Jump to content

విండోస్

వికీపీడియా నుండి

మైక్రోసాఫ్ట్ విండోస్
అభివృద్ధికారులుమైక్రోసాఫ్ట్
ప్రోగ్రామింగ్ భాషC, C++, అసెంబ్లీ[1]
పనిచేయు స్థితివిపణి లో అందుబాటు
మూల కోడ్ విధానంరహస్యం / భాగస్వామ్యం
తొలి విడుదలనవంబరు 20, 1985; 39 సంవత్సరాల క్రితం (1985-11-20), as విండోస్ 1.0
Marketing targetవ్యక్తిగత కంప్యూటర్ సాఫ్ట్ వేర్
విడుదలైన భాషలు137 బాషలు [2]
తాజా చేయువిధము
ప్యాకేజీ మేనేజర్Windows Installer (.msi), Windows Store (.appx)[3]
ప్లాట్ ఫారములుARM, 32 బిట్, ఐటానియం, 64 బిట్, డీ.ఈ.సీ ఆల్ఫా, MIPS, పవర్ పీ.సి
Kernel విధము
  • విండోస్ ఎన్.టీ : హైబ్రిడ్ కెర్నల్
  • విండోస్ 98, పూర్వం : మోనోలిథిక్ కెర్నల్ (MS-DOS)
అప్రమేయ అంతర్వర్తివిండోస్ షెల్
లైెసెన్స్ఉచితం కానిది కమర్షియల్ సాఫ్ట్ వేర్

మైక్రోసాఫ్ట్ విండోస్ ( విండోస్ ) అనేది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ సంపుటి. వీటిని అభివృద్ధి చేసి, మార్కెటింగ్, అమ్మకం చేపడతారు.

ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో చాలా రకాలు ఉన్నాయి, ఒక్కొక్క రకం ఒక్కో రంగానికి అనుగుణంగా అభివృద్ధి చేసినవి. ప్రస్తుతం విండోస్ లో విండోస్ ఎన్.టీ, విండోస్ ఎంబెడెడ్, విండోస్ ఫోన్ అనే రకాలు అందుబాటులో ఉన్నాయి, ఇందులో మళ్లీ  వివిధ రకాలు ఉన్నాయి ఉ. విండోస్ ఎంబెడెడ్ కాంపాక్ట్ (విండోస్ CE) లేదా విండోస్ సర్వర్.  విండోస్ 9x (95,98,ME), విండోస్ మొబైల్ వాడుకలోలేని విండోస్ రకాలు.

1985 నవంబరు 20 లో మైక్రోసాఫ్ట్, అప్పటి మార్కెట్ డిమాండ్ కి అనుగుణంగా విండోస్ ని విపణిలో విడుదల చేసారు. విండోస్ ని అప్పట్లో మైక్రోసాఫ్ట్ యొక్క MS-DOS ఆపరేటింగ్ సిస్టం మీద ఆధారపడిన ఒక GUI ఆపరేటింగ్ సిస్టంగా అభివృద్ధి చేసారు.

అప్పట్లో విండోస్, కంప్యూటర్ సాఫ్ట్ వేర్ మార్కెట్ లో ఒక కొత్త సంచలనం, ఇది వినియోగదారులు వాడటానికి సులువుగా ఉండటంతో కంప్యూటర్ ఏంటో మందికి మరింత చేరువ అయ్యింది, విండోస్ కి మార్కెట్ లో మంచి ఆదరణ వచ్చింది.

అలా క్రమంగా విండోస్ ప్రపంచ కంప్యూటర్ సాఫ్ట్ వేర్ మార్కెట్ లో 90% షేర్ తోని తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. మైక్రోసాఫ్ట్ కంటే ముందు ఆపిల్ సంస్థ 1984 లో ప్రవేశపెట్టిన మాక్ OSని అధిగమించి తన మార్కెట్ ను సుస్థిరం చేసుకుంది.

విండోస్ ని ఎక్కువగా గృహాలలో,చిన్న తరహ పరిశ్రమలలో వినియోగిస్తారు. కంపూటర్లు అధికంగా వాడే వినియోగదారులు వెళ్ళే అవ్వడంతో విండోస్ కి బాగా ప్రాచుర్యం పొందింది.

