రాజ్‌సమంద్
రాజ్‌సమంద్ | |
---|---|
Coordinates: 25°04′N 73°53′E / 25.07°N 73.88°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
జిల్లా | రాజ్‌సమంద్ |
Founded by | రానా రాజా సింగ్ |
Named for | రానా రాజా సింగ్ పేరు మీద |
Elevation | 547 మీ (1,795 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 67,798 |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
Vehicle registration | RJ-30 |
రాజ్‌సమంద్, పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక నగరం.ఈ నగరానికి 17వ శతాబ్దంలో మేవార్‌కు చెందిన రానా రాజ్ సింగ్ సృష్టించిన కృత్రిమ సరస్సుకు రాజ్‌సమంద్ సరస్సు అని పేరు పెట్టారు.ఇది రాజ్‌సమంద్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం.
భౌగోళికం
[మార్చు]రాజ్‌సమంద్ పట్టణం 25°04′N 73°53′E / 25.07°N 73.88°E వద్ద ఉంది.[2] దీని సగటు ఎత్తు 547మీటర్లు (1794 అడుగులు) ఉంది.
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం రాజ్‌సమంద్ పట్టణంలో 67,798 మంది జనాభా ఉన్నారు.అందులో 35,033 మంది పురుషులు ఉండగా, 32,765 మంది మహిళలు ఉన్నారు.
0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు మొత్తం జనాభాలో 8121మంది ఉన్నారు. ఇది రాజ్‌సమంద్ (ఎం) మొత్తం జనాభాలో 11.98%గా ఉంది. రాజ్‌సమంద్ పట్టణ పరిధిలో, స్త్రీ సగటు నిష్పత్తి 938 తో పోలిస్తే జిల్లా సగటునిష్పత్తి 935 గా ఉంది. అంతేకాక రాజస్థాన్ రాష్ట్ర సగటు 888 తో పోలిస్తే రాజ్‌సమండ్‌లో బాలల లైంగిక నిష్పత్తి 879 గా ఉంది. రాజ్‌సమంద్ నగర అక్షరాస్యత రాష్ట్ర సగటు 66.11% కంటే 84.22% ఎక్కువ. రాజ్‌సమంద్ లో పురుషుల అక్షరాస్యత 92.52% కాగా, మహిళా అక్షరాస్యత 75.42%గా ఉంది
రాజ్‌సమంద్ పట్టణ పరిధిలో మొత్తం 13,765 ఇళ్లకు పైగా పరిపాలన ఉంది. దీనికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను స్థానిక పురపాలక సంఘం సమకూర్చింది. మున్సిపాలిటీ పరిధిలో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా పురపాలక సంఘానికి అధికారం ఉంది.[3]
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]రాజస్థాన్ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నప్పటికీ, రాష్ట్రంలో రాజ్‌సమంద్ ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉంది.పాలరాయి, గ్రానైట్, ఇతర విలువైన రాయిని సరఫరా చేసే ప్రధాన భారతీయ సరఫరాదారులలో రాజ్‌సమంద్ ఒకటి. జింక్, వెండి, మాంగనీస్ మొదలైన వాటి ముడి ఖనిజాల భారతీయ ప్రధాన వనరులు దరిబా, జవార్ గనులు. జనాభాలో ఎక్కువ మంది వ్యవస్థీకృత, అసంఘటిత గనుల తవ్యకంలాంటి సంబంధిత పనులలో చేస్తారు. మరికొందరు టైర్ల పరిశ్రమ, పొగాకు కర్మాగారాల్లో నిమగ్నమై ఉన్నారు.
చూడవలసిన ప్రదేశాలు
[మార్చు]రాజ్‌సమంద్ సహజంగానే ఆకర్షించే అందమైన నగరం.ఇది అద్భుతమైన ఉదయపూర్ (సరస్సుల నగరం) నుండి 62 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఆరావళి విస్తృత శ్రేణుల చుట్టూ, ఇది అద్భుతమైన రాజ్‌సమంద్ సరస్సును కలిగి ఉంది.
రాజ్‌సమంద్ సమీపంలో పర్యాటక ఆసక్తి ఉన్న ప్రదేశాలలో కుంభల్‌గఢ్ ఒకటి.ఇది మహారాణా ప్రతాప్ జన్మస్థలం, యుద్ధభూమి. హల్దిఘాటిలో వైష్ణవ్ ప్రధాన దేవత శ్రీనాథ్ ఆలయం ఉంది. సమీపంలో ద్వారకాధీష్ ఆలయం, చార్భుజా ఆలయం, ఏక లింగ ఆలయంతో సహా అనేక శివాలయాలు ఉన్నాయి.ఈ ప్రాంతంలో అనేక పురాతన, కొత్త జైన దేవాలయాలు ఉన్నాయి.[4]
కుంభల్‌గఢ్ కోట తప్పక చూడవలసిన మరో ప్రదేశం.ఇదిఒక కొండపై ఉంది. ఇది దాని గొప్ప సరిహద్దు గోడకు పేరు పొందింది. ఇది గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకు రెండవ స్థానంలో ఉంది.
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.
- ↑ Falling Rain Genomics, Inc - Rajsamand
- ↑ "Rajsamand Municipality City Population Census 2011-2021 | Rajasthan". www.census2011.co.in. Retrieved 2021-03-01.
- ↑ http://rajsamand.rajasthan.gov.in/
వెలుపలి లంకెలు
[మార్చు]- రాజ్‌సమంద్ జిల్లా వెబ్సైట్ Archived 2019-12-18 at the Wayback Machine
- అధికారిక వెబ్సైట్