స్థిరపడిన శరణాత్ధుడు ) మరియు ఇతరులు సంగీత వారస్వత్వాన్ని తమతో తీసుకువెళ్ళి సంరక్షించారు. వారు ప్రబలమైన గీతాలను తిరిగి రూపకల్పన చేసారు. 1980-1990 లలో ఖేమర్ సురిన్‌సెట్ ఆధునిక వాయిద్యాల కాంటం సంగీతానికి ప్రజాదరణ అధికమైంది.

అంతర్జాలం

కంబోడియా నిరంతర అభివృద్ధిలో కంబోడియన్లు ప్రపంచసంబంధాలను మెరుగుపచుకోవడం ఒక భాగమే. దేశంలో కాఫీ షాపులు, బార్లు, రెస్టారెంట్లు మరియు పెట్రోలు స్టేషన్లు ప్రజలకు అంతర్జాల సౌకర్యాలను అందిస్తున్నాయి. యు.ఎస్.బి మోడెం మరియు సెల్ ఫోన్ల ద్వారా ప్రజలకు అంతర్జాల సౌకర్యం లభిస్తుంది. అంతర్జాల అనుసంధానం ద్వారా కంబోడియన్లు ప్రపంచంతో సంబంధాలను కలిగిఉన్నారు. మహానగర ప్రాంతాలలో గ్రామప్రాంతాలకంటే తక్కువ ఖర్చుతో అంతర్జాల వసతి లభిస్తుంది. 3 మెగాబైట్స్ వేగంతో అంతర్జాల వసతికి అయ్యే ఖర్చు 12 అమెరికన్ డాలర్లు మరియు మోడెం అద్దె. గ్రామప్రాంతంలో అంతర్జాల వసతి కొరకు ఇంస్టాలేషన్ మరియు డెలివరీ రుసుము అదనంగా ఖర్చు చేయవలసి అస్తుంది. ప్రస్థుతం ఇంటర్నెట్ కనెక్షన్ లో మెరుగైన సాంకేతిక అభివృద్ధి కారణంగా అంతర్జాల అనుసంధాన ఖర్చులు కనీసంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాల అనుసధానంలో వచ్చిన మార్పులు అభివృద్ధి కంబోడియాలో వెబ్సైట్లు అవసరం అధికంచేసింది. కంబోడియాలో అక్షరాద్యతలో కలిగిన అభివృద్ధి కంబోడియన్ కేందీకృతం చేసే వెబ్ సైట్లు ఆంగ్లం మరియు ఖేమర్ భాషలో లభ్యం కావడం అత్యవసరం. అంతర్జాలం మీద ఆంగ్లం ఆధిక్యత కలిగి ఉంది. అలాగే కంబోడియాలోని అత్యధిక అంతర్జాల వాడకం దార్లు ఆంగ్లభాషను అర్ధం చేసుకునే శక్తిని కలిగి ఉన్నారు. ఖేమర్ యూనికోడ్ వాడడం ద్వారా అధికమైన వెబ్సైట్లు ఖేమర్ భాషలో వెబ్సైట్లను అందించే శక్తిని అభివృద్ధి చేసుకుంటున్నాయి.

