Jump to content

వెన్నుపూస

వికీపీడియా నుండి
వెన్నుపూస

మనుషుల వెన్నెముకలో 33 వెన్నుపూసలు (Vertebrae) శరీరం వెనకభాగంలో మెడనుండి పిరుదుల వరకు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి. వెన్నుపూసలను 'కశేరుకాలు' అని కూడా అంటారు.

వెన్నునొప్పి

[మార్చు]

ఎక్కువగా కంప్యూటర్‌పై పనిచేయడం, మితిమీరిన వాహన వినియోగం, వ్యాయామం చేయకపోవడం ,మారిన జీవనశైలి, ఇష్టం వచ్చినట్లు కుర్చీలు, సోఫాల్లో కూర్చొని టీవీలకు అతుక్కుపోవడం, కుర్చీ కదలకుండా విధులు నిర్వహించడం తదితర కారణాల వల్ల ఈ సమస్య తీవ్రమవుతోంది.

  • కుర్చీలో కూర్చునేటప్పుడు వెన్నుపూస వెనుక కుర్చీ భాగానికి ఆనించి ఉండాలి.
  • మెడ, నడుం వంచి ఎక్కువ సేపు పనిచేయకూడదు.
  • కంప్యూటర్‌ స్క్రీన్‌ తలకు తగినంత ఎత్తులో ఉండాలి.
  • సర్వైకల్‌ స్పాండిలైటీస్‌తో బాధపడుతున్నవారు సర్వైకల్‌ కాలర్‌, లంబార్‌ స్పాండిలైటీస్‌ ఉన్నవారు లంబార్‌ బెల్టు ఉపయోగించాలి.