ప్రియమణి
స్వరూపం
ప్రియమణి | |
జన్మ నామం | ప్రియ వాసుదేవ్ మణి అయ్యర్ |
జననం | పాలక్కడ్, కేరళ, భారతదేశం | 1994 జూన్ 4
క్రియాశీలక సంవత్సరాలు | 2004 - ఇప్పటి వరకు |
ప్రియమణి ప్రముఖ దక్షిణాది నటి. పరుత్తివీరన్ లోని నటనకు 2006 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారమును పొందింది.తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలలో దాదాపు 20 [ఆధారం చూపాలి] చిత్రాలలో నటించింది. రావణ్ చిత్రం ద్వారా హిందీ చిత్రసీమ లోకి అడుగు పెట్టింది.[1] ఎవరే అతగాడు ప్రియమణికి మొదటి సినిమా.[2]
నేపధ్యము
[మార్చు]ప్రియమణి జూన్ 4న 1994కేరళలోని పాలక్కడ్‌లో జన్మించింది. తండ్రి వసుదేవ మణి అయ్యర్. తల్లి లతా మణి అయ్యర్. ఆమె అసలు పేరు ప్రియ వసుదేవ మణి అయ్యర్. దాన్నే పొట్టిగా ప్రియమణి అని స్క్రీన్ నేమ్ పెట్టుకుంది.
నటజీవితము
[మార్చు]- బీఏ చేసిన ప్రియమణి సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలో అడుగుపెట్టింది.
- తెలుగులో మొదట 2003లో 'ఎవరే అతగాడు?' సినిమాతో తెరంగేట్రం చేసినా.. ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. తర్వాత తమిళంవైపు కొన్నాళ్లు దృష్టి పెట్టి మళ్లీ 'పెళ్ళైనకొత్తలో..' అంటూ హీరో జగపతి బాబుతో జతకట్టింది. ఈ సినిమాతో ప్రియమణి సుడి తిరిగిపోయింది. ఒకేసారి తెలుగులో మూడు అవకాశాలు వచ్చి చేరాయి.
- ఆ తర్వాత 'యమదొంగ'లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. అప్పటి వరకూ తెలుగింటి అమ్మాయిలా సంస్కారవంతంగా ఉన్న ప్రియ ద్రోణాతో గ్లామర్ డాల్ అవతారమెత్తింది.
- అలా నటిగా బాగా బిజీ అయ్యింది. అప్పట్నుంచి మిత్రుడు, ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, రాజ్, రక్తచరిత్ర.. ఇలా చాలా చిత్రాల్లో నటించి మంచి ప్రశంసలు పొందింది.
- కేవలం హీరోల సరసన హీరోయిన్ క్యారెక్టర్లే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలవైపు దృష్టి సారించింది. ఒక రకంగా చెప్తే ప్రయోగాలు చేసిందనే చెప్పాలి. అలా వచ్చినవే క్షేత్రం, చారులత, చండి.
- ఈ రెండు సినిమాల్లోనూ చక్కటి నటనా చాతుర్యాన్ని ప్రదర్శించింది. విమర్శకులు సైతం వహ్వా అనేలా చేసింది. అందుకు ఉదాహరణ చారులతకు వచ్చిన అవార్డులే.
- తెలుగు చిత్రాలతో పాటు మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా నటిస్తోంది. అటు తమిళంలో కూడా మేటి హీరోయిన్స్‌లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకుంది.
- ప్రియకి నార్త్ ఇండియన్ వంటకాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా రవ్వదోశ. తీరిక సమయంలో సంగీతం వినడం, నృత్యం చేయడం ఈమె హాబీలు! ఇంకా చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్, కుక్కపిల్లలు, పిల్లి పిల్లలంటే ఈ కేరళ కుట్టికి చాలా ఇష్టం.
