దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు
మారుపేరు | ప్రొటీస్ | ||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
అసోసియేషన్ | క్రికెట్ దక్షిణాఫ్రికా | ||||||||||||
వ్యక్తిగత సమాచారం | |||||||||||||
టెస్టు కెప్టెన్ | టెంబా బావుమా | ||||||||||||
ఒన్ డే కెప్టెన్ | టెంబా బావుమా | ||||||||||||
Tట్వంటీ I కెప్టెన్ | ఐడెన్ మార్క్రమ్ | ||||||||||||
కోచ్ | శుక్రి కాన్రాడ్ (టెస్ట్) రాబ్ వాల్టర్ (పరిమిత ఓవర్లు) | ||||||||||||
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | |||||||||||||
ICC హోదా | పూర్తి సభ్యత్వం (1909) | ||||||||||||
ICC ప్రాంతం | ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ | ||||||||||||
| |||||||||||||
టెస్టులు | |||||||||||||
మొదటి టెస్టు | v ఇంగ్లాండు సెయింట్ జార్జ్ పార్క్, పోర్ట్ ఎలిజబెత్, 12–13 మార్చి 1889 | ||||||||||||
చివరి టెస్టు | v వెస్ట్ ఇండీస్ వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్ వద్ద; 8–11 మార్చి 2023 | ||||||||||||
| |||||||||||||
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో పోటీ | 2 (first in 2019–2021) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | 3వ స్థానం (2021–2023) | ||||||||||||
వన్డేలు | |||||||||||||
తొలి వన్డే | v భారతదేశం ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా వద్ద; 10 నవంబరు 1991 | ||||||||||||
చివరి వన్డే | v ఆస్ట్రేలియా ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా వద్ద; 16 నవంబరు 2023 | ||||||||||||
| |||||||||||||
పాల్గొన్న ప్రపంచ కప్‌లు | 8 (first in 1992) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | సెమీ-ఫైనలిస్ట్ (1992, 1999, 2007, 2015, 2023) | ||||||||||||
ట్వంటీ20లు | |||||||||||||
తొలి టి20ఐ | v న్యూజీలాండ్వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్ వద్ద; 21 అక్టోబరు 2005 | ||||||||||||
చివరి టి20ఐ | v ఆస్ట్రేలియాకింగ్స్మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్ వద్ద ; 3 సెప్టెంబరు 2023 | ||||||||||||
| |||||||||||||
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ | 8 (first in 2007) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | సెమీ-ఫైనలిస్ట్ (2009, 2014) | ||||||||||||
అధికార వెబ్ సైట్ | https://cricket.co.za/ | ||||||||||||
| |||||||||||||
As of 16 November 2023 |
దక్షిణాఫ్రికా పురుషుల జాతీయ క్రికెట్ జట్టు, పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA) నిర్వహణలో ఉంటుంది. దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)లో పూర్తి స్థాయి సభ్యురాలు. ఈ జట్టును ప్రోటీస్ అని కూడా పిలుస్తారు. దక్షిణాఫ్రికా జాతీయ పుష్పం, ప్రొటీయా సైనరాయిడ్స్ నుండి ఈ పేరు వచ్చింది.
దక్షిణాఫ్రికా, 1888-89 సీజన్లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు ఆతిథ్యం ఇచ్చిన సమయంలోనే ఫస్ట్-క్లాస్, అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించింది. ప్రారంభంలో, జట్టు ఆస్ట్రేలియా లేదా ఇంగ్లండ్‌తో సరిపోలలేదు కానీ, అనుభవం, నైపుణ్యాలను సంపాదించి, 20వ శతాబ్దం మొదటి దశాబ్దం నాటికి వారు గట్టి పోటీ ఇవ్వగల జట్టును రంగంలోకి దించగలిగారు. 1960ల వరకు క్రమం తప్పకుండా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లతో ఆడుతూ వచ్చింది. ఆ సమయంలో దేశం ఆచర్రిస్తున్న వర్ణవివక్ష విధానానికి ప్రపంచదేశాల్లో గణనీయమైన వ్యతిరేకత ఉండేది. ఇతర ప్రపంచ క్రీడా సంస్థలు తీసుకున్న చర్యలకు అనుగుణంగా ICC కూడా దక్షిఉణాఫ్రికా జట్టుపై అంతర్జాతీయ నిషేధం విధించింది. నిషేధం విధించబడినప్పుడు దక్షిణాఫ్రికా జట్టు, ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయికి, ఆస్ట్రేలియాను కూడా ఓడించేంత స్థాయికి అభివృద్ధి చెందింది.
