Jump to content

మొదాసా

అక్షాంశ రేఖాంశాలు: 23°28′N 73°18′E / 23.47°N 73.3°E / 23.47; 73.3
వికీపీడియా నుండి
Modasa
Town
Modasa is located in Gujarat
Modasa
Modasa
Location in Gujarat, India
Modasa is located in India
Modasa
Modasa
Modasa (India)
Coordinates: 23°28′N 73°18′E / 23.47°N 73.3°E / 23.47; 73.3
Country India
రాష్ట్రంగుజరాత్
జిల్లాAravalli
విస్తీర్ణం
 • Total13.47 కి.మీ2 (5.20 చ. మై)
Elevation
197 మీ (646 అ.)
జనాభా
 (2011)[1]
 • Total67,648
 • జనసాంద్రత5,022.1/కి.మీ2 (13,007/చ. మై.)
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
383315
Telephone code091-2774-
Vehicle registrationGJ-31
Sex ratio923 female per 1000 male /

మోదాసా,భారతదేశం,గుజరాత్ రాష్ట్రం,ఆరావళి జిల్లాలోని ఒక పట్టణం.ఇది పురపాలక సంఘం.1466లో మోదాసాలోపాలించిన భిల్ అధిపతిమలాజీ భిల్ పేరుమీద మోదాసా పేరు పెట్టబడింది.మోదాసా సబర్‌కాంత నుండి ఏర్పడిన కొత్త ఆరావళి జిల్లాకు ప్రధానకార్యాలయంగా మారింది.కొత్త జిల్లాప్రకటన 2013 జనవరి 26న వెలువడింది.ఆతరువాత 2013 ఆగస్టున 15న ఏర్పడింది [2][3] ఇది ప్రాంతీయ,జాతీయ స్థాయిలలో వ్యవసాయ ఎగుమతులకు ఆర్థిక కేంద్రం. చుట్టుపక్కల గ్రామాలకు చిన్నపట్టణాలకు వ్యాపార కేంద్రం.మోడసా నివాసితులు, పర్యాటకులకు రవాణా కేంద్రంగా పనిచేస్తుంది.నగరం రెండు పెద్ద ఆసుపత్రులను కలిగి ఉంది.ఈ నగరంఉత్తర గుజరాత్ ప్రజలకు,దక్షిణ రాజస్థాన్ నుండివలసవచ్చిన కొంతమందికి వైద్యుల కేంద్రంగాసౌకర్యాలు అందిస్తుంది.ఇంజినీరింగ్ కళాశాలలు,కేంద్ర పాఠ్య ప్రణాళిక అమలు పాఠశాలలు, సాంప్రదాయ విద్యా అధ్యాపకులకు అనుబంధంగాఉండటంతో,మోడసా ఈ ప్రాంతానికి విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందింది.నగరంలో ఇప్పుడున్యాయ,విజ్ఞాన, ఆర్ట్స్,కామర్స్,వైద్య కళాశాలలు ఉన్నాయి.అలాగే ఎంబిఎ.,బిబిఎ, బిసిఎ,కోర్సులు చదవటానికితగిన విద్యాసంస్థలు ఉన్నాయి.మెకానికల్,కంప్యూటర్,ఎలక్ట్రానిక్స్,కమ్యూనికేషన్,సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఆటోమోటివ్ ఇంజినీరింగ్ వంటి ప్రభుత్వఇంజినీరింగ్ కళాశాలలు నిర్వహిస్తున్న అధ్యయన కోర్సులుఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

మోడాసా చరిత్రవేలసంవత్సరాల నాటిది.సింధు లోయనాగరికత కాలం నుండి మోడాసా చుట్టూ ఉన్నప్రాంతంజనసమూహంతోఉందనినమ్ముతారు.అనేక నిర్మాణ వస్తువులు,నాణేలు,మతపరమైన కళాఖండాలు,ఇటుకలుమొదలైనవి మోడాసా చుట్టూ త్రవ్వకాలలోలభ్యమయ్యాయి.ఈపరిశోధనలుభారతీయచరిత్రలోని వివిధ కాలాల్లో మోడాసా పోషించిన ప్రముఖపాత్రకునిదర్శనం.మౌర్యులు,షట్వానులు,క్షత్రపు గుప్తులు,మారిత్రకులు,రాష్ట్రకూటులు మొదలైన వారికాలంలో మోడాసాప్రాముఖ్యత కలిగిన ప్రదేశం.స్కంద పురాణంలో మోదాసామౌలయషా తీర్థంగాసూచించబడిందని నమ్ముతారు.2000 సంవత్సరాలకంటేఎక్కువపురాతనరాయిఈ ప్రాంతలో కనుగొనబడింది.ఇదిఉన్నప్రదేశాన్నిమందసన్ అనిసూచిస్తుంది.గతంలో మోదసను మోధక్ వాస్ లేదా మోహదక్వాస్ అని పిలిచేవారు.