- కేవలం హీరోయిన్‌గానే కాకుండా రగడ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చింది. కలెక్షన్ల వర్షంతో రికార్డులు సృష్టించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో కూడా గెస్ట్‌గా ఒక పాటలో ఓ వెలుగు వెలిగింది.మలయాళంలో ఓ డ్యాన్స్ షోకి న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు | మూ |
---|---|---|---|---|---|
2003 | ఎవరే అతగాడు | రేఖ | తెలుగు | ప్రియగా ఘనత పొందింది | [3] |
2004 | కంగలాల్ కైధు సెయి | విద్యా | తమిళం | ||
సత్యం | సోనా | మలయాళం | |||
2005 | అదు ఒరు కన కాలం | తులసి | తమిళం | ||
ఒట్ట నానయం | రేష్మా | మలయాళం | |||
2006 | పెళ్ళైన కొత్తలో | లక్ష్మి | తెలుగు | ||
మధు | దయ | తమిళం | |||
2007 | పరుత్తివీరన్ | ముత్తఝగు | తమిళం | ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు (2006) | |
టాసు | నైనా | తెలుగు | |||
యమదొంగ | మహేశ్వరి | తెలుగు | |||
నవ వసంతం | అంజలి | తెలుగు | |||
మలైకోట్టై | మలార్ | తమిళం | |||
2008 | తొట్ట | నళినా | తమిళం | ||
తిరక్కత | మాళవిక | మలయాళం | |||
హరే రామ్ | అంజలి | తెలుగు | |||
కింగ్ | నర్తకి | తెలుగు | ప్రత్యేక ప్రదర్శన (నువ్వు రెడీ నేను రెడీ పాట) | ||
2009 | ద్రోణ | ఇంధు | తెలుగు | ||
మిత్రుడు | ఇందు | తెలుగు | |||
పుతియా ముఖం | అంజన | మలయాళం | |||
ఆరుముగం | యామిని | తమిళం | |||
నినైతలే ఇనిక్కుమ్ | మీరా | తమిళం | |||
ప్రవరాఖ్యుడు | శైలజ | తెలుగు | |||
రామ్ | పూజ | కన్నడ | |||
2010 | శంభో శివ శంభో | మునిమ్మ | తెలుగు | ||
సాధ్యం | సుహాని | తెలుగు | |||
గోలీమార్ | పవిత్ర | తెలుగు | |||
రావణుడు | జముని | హిందీ | |||
రావణన్ | వెన్నిలా | తమిళం | |||
ప్రాంచియెట్టన్ మరియు సెయింట్ | పద్మశ్రీ | మలయాళం | |||
ఎనో ఒంటారా | మధుమతి | కన్నడ | |||
రక్త చరిత్ర II | భవానీ | హిందీ | ద్విభాషా చిత్రం (తమిళంలో కూడా పాక్షికంగా రీషాట్ చేయబడింది) | ||
రగడ | ప్రియ/అష్టలక్ష్మి | తెలుగు | |||
2011 | రాజ్ | మైథిలి | తెలుగు | ||
క్షేత్రం | నాగ పెంచలమ్మ/
సోహిని అగర్వాల్ |
తెలుగు | |||
విష్ణువర్ధనుడు | మీరా | కన్నడ | |||
2012 | కో కో | కావేరి | కన్నడ | ||
అన్నా బాండ్ | మీరా | కన్నడ | |||
గ్రాండ్ మాస్టర్ | దీప్తి | మలయాళం | |||
చారులత | చారు \ లత | కన్నడ
తమిళం |
ద్విభాషా చిత్రం | ||
2013 | లక్ష్మి | ప్రియా | కన్నడ | ||
చెన్నై ఎక్స్‌ప్రెస్ | నర్తకి | హిందీ | ప్రత్యేక ప్రదర్శన (పాట 1-2-3-4 గెట్ ఆన్ ది డ్యాన్స్ ఫ్లోర్) | ||
చండీ | గంగ/చండీ | తెలుగు | |||
2014 | ఆలిస్: ఎ ట్రూ స్టోరీ | ఆలిస్/ఉమా | మలయాళం | ||
నంజలుడే వీట్టిలే అతిధికల్ | భావన | మలయాళం | |||
అంబరీష | స్మిత | కన్నడ | |||
2015 | రాన్నా | నర్తకి | కన్నడ | ప్రత్యేక ప్రదర్శన (పాట ఏమి చేయాలి) | |
2016 | కథే చిత్రకథే నిర్దేశనా పుట్టన్న | గీతాంజలి | కన్నడ | ||
కల్పన 2 | కల్పన | కన్నడ | |||
దాన కాయోను | జగదాంబ (ఝుమ్మీ) | కన్నడ | |||
ఈడోల్లే రామాయణం | సుశీల | కన్నడ