నిషేధం 1991 వరకు కొనసాగింది, ఆ తర్వాత దక్షిణాఫ్రికా మొదటిసారిగా భారత్, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్‌లతో ఆడింది. జట్టు పునఃస్థాపన నుండి బలంగా ఉంది. అనేక సార్లు అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో నంబర్-వన్ స్థానాలను పొందింది. వన్డే క్రికెట్లో అత్యంత విజయవంతమైన జట్లలో దక్షిణాఫ్రికా కూడా ఒకటి. ఆడిన మ్యాచ్‌లలో 60 శాతానికి పైగా విజయం సాధించింది.[8] అయినప్పటికీ, ICC-నిర్వహించిన టోర్నమెంట్లలో అది గెలుచుకున్న టోర్నమెంటు, 1998 ఛాంపియన్స్ ట్రోఫీ ఒక్కటే. 1998 కామన్వెల్త్ క్రీడల్లో దక్షిణాఫ్రికా స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.[9]
2022 అక్టోబరు నాటికి, జట్టు ప్రస్తుతం వన్డేలలో 6వ స్థానంలో, T20Iలలో 4వ స్థానంలో, టెస్టుల్లో 4వ స్థానంలో ఉంది.[10]
టోర్నమెంటు చరిత్ర
[మార్చు]ప్రారంభ అభివృద్ధి
[మార్చు]1652 ఏప్రిల్ 6 న డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రస్తుత కేప్ టౌన్ సమీపంలోని టేబుల్ బేలో కేప్ కాలనీ అని పిలిచే ఒక స్థావరాన్ని స్థాపించడంతో దక్షిణ ఆఫ్రికాలో ఐరోపా వలసపాలన ప్రారంభమైంది. 17వ, 18వ శతాబ్దాల కల్లా లోతట్టు ప్రాంతాలకు విస్తరించింది. ఇది డచ్ ఈస్ట్ ఇండీస్ వర్తక మార్గం కోసం ఒక విక్చువలింగ్ స్టేషనుగా మొదలైంది. అయితే అక్కడి మంచి సారవంతమైన భూమి, ఖనిజ సంపద కారణంగా త్వరలోనే ప్రాముఖ్యతను పొందింది. 1795 లో జనరల్ సర్ జేమ్స్ హెన్రీ క్రెయిగ్ ఆధ్వర్యంలోని బ్రిటిషు దళాలు కేప్ కాలనీని స్వాధీనం చేసుకునే వరకు దక్షిణాఫ్రికాలో బ్రిటిషు వారు ఆసక్తి చూపలేదు. నెపోలియన్ యుద్ధాల సమయంలో ఈ ప్రాంతంలో ఫ్రెంచ్ ప్రయోజనాలను ఎదుర్కోవడానికి 1806లో బ్రిటిష్ వారు కేప్ కాలనీని రెండవసారి స్వాధీనం చేసుకున్న తరువాత, కేప్ కాలనీ శాశ్వత బ్రిటిష్ స్థావరంగా మారిపోయింది. ప్రపంచంలోని ఇతర వలస ప్రాంతాలలో లాగానే, ఇక్కడ కూడా క్రికెట్ ఆటను పరిచయం చేసింది. ఇది వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. దక్షిణాఫ్రికాలో మొట్టమొదటిసారిగా రికార్డ్ చేయబడిన క్రికెట్ మ్యాచ్ 1808లో కేప్ టౌన్లో రెండు సర్వీస్ జట్ల మధ్య వెయ్యి రిక్స్-డాలర్ల బహుమతితో పోటీ జరిగింది. [11]
టెస్టులు
[మార్చు]1889లో, ఓవెన్ రాబర్ట్ డునెల్ కెప్టెన్‌గా పోర్ట్ ఎలిజబెత్‌లో ఇంగ్లండ్‌తో ఆడినప్పుడు దక్షిణాఫ్రికా మూడో స్థానంలో నిలిచింది.[12] వెంటనే, కేప్ టౌన్లో 2వ టెస్టు ఆడారు. అయితే, ఈ రెండు మ్యాచ్‌లు, అన్ని టూరింగ్ జట్లకు వ్యతిరేకంగా పూర్వపు 'సౌత్ ఆఫ్రికా XI' పాల్గొన్న అన్ని ప్రారంభ మ్యాచ్‌ల మాదిరిగానే, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మూడూ కలిసి ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసే వరకు అధికారిక 'టెస్టులు' మ్యాచ్‌ల హోదాను పొందలేదు. 1906లో. మేజర్ వార్టన్ ఆధ్వర్యంలో పర్యటించిన ఇంగ్లాండ్ జట్టు కూడా తాను ఇంగ్లీష్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకోలేదు; ఆ మ్యాచ్‌లు 'మేజర్ వార్టన్స్ XI' v/s 'సౌత్ ఆఫ్రికన్ XI' గా చెప్పుకున్నారు. పాల్గొన్న ఆటగాళ్లకు కూడా వారు అంతర్జాతీయ క్రికెట్ ఆడినట్లు తెలియదు. దక్షిణాఫ్రికాతో ఆడిన ఇంగ్లాండ్ జట్టు బలహీనమైన కౌంటీ ఆటగాళ్ళతో కూడినదిగా పరిగణించారు. ఈ జట్టుకు ససెక్స్‌కు చెందిన ఒక మంచి మీడియం పేసర్ అయిన సి. ఆబ్రే స్మిత్ కెప్టెన్‌గా ఉన్నాడు. 'సౌత్ ఆఫ్రికా XI' చాలా బలహీనంగా ఉంది, ఇంగ్లండ్‌తో రెండు టెస్టులను సునాయాసంగా కోల్పోయింది. కేప్ టౌన్లో జరిగిన రెండవ టెస్టులో ఇంగ్లీష్ స్పిన్నర్ జానీ బ్రిగ్స్ 28 పరుగులిచ్చి 15 వికెట్లు తీసుకున్నాడు. అయితే, ఆల్బర్ట్ రోజ్-ఇన్స్ పోర్ట్ ఎలిజబెత్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన మొదటి దక్షిణాఫ్రికా బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
