Jump to content

వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 25

వికీపీడియా నుండి

పాత చర్చ 24 | పాత చర్చ 25 | పాత చర్చ 26

alt text=2013 అక్టోబరు 4 - 2013 అక్టోబరు 21 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2013 అక్టోబరు 4 - 2013 అక్టోబరు 21

తెవికీ దశవార్షికోత్సవ పండుగ చేసుకొనటానికి సూచనలు

[మార్చు]
దశమ వార్షికోత్సవాల గురించిన చర్చలు వికీపీడియా:దశాబ్ది ఉత్సవాలు పేజీలో చేయగలరు..విశ్వనాధ్ (చర్చ) 03:37, 10 అక్టోబర్ 2013 (UTC)

తెవికీ 10 డిసెంబరు 2013 న విజ్ఞాన సర్వస్వ నిర్మాణంలో పది సంవత్సరాలు పూర్తి చేసుకొనబోతున్నది. దీనిని సముచిత రీతిని ఆచరిస్తే బాగుంటుంది. సభ్యులు తమ సూచనలు ఒక వారం లోపు చర్చించమని కోరుతున్నాను--అర్జున (చర్చ) 04:53, 4 అక్టోబర్ 2013 (UTC)

  • మొదటి చర్చ తరువాత అనుకున్న అంశాలు:
    • దశవార్షికోత్సవ తేదీలు : డిసెంబర్ 14 & 15
    • వేదిక : IIIT RGUKT, Nuzvid/KBN college, Vijayawada/Siddartha college, Vijayawada
    • వారం-వారం వికీపీడియాలోని ఒక అంశంపై ప్రెస్ నోట్
    • తెవికీ పరిచయ పుస్తకం
    • తెవికీ ఆండ్రాయిడ్ ఆప్ ( సాధారణ వికీ ఆప్ కు తెలుగు రూపముండే తెరతో)
    • ప్రముఖ మ్యాగజైనులతో తెవికీ వ్యాసాలు కలిగిన సీడీ పంపిణీ చేయడం మరియు/లేక పాఠశాలలకు పంపిణి చేయడం
    • ఇతర ఉత్సవ కానుకలు(టీ షర్ట్, స్టికర్ మొ॥)

రహ్మానుద్దీన్ (చర్చ) 03:53, 6 అక్టోబర్ 2013 (UTC)

పై అంశాలు రహ్మనుద్దీన్, నేను ఇటీవల బెంగుళూరులో కలిసినప్పుడు అనుకున్నవి. ఈ రోజు సిఐఎస్ శిక్షణా శిబిరంలో కలిసిన కశ్యప్, ప్రణయ్, విష్ణు మరియు విశ్వనాధ్ తో కూడా ముచ్చటించాము. పై వాటిపై స్పందనలు మరిన్ని సలహాలు చేర్చండి.--అర్జున (చర్చ) 14:23, 6 అక్టోబర్ 2013 (UTC)
  • 6 అక్టోబర్ CIS లో జరిగిన చర్చల సారాంశం
  • కార్యక్రమం డిసెంబర్ 10 తరువాత జనవరి 2014 చివరివారం లోపు జరపాలని నిర్ణయించబడినది.
  • వేదిక నిర్ణయం అప్పటి పరిస్థితుల బట్టి నిర్ణయించబడును.
  • ప్రెస్ నోట్ సమిష్టి కృషితో రూపొందించాలి, వికీపీడియా మూసలో ఈ ప్రెస్ నోట్ రూపొందించబడును.
  • తెవికీ పరిచయ పుస్తకం ప్రెస్ నొట్ సంక్షిప్తంగా రూపొందించాలి...విశ్వనాధ్ (చర్చ) 03:54, 7 అక్టోబర్ 2013 (UTC)
వేదిక నిర్ణయం త్వరలో ఖరారు చేయటం మంచిది. ఎందుకంటే దూరప్రాంతాలనుండి వచ్చేవారికొరకు ఏర్పాట్లు చేయాలికదా.--అర్జున (చర్చ) 04:37, 8 అక్టోబర్ 2013 (UTC)
వాడుకరి:రహ్మానుద్దీన్ తెవికీ పరిచయపుస్తక అనువాదం వివరాలు తెలియపరిస్తే దానిని ఇతరులు సమీక్షించవచ్చు. --అర్జున (చర్చ) 04:38, 8 అక్టోబర్ 2013 (UTC)
దశమ వార్షికోత్సవాల గురించిన చర్చలు వికీపీడియా:దశాబ్ది ఉత్సవాలు పేజీలో చేయగలరు..విశ్వనాధ్ (చర్చ) 03:37, 10 అక్టోబర్ 2013 (UTC)

చర్చాపేజీలను సమర్ధవంతంగా వాడటం.

