Jump to content

శ్రీరామకథ

వికీపీడియా నుండి
శ్రీరామకథ
(1969 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.పద్మనాభం
తారాగణం హరనాథ్,
శారద,
జయలలిత,
చిత్తూరు నాగయ్య,
పి.హేమలత,
నిర్మలమ్మ,
కె.మాలతి,
ముక్కామల,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
అంజలీ దేవి,
పద్మనాభం,
చంద్రమోహన్,
గీతాంజలి,
రేలంగి,
సూర్యకాంతం,
బాలకృష్ణ
సంగీతం ఎస్.పీ. కోదండపాణి
గీతరచన సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ మహా విష్ణు పిక్చర్స్
భాష తెలుగు
సినిమా నుండి కొన్ని సన్నివేశాలు

శ్రీరామకథ రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ హాస్యనటుడు, నిర్మాత బి.పద్మనాభం తొలిసారిగా దర్శకత్వం వహించి, తన తమ్ముడు బి.పురుషోత్తం నిర్మాతగా రూపొందించిన చిత్రం. ఈ శ్రీ రామకథ చిత్రంలో సీతారాములకు ఎందుకు వియోగం సంభవించిందన్న అంశం ప్రాథమికంగా పరిగణించి, దానికి కల్యాణం అంశం జోడింపుతో ప్రముఖ రచయిత వీటూరి కథ, మాటలు, పద్యాలు సమకూర్చాడు. ఈ చిత్రం 1969 జనవరి 1న విడుదలైంది.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సంగీతం: ఎస్‌.పి.కోదండపాణి
  • కళ: మాధవపెద్ది గోఖలే
  • ఛాయాగ్రహణం: సత్యనారాయణ
  • నృత్యం: వెంపటి సత్యం, పసుమర్తి, కె.ఎస్.రెడ్డి
  • కూర్పు: హరినారాయణ
  • నిర్మాత: బి.పురుషోత్తం
  • దర్శకత్వం: బి.పద్మనాభం

తారాగణం

[మార్చు]

నారదుడు (పద్మనాభం) శ్రీరామ కథా గానంలో శ్రీరామ జననం మొదలు సీతావియోగంతో తల్లడిల్లుతున్న రామునికి గతం గుర్తు చేయటంతో సినిమా మొదలవుతుంది. ఒకనాడు వైకుంఠం చేరిన నారదుడు, అక్కడ శ్రీహరిసహా బ్రహ్మాది దేవతలు రతీ మన్మథులను ఆరాధించటం గమనిస్తాడు. రక్తి గొప్పదా? భక్తి గొప్పదా? అని శ్రీహరిని ప్రశ్నించి వారిని, వారి ఆరాధనను విమర్శిస్తాడు. దీంతో మన్మథుడు నారదునిపై ఆగ్రహిస్తాడు. శ్రీహరి అనునయిస్తాడు. నారదుని ప్రోత్సాహంతో వైకుంఠం వచ్చిన భూదేవి, శ్రీహరి అనురాగం పొందిన శ్రీలక్ష్మిని (శారద) నిందిస్తుంది. దీంతో భూదేవి, శ్రీలక్ష్మిలు పరస్పరం ఆగ్రహానికి గురై ఒకరినొకరు శపించుకుంటారు. భూదేవిని రాక్షస కులంలో జన్మించమని శ్రీలక్ష్మి శపిస్తే, శ్రీలక్ష్మిని మానవకాంతగా జన్మించి రాక్షసులచే బాధలు పడమని భూదేవి (జయలలిత) శపిస్తుంది. వారిద్దరినీ శ్రీహరి అనునయించి భూదేవి భూలోకంలో తనకు శ్రీమతిగా జన్మించి తన అనురాగం పొందగలదని, శ్రీలక్ష్మి రామావతారంలో సీతగా తన అర్ధాంగి కాగలదని వరమిస్తాడు. ఆ ప్రకారం భూలోకంలో రాక్షసరాజు, విష్ణ్భుక్తుడైన మకరధ్వజుడు (గుమ్మడి) భవాని (అంజలి దేవి) దంపతులకు భూదేవి కుమార్తెగా జన్మిస్తుంది. భార్య గర్భవతిగా ఉన్నపుడు విష్ణు సాక్షాత్కారం కోసం తపస్సుకు వెళ్లిన మకరధ్వజుడు, కుమార్తె శ్రీమతికి (జయలలిత) 18 ఏళ్లు వచ్చిన తరువాత నిరాశతో తిరిగొస్తాడు. విష్ణుదర్శనం కాకపోవడంతో విష్ణుద్వేషిగా మారతాడు. తన భార్య, కుమార్తెల విష్ణు పూజను, రాజ్యంలోని దేవాలయాలు, ఋషుల పూజలను నిషేధిస్తాడు. శ్రీహరి ఆరాధకురాలైన తన కుమార్తెను ఆ ధ్యాసనుంచి మరల్చాలని గురువు ప్రగల్భాచార్యులు (రేలంగి), నాట్య గురువుగా వచ్చిన వల్లభాచార్యుల (హరనాథ్)ను నియమిస్తాడు. వల్లభాచార్యులుగా వచ్చిన శ్రీహరినే శ్రీమతి ఆరాధించటం, మకరధ్వజుని మేనల్లుడు ధూమ్రాక్షుని (ప్రభాకర్‌రెడ్డి) తిరస్కరించటం జరుగుతుంది. నారదుని మేనల్లుడు పర్వతుడు రాజేంద్రుడు (రామకృష్ణ), నారదుడు కూడా శ్రీమతిచే వరించాలనుకుంటారు. అందుకోసం -నారదుడు కోతిలా కనిపించాలని పర్వతుడు, పర్వతుడు గాడిదలా కనిపించాలని నారదుడు ఒకరికి తెలియకుండా మరొకరు శ్రీహరిని వేడుకుంటారు. అయితే స్వయంవరంలో శ్రీమతి శ్రీహరిని మాలవేసి వరిస్తుంది. అలా ఆకసానికెగిసిన శ్రీమతీ శ్రీహరిలను వెంబడించిన మకరధ్వజుడు విష్ణుస్తుతి చేస్తాడు. నారదుడు మాత్రం ఆగ్రహంతో శ్రీహరిని శపిస్తాడు. ఆ శాప ఫలం రామావతారంలో దక్కుతుందని శ్రీహరి శెలవివ్వడంతో చిత్రం ముగుస్తుంది[1].