1900ల ప్రారంభంలో, బోనర్ మిడిల్టన్, జిమ్మీ సింక్లైర్, చార్లీ లెవెల్లిన్, డేవ్ నర్స్, లూయిస్ టాన్క్రెడ్, ఆబ్రే ఫాల్క్‌నర్, రెగ్గీ స్చ్వార్జ్, పెర్సీ షెర్వెల్, టిప్ స్నూక్, బెర్ట్ వోగ్లర్, గోర్డాన్ వైట్ వంటి స్టార్లతో కూడిన మొదటి ప్రపంచ స్థాయి దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఆవిర్భవించింది. ఏ అంతర్జాతీయ జట్టుకైనా చెమట్లు పట్టించగల ఆటగాళ్ళు వారు. సింక్లెయిర్ (టెస్ట్ చరిత్రలో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన బ్యాట్స్‌మెన్), నర్స్, టాన్క్రెడ్, ఆల్-రౌండర్ ఫాల్క్‌నర్, షేర్వెల్, స్నూకర్, వైట్ వంటి బ్యాట్స్మెన్లను కలిగి ఉండటంతో పాటు, దక్షిణాఫ్రికన్లు ప్రపంచంలోనే మొదటి (నిస్సందేహంగా గొప్ప) గూగ్లీలో నైపుణ్యం కలిగిన స్పిన్ దాడిని అభివృద్ధి చేశారు. దక్షిణాఫ్రికా గూగ్లీ క్వార్టెట్‌లో గొప్పవాడు స్క్వార్జ్, ఇతను గూగ్లీ ఆవిష్కర్తగా పరిగణించబడే ఇంగ్లీష్ గూగ్లీ బౌలర్ బెర్నార్డ్ బోసాంక్వెట్ నుండి ప్రేరణ పొంది, అతని కాలంలోని అత్యంత వినాశకరమైన గూగ్లీ బౌలర్‌గా అభివృద్ధి చెందాడు. అతను ఆల్‌రౌండర్ ఫాల్క్‌నర్, మీడియం-పేసర్ వోగ్లర్, స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ వైట్లకు గూగ్లీ రహస్యాలను శ్రద్ధగా బోధించాడు. ఈ నలుగురు కలిసి ఒక క్వార్టెట్‌ను ఏర్పాటు చేశారు. ఇది దక్షిణాఫ్రికాను టెస్ట్ క్రికెట్లో అపూర్వమైన ఎత్తులకు నడిపించడం ప్రారంభించింది. [13] దక్షిణాఫ్రికాకు ఈ కాలంలో మరో ముఖ్యమైన శక్తి ఫాల్క్‌నర్, లెవెల్లిన్ల ఆల్‌రౌండ్ ప్రదర్శనలు. ఫాల్క్‌నర్ అంతర్జాతీయ ఆటలో దక్షిణాఫ్రికా తరఫున మొదటి గొప్ప ఆల్-రౌండర్‌గా పరిగణించబడ్డాడు. కొంతమంది మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు కాలంలో ప్రపంచంలోనే గొప్ప ఆల్-రౌండర్‌గా కూడా పరిగణించబడ్డాడు. [14]
అంతర్జాతీయ నిషేధం
[మార్చు]వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో 1970 లో ICC, పర్యటనలపై నిషేధం విధించింది.[15] ఈ నిర్ణయం వలన గ్రేమ్ పొలాక్, బారీ రిచర్డ్స్, మైక్ ప్రోక్టర్ వంటి ఆటగాళ్ళు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ఆడే అవకాశం లేకుండా పోయింది. దీంతో అలన్ లాంబ్, రాబిన్ స్మిత్, కెప్లర్ వెసెల్స్ వంటి భవిష్యత్ స్టార్లు దక్షిణాఫ్రికా నుండి వలస వెళ్ళడానికి కూడా దారిస్తీసింది. క్లైవ్ రైస్, విన్సెంట్ వాన్ డెర్ బిజ్ల్ వంటి నాటి ప్రపంచ స్థాయి క్రికెటర్లు, బలమైన ఫస్టు క్లాస్ రికార్డులు ఉన్నప్పటికీ, ఎప్పుడూ టెస్టు క్రికెట్ ఆడలేదు.
సప్తవర్ణ దేశం
[మార్చు]ICC 1991లో దక్షిణాఫ్రికాను టెస్టు దేశంగా పునఃస్థాపన చేసింది. 1970 తరువాత తొలి అంతర్జాతీయ మ్యాచ్ (దాని మొట్టమొదటి వన్డే ఇంటర్నేషనల్ కూడా) కలకత్తాలో 1991 నవంబరు 10 న భారత్‌పై ఆడి, 3 వికెట్లతో ఓడిపోయింది. పునరాగమనం తర్వాత మొదటి టెస్టు మ్యాచ్ 1992 ఏప్రిల్‌లో వెస్టిండీస్‌తో ఆడింది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 52 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ప్రపంచ క్రికెట్ లోకి దక్షిణాఫ్రికా తిరిగి వచ్చినప్పటి నుండి వారు మిశ్రమ విజయాన్ని సాధించారు. 2003 లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వారి ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చారు. అయితే అలన్ డోనాల్డ్, షాన్ పొలాక్, గ్యారీ కిర్‌స్టన్, జాక్వెస్ కల్లిస్, హాన్సీ క్రోన్యే వంటి వారితో కూడిన జట్టు సాధించగలిగిన దానికంటే తక్కువే సాధించిందని భావిస్తారు. జట్టు "చోకర్స్" (వత్తిడిలో తడబడేవారు) అని పేరు పొందింది. ఎందుకంటే, వరల్డ్ కప్ పోటీల్లో నాలుగు సార్లు జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, ఫైనల్స్‌కు వెళ్లడంలో మాత్రం విఫలమైంది. 1990ల రెండవ భాగంలో, వన్డేలలో దక్షిణాఫ్రికా జట్టుకు మరే జట్టుకూ లేనంత అత్యధిక విజయాల శాతం ఉంది. కానీ వారు 1996 ప్రపంచ కప్‌లో క్వార్టర్-ఫైనల్స్‌లో పరాజయం పాలయ్యారు. 1999 ఆపైలో ఆస్ట్రేలియాతో సెమీ-ఫైనల్‌ను టై చేసుకోవడంతో కౌంట్‌బ్యాక్‌లో నిష్క్రమించారు.
వారి అత్యంత ప్రసిద్ధ అంతర్జాతీయ విజయం 1998లో తొలి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం. ఈ 1998 జట్టులో కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతకాన్ని కూడా గెలుచుకుంది.
