మల్లెలతీర్థం
స్వరూపం
మల్లెలతీర్థం మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలో విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కనిపించే ఒక సుందర సహజ జలపాతం. 500 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకే ఈ జలపాతం చూపరులకు కనువిందు చేస్తుంది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో కూడి అత్యంత రమణీయంగా కనిపిస్తుంది., ప్రశాంతమై ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు తప్పనిసరి విహారకేంద్రం.[1]. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి మార్గంలో వచ్చే అమ్రాబాద్ మండలంలోని వట్వర్లపల్లి గ్రామం నుండి 9 కిలోమీటర్లు అడవి మార్గంలో ప్రయాణిస్తే మల్లెలతీర్థం జలపాతానికి చేరుకోవచ్చు[2].అచ్చంపేట నుండి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 50
- ↑ http://mahabubnagar.nic.in