Jump to content

బారసాల

వికీపీడియా నుండి
(నామకరణ దినోత్సవం నుండి దారిమార్పు చెందింది)

బిడ్డ పుట్టిన తరువాత మొదటిసారిగా ఊయలలో వేసే కార్యక్రమాన్ని బారసాల లేదా నామకరణ డోలారోహణ లేదా నామకరణం అంటారు. దీని అసలు పేరు బాలసారె. అది వాడుకలోకి వచ్చేసరికి బారసాల అయింది.[1] దీన్ని బిడ్డ పుట్టిన 21వ రోజున చేస్తారు. ఆరోజున బంధువులు, ఇరుగు పొరుగు వారు వచ్చి పసిబిడ్డను ఆశీర్వదించి, తాంబూలము పుచ్చుకొని వెళతారు. ఇది భారతదేశంలోని హిందువులు నవజాత శిశువుకు పేరు పెట్టే సంప్రదాయ వేడుక. అసలైతే భారత వర్షం అనాలి. ఇప్పటి ఈరాన్ ప్రాంతం,east Kaspean ప్రాంతాల నుండి ఇండోనేషియా ఫిజి ద్వీపాల వరకు భారత వర్షంగా పిలువబడేది. ఈ రోజు మాతా శిశువు లకు నూతన వస్త్రాల తో అలంకరించి, ముత్తయిదువులకు పసుపు పారాణి పండ్లు నూతన వస్త్రాలు సమర్పించి తల్లీ బిడ్డలు ఆశీర్వాదం తీసుకుంటారు.పురోహితుడు తల్లికి,తండ్రికి,నవజాత శిశువులకు వేద మంత్రాలతో ఆశీర్వాదం చేస్తాడు.బియ్యం ఒక పళ్ళెంలో పేర్చి ఆ బియాం మీద శివువుకు పెట్టల్సిన పేరును (3పేర్లు)బంగారు లేదా వెండి లేదా రాగి పుల్లతో వ్రాస్తారు.తరువాత శిశువు తల్లి నూతిలో చేద వేసి నీరు 3సార్లు తోడుతుంది. ఇది నీరును( ఆపః ) దైవం గా భావించి పూజించడం.ఈ సృష్టిలోని ప్రతీ ప్రాణికి లభించే ఆహారానికి నీరే ఆధారం.నీరు లేనిది ఏ ప్రాణీ బ్రతక లేదు.తరువాత బిడ్డను తొట్లే అనగా ఊయలలో పరుండబెట్టి కనీసం 5 లాలి పాటలు ఆలాపిస్తారు.తరువాత శిశువుకు చెవిలో నామకరణం చేసిన పేర్లతో పిలుస్తారు. బంధు మిత్రులను ఆహ్వానించి విందు ఏర్పాటు చేస్తారు. .రామాయణ కాలంనుండి కూడా ఈ 21వ రోజునాడు నవజాత శిశువులకు పేరు పెట్టడం అనే ఆచారం ఉన్నది.సనాతన ధర్మం అనగా హిందూ ధర్మంలో షోడశ సంస్కారాలలో(16 Ceremonies)బారసాల ఒకటి.శిశువుకు 1 నక్షత్ర నామం,2.మాసనామం,3.వ్యవహార నామం అని 3 పేర్లు పెడతారు. యూదులు ఈ వేడుకను జావేద్ హబాత్ లేదా బ్రిట్ మిలా పేరిట జరుపుకుంటారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో, శిశు బాప్టిజం వేడుక బాలసరాను పోలి ఉంటుంది. పురాతన గ్రీస్, పర్షియాలో కూడా దీనిని జరుపుకున్నారు.

ఆది శంకరాచార్యులు క్రీ.పూ 2000 లో బారసాలను ప్రారంభించాడు

విధానం

[మార్చు]

బారసాల సాధారణంగా పిల్లల పుట్టిన 11 వ రోజు, 16 వ రోజు, 21 వ రోజు, 3 వ నెల లేదా 29 వ నెలలో జరుపుకుంటారు. ఈ వేడుకకు బ్రాహ్మణులు పవిత్రమైన ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. దీనిని ఆలయంలో లేదా ఇంట్లో నిర్వహిస్తారు. ఈ వేడుక ముందు, కొన్ని పూజలు చేయడానికి ఇంటిని బాగా శుభ్రం చేస్తారు. రోజు, శిశువుకు స్నానం చేసి, దుస్తులు ధరించి, ఊయలలో ఉంచుతారు. మొదట విఘ్నేశ్వర పూజ చేస్తారు. తరువాత పుణ్యః వచనము చేస్తారు. తరువాత కటి సూత్రధారణ (మ్రొలత్రాడు) చేస్తారు. పేరును కొందరు జన్మ నక్షత్రం ప్రకారం పెడతారు. మరికొందరు వారికి యిష్టమైన పేరును పెడతారు.