[మార్చు]

వ్యాసంపై చర్చించేటపుడు మీ వ్యాఖ్యని సంబంధిత వాడుకరుల దృష్టికి తీసుకెళటానికి ఆయా వాడుకరుల పేజీలను వ్యాఖ్యలో [[వాడుకరి:వాడుకరిపేరు]] వుటంకిస్తే వారికి సందేశం ఎకో వ్యవస్థ ద్వారా పంపబడుతుంది. వాడుకరి చర్చాపేజీలో ప్రత్యేకంగా వ్యాఖ్య రాయనవసరంలేదు. ఇది మరింత మంది దృష్టికి తీసుకువెళ్లాలంటే {{సహాయం కావాలి}} చేర్చితే ఆ పేజీ రచ్చబండలో సహకారం స్థితి పెట్టెలో సహాయంకోరుతున్న పసభ్యుల లేక పేజీల సంఖ్య ద్వారా తెలియచేయబడుతుంది. ఉదాహరణ. --అర్జున (చర్చ) 04:22, 8 అక్టోబర్ 2013 (UTC)

Echo సూచనల వ్యవస్థ వచ్చాక, కొన్ని విషయాలలో రెండు మెయిల్స్ వస్తున్నాయి(మెయిల్ అలెర్ట్ జతచేసినవి. ఉదాహరణకు వాడుకరి చర్చా పేజీలో కొత్త సందేశం). అందువలన అభిరుచులలో మెయిల్ అమరికలు మార్చి ఒకే మెయిల్ వచ్చేలా చూసుకోవటం సరి. ఆ మెయిల్ Echo నుండయినా లేక మీడియావికీ నుండయినా! రహ్మానుద్దీన్ (చర్చ) 04:27, 8 అక్టోబర్ 2013 (UTC)

Speak up about the trademark registration of the Community logo.

[మార్చు]

పాత్రికేయులపై వ్యాసాలకు వనరు

[మార్చు]

దస్త్రం:మన పాత్రికేయ వెలుగులు.pdf

పాత్రికేయులపై వ్యాసాలకు వనరు. రహ్మానుద్దీన్ (చర్చ) 02:41, 10 అక్టోబర్ 2013 (UTC)

రహ్మానుద్దీన్ గారు చేర్చిన ప్రతిపై కాపీరైటు హక్కులు వయోధిక పాత్రికేయ సంఘానికి చెందినవి. వారి నుండి CC-BY-SA అనుమతి తీసుకోకుండా ఇక్కడ చేర్చడం వికీనియమాలకు విరుద్ధం. కనుక రహ్మనుద్దీన్ దీనికి అనుమతి వుంటే దాని వివరాలు త్వరలో చేర్చవలసినదిగా కోరుచున్నాను. ప్రస్తుతానికి తొలగింపు మూస చేర్చబడుతున్నది--అర్జున (చర్చ) 03:13, 10 అక్టోబర్ 2013 (UTC)
  • రహ్మానుద్దీన్ ఈ ఫైలుతొలగింపుని రద్దుచేయడం మంచిది కాదు. నకలు హక్కుల సమస్య వున్నవి సత్వరంగా తొలగించాలి. లేకపోతే నకలుహక్కుల వుల్లంఘనని ప్రోత్సహించినట్లవుతుంది. అనుమతి వచ్చిన తరువాతనే ఇటువంటివి ప్రవేశపెట్టండి. --అర్జున (చర్చ) 05:11, 12 అక్టోబర్ 2013 (UTC)
మన పాత్రికేయ వెలుగులు
--రహ్మానుద్దీన్ తాజాగా చేర్చబడిన లింకు చర్చలో సరియైన స్థానానికి అర్జున మార్చారు. --అర్జున (చర్చ) 06:41, 18 అక్టోబర్ 2013 (UTC)

తెలుగు వికీపీడియా లోగో ప్రతిపాదన

[మార్చు]

మిత్రులందరూ చెప్పిన విధంగా మార్పులు చేసాను. ఆదివారం సాయంత్రానికి ఇంకా ఏమయినా మార్పులుంటే చెప్పగలరు. చర్చని ప్రతిపాదనలు ట్యాబ్ లో కొనసాగించగలరు ఇక్కడ.రహ్మానుద్దీన్ (చర్చ) 18:27, 11 అక్టోబర్ 2013 (UTC)

వ్యాసాలకు ఆంగ్ల పేరులు మరియు వాటికి దారి మళ్లింపులు

[మార్చు]

వాడుకరి:YVSREDDYగారు ఇటీవల చాలా గ్రామాలు, పట్టణాల పేర్లకు వ్యాసాలను ఆంగ్ల భాషలో కొత్త వ్యాసం మొదలుపెట్టి దానిని సంబంధిత తెలుగు వ్యాసానికి దారి మళ్ళింపు చేయటం గమనించాను. వారి స్పందన ప్రకారం, ఈ పద్ధతి కొన్ని భారతీయ భాషల వికీపీడియాలలో వాడుతున్నారట. కొంతమంది నిర్వాహకులు దీనికి మద్ధతు తెలిపారట. నాకు తెలిసితెవికీలో తెలుగు సంప్రదాయం ప్రకారం ఆంగ్లపేరులు వ్యాసాలకి వాడడంలేదు. ఈ విషయంపై ఏకాభిప్రాయ సాధనకి చర్చ ప్రారంభిస్తున్నాను.--అర్జున (చర్చ) 06:31, 13 అక్టోబర్ 2013 (UTC)