21వ శతాబ్దపు ప్రోటీస్
[మార్చు]
2003 ప్రపంచ కప్‌లో, దక్షిణాఫ్రికా ఫేవరెట్లలో ఒకటిగా ఉంది, అయితే ఒక గ్రూప్ మాచ్లో తమకు అవసరమైన పరుగుల సంఖ్యను పొరపాటుగా లెక్కించిన కారణంగా గ్రూప్ దశల్లో కేవలం ఒక్క పరుగుతో నిష్క్రమించారు. 2002 ICC ఛాంపియన్స్ ట్రోఫీ, 2007 ICC వరల్డ్ ట్వంటీ20 తో సహా ప్రపంచ స్థాయి టోర్నమెంట్లలో విఫలమైనందుకు వారిపై పలు విమర్శలొచ్చాయి. [16]
డొనాల్డ్ పదవీ విరమణ చేయడంతో, క్రోన్యే మ్యాచ్ ఫిక్సింగ్పై నిషేధం విధించారు. ఆ తరువాత అతను విమాన ప్రమాదంలో మరణించాడు. పొల్లాక్ కూడా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవ్వడంతో, జట్టు మరోసారి రూపు మార్చుకుంది. గ్రేమ్ స్మిత్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు, అయితే స్మిత్, జాక్వెస్ కాలిస్లకు గాయాలవడంతో, ఆష్వెల్ ప్రిన్స్‌ను 2006 జూలై 12 న టెస్టు కెప్టెన్‌గా నియమించారు. 29 సంవత్సరాల వయస్సులో, అతను ఒకప్పుడు పూర్తిగా తెల్లగా ఉన్న దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన మొదటి శ్వేతజాతీయేతర వ్యక్తి అయ్యాడు. ఆ జాతి క్యాజిల్ా విధానం 2007లో రద్దు చేయబడినప్పటికీ, [17] 2016లో ఆమోదించబడిన కొత్త నియమం ప్రకారం, సీజన్లో జరిగే మ్యాచ్‌లలో జట్టు సగటున కనీసం ఆరుగురు నల్లజాతి ఆటగాళ్లను కలిగి ఉండాలి, అందులో ఇద్దరు బ్లాక్ ఆఫ్రికన్లు ఉండాలి. [18]
ఎబి డివిలియర్స్, హషీమ్ ఆమ్లా వంటి హై-క్లాస్ ఆటగాళ్లు చేరడంతో, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఐసిసి ర్యాంకింగ్స్‌లో పెరగడం ప్రారంభించింది. 2000 ల ప్రారంభంలో ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియన్ జట్టులోని అనేక మంది ప్రధాన ఆటగాళ్ళు పదవీ విరమణ చేసిన తర్వాత, ICC టెస్టు ఛాంపియన్‌షిప్‌లో నంబరు వన్ స్థానం ఓపెన్ రేసుగా మారింది. భారత్, ఇంగ్లండ్‌లు కొద్ది కాలాల పాటు నంబరు వన్‌గా ఉన్నాయి. 2012లో దక్షిణాఫ్రికా మూడు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించినపుడు ఆ సీరీస్‌లో విజేతగా నిలిచిన జట్టు ప్రపంచ నంబరు 1గా నిలుస్తుంది. దక్షిణాఫ్రికా ఆ సిరీస్‌ను 2-0తో సునాయాసంగా కైవసం చేసుకుని, ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ స్థానాన్ని 2012 ఆగస్టు 20 నుండి పూర్తిగా సంవత్సర కాలం పాటు నిలుపుకుంది [19] ఎనిమిది రోజుల తర్వాత, 2012 ఆగస్టు 28 న, దక్షిణాఫ్రికా, ఆట మూడు ఫార్మాట్లలోనూ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన మొదటి జట్టుగా అవతరించింది.[20]
2014 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పాల్గొంది. అందులో విజేత ప్రపంచ నంబరు 1 జట్టుగా నిలుస్తుంది. ఆస్ట్రేలియా 2-1తో ఆ సిరీస్‌ను కైవసం చేసుకుంది.[21] ఏడాది తర్వాత దక్షిణాఫ్రికా మళ్లీ నంబరు 1 ర్యాంక్‌ను పొందింది. 2020 మే 4 నాటికి దక్షిణాఫ్రికా, టెస్టు క్రికెట్లో 6వ స్థానంలో ఉంది.[22]
2014 ICC వరల్డ్ ట్వంటీ 20. 2015 ICC క్రికెట్ ప్రపంచ కప్ కంటే ముందు దక్షిణాఫ్రికా విజయ సూత్రం కోసం వెతుకుతున్నందున, టెస్టు రంగంలో ఆధిపత్యం చెలాయించే ఈ సమయంలో, వన్డే, T20I ప్రదర్శనలు చాలా తక్కువ స్థిరంగా ఉన్నాయి. 2013 జనవరిలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో చెప్పుకోదగ్గ వన్డే సిరీస్ ఓటమి, శ్రీలంకలో కూడా ఎదురైన ఓటమి దక్షిణాఫ్రికా జట్టులోని ఇటీవలి కష్టాలను ఎత్తి చూపింది. 2012 ICC వరల్డ్ ట్వంటీ 20, 2013 ICC ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించడం ప్రధాన టోర్నమెంట్లలో 'చోకర్స్' అనే దక్షిణాఫ్రికా కీర్తి మరింత విస్తరించడానికి మాత్రమే ఉపయోగపడింది. స్మిత్ కెరీర్లో చివరి సంవత్సరాల్లో దక్షిణాఫ్రికా, ఆట చిన్న రూపాల్లో కెప్టెన్సీని విభజించింది. వన్డే జట్టుకు AB డివిలియర్స్, T20I జట్టుకు ఫాఫ్ డు ప్లెసిస్ నాయకత్వం వహించారు. స్మిత్ రిటైర్మెంట్ తర్వాత, హషీమ్ ఆమ్లా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. శ్రీలంకలోని గాలేలో అతని కెప్టెన్సీలో జరిగిన మొదటి టెస్టులో జట్టు విజయం సాధించింది.
టెస్టులు
[మార్చు]
అంతర్జాతీయ మైదానాలు
[మార్చు]చరిత్ర
[మార్చు]ICC ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్
[మార్చు]ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ రికార్డు | ||||||||||||||||||
సంవత్సరం | లీగ్ వేదిక | ఫైనల్ హోస్ట్ | చివరి | తుది స్థానం | ||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Pos | మ్యాచ్‌లు | Ded | PC | Pts | PCT | |||||||||||||
P | W | L | D | T | ||||||||||||||
2019–21[23] | 5/9 | 13 | 5 | 8 | 0 | 0 | 6 | 600 | 264 | 44 | రోజ్ బౌల్, ఇంగ్లాండ్ | DNQ | 5వ | |||||
2021–23 | 3/9 | 15 | 8 | 6 | 1 | 0 | 0 | 180 | 100 | 55.6 | ది ఓవల్, ఇంగ్లాండ్ | DNQ | 3వ |
క్రికెట్ ప్రపంచ కప్
[మార్చు]నేను రౌండ్ | II రౌండ్ | సెమీ ఫైనల్స్ | చివరి | SA కోచ్ | SA కెప్టెన్ | |||
---|---|---|---|---|---|---|---|---|
1992 క్రికెట్ ప్రపంచ కప్ | ||||||||
SA | ENG | మైక్ ప్రోక్టర్ | కెప్లర్ వెసెల్స్ | |||||
1996 క్రికెట్ ప్రపంచ కప్ | ||||||||
SA | WI | బాబ్ వూల్మెర్ | హాన్సీ క్రోన్యే | |||||
1999 క్రికెట్ ప్రపంచ కప్ | ||||||||
SA | SA | AUS | బాబ్ వూల్మెర్ | హాన్సీ క్రోన్యే | ||||
2003 క్రికెట్ ప్రపంచ కప్ | ||||||||
SA | ఎరిక్ సైమన్స్ | షాన్ పొల్లాక్ | ||||||
2007 క్రికెట్ ప్రపంచ కప్ | ||||||||
SA | SA | AUS | మిక్కీ ఆర్థర్ | గ్రేమ్ స్మిత్ | ||||
2011 క్రికెట్ ప్రపంచ కప్ | ||||||||
SA | NZ | కొర్రీ వాన్ జిల్ | గ్రేమ్ స్మిత్ | |||||
2015 క్రికెట్ ప్రపంచ కప్ | ||||||||
SA | SA | NZ | రస్సెల్ డొమింగో | AB డివిలియర్స్ | ||||
2019 క్రికెట్ ప్రపంచ కప్ | ||||||||
SA | ఒట్టిస్ గిబ్సన్ | ఫాఫ్ డు ప్లెసిస్ |
ఛాంపియన్స్ | సెమీ-ఫైనలిస్టులు | క్వార్టర్ ఫైనలిస్టులు | గ్రూప్ దశ నాకౌట్లు | |||||
---|---|---|---|---|---|---|---|---|
దక్షిణాఫ్రికా CWC రికార్డు | ||||||||
0 | 4 | 2 | 2 |
† 1975 నుండి 1987 వరకు ప్రపంచ కప్‌ల కోసం, దక్షిణాఫ్రికా ICC సభ్యుడు కాదు, అందువల్ల టోర్నమెంట్లో పాల్గొనడానికి అనర్హులు.
