పోతురాజు
పోతరాజు లేదా పోతురాజు pōtu-rāju. n. గంగమ్మ, పెద్దమ్మ లాంటి గ్రామదేవత ల తమ్ముడిగా పూజలు అందుకునేవాడు. "పాడు ఊరికి మంచపుకోడు పోతురాజు" అనేది తెలుగు సామెత. in a ruined village the leg of a cot is a god. cf., 'a Triton of the minnows' (Shakespeare.)
పోతురాజు లేకుండా ఏ కొలుపు, ఏ జాతర, ఏ తిరునాళ్లు, ఏ బోనాలు జరగవు. అంత ముఖ్యమైనవాడు ఈ పోతురాజు.[1] మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, మారమ్మ ,ఈదమ్మ, దుర్గమ్మ, మహంకాళి, పెద్దమ్మ మొదలైన దేవతలందరి కోటకు కావలిగా పోత లింగమై శివుని ఆజ్ఞ మేరకు నిలుస్తాడు పోతురాజు.[2]
గ్రామదేవత ఉత్సవాలలో పూనకంతో వున్న పోతరాజు తన దంతాలతో మేక పోతును కొరికి, తలను మోండెం నుండి వేరుచేసి పైకి ఎగురవేస్తాడు, దీనినే గావు పెట్టడం అంటారు. గ్రామ దేవతల ఊరేగింపులో ముందుగా పోతు రాజు విగ్రహము ముందుంటుంది. ఈ ఊరేగింపులో కొందరు పురుషులు పోతు రాజు వేషం ధరించి ఆడుతారు. అలాగే పురాణ సంబంధిత నాటకాలు వేసే టప్పుడు ముందుగా పోతురాజు విగ్రహాన్ని పెట్టి నాటకము ఆడుతారు.
చిత్రమాలిక
[మార్చు]-
పోతురాజు విగ్రహము. మొగరాల మహాభారత నాటకములో తీసిన చిత్రము
-
గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలోని పోతరాజు విగ్రహం
-
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా 2022, సెప్టెంబరు 17న హైదరాబాదులోని నక్లెస్ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు జరిగిన కళాయాత్రలో పాల్గొన్న పోతరాజు కళాకారులు
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (13 July 2019). "'అమ్మ దేవతల' తమ్ముడు మన పోతురాజు". ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి. Archived from the original on 14 July 2019. Retrieved 14 July 2019.
- ↑ మనతెలంగాణ, లైఫ్ స్టైల్ (14 July 2019). "నూటొక్క శక్తి దేవతల తమ్ముడు జానపదుల పోతురాజు". Archived from the original on 14 July 2019. Retrieved 14 July 2019.