పాటలు, పద్యాలు

[మార్చు]
  • రావేలా కరుణాలవాల దరిశెన మీయగ రావేలా నతజనపాల సుతగుణశీలా కమలాలోలా కాంచనచేలా - రచన: వీటూరి - సంగీతం: ఎస్.పి.కోదండపాణి - గానం: పి.సుశీల
  • ఒద్దికతో ఉన్నది చాలక (రచన వీటూరి, గానం: ఘంటసాల)
  • ఓం మదనాయ శృంగార (శ్లోకం గానం: ఎస్‌పి బాలు, ఎల్‌ఆర్ ఈశ్వరి బృందం)
  • చక్కనివాడు మాధవుడు (పద్యం గానం: పి సుశీల
  • టింగురంగా, నామోహనరంగా (గానం: పి సుశీల, పిఠాపురం, మాధవపెద్ది)
  • శౌరిపైగల నా ప్రేమ సత్యమేని ( పద్యం గానం: పి సుశీల)
  • యతోహస్తస్తతో దృష్టి, యతో దృష్టిస్తతో (శ్లోకం గానం: ఎస్‌పి బాలు, పి సుశీల)
  • శృంగార రస సందోహం (శ్లోకం గానం: ఎస్‌పి బాలు, పి సుశీల)
  • సర్వకళాసారము నాట్యము (గానం: పి సుశీల, ఎస్ జానకి)
  • చారూ చారు నా బంగారు చారు (రచన: అప్పలాచార్య, గానం: రేలంగి, తిలకం)
  • మాధవా, మాధవా నను లాలించరా, నీ లీలాకేళి (రచన: వీటూరి, గానం: పి సుశీల, ఘంటసాల).
  • రామకథ శ్రీరామకథ ఎన్నిసార్లు (సీనియర్ సముద్రాల రచిస్తే, ఎస్‌పి బాలు బృందం).
  • జయ జయ వైకుంఠ దామా (దండకం), ఘంటసాల , రచన:వీటూరీ

మూలాలు

[మార్చు]
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (29 December 2018). "ఫ్లాష్ బ్యాక్ @ 50 శ్రీరామకథ". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 25 ఫిబ్రవరి 2020. Retrieved 4 January 2019.

బయటి లింకులు

[మార్చు]