ICC T20 ప్రపంచ కప్
[మార్చు]సూపర్ 8/10/12 | సెమీ ఫైనల్స్ | చివరి | SA కోచ్ | SA కెప్టెన్ | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
2007 ప్రపంచ T20 | |||||||||
SA | మిక్కీ ఆర్థర్ | గ్రేమ్ స్మిత్ | |||||||
2009 ప్రపంచ T20 | |||||||||
SA | Pakistan | మిక్కీ ఆర్థర్ | గ్రేమ్ స్మిత్ | ||||||
2010 ప్రపంచ T20 | |||||||||
SA | కొర్రీ వాన్ జిల్ | గ్రేమ్ స్మిత్ | |||||||
2012 ప్రపంచ T20 | |||||||||
SA | గ్యారీ కిర్‌స్టన్ | AB డివిలియర్స్ | |||||||
2014 ప్రపంచ T20 | |||||||||
SA | India | రస్సెల్ డొమింగో | ఫాఫ్ డు ప్లెసిస్ | ||||||
2016 ప్రపంచ T20 | |||||||||
SA | రస్సెల్ డొమింగో | ఫాఫ్ డు ప్లెసిస్ | |||||||
2021 T20 ప్రపంచ కప్ | |||||||||
SA | మార్క్ బౌచర్ | టెంబ బావుమా | |||||||
2022 T20 ప్రపంచ కప్ | |||||||||
SA | మార్క్ బౌచర్ | టెంబ బావుమా |
ఛాంపియన్స్ | సెమీ-ఫైనలిస్టులు | సూపర్ KOలు | |||||
---|---|---|---|---|---|---|---|
దక్షిణాఫ్రికా WT20 రికార్డు | |||||||
0 | 2 | 6 |
ICC ఛాంపియన్స్ ట్రోఫీ
[మార్చు]సమూహ దశలు | సెమీ ఫైనల్స్ | చివరి | SA కోచ్ | SA కెప్టెన్ | ||||
---|---|---|---|---|---|---|---|---|
1998 ఛాంపియన్స్ ట్రోఫీ | ||||||||
SA | SA | SA | బాబ్ వూల్మెర్ | హాన్సీ క్రోన్యే | ||||
2000 ఛాంపియన్స్ ట్రోఫీ | ||||||||
SA | IND | షాన్ పొల్లాక్ | ||||||
2002 ఛాంపియన్స్ ట్రోఫీ | ||||||||
SA | IND | ఎరిక్ సైమన్స్ | షాన్ పొల్లాక్ | |||||
2004 ఛాంపియన్స్ ట్రోఫీ | ||||||||
SA | గ్రేమ్ స్మిత్ | |||||||
2006 ఛాంపియన్స్ ట్రోఫీ | ||||||||
SA | WIN | మిక్కీ ఆర్థర్ | గ్రేమ్ స్మిత్ | |||||
2009 ఛాంపియన్స్ ట్రోఫీ | ||||||||
SA | మిక్కీ ఆర్థర్ | గ్రేమ్ స్మిత్ | ||||||
2013 ఛాంపియన్స్ ట్రోఫీ | ||||||||
SA | ENG | గ్యారీ కిర్‌స్టన్ | AB డివిలియర్స్ | |||||
2017 ఛాంపియన్స్ ట్రోఫీ | ||||||||
SA | రస్సెల్ డొమింగో | AB డివిలియర్స్ |
ఛాంపియన్స్ | సెమీ-ఫైనలిస్టులు | గ్రూప్ నాకౌట్లు | ||||||
---|---|---|---|---|---|---|---|---|
ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా రికార్డు | ||||||||
1 | 4 | 3 |
కామన్వెల్త్ గేమ్స్‌లో దక్షిణాఫ్రికా
[మార్చు]సమూహ దశలు | సెమీ ఫైనల్స్ | స్వర్ణ పతకం | కోచ్ | కెప్టెన్ | ||||
---|---|---|---|---|---|---|---|---|
1998 | ||||||||
SA | SA | SA | బాబ్ వూల్మెర్ | షాన్ పొల్లాక్ |
సన్మానాలు
[మార్చు]ICC
[మార్చు]- ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ :
- మూడవ స్థానం (1): 2021-2023
- T20 ప్రపంచ కప్ :
- సెమీఫైనలిస్టులు (2): 2009, 2014
- ఛాంపియన్స్ ట్రోఫీ :
- ఛాంపియన్స్ (1): 1998
ఇతరులు
[మార్చు]- కామన్వెల్త్ గేమ్స్ :
- బంగారు పతకం (1): 1998
జట్టు రంగులు
[మార్చు]కాలం | కిట్ తయారీదారు | చొక్కా స్పాన్సర్ |
---|---|---|
1992–1996 | ISC | |
1997–2001 | అడిడాస్ | క్యాజిల్ |
1999 ICC ప్రపంచ కప్ | ఆసిక్స్ | స్టాండర్డ్ బ్యాంక్ |
2001–2005 | అడ్మిరల్ | క్యాజిల్ |
2005–2007 | హమ్మల్ | క్యాజిల్ |
స్టాండర్డ్ బ్యాంక్ | ||
2008–2011 | రీబాక్ | క్యాజిల్ |
2011–2015 | అడిడాస్ | స్టాండర్డ్ బ్యాంక్ |
క్యాజిల్ | ||
2016–2021 | కొత్త బ్యాలెన్స్ | స్టాండర్డ్ బ్యాంక్ |
2021-ప్రస్తుతం | ఆముదం |
ప్రస్తుత స్క్వాడ్
[మార్చు]ఇది క్రికెట్ దక్షిణాఫ్రికాతో ఒప్పందం కుదుర్చుకున్న, 2022 ఏప్రిల్ నుండి దక్షిణాఫ్రికా తరపున ఆడిన లేదా ఇటీవలి టెస్ట్, వన్డే లేదా T20I స్క్వాడ్లలో పేరు పొందిన ప్రతి క్రియాశీల ఆటగాడి జాబితా. ఇంతవరకూ ఆడని ఆటగాళ్ళ పేర్లు ఇటాలిక్‌లలో చూపించాం. (2023 ఏప్రిల్ 3 నాటికి నవీకరించబడింది)
2023–24 కాలానికి, CSA 20 మంది ఆటగాళ్లకు జాతీయ కాంట్రాక్టులను అందజేసింది. సెలెక్టర్లు టెస్ట్, వన్డే, ట్వంటీ 20 అంతర్జాతీయ జట్ల కోర్‌ను ఎంచుకుంటారు.[24] కాంట్రాక్టుల్లో లేని ఆటగాళ్ళు కూడా ఎంపికకు అర్హులే. వారు సాధారణ ఎంపికను పొందినట్లయితే, క్రికెట్ సౌత్ ఆఫ్రికా కాంట్రాక్ట్‌కు అప్‌గ్రేడ్ అవుతారు.
