రాజేంద్ర షా (రచయిత)
రాజేంద్ర షా | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | కాపడ్వాని, బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా | 1913 జనవరి 28
మరణం | 2010 జనవరి 2 ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 96)
వృత్తి | రచయిత |
జాతీయత | భారతీయుడు |
పూర్వవిద్యార్థి | ఎం.ఎస్.యు బరోడా |
కాలం | 1947-2003 |
గుర్తింపునిచ్చిన రచనలు |
|
పురస్కారాలు |
|
రాజేంద్ర కేశవలాల్ షా (1913 జనవరి 28 - 2010 జనవరి 2 ) గుజరాతీ భాషా సాహిత్యకారుడు, కవి. అతను కపద్వాంజ్‌లో జన్మించాడు. అతను 20 కి పైగా కవితలు, పాటల సంకలనాలను రచించాడు. ప్రధానంగా ప్రకృతి సౌందర్యం, స్వదేశీ ప్రజలు, మత్స్యకారుల సమాజాల దైనందిన జీవితాల గురించి రాసాడు. సంస్కృత పదాలను ఉపయోగించి కవితలు రాయడంలో రవీంద్రనాథ్ ఠాగూర్ చేత ప్రభావితమైనట్లు తెలుస్తుంది. గుజరాతీ సాహిత్యంలో గాంధీ యుగం అనంతరం దిగ్గజాలలో ఒకరిగా అతనిని భావిస్తారు. [1]
అతను చేసే వివిధ వృత్తులతో పాటు అతను ప్రచురణ కర్త. అతను ముంబైలో ఒక ప్రచురణకర్తగా 1957 లో కవిలోక్ అనే కవితా పత్రికను ప్రారంభించాడు. ఆ ముద్రణాశాల కూడా గుజరాతీ కవులకు ఒక ముఖ్యమైన సమావేశ స్థలంగా మారింది. అక్కడ ఆదివారాలు సాహిత్య సమావేశాలు నిర్వహించేవారు. కవిత్వం రాయడమే కాకుండా, గుజరాతీ ఠాగూర్ కవితా సంకలనం బాలాకాకు కూడా షా అనువదించాడు ; అతను జయదేవుని గీత గోవింద ; కోల్రిడ్జ్ రాసిన ది రిమ్ ఆఫ్ ది ఏన్షియంట్ మెరైనర్ ; డాంటే రాసిన ది డివైన్ కామెడీ లను కూడా అనువదించాడు.
షా 2001 లో జ్ఞానపిఠ పురస్కారాన్ని గెలుచుకున్నారు.[2]
జీవిత విశేషాలు
[మార్చు]1930 లో, అతను శాసనోల్లంఘన ఉద్యమంలో అరెస్టు చేయబడి జైలు శిక్ష అనుభవించినందున అతను విద్యాధ్యయనం నుండి తప్పుకున్నాడు. 1931 లో మంజుల అగర్వాల్‌ను వివాహం చేసుకున్నాడు. తరువాత 1934 లో అతను బరోడా లోని మహారాజా సయాజిరావ్ విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో తన బాచిలర్ డిగ్రీని సంపాదించాడు. ఆ తరువాత అహ్మదాబాద్ లోని పాఠశాల విద్యార్థులకు బోధించడం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు. [3]
అతను 2010 జనవరి 2 న ముంబైలో మరణించాడు. [4]
గ్రంథ పట్టిక
[మార్చు]కవితా సంకలనాలు
[మార్చు]- ధ్వని (1951)
- అందోలన్ (1952)
- శ్రుతి (1957)
- మోర్పిన్చ్ (1959)
- శాంత్ కోలహాల్ (1962)
- చిత్రానా (1967)
- క్షన్ జె చిరాంతన్ (1968)
- విశద్నే సాద్ (1968)
- మధ్యమా (1978)
- ఇక్షనా (1979)
- ఉడ్గిటి (1979)
- పట్రాలేఖా (1981)
- ప్రసాంగ్ సప్తక్ (1982)
- ద్వాసుపమ (1983)
- పంచ పర్వ (1983)
- విభవన్ (1983)
- చందన్ భినీ ఔర్ అనామిక్ (1987)
- ఆరణ్యక్ (1992)[5]
- స్మృతిసంవేదన (1998)
- విరాహ్మధురి (1999)
- వ్రజ్వైకుంతే (2002)
- హా ... హు సాక్షి చు '(2003)
- ప్రేమ్నో పరియే (2004)
- ఆ గగన్ (2005)
పురస్కారాలు
[మార్చు]అతను 1947 లో కుమార్ చంద్రక్ పురస్కారాన్ని, 1956 లో రంజిత్రమ్ సువర్ణ చంద్రక్ పురస్కారాన్ని గెలిచాడు. శాంత్ కోలహాల్ అనే పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు (1963) అందుకున్నాడు . అతను 1980లో గుజరాతీ సాహిత్య పరిషత్ చే అరబిందో సువర్ణ చంద్రక్ పురస్కారాన్ని అందుకున్నాడు. 1992 లో సాహిత్య గౌరవ్ పురస్కారాన్ని, 1999లో నరసింహ మెహతా పురస్కారాన్ని పొందాడు. అతను 2001 లో భారతదేశపు అత్యున్నత సాహిత్య పురస్కారంగా పరిగణించబడుతున్న జ్ఞానపిఠ పురస్కారాన్ని అందుకున్నాడు.
"అతని భావోద్వేగం, ఆవిష్కరణల తీవ్రత, వ్యక్తీకరణ అతనిని గొప్ప ప్రాముఖ్యత కలిగిన కవిగా వేరు చేసింది. అతని అతని కవిత్వం యొక్క ఆధ్యాత్మిక స్వరం నర్సింగ్ మెహతా, కబీర్, అఖో వంటి గొప్ప మధ్యయుగ కవుల సంప్రదాయం నుండి వచ్చింది. " అని పురస్కారానికి ఎంపికచేసే న్యాయమూర్తులు గుర్తించారు. [6]
మూలాలు
[మార్చు]- ↑ Mehta, Deepak B. (August 2003). "In love with the world". Frontline. 20 (16).
- ↑ https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-190012[permanent dead link]
- ↑ Suguna Ramanathan and Rita Kothari (1998). Modern Gujarati Poetry: A Selection. New Delhi: Sahitya Akademi. p. 85. ISBN 81-260-0294-8.
- ↑ "Gujarati poet Rajendra Shah(97) passes away". 2010-01-03. Retrieved 2017-02-09.
- ↑ "Third Gujarati to win Jnanpith". The Hindu. New Delhi. 18 July 2003. Archived from the original on 18 సెప్టెంబరు 2003. Retrieved 12 October 2018.
- ↑ Mehta, Harit (19 July 2003). "At 90, Jnanpith winner Rajendra creative as ever". The Times of India. Ahmedabad. Archived from the original on 16 ఫిబ్రవరి 2013. Retrieved 9 January 2013.