తెలుగు |
ద్విభాషా చిత్రం | ||
2017 | చౌకా | మరియా డి సౌజా | కన్నడ | ||
2018 | ధ్వజ | రమ్య | కన్నడ | ||
ఆషిక్ వన్నా దివాసం | శైని | మలయాళం | |||
2019 | పతినెట్టం పాడి | గౌరీ వాసుదేవ్ | మలయాళం | అతిధి పాత్ర | |
నాన్న ప్రకార | డా. అమృత | కన్నడ | [4] | ||
2020 | అటీట్ | జాన్వీ | హిందీ | జీ5 చిత్రం | [5] |
2021 | నారప్ప | సుందరమ్మ | తెలుగు | అమెజాన్ ప్రైమ్ ఫిల్మ్ | [6] |
2022 | భామాకలాపం | అనుపమ మోహన్ | తెలుగు | ఆహా సినిమా | [7] |
విరాట పర్వం | కామ్రేడ్ భరతక్క | తెలుగు | [8] | ||
సలామ్ వెంకీ | అడ్వా. నంద కుమార్ | హిందీ | అతిధి పాత్ర | ||
డాక్టర్ 56 | ప్రియా కృష్ణ | కన్నడ
తమిళం |
ద్విభాషా చిత్రం | [9] | |
2023 | కస్టడీ | ముఖ్యమంత్రి దాక్షాయణి | తెలుగు
తమిళం |
ద్విభాషా చిత్రం | [10] |
జవాన్ | లక్ష్మి | హిందీ | [11] | ||
నేరు | పూర్ణిమ | మలయాళం | [12] | ||
2024 | భామా కలాపం 2 | అనుపమ మోహన్ | తెలుగు | [13] | |
ఆర్టికల్ 370 | రాజేశ్వరి స్వామినాథన్ | హిందీ | [14] | ||
కొటేషన్ గ్యాంగ్ † | TBA | [15] | |||
ఖైమారా † | TBA | కన్నడ | చిత్రీకరణ | [16] | |
మైదాన్ † | TBA | హిందీ | పూర్తయింది | [17] |
సిరివెన్నెల (2021)
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | నెట్‌వర్క్ | గమనికలు |
---|---|---|---|---|---|
2019–ప్రస్తుతం | ది ఫ్యామిలీ మ్యాన్ | సుచిత్ర తివారీ | హిందీ | అమెజాన్ ప్రైమ్ వీడియో | |
2021 | హిస్ స్టోరీ | సాక్షి | హిందీ | ఆల్ట్ బాలాజీ, జీ5 | |
2023 | సర్వం శక్తి మయం | ప్రియా | హిందీ | జీ5 |
హోస్ట్
[మార్చు]సంవత్సరం | కార్యక్రమం | భాష | ఛానెల్ | గమనికలు |
---|---|---|---|---|
2014 | D 4 డాన్స్ | మలయాళం | మజావిల్ మనోరమ | |
2015 | D 2 - D 4 డాన్స్ | |||
డ్యాన్సింగ్ స్టార్ 2 | కన్నడ | ETV కన్నడ | ||
2016 | డ్యాన్సింగ్ స్టార్ జూనియర్స్ | |||
డాన్స్ రాజులు | తమిళం | స్టార్ విజయ్ | ||
D 3 - D 4 డాన్స్ | మలయాళం | మజావిల్ మనోరమ | ఉత్తమ సెలబ్రిటీ జడ్జికి ఆసియావిజన్ టెలివిజన్ అవార్డు | |
డ్యాన్సింగ్ స్టార్ 3 | కన్నడ | కన్నడ రంగులు | ||
2017 | D4 జూనియర్ v/s సీనియర్స్ | మలయాళం | మజావిల్ మనోరమ | |
డాన్స్ జోడి డ్యాన్స్ 2 | తమిళం | జీ తమిళం | ||
ఢీ 10 | తెలుగు | ఈటీవీ తెలుగు | ||
2018–2019 | ఢీ 11 | ఈటీవీ తెలుగు | ||
2018–2019 | డాన్స్ కేరళ డాన్స్ | మలయాళం | జీ కేరళం | |
2019 | టీస్ బెస్ట్ పార్టనర్ | మజావిల్ మనోరమ | ||
కేరళ డ్యాన్స్ లీగ్ | అమృత టీవీ | ప్రముఖ న్యాయమూర్తి | ||
D5 జూనియర్ | మజావిల్ మనోరమ | గ్రాండ్ ఫినాలే జ్యూరీ | ||
ఫేమస్ ఫిల్మ్ ఫేర్ | మలయాళం
కన్నడ |
MX ప్లేయర్ | హోస్ట్ | |
2019–2020 | కామెడీ స్టార్స్ | మలయాళం | ఏషియానెట్ | పునరావృత న్యాయమూర్తి |
2019–2020 | కామెడీ స్టార్స్ వీకెండ్ ఛాలెంజ్ | ఏషియానెట్ | ||
డాన్స్ జోడి డ్యాన్స్ 3.0 | తమిళం | జీ తమిళ్ | ||
2020 | ఢీ ఛాంపియన్స్ | తెలుగు | ఈటీవీ తెలుగు | |
2021 | ఢీ 13 | |||
2022 | ఢీ 14 డ్యాన్స్ ఐకాన్ |
