భారత రాష్ట్రపతి ఎన్నికల విధానం
స్వరూపం
భారతదేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతిని ఎన్నుకునే విధానాన్ని భారత రాజ్యాంగ పరిషత్, ఐర్లాండ్ దేశం నుండి ఆదర్శంగా తీసుకుంది. ప్రతి ప్రాంతంలోని జనాభాను, ఆ ప్రాంత విస్తీర్ణాన్నీ ప్రాతిపదికంగా తీసుకొని ఎన్నికలను నిర్వహిస్తారు. ఆర్టికల్-54 లో రాష్ట్రపతి ఎన్నికల ప్రస్తావన ఉంది. ఎలక్ట్రోరల్ కాలేజి సభ్యులు ఓటర్లుగా ఉంటారు. ఎలక్ట్రోరల్ కాలేజిలో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటర్లుగా ఉంటారు. 1992లో 72 వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలకు ఓటు హక్కు కల్పించారు. దీన్ని భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.[1]
ఓట్ల విలువ
[మార్చు]- ఎలక్ట్రోరల్ కాలేజిలో మొత్తం ఓట్ల విలువ = 10,98,990. అందులో 50 శాతం ఎంపిలకు, 50 శాతం ఎమ్మెల్యేలకు ఉంటుంది.
- ప్రస్తుతం ఎలక్ట్రోరల్ కాలేజిలో 776 (544+223) మంది ఎంపీలు.
- 4120 మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉంటారు.
ఎంపీల ఓట్ల విలువ
[మార్చు]- దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 54,9495. దీన్ని ఎంపీల సంఖ్య 776 తో భాగిస్తారు. అదే 708.112 వస్తుంది.
- దాన్నే 708 గా ఖరారు చేశారు.
ఎమ్మెల్యేల ఓట్ల విలువ
[మార్చు]- ఎమ్మెల్యేలకు మాత్రం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉంటుంది.
- దీన్ని నిర్ణయించడానికి 1971 జనాభాను ప్రాతిపదికన తీసుకుంటారు.
- 1971 నాటి మొత్తం జనాభాను ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్యతో భాగిస్తారు. దానిని వేయితో భాగిస్తారు.[2]
ఉదాహరణ:
- తెలంగాణ రాష్ట్రం మొత్తం జనాభా (1971 జనాభా లెక్కల ప్రకారం) 1,56,02,122.
- దీన్ని 119 ఎమ్మెల్యేలతో భాగించగా 131950.650 వస్తుంది.
- దాన్ని 1000 తో భాగిస్తే 131.95 వస్తుంది.
- దీన్ని ఓటు విలువ 132 గా నిర్ణయించారు.
రాష్ట్రాల వారిగా శాసనసభ్యల ఓట్ల విలువ వివరాలు
[మార్చు]నెం. | రాష్ట్రం | జనాభా (1971) | అసెంబ్లీ సీటు | ఓటు విలువ | రాష్ట్ర ఓట్ల విలువ |
---|---|---|---|---|---|
1 | ఉత్తర ప్రదేశ్ | 8,38,49,905 | 403 | 208 | 83,824 |
2 | తమిళనాడు | 4,11,99,168 | 234 | 176 | 41,184 |
3 | జార్ఖండ్ | 1,42,27,133 | 81 | 176 | 14,256 |
4 | తెలంగాణ | 1,57,02,122 | 119 | 132 | 15,708 |
5 | ఆంధ్రప్రదేశ్ | 2,78,00,586 | 175 | 159 | 27,825 |
6 | మహారాష్ట్ర | 5,04,12,235 | 288 | 175 | 50,400 |
మూలాలు
[మార్చు]- ↑ "Indian Presidential Election: రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు, ఎలక్ట్రోరల్ కాలేజ్ అంటే ఏంటి? - BBC News తెలుగు". web.archive.org. 2024-11-24. Archived from the original on 2024-11-24. Retrieved 2024-11-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Andhrajyothi 16 july 2017