లులు మాల్
ప్రదేశం | ఎడపల్లి, కొచ్చి |
---|---|
అక్షాంశ రేఖాంశాలు | 10°1′32″N 76°18′28″E / 10.02556°N 76.30778°E |
చిరునామా | ఎడపల్లి, కొచ్చి – 682024 |
ప్రారంభ తేదీ | 10 మార్చి 2013 |
యజమాని | లులు గ్రూప్ ఇంటర్నేషనల్ |
నిర్మాణ శిల్పి | డబ్ల్యూ ఎస్ అట్కిన్స్ |
స్టోర్‌ల సంఖ్య, సేవలు | 215[1] |
ఏంకర్ టెనంట్స్ సంఖ్య | 5 |
మొత్తం ఫ్లోర్ విస్తీర్ణం | 2,500,000 sq ft (230,000 మీ2)[2] (Total built up area) |
ఫ్లోర్ల సంఖ్య | 4 |
లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ కేరళ రాష్ట్రం కొచ్చిలో నెలకొని వున్న భారతదేశంలోని అత్యంత విశాలమైన షాపింగ్ మాల్.[3][4][5] ప్రతిరోజు సగటున 80,000 మంది ఈ మాల్‌ను సందర్శిస్తారు. కేరళలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రదేశాలలో ఇది ఒకటి.[6] ఇది 17 ఎకరాలు (6.9 హెక్టార్లు) విస్తీర్ణంలో మొత్తము 25 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాను కలిగి ఉంది. దానిలో 17 లక్షల చదరపు అడుగుల స్థలం నికరంగా లీజుకు ఇవ్వడానికి వీలుగా ఉంది. ఈ మాల్ 2013,మార్చిలో ప్రారంభమైంది. దీనిలో 215 దుకాణాలు ఉన్నాయి. వాటిలో ఫుడ్ కోర్టులు, రెస్టారెంటులు, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు, ఒక మల్టీప్లెక్స్, ఐస్ స్కేటింగ్ రింక్, బౌలింగ్ అల్లేలు ఉన్నాయి.[1][7][8][9][10] ఈ ప్రాజెక్టు అయిన మొత్తం ఖర్చు ₹1600 కోట్లు (25 కోట్ల డాలర్లు)గా అంచనా వేయబడింది.[11]లులు గ్రూప్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన యూసుఫ్ అలీ ముసల్లియం వీట్టిల్ అబ్దుల్ ఖాదర్ ఈ ఆస్తికి స్వంతదారుడిగా, నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడు. లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థకు రిటైల్, రియల్ ఎస్టేట్ మొదలైన రంగాలలో విస్తృతమైన వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఈ షాపింగ్ మాల్ భారతదేశంలో చేపట్టిన తొలి ప్రాజెక్టు. ఈ సంస్థ తిరువనంతపురం, లక్నో,[12] చెన్నై,బెంగళూరు, హైదరాబాదులలో మాల్స్ నిర్మించడానికి తలపెట్టింది.
ప్రదేశం
[మార్చు]లులు మాల్ కొచ్చి నగరంలో రెండు జాతీయ రహదారులు ఎన్.హెచ్ 544, ఎన్.హెచ్ 47ల కూడలి అయిన ఎడప్లల్లి జంక్షన్‌లో నెలకొని ఉంది. ఎడపల్లి మెట్రో రైల్వే స్టేషన్‌కు అతి సమీపంలో ఉంది. ఈ షాపింగ్ మాల్ కేరళ రాష్ట్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పర్యాటకులను ఆకర్షిస్తూ వుంది.
రికార్డు పుస్తకాలలో స్థానం
[మార్చు]2016, అక్టోబరు 27న లులు మాల్ ఉద్యోగులు భారత సైనికులకు సంఘీభావం ప్రకటిస్తూ "లులు సాల్యూట్స్ టు అవర్ సోల్జర్స్" అనే పేరుతో 5509 ప్రమిదలను మాల్ ఆవరణలో ఒక నిముషంలో వెలిగించి దీపావళిని ముందుగా జరుపుకున్నారు. ఈ ఉదంతం "ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్[13]", "ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్[14]"లలో నమోదయ్యింది.