థియునిస్ డి బ్రుయిన్ ఈ కాలంలో దక్షిణాఫ్రికాకు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు, అయితే ఈ మధ్య అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. [25]
- ఫారమ్‌లు - ఇది వారి మొత్తం దక్షిణాఫ్రికా కెరీర్లో కాకుండా గత సంవత్సరంలో దక్షిణాఫ్రికా తరపున ఆడిన ఫారమ్‌లను సూచిస్తుంది.
- సి – క్రికెట్ సౌతాఫ్రికాకు ఒప్పందం (Y = ఒప్పందంలో ఉన్నాడు)
- S/N - షర్ట్ నంబర్
పేరు | వయసు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | దేశీయ జట్టు | రూపాలు | కాం | చొక్కా సంఖ్య | కెప్టెన్ | చివరి టెస్టు | చివరి వన్డే | చివరి T20I |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాటర్లు | |||||||||||
టెంబా బావుమా | 34 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | లయన్స్ | టెస్టులు, వన్డే, టి20ఐ | Y | 11 | టెస్టులు, వన్డే (C) | 2023 | 2023 | 2023 |
మాథ్యూ బ్రీట్జ్కే | 26 | కుడిచేతి వాటం | — | ఈస్టర్న్ ప్రావిన్స్ | T20I | — | — | — | — | — | |
డీన్ ఎల్గార్ | 37 | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ | టైటన్స్ | టెస్టులు | Y | 64 | 2023 | 2018 | — | |
సరేల్ ఎర్వీ | 35 | ఎడమచేతి వాటం | — | డాల్ఫిన్స్ | టెస్టులు | — | 40 | 2023 | — | — | |
టోనీ డి జోర్జి | 27 | ఎడమచేతి వాటం | — | వెస్టర్న్ ప్రావిన్స్ | టెస్టులు, వన్డే | — | 33 | 2023 | 2023 | — | |
రీజా హెండ్రిక్స్ | 35 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | లయన్స్ | వన్డే, టి20ఐ | Y | 17 | — | 2023 | 2023 | |
ఐడెన్ మార్క్రామ్ | 30 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | టైటన్స్ | టెస్టులు, వన్డే, టి20ఐ | Y | 4 | T20I (C) | 2023 | 2023 | 2023 |
డేవిడ్ మిల్లర్ | 35 | ఎడమచేతి వాటం | — | డాల్ఫిన్స్ | వన్డే, టి20ఐ | Y | 10 | — | 2023 | 2023 | |
కీగన్ పీటర్సన్ | 31 | కుడిచేతి వాటం | — | డాల్ఫిన్స్ | టెస్టులు | Y | 93 | 2023 | — | — | |
రిలీ రోసోవ్ | 35 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | నైట్స్ | T20I | — | 32 | — | 2016 | 2023 | |
రాస్సీ వాన్ డెర్ డస్సెన్ | 35 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | లయన్స్ | వన్డే, టి20ఐ | Y | 72 | 2022 | 2023 | 2023 | |
ఖయా జోండో | 34 | కుడిచేతి వాటం | — | డాల్ఫిన్స్ | టెస్టులు | — | 73 | 2023 | 2021 | — | |
ఆల్ రౌండర్లు | |||||||||||
డెవాల్డ్ బ్రెవిస్ | 21 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | టైటన్స్ | వన్డే, టి20ఐ | — | 52 | — | — | 2023 | |
డోనోవన్ ఫెర్రీరా | 26 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | టైటన్స్ | T20I | — | — | — | — | — | |
మార్కో జాన్సెన్ | 24 | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | వారియర్స్ | టెస్టులు, వన్డే, టి20ఐ | Y | 70 | 2023 | 2023 | 2023 | |
వియాన్ ముల్డర్ | 26 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | లయన్స్ | టెస్టులు | — | 13 | 2023 | 2021 | 2021 | |
సేనురన్ ముత్తుసామి | 30 | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ | లయన్స్ | టెస్టులు | — | 67 | 2023 | — | — | |
వికెట్ కీపర్లు | |||||||||||
క్వింటన్ డి కాక్ | 32 | ఎడమచేతి వాటం | — | టైటన్స్ | వన్డే, టి20ఐ | Y | 12 | 2021 | 2023 | 2023 | |
హెన్రిచ్ క్లాసెన్ | 33 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | టైటన్స్ | టెస్టులు, వన్డే, టి20ఐ | Y | 45 | 2023 | 2023 | 2023 | |
ర్యాన్ రికెల్టన్ | 28 | ఎడమచేతి వాటం | — | లయన్స్ | టెస్టులు, వన్డే | Y | 44 | 2023 | 2023 | — | |
ట్రిస్టన్ స్టబ్స్ | 24 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | వారియర్స్ | వన్డే, టి20ఐ | Y | 30 | — | 2023 | 2023 | |
కైల్ వెరియెన్ | 27 | కుడిచేతి వాటం | — | వెస్టర్న్ ప్రావిన్స్ | టెస్టులు | — | 97 | 2023 | 2022 | — | |
స్పిన్ బౌలర్లు | |||||||||||
జార్న్ ఫోర్టుయిన్ | 30 | కుడిచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ | లయన్స్ | వన్డే, టి20ఐ | Y | 77 | — | 2023 | 2023 | |
