ములుగు జిల్లా
స్వరూపం
తెలంగాణలో ములుగు కేంద్రంగా ములుగు జిల్లా ఏర్పాటైంది. 2019 ఫిబ్రవరి 16న నారాయణపేట జిల్లాతో పాటు ఈ జిల్లా ఏర్పాటైంది.[1] జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ములుగు రెవెన్యూ డివిజన్‌ను విడదీసి, మొత్తం 9 మండలాలతో ఈ జిల్లాను ఏర్పాటుచేశారు.[2] జిల్లా జనాభా 2.94 లక్షలు.
జిల్లా లోని మండలాలు
[మార్చు]కొత్త జిల్లాలో మండలాలవారీగా గ్రామాల సంఖ్య ఇలా ఉంది.
క్ర.సంఖ్య | మండలం | రెవెన్యూ గ్రామాల
మొత్తం సంఖ్య |
అందులో నిర్జన
గ్రామాలు సంఖ్య |
నిర్జన గ్రామాలు పోగా
మిగిలిన రెవెన్యూ గ్రామాలు |
---|---|---|---|---|
1 | ములుగు మండలం | 19 | 02 | 17 |
2 | వెంకటాపూర్ మండలం | 10 | 01 | 09 |
3 | గోవిందరావుపేట | 14 | 04 | 10 |
4 | తాడ్వాయి మండలం | 73 | 32 | 41 |
6 | ఏటూరునాగారం మండలం | 39 | 16 | 23 |
6 | కన్నాయిగూడెం మండలం | 25 | 07 | 18 |
7 | మంగపేట మండలం | 23 | 03 | 20 |
8 | వెంకటాపురం మండలం | 72 | 27 | 45 |
9 | వాజేడు మండలం | 61 | 20 | 41 |
మొత్తం | 336 | 112 | 224 |
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (1)
అవార్డులు
[మార్చు]- కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 2023 సంవత్సరానికి గానూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి ప్రదానం చేసిన నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2023లో ఉత్తమ జిల్లా పంచాయతీలు విభాగంలో సెకండ్ ర్యాంకు అవార్డును (రూ.3కోట్ల నగదు పారితోషం) అందుకుంది.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 18, Revenue (DA-CMRF) Department, Date: 16.02.2019
- ↑ "National Panchayat Awards: తెలంగాణ పల్లెలకు 13 జాతీయ అవార్డులు". Sakshi Education. 2023-04-08. Archived from the original on 2023-04-17. Retrieved 2023-04-18.