Jump to content

మంజేశ్వర్

అక్షాంశ రేఖాంశాలు: 12°43′27″N 74°52′27″E / 12.7243°N 74.8743°E / 12.7243; 74.8743
వికీపీడియా నుండి
మంజేశ్వర్
పట్టణం
మంజేశ్వర్ నౌకాశ్రయం
మంజేశ్వర్ నౌకాశ్రయం
మంజేశ్వర్ is located in Kerala
మంజేశ్వర్
మంజేశ్వర్
కేరళ, భారతదేశం
మంజేశ్వర్ is located in India
మంజేశ్వర్
మంజేశ్వర్
మంజేశ్వర్ (India)
Coordinates: 12°43′27″N 74°52′27″E / 12.7243°N 74.8743°E / 12.7243; 74.8743
Country India
Stateకేరళ
Districtకాసరగోడ్
Talukమంజేశ్వరం
Named forమంజుల క్షేత్రం
Government
 • Bodyగ్రామ పంచాయితీ
విస్తీర్ణం
 • Total28.38 కి.మీ2 (10.96 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total41,515
 • జనసాంద్రత1,500/కి.మీ2 (3,800/చ. మై.)
Languages
 • Officialమలయాళం, ఆంగ్లం[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
671323
Telephone code4998
Vehicle registrationKL-14

మంజేశ్వర్ కేరళ రాష్ట్రంలోని ఉత్తర కొనలో కాసరగోడ్ జిల్లాలో గల తీరప్రాంత పట్టణం. అక్కడ ఒక చిన్న రేవు కూడా ఉంది. అది రాష్ట్ర రాజధాని తిరువనంతపురం నుండి 584 కిలోమీటర్లు (360 మైళ్ళు), జిల్లా కేద్రం కాసరగోడ్‌కు ఉత్తరాన 28 కిలోమీటర్లు (20 మైళ్ళు), పొరుగున ఉన్న కర్ణాటకలోని మంగళూరు నగరానికి దక్షిణంగా 30 కిలోమీటర్లు (20 మైళ్ళు) దూరంలో ఉంది.

జనాభా

[మార్చు]
శ్రీమఠం అనంతేశ్వరాలయం, మంజేశ్వర్

సెన్సస్ ఇండియా 2011 భారత జనాబా లెక్కలు ప్రకారం మంజేశ్వర్ జనగణన పట్టణం (సిటి) 3.98 కిమీ² విస్తీర్ణంలో 8,742 జనాభా కలిగి ఉంది, ఇందులో 4,178 మంది పురుషులు, 4,564 మంది మహిళలు ఉన్నారు.

0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1149 మంది ఉన్నారు, ఇది మంజేశ్వర్ (సిటి) మొత్తం జనాభాలో 13.14%. మంజేశ్వర్ సెన్సస్ టౌన్‌లో, స్త్రీ పురుష నిష్పత్తి రాష్ట్ర సగటు 1084కి 1092గా ఉంది. అంతేకాకుండా, కేరళ రాష్ట్ర సగటు 964తో పోలిస్తే మంజేశ్వర్‌లో పిల్లల లింగ నిష్పత్తి 995గా ఉంది.

అక్షరాస్యత

[మార్చు]
జైన్ మందిర్, మంజేశ్వర్

మంజేశ్వర్ నగరం అక్షరాస్యత రేటు 92.91%, ఇది రాష్ట్ర సగటు 94.00% కంటే తక్కువ. మంజేశ్వర్‌లో పురుషుల అక్షరాస్యత దాదాపు 97.53% కాగా స్త్రీల అక్షరాస్యత 88.75%.[3]

ఆరోగ్యం

[మార్చు]

హెచ్‌ఐవీ రోగులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మంజేశ్వర్‌ ఒకటి. కాసర్‌గోడ్ జిల్లాలో 970 హెచ్‌ఐవి కేసులు నమోదయ్యాయి. 2016లో రెండు నెలల స్వల్ప వ్యవధిలో కాసరగోడ్ జిల్లాలో పది హెచ్‌ఐవి మరణాలు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో హెచ్‌ఐవి రోగులకు ప్రత్యేక సదుపాయం కాని, వైద్యులు కాని లేరు. కాసరగోడ్‌లోని హెచ్‌ఐవి ప్రభావిత ప్రాంతాలలో ధర్మతడ్క, నీలేశ్వరం, మంజేశ్వర్, బండియోడ్, వెల్లరికుండు, కాసరగోడ్ పట్టణం, పదన్నక్కడ్ ఉన్నాయి.[4]

మతాలు

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, మంజేశ్వర్ మొత్తం జనాభా 8,742, వారిలో 5,827 మంది ముస్లింలు (66.7%), 2,742 మంది హిందువులు (31.4%), 165 మంది క్రైస్తవులు (1.9%), 28 మంది తమ మతాన్ని పేర్కొనలేదు (0.3%), 4గురు ఇతరులు కేటగిరీ కింద గుర్తించబడ్డారు.[5]

మూలాలు

[మార్చు]
  1. https://censusindia.gov.in › 3...PDF Web results Kasaragod - DISTRICT CENSUS HANDBOOK
  2. "The Kerala Official Language (Legislation) Act, 1969" (PDF). Archived from the original (PDF) on 2016-04-20. Retrieved 2023-09-09.
  3. Kerala, Directorate of Census Operations. District Census Handbook, Kasaragod (PDF). Thiruvananthapuram: Directorateof Census Operations,Kerala. p. 100,101. Retrieved 14 July 2020.
  4. "10 HIV deaths reported in Kasargod dist within 2 months". Archived from the original on 2020-03-09. Retrieved 2023-09-09.
  5. "Religion – Kerala, Districts and Sub-districts". Census of India 2011. Office of the Registrar General.