ఈ మధ్యన స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగటంతో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ప్లాట్ ఫార్మ్ ను కైవసం చేసుకుంది, కానీ విండోస్ కి స్మార్ట్ ఫోన్ ల కూడా మంచి ఆదరణ ఉంది, కానీ కంప్యూటర్ ప్లాట్ఫారంలో ఇప్పటికి విండోస్ దే పైచేయి.

ప్రపంచంలో ఎక్కువ కంప్యూటర్లలో వాడబడే ఆపరేటింగు సిస్టం విండోస్.

విండోస్ 10 తాజాగా విపణిలో అందుబాటులో ఉన్న ఆపరేటింగ్ సిస్టం. ఇది కంపూటర్లు,స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంది. సర్వర్ లో విండోస్ సర్వర్ 2012 R2 తాజా ఆపరేటింగ్ సిస్టం.

విండోస్ వంశవృక్షం

[మార్చు]

మార్కెటింగ్

[మార్చు]

మైక్రోసాఫ్ట్, విండోస్ తయారిదారు, ఆ తరువాత ఆయా రంగాలు, పరిశ్రమలకు తగ్గటుగా విండోస్ లో ఎన్నో రకాలు రోపొందించి వాటికీ ట్రేడ్ మార్కు నమోదు చేసింది.

ప్రస్తుతం, 2014 కు గాను విండోస్ లో ఈ రకాలను మైక్రోసాఫ్ట్ క్రియాశీలకంగా ఉత్త్పత్తి చేస్తుంది :

  • విండోస్ ఎన్.టీ : విండోస్ ఎన్.టీ 3.1 వెర్షన్ తో ప్రారంబం ఐన ఈ ఆపరేటింగ్ సిస్టం కెర్నల్ ప్రధానంగా సర్వర్, వర్క్ స్టేషన్ లకు అనుగుణంగా రూపొందించబడింది. ప్రస్తుతం మూడు ప్రధాన విండోస్ ఓ.ఎస్ రకాలు ఈ కెర్నల్ ఆధారితం గానే రూపొందించారు.
    • విండోస్ సర్వర్ : సర్వర్ సిస్టంలకు ఉద్దేశించిన ఆపరేటింగ్ సిస్టం.విండోస్ సర్వర్ 2012 R2 ఇందులో తాజా వెర్షన్. వీటి క్లైంట్ వెర్షన్లలాగ 95,98,ఎక్స్.పి అనే పేర్లు కాకుండా ఒక బలమైన నేమింగ్ స్కీం పాటిస్తున్నారు. సర్వర్ లలో లినక్స్ ఆపరేటింగ్ సిస్టం ప్రధాన పోటిదారు.
    • విండోస్ PE : విండోస్ ఆపరేటింగ్ సిస్టంని ఒక CD లో ఇమిడిపోయేలాగా అందులో ఉన్న ఫీచర్లను తొలగించి రూపొందించారు. సాధారణ విండోస్ లాగ దీనికి ఇన్స్టలేషన్ అక్కర్లేదు. వీటినే లైవ్ ఆపరేటింగ్ సిస్టం అంటారు. దీనిని ప్రధానంగా కంప్యూటర్లలో సమస్యలను నివ్వృత్తి చేయడానికి, ఒక ఆపరేటింగ్ సిస్టాన్ని వందల కంప్యూటర్లలో ఒకే సరి ఇన్స్టాల్ చేయడానికి, డేటా రికవరీ అవసరాలకు ఉపయోగిస్తారు. విండోస్ PE 5.1 ఇందులో తాజా వెర్షన్.
    • విండోస్ : కంప్యూటర్లకు రూపొందించిన ఆపరేటింగ్ సిస్టం. విండోస్ లో అందరికి తెలిసిన రకం ఇదే. ఇందులో తాజా వెర్షన్ విండోస్ 10. ఈ కంప్యూటర్ వెర్షన్లకు సర్వర్ వెర్షన్ ల్లగా ఒక నేమింగ్ స్కీం లేదు.
    • విండోస్ లో ప్రధాన ఆపరేటింగ్ సిస్టాలు ఇవి :

కానీ, విండోస్ మొదటి రకం ఐన విండోస్ 1.x, విండోస్ 3.x రూల్ స్కీం ప్రకారం విండోస్ మెయిన్ స్ట్రీమ్ లో భాగం కాదు. పీ.సి ప్లాట్ఫారంలో విండోస్ కు పోటిదారులు ఆపిల్ వారి మాక్ ఆపరేటింగ్ సిస్టం.