రెడ్డిగారి వాదన (ఆయన చర్చాపేజీనుండి)

ఆంగ్ల వికీపీడియాలో కూడా కొన్ని ముఖ్యమైన ఇతర భాషలలో వెతికినచో మనం ఆ పేజీకి చేరుకోగలుగుతున్నాము, ఉదాహరణకు ఆంగ్ల వికీపీడియాలో कृष्ण అని హిందీలో టైప్ చేసి వెతికితే Krishna పేజీకి చేరుకుంటున్నాము. అలాగే అనేక ఇతర భాషలలో ఆంగ్ల పేరులతో దారిమార్పులు ఇస్తున్నారు, ఉదాహరణకు Bangalore అని కన్నడ వికీపీడియాలో ఆంగ్లంలో టైప్ చేసి వెతికితే ಬೆಂಗಳೂರು పేజీకి చేరుకుంటున్నాము --YVSREDDY (చర్చ) 06:17, 13 అక్టోబర్ 2013 (UTC)

తెలుగు వ్యాసాలకు ఆంగ్ల పేర్లతో దారి మార్పులు ఏర్పాటు చేయటం సమంజసమే. ఈ విధంగా దారిమార్పుల సృష్టిని నేను సమ్ర్ధిస్తున్నాను కూడా. ఇందుకు గల కారణాలు :
  1. వికీపీడియాను వాడేందుకు మొదటిసారి వచ్చేవారు ఆంగ్లంలోనే వెతుకుతారన్నది గమనించాలి
  2. ఇంతకు ముందు శోధనపెట్టె అప్రమేయంగా తెలుగు లిప్యంతరీకరణతో ఉండేది. ఇప్పుడు అలా లేదు, అప్రమేయంగా ఆంగ్లమే వస్తుంది. అందువలన వ్యాసం ఆంగ్ల పేరుతో లేకపోతే, ఏమీ లేదు అన్న భావనకు వాదుకరులు రావచ్చు.
  3. దారిమార్పుల వలన వచ్చిన నష్టాలేమితో తెలియపరచగలరు. ఈ ఒక్క లాభం వలన ఆంగ్ల సెర్చ్ ఇంజన్లలో కూడా తెలుగు వికీపీడియా పేజీలు కనిపించే అవకాశం ఉంది.
  4. తెలుగు టైపు తెలీని త్లుగు వాడుకరులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

రహ్మానుద్దీన్ (చర్చ) 10:52, 13 అక్టోబర్ 2013 (UTC)

  • మరో రెండు పైసలు :
  1. వికీదశాబ్ది వేడుకల సందర్భంగా తెలుగుపేజీలకు ఫేస్బుక్ లాంటి చోట్ల యూఆరెల్ రాయాల్సి వచ్చినపుడు అది చాలా పొడవుగా, అర్ధరహితంగా ఉందనీ; తమిళ వికీ తరహాలో చిట్టి యూఆరెల్ వాడదామని సూచించినపుడు ఎవరూ ఆసక్తి చూపలేదు-వీవెన్ గారిచ్చిన సూచన - ఆ చిట్టియూఆరెల్ ను గుర్తు పెట్టుకోడం కష్టమని. ఇప్పుడు ఆంగ్ల దారిమార్పులు వాడటం ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుంది - ఉదాహరణకు: te.wikipedia.org/wiki/hyderabad, హైదరాబాదు పేజీకు వెళుతుంది. ఇది ఒక అర్ధవంతమయిన చిట్టియూఆరెల్ . ఉదాహరణకు చూడండి : https://te.wikipedia.org/wiki/%E0%B0%B9%E0%B1%88%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%81

ఈ లింకు తెలుగు హైదరాబాదును యూఆరెల్ లో ఉంచినపుడు వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవడం కన్నా te.wikipedia.org/wiki/hyderabad అన్నది వాడటం మొదలుపెడితే ఎంతోకొంత వ్యాప్తి పెరగవచ్చు.

  1. అయితే ప్రతి వ్యాసానికి ఇది అనివార్యం కాదు, వెబ్ లో పంచుకునే పేజీలకు, అలానే సాధారణ జనం వెతికే పదాల కోసం ఇది ముందు పూర్తి చేయటం మేలు.

రహ్మానుద్దీన్ (చర్చ) 10:57, 13 అక్టోబర్ 2013 (UTC)