రవాణా

అంతర్యుద్ధం మరియు నిర్లక్ష్యం కంబోడియా రవాణా వ్యవస్థను అస్థవ్యస్థం చేసాయి. అయినప్పటికీ విదేశీ సలహాలు సహాయాలు మరియు అవసర ఉపకరణాలు కంబోడియా రహదారులను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధిపరచడానికి సహకరించాయి. కంబోడియన్ రహదారులు 2006లో అభివృద్ధి చేయబడ్డాయి. ప్రధాన రహదారులకు ప్రస్థుతం పేవ్మెంట్లు నిర్మించబడ్డాయి. కంబోడియాలో ఉన్న తెండు రైమార్గాల పొడవు 612 కిలోమీటర్లు. ఇవి సింగిల్ ఒన్ మీటర్ గేజ్ మార్గాలు మాత్రమే. ఇందులో ఒక మార్గం దేశరాజధాని అయిన సిహానౌక్‌వెల్లీ నుండి దక్షిణ తీరం వెంట సాగిపోతుంది. రెండవ మార్గం నెం పెన్ నుండి సిసోఫన్ వరకూ ఉన్నప్పటికీ తరచుగా రైళ్ళు బాటంబాంగ్ వరకు నడుపబడుతుంటాయి. 1987 వరకు నెం పెన్ నుండి బాటంబాంగ్ వరకు వరానికి ఒక పాసింజర్ రైలు మాత్రమే నడుపబడుతుంది. అయినప్పటికీ ఆసియన్ డెవలెప్మెంట్ బ్యాంక్ అందించిన 141 అమెరికన్ డాలర్ల ప్రణాళికతో కొట్టుమిట్టాడుతున్న కంబోడియన్ రైలు మార్గాలు తిరిగి ఉపయోగానికి వచ్చాయి. తరువాత కంబోడియాలోని రైలు మార్గాలు అభివృద్ధి చేయబడి రైలు మార్గం ద్వారా బాంకాక్ మరియు హో చీ మిన్ నగరం వరకు సరకు రవాణా సాధ్యమైంది. మరొకవవైపు అస్థవ్యస్థంగా ఉన్న రహదారి మార్గాలు పునరుద్ధరించబడి 5 నదులను వంతెనల నిర్మాణం ద్వారా అధిగమిస్తూ నెం పెన్ మరియు కోకాంగ్‌లను కలుపుతూ నిర్మించబడ్డాయి. 2004 లో నిరంతరాయంగా సాగొపోయే ఈ రహదారులు విద్తారమైన తాయ్‌లాండ్ రహదారులతో అనుసంధానించబడ్డాయి. కంబోడియా రహదారి ప్రమాదాలు అంతర్జాతీయ స్థాయికంటే అధికంగా ఉన్నాయి. కంబోడియా 10,000 వాహనాల కంటే ప్రమాదాలు అభివృద్ధి చెందిన కంబోడియన్ రహదారులలో 10 రెట్లు అధికంగా ఉన్నాయి. గత మూడు సంవత్సరాల కాలంలో ప్రమాదాలలో సంభవించిన మరణాల సంఖ్య రెండింతలు అయింది.

కంబోడియాలో అంతర్జాతీయంగా వాణిజ్యానికి పేరు పొందిన చారిత్రక ప్రఖ్యాతి చెందిన జలమార్గాలు విస్తారంగా ఉన్నాయి. మెకాంగ్ మరియు టోన్లే శాప్ నదులు వాటి ఉపనదులు కలిసి 3,700 పొడవున జలమార్గాలు సంవత్సరం పొడవున వాణిజ్యానికి అనువుగా ఉన్నాయి. రెండవ జలమార్గం పొడవు 282 కిలోమీటర్లు కంబోడియాలో రెండు ప్రధాన రేవులు నెం పెన్ మరియు సిహానౌక్ విల్లేలో ఉన్నాయి. అలాగే ఐదు చిన్న రేవులు ఉన్నాయి. నెం పెన్ రేవు మెకాంగ్ మరియు టోన్లే నదీ సంగమంలో ఉంది. ఇక్కడి నుండి వెట్ సీజన్లో 8,000 టన్నులు మరియు డ్రై సీజన్లో 5,000 టన్నుల సరుకు రవాణా జరుగుతుంది.

కంబోడియా ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా ఆటోమొబైల్స్ మరియు మోటర్ సైకిల్స్ సంఖ్యకూడా అధికం ఔతూఉంది. సైకిల్ కంబోడియన్ల ప్రయాణాలకు చాలాకాలం ముందు నుండే సహకరిస్తున్నది. కంబోడియా అంతటా కనిపించే ప్రత్యేక తరహా సైకిల్ రిక్షాలు పర్యాటకుల ప్రత్యేక ఆకర్షణలలో ఒకటి. విదేశీ పర్యాటకులలో అధికం ఈ సైకిల్ రిక్షాలలో ప్రయాణించడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ సైకిల్ రిక్షాలో నడిపే వ్యక్తి వెనుక ఉండి పర్యాటకులు ముందుంటారు. పొరుగున ఉన్న దేశాలలో నడిపే వ్యక్తి రిక్షా ముందుభాగంలో ఉంటాడు.

దేశంలో నాలుగు వాణిజ్యపరమైన విమానాశ్రయాలు ఉన్నాయి. నెంపెన్ లో ఉన్న నెం పెన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం దేశంలో రెండవ స్థానంలో ఉంది. సియాం రీప్ ఆంకర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం మొదటి ద్థానంలో ఉంది. కంబోడియాలోకి ప్రవేశించడానికి కంబోడియా నుండి విదేశాలకు వెళ్ళడానికి ఈ విమాశ్రయాన్ని ప్రయాణీకులు అధికంగా ఉపయోగిస్తారు. సిహానౌక్ మరియు బాటంబాంగ్ లలో మిగిలిన రెండు విమానాశ్రయాలు ఉన్నాయి.

వెలుపలి లింకులు

  1. 1.0 1.1 రామారావు, మారేమండ (1947). భారతీయ నాగరికతా విస్తరణము (1 ed.). సికిందరాబాద్, వరంగల్: వెంకట్రామా అండ్ కో. Retrieved 9 December 2014.