  • విండోస్ ఫోన్ : ఈ ఆపరేటింగ్ సిస్టాన్ని మైక్రోసాఫ్ట్ కేవలం స్మార్ట్ ఫోన్ల తయారిదారులకు పంపిణి చేస్తుంది. స్మార్ట్ ఫోన్లకు ప్రత్యేకంగా రూపొందించిన ఓ.ఎస్ ఇది. విండోస్ ఫోన్ 7 ఇందులో మొదటి వెర్షన్. ప్రస్తుతం మార్కెట్ లో విండోస్ ఫోన్ 10 రకం అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ రంగంలో విండోస్ ఫోన్ కు గూగుల్ వారి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ప్రధాన పోటిదారు. స్మార్ట్ ఫోన్ల వినియోగదారుల్లో విండోస్ ఫోన్ ఆండ్రాయిడ్ తర్వాతి స్థానంలో ఉంది.
  • విండోస్ ఎంబెడెడ్ : మొదట్లో మైక్రోసాఫ్ట్ విండోస్ CE అనే ఆపరేటింగ్ సిస్టంని చేతికి ఇమిడిపోయే పాకెట్ పీ.సిలు, తక్కువ సామర్ధ్యంతో నడిచే కంప్యూటర్ లను ఉద్దేశించి రూపొందించింది. ఆ తరువాత పరిస్తుతులకు అనుగుణంగా విండోస్ CE ని విండోస్ ఎంబెడెడ్ గ పేరు మార్చారు. విండోస్ కాంపాక్ట్ ట్రేడ్ మార్కుతో ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు విండోస్ ఎంబెడెడ్ ని బిల్లింగ్ మెషిన్లు, పరిశ్రమల పరికరాలు, కార్లు, పాకెట్ పీ.సిలు, ఇతర చిన్న తరహ పరికర అవసరాలకు ఆపరేటింగ్ సిస్టంగా వినియోగిస్తునారు.

క్రింది విండోస్ లో రకాలును మైక్రోసాఫ్ట్ ఉత్పత్తి చేయటం ఆపేసింది :

  • విండోస్ 9x : గృహ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మైక్రోసాఫ్ట్ రూపొందించిన తొలి ఆపరేటింగ్ సిస్టంల కెర్నల్ రకం. మైక్రోసాఫ్ట్ MS-DOS ఆధారంగా రూపొందించిన కెర్నల్. అప్పట్లో మార్కెట్ లో సంచలనం ఐన విండోస్ 95,98 లలో దిన్ని ఉపయోగించారు. ఆ తర్వాత విండోస్ ME లో దిన్ని ఉపయోగించారు, కానీ ఈ కెర్నల్ కి 2000 తర్వాత వచ్చిన ఆధునిక కంప్యూటర్ హార్డువేర్ ను పూర్తి సామర్ధ్యంతో వినియోగిన్చుకోలేకపోయింది. దానితో ఎన్నో సాఫ్ట్ వేర్ సమస్యలు రావటంతో విండోస్ ME వినియోగదారులను ఆకుట్టుకోలేకపోయింది. విండోస్ 9x కెర్నల్ మీద రూపొందించిన చివరి ఆపరేటింగ్ సిస్టం ఇది. ఆ తరువాత విండోస్ 9x కెర్నల్ స్థానంలో విండోస్ NT ఆధారిత కెర్నల్ తో ఆపరేటింగ్ సిస్టం లను ఉత్పత్తి చేస్తుంది. 1993లో వచ్చిన విండోస్ NT 3.1, NT కెర్నల్ మీద రూపొందించిన మొదటి ఆపరేటింగ్ సిస్టం. విండోస్ 2000, ఆ తర్వాతి అన్ని ఆపరేటింగ్ సిస్టం లను NT కెర్నల్ మీదనే ఉత్త్పత్తి చేయటం మొదలుపెట్టారు.
  • విండోస్ మొబైల్ : ఆండ్రాయిడ్ కంటే ముందు, అప్పటి స్మార్ట్ ఫోన్ లకు మైక్రోసాఫ్ట్ తయారుచేసిన ఆపరేటింగ్ సిస్టం ఇది. పాకెట్ PC 2000 ఇందులో మొదటి వెర్షన్. విండోస్ మొబైల్ 2003 లో మొదటి సరిగా అప్పటి విండోస్ లోగోను వినియోగించారు. ఆ తరువాత టచ్ స్క్ర్రెన్, స్మార్ట్ ఫోన్ లలో వచ్చిన ఆధునిక హార్డువేర్ కు అనుగుణంగా ఈ ఆపరేటింగ్ సిస్టాన్ని మార్చి, విండోస్ ఫోన్ అనే పేరును పునఃప్రారంభించారు. విండోస్ ఫోన్ 6.5 విండోస్ ఫోన్ లో చివరి వెర్షన్.