  • తెలుగు వ్యాసాలకు దారి మారులు చేయడం అనేదానికి నేను వ్యతిరేకం కాదు, కాని తెలుగులో ఉన్న అన్ని వ్యాసాలకూ దారి మార్పు అవసరం లేదని నా వాదన. దానిని గురించి రెడ్డి గారి పేజీలో ( రెడ్డి గారూ మీరు అన్ని వ్యాసాలకూ దారి మార్పులు చేస్తున్నారు. అన్నిటికీ అవసరం లేదు ప్రస్తుతం ముఖ్యమైన వ్యాసాలుగా ఉన్న కొన్ని వర్గాలలోని వాటిని మాత్రమే చేయండి. నేను ప్రణయ్ అలాటివి మొదలు పెట్టడానికి కారణం కొందరు కొత్త వారు సెర్చ్ ఇంజిన్లలో ఆంగ్లంలోనే టైపు చేసి వెతుకుతారు కనుక, ముఖ్యమైన వర్గాలలోని కొన్ని వ్యాసాలకు మాత్రమే పరిమితం చేసే ఉద్దేశ్యంతో. కనుక మీరు ఇలాంటి సుప్రసిద్ధ ఆంధ్రులు-జాబితా, తెలుగు కవులు, రచయితలు, తెలుగు రాజకీయ ప్రముఖులు, వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు ప్రముఖులు, ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ మండలాలు వంటి వాటినుండి ముఖ్యమైన వాటిని తీసుకొని వాటిని రీడైరెక్ట్ చేయండి...మీరు మరిన్ని మార్పులు చేయాలనుకుంటే ఇవి ఎడమవైపున సూచీలోని ప్రత్యేక పేజీలు చూడండి. మరొక విన్నపం కొన్ని వ్యాసాలకు పేరులో మర్పులుండవచ్చు. వాటిని కొద్దిగా గమనించండి.ఊదాహరణకు తిరుపతికి thi, ti రెండూ ఉంటాయి కనుక అలాంటివి చేసేటపుడు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి) అని రాయడం జరిగింది. ప్రస్తుతం మారుమూల గ్రామాల పేజీలు వంటివి రీడైక్ట్ చేసినా వాటి వలన ఎక్కువ ఉపయోగం ఉందదని, ముఖ్యమైన పేజీలను చేయడం ద్వారా త్వరగా పాఠకులను తెవికీ వైపుకు మరల్చవచ్చునని నా అభిప్రాయం...విశ్వనాధ్ (చర్చ) 13:30, 13 అక్టోబర్ 2013 (UTC)
  • విధానంలో స్పష్టత లేకపోతే సమస్యలేర్పడతాయనటానికి ఇది ఒక ఉదాహరణ. ఇంతకు ముందు ప్రముఖ వ్యక్తులు (పాతలింకు) గురించి చర్చలుచేసి విధానం చేయకుండానే ఆగిపోయాము. రహ్మనుద్దీన్ స్పందనకు ప్రతిస్పందన. సాధారణంగా దారిమార్పులు ఒక వ్యాసానికి ఒకే భాషలో ఒకటి కన్నా ఎక్కువపేర్లతో చేరుకోవటానికి వాడుతాము. బెజవాడ, విజయవాడ లాగా. ఇంకొక భాషకు దారిమార్పు పెట్టుకోవడం నా దృష్టిలో మంచిపద్ధతికాదు. 1. వికీపీడియాను వాడేందుకు మొదటిసారి వచ్చేవారు ఆంగ్లంలోనే వెతుకుతారన్నది గమనించాలి : వికీపీడియా వ్యాసాలు చదివేవారు సుమారు 70శాతం పైగా గూగుల్ శోధన లింకులను పట్టుకొని వస్తారు. అందుకనే గూగుల్ అనువాద ప్రణాళిక ద్వారా 1000 వ్యాసాలు చేర్చింది. నేరుగా వికీపీడియాలో వెతకటం చాలా తక్కువ అన్నది నా అనుభవం. 2. ఇంతకు ముందు శోధనపెట్టె అప్రమేయంగా తెలుగు లిప్యంతరీకరణతో ఉండేది. ఇప్పుడు అలా లేదు, అప్రమేయంగా ఆంగ్లమే వస్తుంది. అందువలన వ్యాసం ఆంగ్ల పేరుతో లేకపోతే, ఏమీ లేదు అన్న భావనకు వాదుకరులు రావచ్చు: దీనికొరకు ఒక బగ్ నివేదిస్తే సరిపోతుంది. 3. దారిమార్పుల వలన వచ్చిన నష్టాలేమితో తెలియపరచగలరు. ఈ ఒక్క లాభం వలన ఆంగ్ల సెర్చ్ ఇంజన్లలో కూడా తెలుగు వికీపీడియా పేజీలు కనిపించే అవకాశం ఉంది.: తెవికీలో తెలుగు ప్రముఖంగా కనబడాలి అన్నది నా వుద్దేశ్యం. ప్రతి పేజీకి ఆంగ్లలింకు వుంటే అది ఏమంత బాగుంటుంది. ఇదే పద్ధతి అనుకొని ముందు ముందు ఆంగ్లపేరు దారి మళ్లింపు చేసే పద్ధతి విధానమైపోవొచ్చు. సెర్చ్ ఇంజన్లు ఇప్పటికే అభివృద్ధి చెంది తెలుగులో పనిచేస్తున్నాయి. భారతదేశం లో వాడేవారికి గూగుల్ పేజీపై తెలుగు స్పష్టంగా కనిపిస్తుంది. కుతూహలంకొద్ది దాని పై క్లిక్ చేసినా లిప్యంతరీకరణతో తెలుగు టైపవుతుంది. ఫలితాలు కనబడతాయి. సెర్చ్ ఇంజన్ ఫలితాల మొదటి తెరలో కనబడాలంటే ఒక ఆంగ్లపదం వుంటే సరిపోదు అని నా అభిప్రాయం. 4.తెలుగు టైపు తెలీని తెలుగు వాడుకరులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది: పై వరుసలలో దీనికి సమాధానమిచ్చాను. ఇంకా 5.చిట్టి యూఆర్ఎల్: ఆయాచితంగా పనిచేసే చిట్టి యూఆర్ఎల్ లు మన పెద్ద లింకుని చిట్టిలింకుగా మారుస్తున్నాయి. అలగే హెచ్టిఎమ్ఎల్ సర్వసాధారణమైన ఈమెయిల్ లో దీనిని నేపధ్యానికి మార్చకలుగుతున్నాము. దీనికొరకు మనం దారి మార్పులు పెట్టవలసినపనిలేదు.--అర్జున (చర్చ) 04:59, 15 అక్టోబర్ 2013 (UTC)