సైమన్ హార్మర్ | 35 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | టైటన్స్ | టెస్టులు | — | 47 | 2023 | — | — | |
కేశవ్ మహారాజ్ | 34 | కుడిచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ | డాల్ఫిన్స్ | టెస్టులు, వన్డే, టి20ఐ | Y | 16 | 2023 | 2023 | 2022 | |
తబ్రైజ్ షమ్సీ | 34 | కుడిచేతి వాటం | ఎడమచేతి అనార్థడాక్స్ | టైటన్స్ | వన్డే, టి20ఐ | Y | 26 | 2018 | 2023 | 2023 | |
సీమ్ బౌలర్లు | |||||||||||
గెరాల్డ్ కోయెట్జీ | 24 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | నైట్స్ | టెస్టులు, వన్డే, టి20ఐ | — | 62 | 2023 | 2023 | 2023 | |
సిసండా మగాలా | 33 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | లయన్స్ | వన్డే, టి20ఐ | Y | 58 | — | 2023 | 2023 | |
లుంగీ ఎన్గిడి | 28 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | టైటన్స్ | వన్డే, టి20ఐ | Y | 22 | 2022 | 2023 | 2023 | |
అన్రిచ్ నోర్ట్యే | 31 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | వారియర్స్ | టెస్టులు, వన్డే, టి20ఐ | Y | 20 | 2023 | 2023 | 2023 | |
వేన్ పార్నెల్ | 35 | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | వెస్టర్న్ ప్రావిన్స్ | వన్డే, టి20ఐ | Y | 7 | 2017 | 2023 | 2023 | |
కగిసో రబాడా | 29 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | లయన్స్ | టెస్టులు, వన్డే, టి20ఐ | Y | 25 | 2023 | 2023 | 2023 | |
లిజాడ్ విలియమ్స్ | 31 | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | టైటన్స్ | T20I | — | 6 | 2022 | 2021 | 2023 |
కోచింగ్ సిబ్బంది
[మార్చు]స్థానం | పేరు |
---|---|
క్రికెట్ డైరెక్టర్ | ఎనోచ్ న్క్వే |
స్థానం | పేరు |
---|---|
ప్రధాన కోచ్ | షుక్రి కాన్రాడ్ |
బ్యాటింగ్ కోచ్ | నీల్ మెకెంజీ |
బౌలింగ్ కోచ్ | పీట్ బోథా |
ఫీల్డింగ్ కోచ్ | క్రుగర్ వాన్ వైక్ |
పరిమిత ఓవర్లు
[మార్చు]స్థానం | పేరు |
---|---|
ప్రధాన కోచ్ | రాబ్ వాల్టర్ |
బ్యాటింగ్ కోచ్ | జేపీ డుమిని |
బౌలింగ్ కోచ్ | రోరే క్లీన్వెల్డ్ట్ (మధ్యంతర) |
ఫీల్డింగ్ కోచ్ | వండిలే గ్వావు |
కోచింగ్ చరిత్ర
[మార్చు]- 1991–1994:మైక్ ప్రోక్టర్
- 1994–1999:బాబ్ వూల్మెర్
- 1999–2002:గ్రాహం ఫోర్డ్
- 2002–2004:ఎరిక్ సైమన్స్
- 2004–2005:రే జెన్నింగ్స్
- 2005–2010:మిక్కీ ఆర్థర్
- 2010–2011:కొర్రీ వాన్ జిల్
- 2011–2013:గ్యారీ కిర్‌స్టన్
- 2012–2013:గ్యారీ కిర్‌స్టన్ (టెస్ట్, వన్డే), రస్సెల్ డొమింగో (T20I)
- 2013–2017:రస్సెల్ డొమింగో
- 2017–2019:ఓటిస్ గిబ్సన్
- 2019–2022:మార్క్ బౌచర్
- 2022–2023:మాలిబోంగ్వే మకేటా (మధ్యంతర)
- 2023–ప్రస్తుతం:షుక్రి కాన్రాడ్ (టెస్ట్), రాబ్ వాల్టర్ (వన్డే, T20I)
క్రికెటర్లు
[మార్చు]- హోవార్డ్ ఫ్రాన్సిస్
- హెరాల్డ్ బామ్గార్ట్నర్
- హెడ్లీ కీత్
- హిల్టన్ అకెర్మాన్
- స్టీవ్ ఎల్వర్తీ
- సెక్ డిక్సన్
- షంటర్ కోయెన్
- విలియం హెన్రీ మిల్టన్
- రోలాండ్ బ్యూమాంట్
- రోనీ గ్రీవ్‌సన్
- రెగీ స్క్వార్జ్
- రాబర్ట్ హార్వే
- రాబర్ట్ స్టీవర్ట్
- రాబర్ట్ గ్లీసన్
- రాబర్ట్ గ్రాహం
- మ్ఫునేకో న్గామ్
- మొండే జోండేకి
- మైట్లాండ్ హాథోర్న్
- మైక్ మెకాలే
- ముర్రే కమిన్స్
- మిక్ కమెయిల్
- మార్టిన్ హాన్లీ
- మార్టిన్ వాన్ జార్స్‌వెల్డ్
- మార్క్ రష్మెరే
- క్లైవ్ వాన్ రైనెవెల్డ్
- ఆంథోనీ వాన్ రైనెవెల్డ్
- బ్రియాన్ మెక్‌మిలన్
- బ్రియాన్ బ్లెంకిన్సోప్
- బ్యూరాన్ హెండ్రిక్స్
- బోయెట డిప్పెనార్
- బోనోర్ మిడిల్టన్
- బెర్నార్డ్ టాంక్రెడ్
- బాబ్ న్యూసన్
- బాబ్ కాటెరాల్
- బస్టర్ నుపెన్
- ఫ్లూయి డు టాయిట్
- ఫ్రెడ్ స్మిత్
- ఫ్రాంక్ నికల్సన్
- ఫిలిప్ హచిన్సన్
- ఫానీ డివిలియర్స్
- పీటర్ స్ట్రైడమ్
- పీటర్ మలన్
- పాల్ హారిస్
- పాల్ ఆడమ్స్
- పాట్రిక్ బోథా
- నెవిల్లే క్విన్
- నికోలస్ థ్యూనిస్సెన్
- నార్మన్ రీడ్
- నార్మన్ నార్టన్
- నార్మన్ గోర్డాన్
- నాంటీ హేవార్డ్
- థామస్ రూట్లెడ్జ్
- థమీ త్సోలేకిలే
- త్లాడి బొకాకో
- డేవిడ్ బెడింగ్హామ్
- డేవిడ్ టెర్‌బ్రూగ్
- డేవిడ్ ఐరన్‌సైడ్
- డెవాల్డ్ ప్రిటోరియస్
- డెన్నిస్ డయ్యర్
- డాల్టన్ కోనింగమ్
- ట్రెవర్ గొడ్దార్డ్
- జోహన్ బోథా
- జోనాథన్ బర్డ్
- జో కాక్స్
- జెరోమ్ బాస్
- జుబేర్ హంజా
- జియోఫ్ చుబ్