విడుదల కాలక్రమం

[మార్చు]
విండోస్ వెర్షన్లు
సాఫ్ట్ వేర్ పేరు తాజా వెర్షన్ విడుదల తేది సంకేత పేరు సపోర్ట్ చివరి తేది[4] తాజా వెర్షన్లు
ప్రధాన స్రవంతి పొడిగింపు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ (IE) డైరెక్ట్ X ఏడ్జ్ బ్రౌజరు
Old version, no longer supported: విండోస్ 1.0 1.01 1985 నవంబరు 20 Interface Manager 2001 డిసెంబరు 31
Old version, no longer supported: విండోస్ 2.0 2.03 1987 డిసెంబరు 9 2001 డిసెంబరు 31
Old version, no longer supported: విండోస్ 2.1 2.11 1988 మే 27 2001 డిసెంబరు 31
Old version, no longer supported: విండోస్ 3.0 3.0 1990 మే 22 2001 డిసెంబరు 31
Old version, no longer supported: విండోస్ 3.1 3.1 1992 ఏప్రిల్ 6 Janus 2001 డిసెంబరు 31 5
Old version, no longer supported: విండోస్ ఫర్ వర్క్ గ్రూప్స్ 3.1 3.1 అక్టోబరు 1992 Sparta, Winball 2001 డిసెంబరు 31 5
Old version, no longer supported: విండోస్ NT 3.1 NT 3.1.528 1993 జూలై 27 2001 డిసెంబరు 31 5
Old version, no longer supported: విండోస్ ఫర్ వర్క్ గ్రూప్స్ 3.11 3.11 1993 ఆగస్టు 11 Sparta, Winball 2001 డిసెంబరు 31 5
Old version, no longer supported: విండోస్ 3.2 3.2 1993 నవంబరు 22 2001 డిసెంబరు 31 5
Old version, no longer supported: విండోస్ NT 3.5 NT 3.5.807 1994 సెప్టెంబరు 21 Daytona 2001 డిసెంబరు 31 5
Old version, no longer supported: విండోస్ NT 3.51 NT 3.51.1057 1995 మే 30 2001 డిసెంబరు 31 5
Old version, no longer supported: విండోస్ 95 4.0.950 1995 ఆగస్టు 24 Chicago, 4.0 2000 డిసెంబరు 31 2001 డిసెంబరు 31 5.5 6.1
Old version, no longer supported: విండోస్ NT 4.0 NT 4.0.1381 1996 జూలై 31 Cairo 2000 డిసెంబరు 31 2001 డిసెంబరు 31 5
Old version, no longer supported: విండోస్ 98 4.10.1998 1998 జూన్ 25 Memphis, 97, 4.1 2002 జూన్ 30 2006 జూలై 11 6 6.1
Old version, no longer supported: విండోస్ 98 SE 4.10.2222 1999 మే 5 2002 జూన్ 30 2006 జూలై 11 6 6.1
Old version, no longer supported: విండోస్ 2000 NT 5.0.2195 1999 డిసెంబరు 15 2005 జూన్ 30 2010 జూలై 13 5
Old version, no longer supported: విండోస్ ME 4.90.3000 2000 సెప్టెంబరు 14 Millenium, 4.9 2003 డిసెంబరు 31 2006 జూలై 11 6 9.0c
Old version, no longer supported: విండోస్ XP NT 5.1.2600 2001 అక్టోబరు 25 Whistler 2009 ఏప్రిల్ 14 2014 ఏప్రిల్ 8 8 9.0c
Old version, no longer supported: విండోస్ XP 64-బిట్ NT 5.2.3790 2003 మార్చి 28 2009 ఏప్రిల్ 14 2014 ఏప్రిల్ 8 6 9.0c
Old version, no longer supported: విండోస్ సర్వర్ 2003 NT 5.2.3790 2003 ఏప్రిల్ 24 2010 జూలై 13 2015 జూలై 14 8 9.0c
Old version, no longer supported: విండోస్ XP ప్రొఫెషనల్ 64-బిట్ NT 5.2.3790 2005 ఏప్రిల్ 25 2009 ఏప్రిల్ 14 2014 ఏప్రిల్ 8 8 9.0c