  • అర్జున గారూ, మీరీ విషయంలో కేవలం పర్యవేక్షకుడిగా, పరిశీలకుడిగా ఉంటానన్నారు. మీ సొంత అభిప్రాయాలను ఎందుకు రుద్దాలనుకుంటున్నారు? మీరిచ్చిన వాదనలలో ఏ ఒక్కటీ సరిగా నాకు సమాధానం ఇవ్వలేదు. నేను ఈ విషయంలో మీతో ఏ మాత్రమూ ఏకీభవించలెకపోతున్నాను. రహ్మానుద్దీన్ (చర్చ) 05:07, 15 అక్టోబర్ 2013 (UTC)
  • నా వుద్దేశం అదే అయినా స్పందనలు లేకపోతే నేను చెప్పాల్సినవి చెప్పాలి కదా. అయినా నా వాదనే గెలవాలనే పట్టేమి లేదు. మీరు విభేధించాల్సిన విషయాలను నిస్సంకోచంగా చేర్చండి. --అర్జున (చర్చ) 05:17, 15 అక్టోబర్ 2013 (UTC)
వాడుకరి:రహ్మానుద్దీన్ గారు చెప్పినట్లు ఆంగ్లపేర్లతో దారిమార్పులు ఉంచవచ్చు, వారు చెప్పినట్లు దీన్ని విశేషవ్యాసాలకు మరియు పాఠకాదరణ పొందిన వ్యాసాలకే పరిమితం చేయాలి. చిన్నవ్యాసాలకు, మండల వ్యాసాలకు, సినిమా పేజీలకు అవసరం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:44, 18 అక్టోబర్ 2013 (UTC)
  • తెవికీలో ఇదివరకు ఇలాంటి పని కొన్నాళ్ళు కొనసాగించాము. కానీ అలాచేయటం మానేశాం. ఎందుకంటే కొన్ని కారణాలున్నాయి. మొబైల్ కంప్యూటింగుతో ఈ సమస్య మళ్ళీ ఎదురైనట్టుంది. నేనూ చంద్రకాంతరావు గారిలా పరిమితవాడకం వైపు మొగ్గుచూపిస్తున్నాను. --వైజాసత్య (చర్చ) 08:15, 19 అక్టోబర్ 2013 (UTC)
  • పాత లింకులేమైనా తెలియచేయండి. అలాగే నా స్పందనకు వివరాలతో కూడిన ప్రతిస్పందనకూడా అందరికీ ఉపయోగంగా వుంటుంది. లేకపోతే ఎవరి వ్యక్తిగత అభిరుచులతో వారు చేసే మార్పులు తెవికీ అభివృద్ధికి ఇబ్బంది కలిగిస్తాయి. --అర్జున (చర్చ) 10:48, 19 అక్టోబర్ 2013 (UTC)
  • ఇదిగో ఇలానే చాలామంది తెలుగులో వెతకరు, ఆంగ్లంలో వెతుకుతారు, ఆంగ్ల వ్యాసం పేర్లతో దారిమార్పులుంటే బాగుంటుందని ఇతర భాషల వికీలని చూసి కొత్తలో కొంతకాలం అలాంటివి చేశాం. కానీ పద్ధతి ఊపందుకోలేదు. అప్పట్లో వికీలో నేరుగా తెలుగులో టైపుచేసే పద్ధతి లేదని గమనించాలి. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్లంతా ఆంగ్లంలో వ్రాసేవాళ్ళు. కానీ నేరుగా తెలుగులో టైపుచేసే పద్ధతి వచ్చి, అంతర్జాలంలో తెలుగు గురించి అవగాహన పెరిగి ఆ పరిస్థితి గణనీయంగా మారింది. ఇప్పుడు ఆంగ్లంలో లింకులను కాస్త కూలంకషంగా పరిశీలించాలి. మరీ అవసరమైతే తప్ప, అనవసరంగా తెలుగు వికీలో ఆంగ్లాన్ని పెంచడం ఎందుకు? ఈ విషయాన్ని మరింతగా తెలుసుకునే దిశగా కొన్ని ప్రశ్నలు. మొబైల్లో తెలుగు టైపు చేసే సదుపాయం లేని వాళ్ళు తెలుగు వికీపీడియా చూస్తారంటారా? అలాంటి ఉపకరణాల్లో తెలుగు సరిగా కనిపిస్తుందా? దారిమార్పు పేజీలను గూగుల్ శోధనలో చూపిస్తుందా? చూపించకపోతే ఇది కేవలం వికీపీడియాలో వెతికే సౌలభ్యంకోసమేనా? ఆంగ్ల దారిమార్పులు ఉండటం వలన వికీలో మనం ఊహించని నష్టాలేమైనా ఉన్నాయా? --వైజాసత్య (చర్చ) 08:40, 20 అక్టోబర్ 2013 (UTC)
  • ఏ ప్రతిపాదననైనా ఇలా అన్ని రకాల నుంచి ఆలోచించడం వ్యవస్థకు చాలా మేలుచేస్తుంది. సభ్యుల వ్యాఖ్యలపై స్పందించేవారు కూడా ప్రతివాక్యాన్ని బాగా ఆలోచించి గత చర్చలను గుర్తుంచుకొని, భవిష్యత్తులో జరుగబోయే పరిణామాలను సాధ్యమైనంతవరకు ఊహిస్తూ, అందరికీ ఉపయోగపడే విధంగా ప్రతిస్పందించినప్పుడు, ఆ ప్రతిస్పందన చర్చలో పాల్గొన్నవారికే కాకుండా మిగుతా సభ్యులకు మరియు భావితరాల సభ్యులకూ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఉదా:కు చిట్టి యూఆరెల్‌పై అర్జునరావు గారిచ్చిన సమాధానానికి బదులు నేనైతే https://te.wikipedia.org/wiki/హైదరాబాదు వాడవచ్చని చెప్పేవాడిని. అలాగే ఆంగ్ల పదాల సెర్చింజన్లలో తెవికీ వ్యాసాలు రావాలంటే వ్యాసంలో ఆంగ్లపేరు ఇస్తే సరిపోతుందని చెప్పేవాడిని (ఉదా:గద్వాల). ఈవిషయం