Jump to content

మకరరాశి

వికీపీడియా నుండి
Capricorn
Zodiac Symbol{{{symbol}}}
Duration (Tropical, Western)20 – 19 (2024, UTC)
Constellation{{{constellation}}}
Zodiac Element{{{element}}}
Zodiac Quality{{{quality}}}
Sign ruler{{{domicile}}}
Detriment{{{detriment}}}
Exaltation{{{exaltation}}}
Fall{{{fall}}}
AriesTaurusGeminiCancerLeoVirgoLibraScorpioSagittariusCapricornAquariusPisces

మకరరాశి వారి గుణగణాలు

[మార్చు]

మకరరాశి కాలపురుషుని కర్మ స్థానము. సూర్యుడు ఈ రాశి

లో ప్రవేశించినప్పుటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమౌతుంది. వెంఖటేస్వరస్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము ఈ రాశిలోనిదే. ఈ రాశి వారు జీవితములో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని స్వంతము చేసుకుంటారు. ఇతరులు మొసము చెయ్యనంత వరకు ఇతరులను మోసము చెయాలన్న తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడము వీరి స్వభావము బలహీనత కూడా. పక్కవాళ మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారి తీస్తుంది. తన లోపము తెలిసిన తరువాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చెయ్యరు. అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా పద్ధతి మార్చుకోరు. సాత్విక స్వభావము మాత మిద నిలబడే తత్వము ఉంటాయి. స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికముగా ఉంటుంది. సంతానము వీరి అభీష్టము ప్రకారము నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికముగా స్రమిస్తారు. చిన్నతనము నుండి అధికముగా శ్రమపది చిన్నతనములోనే అధికముగా శ్రమించి అవి సాధించడానికి కృషిచేస్తారు. అనుకున్న దానిని ఎదొ ఒక విధంగా సాధిస్తారు. పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము అధికముగా ఉంటుంది. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారై ఉంటారు. రచనా వ్యాసమ్గము, పరిశోధనా, నతన, కళాఅ సంబంధమైన నైపుణ్యము విశేషముగా ఉంటుంది. వీరు చేసే పనులకు సమానంగా ఇతరులు అనుసరించ లేరు. విరి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకొనబడుతుంది. విరి ప్రతిభ వెలుగులోకి రావడము కష్టము. ధన సంపాదనే ధ్యేయముగా జీవించరు. ఎదో విధముగా ధనము సర్ధుబాటు అయి అవసరాలు గడిచి పొతాయి. అభిమానించే నమ్మిన అనుచర వర్గము వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. స్త్రీల వలన అదృష్టము కలసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. చాలా మందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజాభిమానముతో ఊన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహము అధికముగా ఉంటుంది. బంధువర్గము కంటే బయటి వారి సహాయము అధికముగా అందుతుంది. అంచనాలు చక్కగా పొరబాట్లు లేకుండా వేస్తారు. ఊహలు నిజము ఔతాయి.శని, శుక్ర, బుధదశలు యొగిస్తాయి. ఆధ్యతమక విషయాలలో అమ్కితభావముతో ఉంటారు. సామాజిక సేవ, సామాజిక న్యాయము దైవముగా భావిస్తారు. జీవిత మధ్యకాలములో మోకాల్ల నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటివి వస్తాయి.

మకరరాశి కొన్ని జ్యోతిష విషయాలు

[మార్చు]

రాశి చక్రంలో పదవ స్థానంలో ఉన్న మకర రాశిని 270 డిగ్రీల నుండి 300 డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది. ఈ రాశిని సరి రాశిగాను, శుభ రాశి గాను, స్త్రీరాశిగాను, చర రాశిగానూ వ్యవహరిస్తారు. తత్వం భూమి, శబ్దం అర్ధ శబ్దం, రాత్రి సమయంలో బలం కలిగిన రాశి, పూర్ణ జల రాశి, ఊదయం పృష్టోదయం, సమయం రాత్రి, జాతులు పశువులు, పరిమాణం సమపరిమాణం, జాతి శూద్ర జాతి, సంతానం అల్పం, ప్రకృతి వాతం, వర్ణం కపిల, శ్వేత వర్ణాలు, కాల పురుషుని శరీరభాగాలలో మోకాళ్ళను సూచిస్తుంది. ఈ రాశి సౌమ్య రాశి. ఈ రాశి అధిపతి శని భగవానుడు.

  • నిరయన రవి ఈ రాశిలో పదునాలుగు, పదహైదు తేదీలలో ప్రవేశిస్తాడు.
  • ఈ రాశిలో అయిదవ డిగ్రీలో గురువు నీచ స్థిని పొందగా ఇరవై ఎనిమిదవ డిగ్రీలో కుజుడు ఉచ్ఛస్థితిని పొందుతాడు.
  • ఈ రాశి పాలకులను, పాలనాధికారులను, హస్వ స్వరూపులను సూచిస్తుంది.
  • ఈ రాశి నదులు వన ప్రాంతములను సూచిస్తుంది.
  • ఈ రాశి వారు సౌందర్యవంతులు, ధైర్యవంతులు, ఆలోచనాపరులు, దానపరులై ఉంటారు.
  • ఈ రాశి వారికి రెండు, ఏడు, పన్నెండు, ఇరవై, ఇరవై అయిదు, ముప్పై రెండు సంవత్సరాలలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
  • ఈ రాశి వారికి జలగండం కలిగే అవకాశం ఉంది.
  • ఈ రాశి బొల్లి, వాతము, మానసిక రోగములకు కారకత్వం వహిస్తుంది.

వనరులు

[మార్చు]

\