అనేక విభిన్న విశ్వాసాలు,మతాలకు సంబంధించిన దేవాలయాలు పట్టణం అంతటా కనిపిస్తాయి.హిందువులలో,జైనులు,శివఆరాధకులు అనేక సంవత్సరాలు పట్టణంలో ఆధిపత్యం చెలాయించారు.ఢిల్లీ మొదలైన ఉత్తర భారత ప్రాంతాలనుండిమధ్యయుగకాలంలోమక్కాకోసం సూరత్ నౌకాశ్రయానికివెళ్లేప్రయాణికులకుమొదాసామొదటివిశ్రాంతికేంద్రంగా ఉండేది.మోడసా చుట్టూఉన్ననిర్మాణప్రదేశాలు ఒకప్పుడుపట్టణం చుట్టూ ఒకకోట (గోడ) ఉండేదని సూచిస్తుంది.వివరాలుపరిమితంగాఉన్నప్పటికీ గతంలోగుజరాత్‌లోని ముస్లిం సుబాలు,మరాఠాలసైన్యాలుఈపట్టణాన్నికొల్లగొట్టాయనినమ్ముతారు.సుల్తాన్ అహ్మద్ షా I ఆధ్వర్యంలో గుజరాత్ సుల్తానేట్ (1415) సమయంలో ఇది ఒక ముఖ్యమైనపటిష్టతనిఖీసరిహద్దుగా పనిచేసింది.పదహారవ శతాబ్దం చివరిలో ఇది 162 గ్రామాలపరిధిలోప్రధానప్రదేశంగాఉంది,వార్షిక ఆదాయం £80,000 (రూ. 8,00,000) ఉండేది.మొఘలులఆధ్వర్యంలో,3వ వైస్రాయ్ (1577-1583) షహబ్-ఉద్-దిన్,మొదాసాలోని కోటనుమరమ్మత్తుచేసాడు.అక్కడఅశ్విక దళాన్నిఏర్పాటు చేయడంద్వారాదేశంపూర్తిగా స్థిరపడింది.పద్దెనిమిదవ శతాబ్దం (1818) లో మొదాసా నగరం బాగాక్షీణించింది.బ్రిటిష్ నిర్వహణలోకి వచ్చినప్పుడు,పట్టణం చాలా వెనుకబడి ఉంది.నగరంత్వరగాఅభివృద్ది చెందటానికితగుచర్యలలోభాగంగా 1825లో £90,000 (రూ. 9,00,000) మూలధనంతోఅనేకమందివ్యాపారులుకు అవకాశాలు కల్పించారు. [4]

బ్రిటీష్ పాలనలో మోదాసా చుట్టుపక్కల చాలాప్రాంతాలు ఇదార్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ, మోదాసా భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్షనియంత్రణలో ఉంది.ఇది 19వ శతాబ్దం చివరలో కొంత స్థిరత్వాన్నితెచ్చిఉండవచ్చు.మహాత్మాగాంధీనేతృత్వంలోని స్వతంత్ర పోరాట రోజుల్లో,మోదాసా ప్రజలుచాలా చురుకుగాపాల్గొన్నారు.1930ల నుండి మోడసా అహింసా, సత్యాగ్రహాఉద్యమానికి ఒక శక్తివంతమైనప్రదేశంగామారింది.. మోదాసా పేరుతో ఒక బ్రిటిష్ ప్రయాణీకుల నౌక ఉండేది.స్వాన్ హంటర్, విఘమ్ రిచర్డ్‌సన్‌చే నిర్మించబడిన బ్రిటిష్-ఇండియా స్టీమ్ నావిగేషన్ కో యాజమాన్యంలోని ఆరు సమీప-సహోదరి నౌకలలో "ఎస్ఎస్ మోడసా" ఒకటి.[5]

మూలాలు

[మార్చు]
  1. "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.
  2. "Modi's poll knife carves out Aravali". The Times of India. 18 September 2012. Archived from the original on 21 September 2012. Retrieved 1 October 2012.
  3. "Seven new districts to be formed in Gujarat". Daily Bhaskar. Ahmedabad. DNA. 24 January 2013. Retrieved 9 February 2013.
  4. Gazetteer of the Bombay Presidency: Ad (Public Domain text). Government Central Press. 1879. pp. 345–346.
  5. "S.S MODASA, A british India passenger ship". Retrieved 8 Oct 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]