నేను ఆరేళ్ళ క్రితమే వ్యాఖ్యానించాను. మరోముఖ్యమైన విషయమేమిటంటే ఎన్ని దారిమార్పులున్ననూ మొదటపేజీ నుంచి సరైన వర్గీకరణే ముఖ్యం. ఆంగ్లపేరుతో దారిమార్పులు వ్యాసాలకు చేయడం కన్నా వర్గాలకు చేయడం పాఠకులకు మరింత ఉపయోగకరమని నా భావన. (అన్నింటికికాదు, ముఖ్యమైన వాటికి మాత్రమే) ఉదా:కు india టైపు చేయగానే భారతదేశం వర్గానికి చేరుకుంటారు. అక్కడి నుంచి లింకులద్వారా దేశమంతటా పర్యటించవచ్చు. భారతదేశం వ్యాసం నుంచి కూడా మూసలు, వర్గాలుంటాయి కాని కొత్తవారికి వాటిని ఎలా ఉపయోగించాలో తెలియకపోవచ్చు. ఇక చివరగా వైజాసత్యగారు అనుమానం వ్యక్తం చేసినట్లు దారిమార్పుల వల్ల ఊహించని నష్టాలున్నట్లు నా దృష్టికి రాలేదు. కాని నష్టాలేమీ లేవని అతిగా ఉపయోగిస్తే మాత్రం సమస్య జటిలమౌతుంది. కాబట్టి ఏయే వ్యాసాలకు ఆంగ్ల దారిమార్పులు ఉండాలనేది చర్చించి నియమం ఏర్పర్చుకుంటే సమస్య సుఖాంతమౌతుంది. భవిష్యత్తులోనూ వివాదాలుండవు. సి. చంద్ర కాంత రావు- చర్చ 10:00, 20 అక్టోబర్ 2013 (UTC)
  • వైజాసత్య , సి. చంద్ర కాంత రావు ల వివరణాత్మకమైన స్పందనలకి ధన్యవాదాలు. నేను మర్చిపోయిన మరొక్క సంగతి సాధారణంగా అంతర్జాలానికి, వికీకి హైపర్ లింకే పట్టుకొమ్మ. మన వికీలో అవి చాలా కనిపిస్తాయి. అవి సరిపోనపుడు, క్రిందనున్న వర్గాలు, మొదటి పేజీలో కనబడి మార్గదర్శిని నుండి కూడా చదువరులు తమకు కావలసిన దానికి చేరుకోవచ్చు. విహరిణి లో తెలుగుని ప్రాధాన్యతగా పెట్టుకుంటే గూగుల్ లో ఆంగ్లంలో టైపు చేసిన తెలుగు పదాల సలహాలు కనబడుతుంటాయి. మనం ఈ చిట్కాని ప్రముఖంగా కొన్నాళ్లు ప్రదర్శించి కొత్తవారు వాడే పేజీలలో ప్రధానంగా కనబడేటట్లు చేస్తే సరిపోతుంది. తెవికీ దశాబ్ది రాబోతున్న తరుణంలో, ఆండ్రాయిడ్ ద్వారా మొబైల్ ఫోన్లల గత మూడేళ్లుగా తెలుగు కనబడుతున్నప్పుడు పరిమితిగా వేరే భాషలో దారిమార్పులు అవసరంలేదని నా సూచన.--అర్జున (చర్చ) 05:39, 21 అక్టోబర్ 2013 (UTC)
  • వైజాసత్య , సి. చంద్ర కాంత రావు మరియు అర్జున గారూ, దయచేసి ఏ విధంగా ఈ విషయాన్ని విశ్లేషించినదీ తెలుపగలరు. ఆంగ్ల దారిమార్పులు ఉండలన్న విషయం కొందరు స్నేహితులను అప్రమేయంగా తెవికీలో వ్యాసాలు ఉన్నాయి చూడమన్నపుడు వారు చేసిన ప్రయోగాలననుసరించి మాత్రమే ఇది చెస్తున్నాను. ఇలాంటి ప్రయోగం ఏ-ఏ వ్యాసాలకు చేయాలో అర్జున గారు సూచిస్తె బాగుంటుంది. కానీ ఇది అస్సలు అవసరం లేదు అని మాత్రం అనలేము. ఒక రెణ్ణెల్ల పాటూ ఇది ఆడించి, పేజీ సందర్శనల్లో ఏమయినా మార్పులు వస్తాయేమో చూసి అప్పుడు నిర్ణయించవచ్చు ఆరు సంవత్సరాల మునుపుకీ నేటికీ వాదుకరుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రహ్మానుద్దీన్ (చర్చ) 13:45, 24 అక్టోబర్ 2013 (UTC)
  • నేను ఆంగ్ల పేరుతో దారిమార్పులకై పరిమిత వాడకం వైపు మొగ్గుచూపాను. వైజాసత్యగారు కూడా ఇదే అభిప్రాయం చెప్పారు. అంతకు క్రితమే మీరూ అదే మాట చెప్పారు. అర్జునరావు గారు మాత్రం ఇలా చేసే అవసరం లేదంటున్నారు. నేను దారిమార్పులపై విశ్లేషించిననూ వివరంగా మాత్రం పైన తెలుపలేను. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:06, 24 అక్టోబర్ 2013 (UTC)
  • వైజాసత్యగారిది, రహ్మనుద్దీన్ గారి అనుభవాలు స్నేహితుల మాటలపై ఆధారపడినవే. నేను చెప్పిన వాటికి అవసరమైన చోట్ల దృష్టాంతాలు ఇవ్వగలను. వికీపేజీకి వెళ్లడంలో గూగుల్ ప్రాధాన్యత , ఏప్రిల్ 2011లో మొబైల్ మొదటి పేజీలాంటివి. ఇంకా పేజీవీక్షణలవిశ్లేషణకు కొన్ని ప్రతిబంధకాలు వుంటాయి. దారిమార్పు పేజీ వేరేగా వీక్షణ అభ్యర్ధనలలో నమోదవుతుంది. ఇప్పటికే చాలా దారిమార్పులున్నాయన్నారు కాబట్టి ఇంకా కొత్త వి చేర్చకుండా కావాలంటే తగిన విశ్లేషణ( ఉదాహరణ లింకు ) గణాంకాల ద్వారా బలమైన ఆధారందొరికితే ముందుకుపోవడం మంచిది. అలాంటిది చేయాలనుకుంటే కొంత నియమిత కాలం వేచిచూడవచ్చు. --అర్జున (చర్చ) 16:28, 24 అక్టోబర్ 2013 (UTC)

