మార్సుపీలియా
స్వరూపం
Marsupials Temporal range: Middle Cretaceous - Recent
| |
---|---|
Female Eastern Grey Kangaroo with a joey in her pouch | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Subclass: | |
Infraclass: | మార్సుపీలియా Illiger, 1811
|
Orders | |
మార్సుపీలియా (లాటిన్ Marsupilia) మెటాథీరియాకు చెందిన క్షీరదాల క్రమం. ఇవి ముఖ్యంగా ఆస్ట్రేలియా, పరిసర ద్వీపాలలో ఉంటాయి. అందువల్ల ఆస్ట్రేలియాను 'శిశుకోశ క్షీరదాల భూ'మి (Land of Marsupials) గా వర్ణిస్తారు. కానీ అపోజమ్ మాత్రం అమెరికాలో కనిపిస్తుంది.
సామాన్య లక్షణాలు
[మార్చు]- ఆడజీవులు శిశుకోశాన్ని (Mausupium) కలిగి ఉంటాయి.
- అధిజఘనాస్థులు ఉండి, జఘనాస్థికి అతికి ఉంటాయి. అధిజఘనాస్థులు శిశుకోశానికి ఆధారాన్నిస్తాయి.
- అంసతుండములు, అంతర్ జతృకలు వేర్వేరుగా ఉంటాయి.
- దవడ ప్రతీ అర్ధభాగంలో మూడు కంటే ఎక్కువ కుంతకాలు ఉంటాయి.
- కార్పస్ కల్లోజమ్ అస్పష్టంగా ఉంటుంది.
- పాయువు, మూత్రజననేంద్రియ రంధ్రం ఒకే సంవరణి ద్వారా పనిచేస్తాయి.
- రెండు యోనులు, గర్భాశయాలు ఉంటాయి (డైడెల్ఫిక్ స్థితి).
- శిశూత్పాదక జీవులు, సొనసంచి జరాయువు ఉంటుంది.
- అతి తక్కువ గర్భావధికాలం ఉంటుంది. పిల్లజీవులు అత్యంత అపరిపక్వత దశలో జన్మిస్తాయి. నగ్నంగా, చూపులేకుండా ఉంటాయి.
వర్గీకరణ
[మార్చు]- డైడెల్ఫిమార్ఫియా: ఉ. అపోజమ్.
- పెరామెలిమార్ఫియా: ఉ. పందికొక్కు
- డిప్రోటోడాన్షియా: ఉ. కంగారు, కోలా