- జియోఫ్ గ్రిఫిన్
- జిమ్మీ బ్లాంకెన్‌బర్గ్
- జార్జ్ గ్లోవర్
- జాన్ కొక్రాన్
- జానీ లిండ్సే
- జాక్ కామెరూన్
- జాండర్ డి బ్రుయిన్
- జస్టిన్ కెంప్
- జస్టిన్ ఒంటాంగ్
- చార్ల్ విల్లోబీ
- చార్ల్ లాంగేవెల్డ్ట్
- చార్లెస్ హిమ్
- చార్లెస్ వింట్సెంట్
- చార్లెస్ ప్రిన్స్
- చార్లీ ఫిన్లాసన్
- చాడ్ క్లాసెన్
- గ్లెన్ హాల్
- గోబో ఆష్లే
- గెరాల్డ్ హార్టిగన్
- గెరాల్డ్ బాండ్
- గుస్ కెంపిస్
- గులామ్ బోడీ
- క్లైవ్ హాల్స్
- క్లైవ్ ఎక్స్టీన్
- క్లెమెంట్ జాన్సన్
- క్లాడ్ హెండర్సన్
- క్లాడ్ న్యూబెర్రీ
- క్రిస్ డక్‌వర్త్
- కోలిన్ బ్లాండ్
- ఓవెన్ వైన్
- ఒమర్ హెన్రీ
- ఎర్నెస్ట్ బాక్
- ఎబెన్ బోథా
- ఇయాన్ స్మిత్
- ఆల్బర్ట్ రోజ్-ఇన్నెస్
- ఆల్ఫ్ హాల్
- ఆర్థర్ సెక్యూల్
- ఆర్థర్ లాంగ్టన్
- ఆర్థర్ ఎడ్వర్డ్ ఓచ్సే
- ఆడమ్ బాచెర్
- ఆండ్రే నెల్
- ఆండ్రూ హడ్సన్
- ఆండ్రూ గ్రేమ్ పొల్లాక్
- ఆంట్ బోథా
- అలాన్ బాడెన్‌హోర్స్ట్
- అలాన్ డాసన్
- అడ్రియన్ కైపర్
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ICC Rankings". International Cricket Council.
- ↑ "Test matches - Team records". ESPNcricinfo.
- ↑ "Test matches - 2023 Team records". ESPNcricinfo.
- ↑ "ODI matches - Team records". ESPNcricinfo.
- ↑ "ODI matches - 2023 Team records". ESPNcricinfo.
- ↑ "T20I matches - Team records". ESPNcricinfo.
- ↑ "T20I matches - 2023 Team records". ESPNcricinfo.
- ↑ "Records; One-Day Internationals; ESPN Cricinfo". ESPNcricinfo. Archived from the original on 24 February 2013. Retrieved 1 January 2019.
- ↑ The Commonwealth Games Experience by Shaun Pollock ESPN Cricinfo
- ↑ "ICC overview of Player Rankings International Cricket Council". International Cricket Council (in ఇంగ్లీష్). Retrieved 28 January 2021.
- ↑ History of South African sport – Cricket Archived 9 సెప్టెంబరు 2017 at the Wayback Machine BleacherReport. 9 November 2008.
- ↑ "Coverdrive: Owen Dunell, South Africa's first skipper". Archived from the original on 1 April 2018. Retrieved 31 March 2018.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ South Africa beat England in a thriller to achieve their maiden Test win Archived 20 మే 2018 at the Wayback Machine Cricket Country. 8 January 2016.
- ↑ Aubrey Faulkner: The first of the great South African all-rounders Archived 9 సెప్టెంబరు 2018 at the Wayback Machine Cricket Country. 17 December 2015.
- ↑ Booth, Douglas (1998). The Race Game: Sport and Politics in South Africa. Routledge. p. 99. ISBN 0-7146-4799-3.
- ↑ South Africa choke on their lines again Hugh Chevallier in Durban Archived 10 అక్టోబరు 2007 at the Wayback Machine 20 September 2007 Cricinfo
- ↑ South Africa Remove Racial Quotas Archived 9 నవంబరు 2007 at the Wayback Machine 7 November 2007 BBC Sport
- ↑ "South Africa announce racial quotas for national team". Reuters. 3 September 2016. Archived from the original on 28 నవంబరు 2018. Retrieved 8 September 2018.
- ↑ ICC Rankings 17 October 2013 ESPN Cricinfo
- ↑ McGlashan, Andrew (28 August 2012). "Amla ton leads SA to third No. 1 spot". ESPNcricinfo. Archived from the original on 4 October 2013. Retrieved 25 September 2013.
- ↑ "Results | South Africa v Australia | ESPN Cricinfo". ESPNcricinfo. Retrieved 20 March 2016.
- ↑ "ICC Test match Team Rankings International Cricket Council". icc-cricket.com. Archived from the original on 29 అక్టోబరు 2016. Retrieved 19 May 2020.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "ICC World Test Championship 2019–2021 Table". ESPN Cricinfo. Retrieved 29 August 2021.
- ↑ "New faces in South Africa's latest Men's Contracts List for 2023-24". Retrieved 29 March 2023.
- ↑ "South Africa's Theunis de Bruyn retires from international cricket".