Old version, no longer supported: విండోస్ ఫండమెంటల్స్ ఫర్ లెగసి పీ.సి's NT 5.1.2600 2006 జూలై 8 Eiger, Mönch 2009 ఏప్రిల్ 14 2014 ఏప్రిల్ 8 8 9.0c
Older version, yet still supported: విండోస్ విస్టా NT 6.0.6002 2006 నవంబరు 30 (వాల్యూం లైసెన్స్)
2007 జనవరి 30 (రిటైల్ అమ్మకం)
Longhorn 2012 ఏప్రిల్ 10 2017 ఏప్రిల్ 11 9 11
Old version, no longer supported: విండోస్ హోం సర్వర్ NT 5.2.4500 2007 నవంబరు 4 2013 జనవరి 8 8 9.0c
Older version, yet still supported: విండోస్ సర్వర్ 2008 NT 6.0.6002 ఫెబ్రవరి 27, 2008 Longhorn Server 2015 జనవరి 13 2020 జనవరి 14 9 11
Older version, yet still supported: విండోస్ 7 NT 6.1.7601 2009 అక్టోబరు 22 Blackcomb, Vienna 2015 జనవరి 13 2020 జనవరి 14 11 11
Older version, yet still supported: విండోస్ సర్వర్ 2008 R2 NT 6.1.7601 2009 అక్టోబరు 22 2015 జనవరి 13 2020 జనవరి 14 11 11
Old version, no longer supported: విండోస్ హోం సర్వర్ 2011 NT 6.1.8400 2011 ఏప్రిల్ 6 Vail 2016 ఏప్రిల్ 12 9 11
Older version, yet still supported: విండోస్ సర్వర్ 2012 NT 6.2.9200 2012 సెప్టెంబరు 4 2018 జనవరి 9 2023 జనవరి 10 10 11.1
Old version, no longer supported: విండోస్ 8 NT 6.2.9200 2012 అక్టోబరు 26 2016 జనవరి 12 10 11.1
Older version, yet still supported: విండోస్ 8.1 NT 6.3.9600 2013 అక్టోబరు 17 Blue 2018 జనవరి 9 2023 జనవరి 10 11 11.2
Current stable version: విండోస్ సర్వర్ 2012 R2 NT 6.3.9600 2013 అక్టోబరు 17 Server Blue 2018 జనవరి 9 2023 జనవరి 10 11 11.2
Current stable version: విండోస్ 10 NT 10.0.10586 2015 జూలై 29 Threshold 2020 అక్టోబరు 13 2025 అక్టోబరు 14 11 12 25
Latest preview version of a future release: విండోస్ సర్వర్ 2016 NT 10.0.10586 ఇంకా ప్రకటించలేదు ఇంకా ప్రకటించలేదు ఇంకా ప్రకటించలేదు 11 12 25
విండోస్ కాలక్రమ పట్టిక
Windows 3.1xWindows NT 3.1Windows NT 3.51Windows 95Windows NT Server 3.51Windows NT 4.0Windows 98Windows NT 4.0Windows 2000Pocket PC 2000Windows MeWindows XPWindows XPWindows Server 2003Windows Mobile 2003Windows Mobile 5.0Windows Embedded IndustryWindows Server 2003 R2Windows Mobile 6.0Windows VistaWindows Home ServerWindows Mobile 6.1Windows Server 2008Windows Embedded IndustryWindows Mobile 6.5Windows 7Windows Server 2008 R2Windows MultiPoint ServerWindows Phone 7Windows Home Server 2011Windows MultiPoint ServerWindows Embedded IndustryWindows Server 2012Windows 8Windows MultiPoint ServerWindows Embedded 8 IndustryWindows 8.1Windows Embedded 8.1 IndustryWindows Server 2012 R2Windows Phone 8.1Windows 10Windows 10 Mobile
విండోస్ వెర్షన్లు

వినియోగపు వాటా

[మార్చు]

మార్కెట్ షేర్ల పర్యావలోకనం
మార్చ్ 2016 న నెట్ అప్లికేషన్స్, స్టేట్ కౌంటర్ సమాచారం మేరకు [5][6][7][8]