వికీస్థల ప్రకటనల చర్చలో పాల్గొనండి

[మార్చు]

మీడియావికీ_చర్చ:Sitenotice#ప్రకటనలను అవసరమైనంతవరకే వాడదాం లో మీ స్పందనలు తెలియచేయండి. దీనిలో సహాయంకావాలి మూస చేర్చినా కూడా క్రియాశీల సభ్యులందరు సహకారస్థితి పెట్టెలో సూచికను పట్టించుకోనందున, రచ్చబండలో వ్యాఖ్య రాస్తున్నాను.--అర్జున (చర్చ) 05:15, 14 అక్టోబర్ 2013 (UTC)

కాపీరైట్ల విషయంలో అప్రమత్తత

[మార్చు]

తెవికీ అభివృద్ధి చెందేకొలది, కాపీరైట్ల విషయంలో అప్రమత్తతగా వుండవలసిన అవసరంవుంది. ఇంతకు ముందు కొన్ని వ్యాసాలగురించే అప్పుడప్పుడు చర్చలు చేసేవాళ్లం. ఇక బొమ్మలు గురించి కూడా చర్చించాలి. అందుకు వుపయోగకరమైన వ్యాసాలను, మూసలను నేను ఆంగ్ల వికీనుండి దిగుమతి చేశాను. ప్రయోగాత్మకంగా వాడడం మొదలుపెట్టాను. తెవికీలో వీటిని వాడడానికి భిన్నాభిప్రాయాలేమైనా వుంటే తెలియచేయండి. ఇటీవలి శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు వాడుకరి:Pranayraj1985, వాడుకరి:Kasyap మరియు వాడుకరి:విశ్వనాధ్.బి.కె. దీనిలో చురుకుగా పాల్గొనాలని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 12:06, 14 అక్టోబర్ 2013 (UTC)