ఆకర్షణలు
[మార్చు]- లులు హైపర్ మార్కెట్
- 22 మల్టీ కుజీన్ కిచెన్లు, 2,500 మంది కూర్చోడానికి వీలున్న 4 విశాలమైన రెస్టారెంట్లు ఉన్న ఫుడ్ కోర్ట్
- 71,000 sq ft (6,600 మీ2) విస్త్రీర్ణం, 9 స్క్రీన్‌లు కల పి.వి.ఆర్.సినిమాస్ మల్టీప్లెక్స్[15]
- ఆర్కేడ్ గేమ్స్, 5D సినిమా, పార్టీ హాల్, 12 లేన్ బౌలింగ్ అల్లే, ఇండోర్ క్లైంబింగ్, అమ్యూజ్‌మెంట్ ఆర్కేడ్
- 5,000 sq ft (460 మీ2) విసీర్ణం కల ఐస్ స్కేటింగ్ రింక్ (దక్షిణ భారతదేశంలో పెద్దది)[8]
- 3500 వాహనాలు నిలపడానికి వీలున్న పార్కింగ్ స్థలం
- మనీ ఎక్స్‌చేంజ్ సెంటర్లు
- అర్ధపారదర్శకమైన పైకప్పును కలిగి గాజుగోడలతో నిర్మించిన అతిపెద్ద కేంద్ర ప్రాంగణం
- ఎడపల్లి మెట్రో రైల్వే స్టేషన్ నుండి నేరుగా మాల్ లోనికి వాక్ వే
సదుపాయాలు
[మార్చు]ప్రధాన అంగళ్లు & మినీ డిపార్ట్‌మెంట్ స్టోర్లు
[మార్చు]- లులు హైపర్‌మార్కెట్ - 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్న భారతదేశపు అతిపెద్ద హైపర్‌మార్కెట్
- మిగిలిన ప్రధాన దుకాణాలలో లులు ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్, లులు సెలెబ్రేట్, పివిఆర్ సినిమాస్, స్పార్కీస్ ఉన్నాయి.
- వెస్ట్‌సైడ్, మార్క్స్& స్పెన్సర్ వంటి మిని డిపార్ట్‌మెంటల్ స్టోర్స్ ఉన్నాయి.
మల్టీప్లెక్స్
[మార్చు]- పివిఆర్ సినిమాస్ మల్టీప్లెక్స్ 9 తెరలతో 71,000 sq ft (6,600 మీ2) స్థలాన్ని ఆక్రమించుకుని ఉంది. రెండవ అంతస్తులో ఉన్న ఈ మల్టీప్లెక్స్‌కు వెలుపలి నుండి ప్రవేశించడానికి ఎలివేటర్లు ఉన్నాయి.
లీజర్ జోన్
[మార్చు]- మూడవ అంతస్తులో ఉన్న మనోరంజక క్షేత్రంలో ఇండోర్ క్లైంబింగ్ వాల్, ఐస్ స్కేటింగ్ రింక్, 5Dసినిమా, ఆర్కేడ్ గేమింగ్ జోన్, పార్టీ హాల్, 12 వరుసల బౌలింగ్ అల్లే ఉన్నాయి.
ఐదు నక్షత్రాల హోటల్
[మార్చు]ఈ షాపింగ్ మాల్‌ను ఆనుకుని మారియట్ హోటల్ ఉంది. ఈ హోటల్ 84 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఈ హోటల్ మీద హెలీపాడ్ ఉంది.[7]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "The highway to shopping". The New Indian Express. 11 March 2013. Archived from the original on 26 మార్చి 2016. Retrieved 16 జూన్ 2018.
- ↑ https://economictimes.indiatimes.com/slideshows/infrastructure/indias-largest-mall-in-kochi-lulu-mall/lulu-mall-kochi/slideshow/18923992.cms
- ↑ "LuLu Group: Going places". Khaleej Times. Retrieved January 26, 2016.
- ↑ "Bharat Bandh incurs Rs 1,500 cr loss to Kerala". The New Indian Express. Retrieved September 3, 2016.
- ↑ "Fresh ides needed for startups to navigate Bharat". The Economic Times. Retrieved January 16, 2016.
- ↑ "Lulu Group to build Rs 2,000 crore convention centre, hotel, mall in Visakhapatnam". The Economic Times. Archived from the original on 2018-06-17. Retrieved March 12, 2018.
- ↑ 7.0 7.1 "Mega-size mall to be open in Kochi on March 10". Times of India. 1 March 2013. Archived from the original on 12 జూన్ 2013. Retrieved 17 March 2013.
- ↑ 8.0 8.1 "Skate on Ice this summer". Deccan Chronicle. 29 April 2013.[permanent dead link]
- ↑ "PVR cinemas in Kochi". 23 Dec 2013. Archived from the original on 13 ఆగస్టు 2017. Retrieved 16 జూన్ 2018.
- ↑ "Lulu Mall to be opened tomorrow". The New Indian Express. 9 March 2013. Archived from the original on 21 నవంబరు 2015. Retrieved 16 జూన్ 2018.
- ↑ "Go shop-hopping in Lulu". New Indian Express. 4 March 2013. Archived from the original on 10 మార్చి 2013. Retrieved 17 March 2013.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-04-21. Retrieved 2018-06-16.
- ↑ http://www.asiabookofrecords.com/most-diyas-lit-together/
- ↑ http://www.indiabookofrecords.in/most-diyas-lit-together/
- ↑ "PVR to invest Rs 100 cr in Kerala". Times of India. 27 April 2013. Archived from the original on 2013-05-02. Retrieved 2018-06-16.