Jump to content

లామియేసి

వికీపీడియా నుండి

మింట్ కుటుంబం
Lemon balm (Melissa officinalis)
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
లామియేసి

ప్రజాతి

Many, see text


Ref: Watson and Dallwitz
2002-07-22

లామియేసి (Lamiaceae) కుటుంబములో సుమారు 180 ప్రజాతులు, 3,500 జాతుల మొక్కలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలఓ విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో 64 ప్రజాతులు, 400 జాతులను గుర్తించారు.

కుటుంబ లక్షణాలు

[మార్చు]
  • గుల్మాలు, శాఖీయ భాగాలు కేశాలతో కప్పబడి ఉంటాయి.
  • కాండము నలుపలకలుగా ఉంటుంది.
  • సువాసన గల లఘుపత్రాలు, అభిముఖ డెకుసేట్ పత్ర విన్యాసము.
  • థైర్పస్ లేదా వర్టిసిలాస్టర్ పుష్ప విన్యాసము.
  • పాక్షిక సౌష్టవ యుతము, అండకోశాధిస్థిత పుష్పాలు.
  • రెండు పెదవులుగా చీలిన ఆకర్షణ పత్రావళి.
  • ద్విదీర్ఘ, మకుట దళోపరిస్థిత కేసరాలు.
  • ద్విఫలదళ, సంయుక్త అండాశయము.
  • పీఠ అండాన్యాసము.
  • పీఠ సంబంధ కీలము.
  • కార్సెరూలస్ ఫలము.

ఆర్ధిక ప్రాముఖ్యత

[మార్చు]

ఈ కుటుంబములోని అనేక మొక్కల నుండి సుగంధ తైలం లభిస్తుంది.

  • రోస్ మెరినస్ అఫిసినాలిస్ నుండి రోస్ మేరి తైలం తయారుచేస్తారు.
  • లావెండ్యులా పుష్పాలు, పత్రాల నుండి లావెండరు నూనెను తీస్తారు. దీనిని సబ్బులు, తలనూనెలు, పౌడరుల తయారీలో ఉపయోగిస్తారు.
  • మెంథా జాతుల నుండి మింట్ తైలం లభిస్తుంది. దీనిని పిప్పర్ మింట్ లలోను, పౌడరులలోను, మందుగాను వాడతారు.
  • సాల్వియా జాతుల నుండి సేజ్ తైలం లభిస్తుంది.
  • థైమస్ వల్గారిస్ నుండి థైమాల్ లభిస్తుంది. దీనిని టూత్ పేస్టుల తయారీలో వాడతారు.
  • కొన్ని మొక్కలు మందు మొక్కలుగా ఉపయోగపడతాయి. తులసి ఆకులను దగ్గు, జలుబు నివారణకు ఉపయోగిస్తారు.
  • పుదీనా ఆకును ఆకు కూరగా వాడతారు.
  • చాలా జాతులను సాల్వియా, కోలియస్, లావెండ్యులా జాతులను తోటలలో అందం కోసం పెంచుతారు.

ముఖ్యమైన మొక్కలు

[మార్చు]