వల్పరైజో
వల్పరైసో | |
---|---|
Nickname(s): పసిఫిక్ రత్నం, వల్పో | |
Coordinates (నగరం): 33°03′S 71°37′W / 33.050°S 71.617°W | |
దేశం | Chile |
Region | మూస:Country data Valparaíso |
Province | వల్పరైసో |
స్థాపన | 1536 |
రాజధాని | వల్పరైసో |
Government | |
• Type | మునిసిపాలిటీ |
• మేయరు | (స్వతంత్ర) |
విస్తీర్ణం | |
• City | 401.6 కి.మీ2 (155.1 చ. మై) |
Elevation | 10 మీ (30 అ.) |
జనాభా (2012 census)[2] | |
• City | 2,84,630 |
• జనసాంద్రత | 710/కి.మీ2 (1,800/చ. మై.) |
• Urban | 2,75,141 |
• Metro | 9,30,220 |
• గ్రామీణ | 841 |
Demonym(s) | Porteño (m), Porteña (f) |
Time zone | UTC−4 (CLT) |
• Summer (DST) | UTC−3 (CLST) |
ప్రాంతపు కోడ్ | (country) 56 + (city) 32 |
Climate | Csb |
Website | (in Spanish) |
వల్పరైసో చిలీ దేశపు నగరం, రేవు, నౌకాదళ కేంద్రం. ఇది వల్పరైసో ప్రాంతానికి రాజధాని. ఇది దేశ రాజధాని శాంటియాగో నుండి 120 కి.మీ. దూరంలో ఉంది. రెండు ప్రభుత్వ విశ్వవిద్యలయాలతో పాటు అనేక ప్రైవేటు విశ్వవిద్యాలయలూ ఉన్నాయి.[3] గ్రేటర్ వల్పారైసో దేశంలోని రెండవ అతిపెద్ద మహానగరం.
19 వ శతాబ్దపు రెండో సగంలో, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల మధ్య మేగలన్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు ప్రధానమైన ఆశ్రయంగా ఉంటూ వల్పరైసో ప్రముఖమైన రేవుగా వెలుగొందింది. ఆ సమయంలో ఇది విపరీతమైన అభివృద్ధిని చూసింది. ఐరోపా వలసదారులకు ఇది ప్రధాన గమ్యమైంది. ఆ సమయంలో దీన్ని "లిటిల్ శాన్ ఫ్రాన్సిస్కో" అనీ "పసిఫిక్ రత్నం" అనీ పిలిచేవారు.[4] 2003 లో వల్పరైసో లోని చారిత్రిక ప్రాంతాన్ని యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.
లాటిన్ అమెరికా లోని అత్యంత పురాతన స్టాక్ ఎక్స్‌చేంజి వల్పరైసోలో ఉంది. ప్రపంచం లోని అత్యంత పురాతన స్పానిష్ వార్తాపత్రిక, ఎల్ మెర్క్యూరియో డి వల్పరైసో ఇక్కడి నుండే వెలువడుతుంది. 1827 సెప్టెంబరు 12 న మొదలైన ఈ పత్రిక అప్పటినుండి నిరంతరాయంగా వెలువడుతూ, 2020 నాటికి ఇంకా ప్రచురణ లోనే ఉంది. చిలీ దేశపు మొట్టమొదటి ప్రజా గ్రంథాలయం వల్పరైసొలోనే ఉంది.
20 వ శతి రెండవ సగంలో వల్పరైసోకు పరిస్థితులు తిరగబడ్డాయి. అనేక కుటుంబాలు నగరాన్ని విడిచిపెట్టాయి. పనామా కాలువను తెరవడంతో ఇక్కడి రేవుకు వచ్చే నౌకల రద్దీ తగ్గిపోయింది. అది వల్పరైసో ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. 21 వ శతాబ్ది తొలి 15 ఏళ్ళలో, ఇక్కడ కళాకారులు, సాంస్కృతిక వ్యాపారులూ, వ్యాపార సంస్థలూ స్థిరపడడంతో నగరం కొంత కోలుకుంది. ఇప్పుడు నగరం పర్యాటకులను బాగా ఆకర్షిస్తోంది.
మరింత ముఖ్యంగా, వల్పరైసో ఒక ముఖ్యమైన విద్యా కేంద్రంగా మారింది. నాలుగు పెద్ద అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను, అనేక కాలేజీలనూ ఇక్కడ స్థాపించారు. ఏటా పండుగలు పర్వదినాలను జరుపుకుంటూ వల్పరైసో చిలీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఉంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Municipality of Valparaíso" (in స్పానిష్). Archived from the original on 2010-03-30. Retrieved 2010-11-15.
- ↑ 2.0 2.1 2.2 (in Spanish) Instituto Nacional de Estadísticas Archived 2019-01-06 at the Wayback Machine
- ↑ "Universidades de Valparaíso (Privadas y Estatales Públicas)". altillo.com (in స్పానిష్). Archived from the original on 26 June 2020. Retrieved 11 February 2020.
- ↑ Between Two Worlds: Memoirs of a Philosopher-Scientist ISBN 978-3-319-29250-2 p. 120