లఘు చిత్రాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | ఛానెల్ | గమనికలు |
---|---|---|---|---|---|
2017 | హ్యాండ్ అఫ్ గాడ్ | ఎలీనా | మలయాళం | మజావిల్ మనోరమ | |
2019 | వైట్ | బ్లైండ్ లేడీ | ఆంగ్ల | యూట్యూబ్ |
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Priyamaniకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ప్రియమణి పేజీ
మూలాలు
[మార్చు]- ↑ "Women actors must be treated more fairly: Priya Mani". The New Indian Express. Retrieved 2021-11-23.
- ↑ "Evare Athagadu (2003) | Evare Athagadu Telugu Movie | Evare Athagadu Review, Cast & Crew, Release Date, Photos, Videos – Filmibeat". FilmiBeat (in ఇంగ్లీష్).
- ↑ Srihari, Gudipoodi (14 January 2003). "Triangular match". The Hindu. Archived from the original on 28 September 2007.
- ↑ Joy, Prathibha. "Priya Mani joins Kishore in Kannada crime thriller". The Times of India. Retrieved 1 July 2022.
- ↑ "I don't want to rush into projects: 'Ateet' actress Priyamani". The New Indian Express. Retrieved 5 October 2020.
- ↑ "Priyamani in asuran Telugu remake". The New Indian Express. Retrieved 3 January 2020.
- ↑ Correspondent, Special (19 January 2022). "Priyamani in 'Bhamakalapam'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 21 January 2022.
- ↑ Vyas (1 May 2019). "Priyamani Roped in for Rana's Next". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 3 January 2020.
- ↑ "Priya Mani's next film Dr 56 is her 56th film". The Times of India. 2 June 2020.
- ↑ "Arvind Swami, Priyamani, Vennela Kishore and others join Naga Chaitanya's NC22". 14 October 2022.
- ↑ "Nayanthara, Priya Mani, Yogi Babu in Shah Rukh Khan's film with Atlee". The Times of India.
- ↑ "After Shah Rukh Khan's Jawan, Priyamani bags her next with a big superstar; Details inside". PINKVILLA (in ఇంగ్లీష్). 2023-09-13. Archived from the original on 2023-10-07. Retrieved 2023-10-05.
- ↑ [1]
- ↑ "Article 370 Teaser: Yami Gautam and Priyamani promise powerful performances. Watch:". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2024-01-22.
- ↑ "Priyamani's Quotation Gang goes on floors". The Times of India (in ఇంగ్లీష్). 7 December 2020. Retrieved 30 September 2021.
- ↑ Lokesh, Vinay. "Priya Mani joins Priyanka Upendra and Chaya Singh for horror thriller". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 10 November 2020.
- ↑ India Today (19 January 2020). "The Family Man's Priyamani replaces Keerthy Suresh in Ajay Devgn's Maidaan" (in ఇంగ్లీష్). Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.