సాంప్రదాయ పాటలు పాడటానికి మహిళలు ఊయల చుట్టూ గుమిగూడుతారు. ఈ కార్యక్రమంలో తల్లిని గౌరవిస్తారు. బిడ్డను కుటుంబం, సమాజంలోని పెద్దలు ఆశీర్వదిస్తారు. తండ్రి శిశువు పేరును శిశువు చెవిలో మూడుసార్లు గుసగుసలాడుతూ చెబుతాడు. నేలపై లేదా పళ్ళెంలో పరచిన బియ్యం మీద కూడా ఈ పేరు వ్రాస్తారు. పిల్లల మామయ్య ఆవు పాలు, తేనె మిశ్రమంలో ముంచిన బంగారు ఉంగరాన్ని తీసుకొని శిశువు నాలుకపై ఉంచుతాడు. అప్పుడు పెద్దలు పిల్లలకి మంచి పేరు సంపాదించాలనీ, గొప్ప వ్యక్తి కావాలనీ, ఉజ్వల భవిష్యత్తును పొందాలనీ దీవిస్తారు.

హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడికి, కూతురికి, పుట్టిన బాబుకో లేక పాపకో బట్టలు పెట్టాలి. మన సాంప్రదాయం ప్రకారం వచ్చిన వారికి పండు తాంబూలం, పెట్టదలచు కుంటే చుట్టాలకు భోజనము పెట్టవచ్చు. ఇదే రోజున ఉయ్యాలలో వేయటము, బావిలో చేద వేయటం అనే కార్యక్రమాలు చేస్తారు. బావిలో చేద వేయటం అంటే అంత వరకు ఆ అమ్మాయి పనులేమి చేయదు కనుక ఆ రోజున బావిలో చేద వేయించి ఆమె అన్నీ పనులు చేయ వచ్చు అని చెప్పటం కోసం అన్న మాట.

ఇక గ్రహణం సమయమున అంటే గ్రహణం ఏర్పడిన రోజున బారసాల చేయి వచ్చునా?

చేయవచ్చును. అయితే, గ్రహణ శూలం సమయమును లెక్కించి పన్నెండు గంటల ముందు, పన్నెండు గంటల తరువాత సమయమును ఎంచు కొనవలెను. అంటే గ్రహణం ఏర్పడడానికి పన్నెండు గంటల ముందు లేదా గ్రహణం ఏర్పడిన తరువాత పన్నెండు గంటల తరువాత ఈ బారసాల కార్యక్రమమును నిర్వహించు కొన వచ్చును.(ధర్మ సింధు)

నామకరణం

[మార్చు]

హిందూ ఆచారాల ప్రకారం జన్మ నక్షత్రం ప్రకారం, నక్షత్రంలో జన్మించిన పాదం ప్రకారం ఈ క్రింది అక్షరంతో ప్రారంభమైన పేర్లను పెడతారు.

  1. అశ్విని - చూ - చే - చో - ల
  2. భరణి - లి - లూ - లే - లో
  3. కృత్తిక - ఆ - ఈ - ఊ - ఏ
  4. రోహిణి - ఓ - వా - వీ - వూ
  5. మృగశిర - వే - వో - కా - కి
  6. ఆరుద్ర -కూ - ఖం - జ్ఞా - చ్చా
  7. పునర్వసు - కే - కో - హా - హీ
  8. పుష్యమి - హూ - హే - హో - డా
  9. ఆశ్లేష - డి - డు - డె - డో
  10. మఖ - మా - మీ - మూ - మే
  11. పుబ్బ - మో - టా - టీ - టూ
  12. ఉత్తర - టే - టో - పా - పీ
  13. హస్త - పూ - ష - ణా - ఠా
  14. చిత్త - పే - పో - రా - రీ
  15. స్వాతి - రూ - రే - రో - త
  16. విశాఖ - తీ - తూ - తే - తో
  17. అనూరాధా - నొ - నీ -నూ - నే
  18. జ్యేష్ఠ - నో - యా - యీ - యూ
  19. మూల - యే - యో - బా - బి
  20. పూర్వాషాఢ - బూ - ధా - భా - ఢ
  21. ఉత్తరాషాఢ - బే - బో - జా - జీ
  22. శ్రవణం - జూ - జే - జో - ఖా
  23. ధనిష్ఠ -గా - గీ - గూ - గే
  24. శతభిషం - గో - సా - సీ - సూ
  25. పూర్వాభాద్ర - సే - సో - దా - దీ
  26. ఉత్తరాభాద్ర - దు - శ్యం - ఝూ - థా
  27. రేవతి - దే - దో - చా - చీ

మూలాలు

[మార్చు]
  1. "బారసాల అంటే ఏమిటి - Baarasala ante emiti". Telugu Bhaarath (in ఇంగ్లీష్). Archived from the original on 2020-10-31. Retrieved 2020-04-18.