Jump to content

భ్రమరగీత

వికీసోర్స్ నుండి
శ్రీశ్రీ
ఖడ్గసృష్టి
1. ఖడ్గసృష్టి (కవిత)
2. శరచ్చంద్రిక
3. విషాదాంధ్ర
4. విశాలాంద్రలో ప్రజారాజ్యం
5. మున్నుడి
6. సదసత్సంశయం
7. మహాసంకల్పం
8. 'కో ఈ హస్ రహ్ హై' ' కో ఈ రో రహా హై'
9. గాంధీజీ!
10. మంచి ముత్యాల సరాలు
11. ఏవి తల్లీ!
12. సామాన్యుని కామన
13. రుబాయత్
14. భ్రమరగీత
15. బొమ్మలాంతరు
16. ఆఖరిమాట మొదటిమాట
17. విదూషకుని ఆత్మహత్య
18. టాంటాం
19. కొంటె కోణాలు
20. ఎ ఏ ఐ ఒ ఓ ఔ
21. అభిసారికి కడసారి
22. ఒకటీ - పదీ
23. నగరంలో వృషభం
24. అధివాస్తవికుల ప్రదేశం
25. మహాకవి ఆశ్చర్యం

గిరగిరగిరాం భ్రమరం గిరాం భ్రమణం భ్రమం 'భ్రమరణం' భ్రమణ భ్రమరం భ్రమర భ్రమణం గిరగిర గిరాగిరాగిరాం భ్రమణం రణం మరణం రణమరణం దారుణహననం ధిషణానిధనం వృథామథనం అదినా చెవిలోకథనం లోకధనం కదనం కదన కథాకథనం అదినాయెదలో రణనం ఝణఝణఝంఝణఝణాఝణా నికణనం అదినా నయనంలోప్రథమారుణకిరణం రణ నిస్సహణం వధవిధానాచరణం నాలోలోలోపల భ్రమా భ్రమర సంచరణం రణద్రణ నిస్సహణ ప్రణవం అదినా హృదయంలోరుధిరజలనం గీతాజననం:::