Jump to content

సీహోర్

అక్షాంశ రేఖాంశాలు: 23°12′N 77°05′E / 23.2°N 77.08°E / 23.2; 77.08
వికీపీడియా నుండి
సీహోర్
పట్టణం
సీహోర్ విహంగ దృశ్యం
సీహోర్ విహంగ దృశ్యం
సీహోర్ is located in Madhya Pradesh
సీహోర్
సీహోర్
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 23°12′N 77°05′E / 23.2°N 77.08°E / 23.2; 77.08
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాసీహోర్
Elevation
502 మీ (1,647 అ.)
జనాభా
 (2011)
 • Total1,09,118
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
466001
టెలిఫోన్ కోడ్07562
Vehicle registrationMP-37

సీహోర్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం, సీహోర్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఇది భోపాల్ - ఇండోర్ రహదారిపై, భోపాల్ నుండి 38 కి.మీ. దూరంలో ఉంది.

భౌగోళికం

[మార్చు]

సీహోర్ 23°12′N 77°05′E / 23.2°N 77.08°E / 23.2; 77.08 వద్ద, [1] సముద్ర మట్టం నుండి 502 మీటర్ల వద్ద ఉంది. ఇది, భోపాల్ - ఇండోర్ హైవేపై రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి నైరుతి దిశలో 37 కి.మీ. సీహోర్ భోపాల్ నుండి రత్లాం వరకు ఉన్న పశ్చిమ రైల్వే మార్గంలో ఉంది. సీహోర్ జిల్లా గుండా వెళుతున్న ఏకైక నది సివేన్.

జనాభా వివరాలు

[మార్చు]
సీహోర్‌లో మతం
మతం శాతం
హిందూ మతం
  
73%
ఇస్లాం
  
22%
జిన మతం
  
3.7%
ఇతరాలు†
  
1.3%
ఇతరాల్లో
సిక్కుమతం (0.2%), బౌద్ధమతం (<0.2%) ఉన్నాయి

2001 జనగణన ప్రకారం [2] సీహోర్ జనాభా 90,930. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48%. సీహోర్ అక్షరాస్యత 68%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 75%, స్త్రీల అక్షరాస్యత 61%. సీహోర్ జనాభాలో 14% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.

2011 జనాభా లెక్కల ప్రకారం, పెరుగుదల ఉన్న సీహోర్ పట్టణ జనాభా 109,118. [3]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

సీహోర్ రైల్వే స్టేషన్ ఉజ్జయిని - భోపాల్ మార్గంలో ఉంది. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, కాన్పూర్, నాగ్‌పూర్, జమ్మూ, పూరి వంటి ప్రధాన నగరాలకు ఇక్కడి నుండి రైళ్లు ఉన్నాయి. సమీప విమానాశ్రయం భోపాల్‌లో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. Falling Rain Genomics, Inc - Sehore
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  3. "Sehore (District, Madhya Pradesh, India) - Population Statistics, Charts, Map and Location". www.citypopulation.de. Retrieved 7 September 2020.