Jump to content

శ్వాస

వికీపీడియా నుండి
మానవుడు శ్వాసించు వీడియో


శ్వాస అనేది ఊపిరితిత్తుల యొక్క లోపలికి, బయటికి గాలిని, లేదా మొప్పలు వంటి ఇతర శ్వాస అవయవాల ద్వారా ఆక్సిజన్ను తరలించే ఒక ప్రక్రియ. శ్వాసను ఆంగ్లంలో బ్రీతింగ్ అంటారు. శ్వాస అర్థం ఊపిరితిత్తులచే కార్బన్ డయాక్సైడ్ (CO2) తొలగించి, ఆక్సిజన్ తీసుకోవడం, శక్తి ఉత్పత్తికి గ్లూకోజ్ తో పాటు వాయువు అవసరం. జంతువులు గాలిని నోరు లేదా ముక్కు నుండి లోపలికి, బయటకు పోనిచ్చూ శ్వాసించడాన్ని లేదా ఊపిరిపీల్చుకోవడాన్ని శ్వాస అంటారు. శ్వాసించకుండా బ్రతకలేము. CO2 తొలగించడం తప్పనిసరి, ఎందుకనగా ఇది ఒక వ్యర్థ ఉత్పత్తి, CO2 అనేది చాలా ఎక్కువ విషపూరితమైనది. జీవులలోని ఊపిరితిత్తులలో ఉచ్చ్వాస, నిచ్వాస రెండూ జరుగుతుంటాయి, శ్వాసను వాయుప్రసారం అని కూడా అంటారు. జీవితం కొనసాగటానికి అవసరమైన శరీరధర్మ శ్వాసక్రియ యొక్క ఒక భాగం శ్వాస.