ఈ విషయంలో నేను కొత్తలో సమాచారం ఇవ్వలేదుకాబట్టి నేను చేర్చిన బొమ్మలకు కావలసిన సమాచారం చేరుస్తున్నాను. (ఉదా:దస్త్రం:Teluguacademy-bw.gif చూడండి. సభ్యులందరు వారు ఎక్కించిన బొమ్మలకు ఇటువంటి సమాచారం చేర్చవలసినదిగా కోరుచున్నాను. --అర్జున (చర్చ) 05:15, 16 అక్టోబర్ 2013 (UTC)
ఎక్కించిన బొమ్మలు చూడడానికి మీ వాడుకరి పేజీకి వెళ్లి ఆ తరువాత ప్రక్కపట్టీలో వాడుకరి రచనలు ఎంపిక చేసిఆతరువాత ఎక్కింపులు ఎంపికచేసుకుంటే మీ బొమ్మలన్నీ కనబడతాయి. వేరే విధంగా గ్యాలరీ ఉపకరణం ఉపయోగంగా వుంటుంది.--అర్జున (చర్చ) 05:30, 16 అక్టోబర్ 2013 (UTC)
మీరు చేర్చిన బొమ్మలకు నకలుహక్కులు మార్చవలసివుండి చాలా బొమ్మలకు మార్పుచేయవలసివస్తే బాట్ తో మార్చటానికి సహాయం కోరండి. --అర్జున (చర్చ) 05:44, 16 అక్టోబర్ 2013 (UTC)
బాట్ తో అంత వీలవని పని అని తెలిసింది. నా బొమ్మల లైసెన్స్ లను మెరుగుపరుస్తూ నాకు కనబడిన సమస్యాత్మక బొమ్మలకు హెచ్చరికి మూసలు పెడుతున్నాను. అలా హెచ్చరిక ప్రకటనలు అందినవారు కంగారు పడనవసరంలేదు. దానిలో తెలిపినట్లు చేస్తే సరిపోతుంది. నా ఇటీవలి బొమ్మల మార్పులు ఉపయోగంగా వుండవచ్చు, కొన్ని చూడండి. (ఉదా1), ఉదా2), మన తెవికీని సిడిగా తేవాలంటే బొమ్మలవాడుక షరతులపై స్పష్టత వుండాలి, ఐదారేళ్ల క్రిందట ఈ దిశగా ప్రారంభమైన పని మరల మొదలెట్టాలనమాట. లైసెన్స్ లలో రక రకాలు వుంటాయి. మీ పుస్తకంలో కొంత భాగాన్ని పూర్తిగా వేరే వాళ్లువాడితే మీకు గుర్తింపు కావాలంటే CC-BY-3.0 లేక 2.5 లాంటివి వాడొచ్చు. ఏమైనా మార్పులు చేస్తే ఇదే తరహాషరతులు వుండాలంటే CC-BY-SA లైసెన్స్ వాడాలి. గుర్తింపు కూడా అవసరంలేదంటే CC-0 వాడాలి. CC-BY-SAకి ఉదాహరణగా దస్త్రం:విశాలంధ్ర గ్రంధాలయం..jpgచూడండి. సాధారణ సందేహాలుంటే ఈ విభాగంలో రాయండి. బొమ్మకి సంబంధించి ప్రత్యేకంగా చర్చించాలంటే ఆ బొమ్మ చర్చాపేజీ వాడండి.--అర్జున (చర్చ) 10:45, 19 అక్టోబర్ 2013 (UTC)
నా బొమ్మలను తనిఖీ చేసి లైసెన్స్ లు సవరించడం,అవసరమైన మూసలు చేర్చడం చేశాను. నిర్వాహకులను తనిఖీచేసి ధృవీకరించమని కోరాను. అలాగే సహ నిర్వాహకులు, అధికారులకు బొమ్మలు గురించి కొత్తగా అందుబాటులోకి వచ్చిన మూసలగురించి తెలియడానికి బొమ్మల నకలుహక్కులు హెచ్చరికలు మచ్చుకి పెట్టాను. పాఠ్యంతో పాటు బొమ్మల నాణ్యత పెరిగితేనే తెవికీ నాణ్యత మెరుగవుతుంది. అందుచేత ఎవరికి వారు వారెక్కించిన బొమ్మలను తనిఖీచేసి తగువిధంగా చర్చలు చేపట్టి అలాగే తోటి సభ్యుల బొమ్మలకు తనిఖీచేయడానికి తోడ్పడాలని కోరుతున్నాను. సదరు వ్యాసాలు (తెలుగులో కొద్దిగా, ఆంగ్లంలో విస్తారంగా) చదివి నకలుహక్కులపై కొంత అవగాహనను పెంచుకొని మాత్రమే ఇతరుల బొమ్మల తనిఖీలో పాల్గొంటే మంచిది. --అర్జున (చర్చ) 14:01, 21 అక్టోబర్ 2013 (UTC)