ప్రగతి
ప్రగతి సచిత్రవారపత్రిక 1969, మార్చి 21వ తేదీన సౌమ్య నామ సంవత్సర ఉగాది రోజున ప్రారంభమయ్యింది. మద్దుకూరి చంద్రశేఖరరావు ప్రధాన సంపాదకుడిగా, బొల్లిముంత శివరామకృష్ణ సహాయసంపాదకుడిగా ఈ పత్రిక విజయవాడ నుండి వెలువడింది. 1974 నుండి ముక్కామల నాగభూషణం సంపాదకులుగా ఉన్నారు.
రచనలు
[మార్చు]ఈ పత్రిక ద్వారా దాశరథి రంగాచార్య వ్రాసిన చిల్లరదేవుళ్లు, వాసిరెడ్డి సీతాదేవి రచించిన సమత, వైతరణి , పోలాప్రగడ సత్యనారాయణమూర్తి వ్రాసిన నవోదయం, నవీన్ వ్రాసిన విచలిత, పోల్కంపల్లి శాంతాదేవి వ్రాసిన నిశిరాత్రిలో నక్షత్రప్రభలు, లత రచించిన నరకానికి నిచ్చెనలు, సత్యం శంకరమంచి వ్రాసిన పిచ్చిగీతలు, తోటకూర ఆశాలత స్పందన మొదలైన నవలలు వెలువడ్డాయి.
రచయితలు
[మార్చు]పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ముద్దంశెట్టి హనుమంతరావు, సింగరాజు లింగమూర్తి, బి.పి.కరుణాకర్, దాశరథి కృష్ణమాచార్య, ముద్దుకృష్ణ, యం.కె.సుగమ్‌బాబు, కె.వి.రమణారెడ్డి, మానేపల్లి సత్యనారాయణ, చందు సుబ్బారావు, కొడవటిగంటి కుటుంబరావు, సెట్టి ఈశ్వరరావు, సుధామ, వేగుంట మోహనప్రసాద్, ఆరుద్ర, దూపాటి సంపత్కుమారాచార్య, ఆవంత్స సోమసుందర్, పవని నిర్మల ప్రభావతి, కొనకళ్ళ వెంకటరత్నం, నిఖిలేశ్వర్, శ్రీశ్రీ, గజ్జెల మల్లారెడ్డి, నందం రామారావు, నంబూరి పరిపూర్ణ, కాటూరి రవీంద్ర త్రివిక్రమ్, మిరియాల రామకృష్ణ, మంజుశ్రీ, కె.శివారెడ్డి, ఉన్నవ విజయలక్ష్మి, ఇచ్ఛాపురపు రామచంద్రం, వరవరరావు, గుంటూరు శేషేంద్రశర్మ మొదలైన వారు ఈ పత్రికకు రచనలు చేశారు.
శీర్షికలు
[మార్చు]ఈ పత్రికలో సంపాదకీయం, సీరియళ్లు, కథలు, కవితలు, వ్యాసాలతో పాటు ఉత్తరాలు, నీవూ నీ చుట్టూ ప్రపంచం, ఏం చోద్యం, మామయ్య డిక్షనరీ, పాతకథే వన్స్‌మోర్, తెలిసిన విషయం, ఇదీభారతం, చిన్నారిలోకం, ఛలోక్తులు, పుస్తకపరిచయం, సినిమా, పూలూ-రాలూ, జాబులు-జవాబులు, ప్రకృతి వింతలు, పాత అచ్చులో కొత్త కథ, పాత సామెతకు కొత్త ఆమెత, ట్యూన్లూ - కార్ట్యూన్లూ, వనితావాణి, విజ్ఞానప్రగతి, జంతు ప్రపంచం, ఆరోగ్య నిధి, వైద్యసలహాలు మొదలైన శీర్షికలు ఉన్నాయి.