Jump to content

పిండి

వికీపీడియా నుండి


పిండి, పొడి లేదా చూర్ణం ఆహారధాన్యాల నుండి తయారుచేసే మెత్తని పదార్ధము. ఇది ప్రపంచంలోకెల్లా ప్రధాన ఆహారమైన రొట్టికి మూలం. అమెరికా, ఐరోపా ఖండాలలో గోధుమ పిండి ముఖ్యమైనది. జొన్న పిండి ప్రాచీనమైన మెసపుటోమియా, లాటిన్ అమెరికా సంస్కృతులలో ముఖ్యమైనది. ఈ ధాన్యాలను మిల్లు లేదా పిండి మరలో ఆడించి పిండిగా చేస్తారు. కొన్నింటిలో పొట్టును వేరుచేయాల్సి ఉంటుంది.

పిండి చేసిన గింజలలో ముఖ్యంగా పిండి పదార్ధాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు లేదా పాలీసాకరైడ్లు వీనిలో ప్రధానమైనవి.

పప్పు ధాన్యాలు పిండి చేసే విధానం (పిండి మర ఆడించుట)

భాషా విశేషాలు

[మార్చు]

పిండి [ piṇḍi ] pinḍi. తెలుగు n. Flour. బియ్యములోనగు వాని పొడి. సంస్కృతం n. A multitude. సమూహము. వెన్నెల పిండి ఆరపోసినట్టుగా నున్నది there is bright moonlight. తెలికపిండి a residue of sesamum seeds after the oil is extracted, oil-cake. ఈ మాట పిండికిని పడును పిడుగుకును పడును this is equivocal, it is neither chalk nor cheese. పిండిబలపము a whitish kind of slate stone. పిండిరాయి a soft kind of stone; also a mica or slate. బలపము, పిండి మిరియము a sauce made of herbs and chillies mixed with rice flour. పేలపిండి flour of parched grain. పిండికూర or పిండిబొద్దికూర pinḍi-kūra. n. A kind of vegetable. పిండిదొండ pinḍi-donḍa. n. The herb called Acrua lanata. (Watts.) H. iv. 12. పిండివంటలు pinḍi-vanṭalu. n. Pastry, cakes.

పిండిలో రకాలు

[మార్చు]
  • గోధుమ పిండి :
  • మైదా పిండి
  • వరి పిండి :
  • శెనగ పిండి :
  • నువ్వు పిండి :
  • కంది పొడి
  • నువ్వుల పొడి
  • కారం పొడి

పిండి ఉపయోగాలు

[మార్చు]
  • ప్రతి రోజూ మనం తినే రొట్టెలు, చపాతీ, పూరీ, పరాఠా మొదలైనవి చేసుకోవాలంటే గోధుమ పిండి అవసరం.
  • రకరకాల అట్లు లేదా దోసెలు కొన్నింటికి మూలమైనది పిండి. కొన్ని అట్లు ఒకటి కంటే ఎక్కువ పిండి రకాలు కలిపి చేస్తారు.
  • పిండి వంటలు అన్నింటికి పిండి ఒక మూల పదార్థం.
  • కొన్ని రకాల పొడుల్ని మసాలా దినుసులతో ఉప్పు, కారం కలిపి ఉపాహారంగా నంచుకోవడానికి వాడుతాము. నువ్వుల పొడి, కంది పొడి, మొదలైనవి.

తయారుచేయు విధానం

[మార్చు]
  • ముందుగా పిండి చేయాల్సిన ఆహార ధాన్యాల్ని కావలసినన్నింటిని తడి లేకుండా ఎండబెట్టాలి. రాళ్ళు లేకుండా ఏరుకోవాలి. కొన్నింటిని ముందుగా కడగవలసి వుంటుంది.
  • రోలు, రోకలి ఉపయోగించి దంచుకొని, మధ్య మధ్యలో పిండి జల్లెడతో జల్లించి పిండిని, నూకల్ని వేరుచేసుకోవచ్చును. ఇలా మళ్ళీ మళ్ళీ దంచుకొంటుంటే మొత్తం గింజలన్నీ పిండిగా మారిపోతాయి. కొద్దిగా మిగిలిపోవచ్చును.
  • ఈ ఆధునిక కాలంలో పిండి మరలో కావలసిన వాటిని శుభ్రం చేసుకున్న తర్వాత క్షణాల్లో పిండిగా మార్చవచ్చును.
  • కొన్ని సందర్భాలలో పిండి నుండి పొట్టును వేరుచేయడానికి సన్నని జల్లెడ పట్టించాల్సి వస్తుంది.