డెస్క్ టాప్ OS Net Applications StatCounter
Old version, no longer supported: విండోస్ 98 0.00% 0.06%
Old version, no longer supported: విండోస్ 2000 0.01% 0.02%
Old version, no longer supported: విండోస్ XP 10.90% 6.83%
Old version, no longer supported: విండోస్ సర్వర్ 2003 0.11%
Older version, yet still supported: విండోస్ విస్టా 1.41% -
Older version, yet still supported: విండోస్ 7 51.89% 41.68%
Old version, no longer supported: విండోస్ 8 2.45% 3.01%
Older version, yet still supported: విండోస్ 8.1 9.56% 9.96%
Current stable version: విండోస్ 10 14.15% 15.05%
అన్ని రకాలు 90.34% 84.80%
మొబైల్ OS Net Applications StatCounter
Older version, yet still supported: విండోస్ RT 8.1 0.08%
Old version, no longer supported: విండోస్ ఫోన్ 7.5 0.09% 1.85%
Old version, no longer supported: విండోస్ ఫోన్ 8 0.38%
Older version, yet still supported: విండోస్ ఫోన్ 8.1 1.68%
Current stable version: విండోస్ 10 మొబైల్ 0.36%
అన్ని రకాలు 2.51% 1.93%

ప్రపంచవ్యాప్తంగా కంపూటర్లు, స్మార్ట్ ఫోన్లు వాడకాన్ని ఈ రెండిటి గణాంకాలు కొలమానంగా నిర్ధారిస్తారు.

సాధారణంగా సంస్థలు ఈ గణాంకాలుని ఈ పరికరాల్ని ఉపయోగించి అంతర్జాలం వాడె వినియోగదారుల సమాచారంని సేకరించి, గణాంకాలు విడుదల చేస్తారు.
వీటి ప్రకారం స్మార్ట్ ఫోన్లు వినియోగించే వాళ్ళు ఎక్కువగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంని వినియోగించగా, కంపూటర్లు వాడే వాళ్ళు అధికంగా విండోస్ ని ఉపయోగిస్తునారని తేలింది.
కంపూటర్ల వినియోగం రోజురోజుకు పెరగగా, స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా అదే స్థాయిలో పెరిగింది. కాని ఇవి భౌగోళికంగా వినియోగదారుల అభిరుచుల మేరకు మారుతూ ఉంటాయి.

విండోస్ తెలుగు రూపం

[మార్చు]
విండోస్ లో తెలుగు కీబోర్డు ఇన్స్క్రిప్ట్ తెరపట్టు (Circa 2005)
విండోస్ ఎక్స్‌పి తెలుగు రూపం (Circa 2006)

భారత అధికార ఇన్స్క్రిప్ట్ కీ బోర్డు తోడ్పాటు 2005 లో విడుదలైంది. విండోస్ ఎక్స్‌పికి అనుబంధంగా తెలుగు భాష పేక్ ఉంది.[9] దీనిని అమర్చిన తరువాత విండోస్ సాధారణ ఉపకరణాల పేర్లు, సందేశాలు తెలుగులో ప్రదర్శించబడతాయి. తొలి అనువాదం కావున కొన్ని ఆంగ్ల పదాలను లిప్యంతరీకరణంగానే వాడారు. ఉదాహరణకు music కు మ్యూజిక్ అని వాడారు, సంగీతం అని వాడలేదు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

సూచనలు

[మార్చు]
  1. "Lesson 2 - Windows NT System Overview". Microsoft TechNet. Microsoft. Retrieved నవంబరు 25, 2014.
  2. "Listing of available Windows 7 language packs". Msdn.microsoft.com. Archived from the original on ఆగస్టు 2, 2012. Retrieved ఏప్రిల్ 5, 2014.
  3. "App packages and deployment (Windows Store apps) (Windows)". Msdn.microsoft.com. Retrieved ఏప్రిల్ 5, 2014.
  4. "Microsoft Support Lifecycle". Microsoft.
  5. "Desktop Operating System Market Share March 2016". Net Applications.
  6. "Mobile/Tablet Operating System Market Share March 2016". Net Applications.
  7. "Top 7 Desktop Operating Systems February 2016". StatCounter Global Stats.
  8. "Top 8 Mobile & Tablet Operating Systems March 2016". StatCounter Global Stats.
  9. "Windows xp Telugu pack download".

అదనపు లంకెలు

[మార్చు]