Jump to content

డి.కె.పట్టమ్మాళ్

వికీపీడియా నుండి
డామల్ కృష్ణస్వామి పట్టమ్మాళ్
ఆమె సోదరుడు డి.కె.జయరామన్ ప్రక్క డి.కె.పట్టమ్మాళ్ (కుడి)(1940లలో)
వ్యక్తిగత సమాచారం
జననం(1919-03-28)1919 మార్చి 28
మూలంకాంచీపురం, మద్రాసు ప్రెసిడెన్సీ, ఇండియా.
మరణం2009 జూలై 16(2009-07-16) (వయసు 90)
చెన్నై,భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం, ప్లే బేక్ సింగర్
వృత్తిగాయకురాలు
క్రియాశీల కాలం1929–2009
లేబుళ్ళుHMV, EMI, RPG, AVM Audio, Inreco, Charsur Digital Workshop etc.

డి.కె.పట్టమ్మాళ్ (తమిళం: தாமல் கிருஷ்ணசுவாமி பட்டம்மாள்) (1919 మార్చి 28 – 2009 జూలై 16)[1] కర్ణాటక సంగీత విద్వాంసురాలు, నేపథ్య గాయని. ఆమె అనేక భారతీయ భాషా చలన చిత్రాలలో పాడారు. కర్ణాటక సంగీతంలో ఆవిడకు ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మికు ఉన్నంత పేరుంది. ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి, ఎం.ఎల్.వసంతకుమారి ఆమెకు సమకాలీనులు. ఈ ముగ్గురు గాయకులు "కర్ణాటక గాత్ర సంగీతంలో స్త్రీరత్నత్రయం"గా సుప్రసిద్ధులు. ఆమె ప్రపంచ సంగీత ప్రేమికులచే ఆరాధించబడింది.[2][3]

జీవిత విశేషాలు

[మార్చు]

పట్టమ్మాళ్ తమిళనాడు రాష్ట్రం లోణి కాంచీపురంలో ఓ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో 1919లో జన్మించింది[4]. ఆమె బాల్యనామం అలమేలు కానీ ఆమె "పట్ట" అని పిలుచుకునేందుకు ఇష్టపడేది.[4][5] ఆమె తండ్రి దామల్ కృష్ణస్వామి దీక్షితార్ సంగీత ప్రియుడు.ఆమె సంగీత జ్ఙానం పొందడానికి ప్రోత్సాహాన్ని ఆయన అందించారు.[6] తల్లి కాంతామణి కూడా సంగీత విద్వాంసురాలే అయినా పదిమంది ముందూ ఎప్పుడూ పాడలేదు. చిన్నప్పటి నుండి పట్టమ్మాళ్ మంచి గొంతుతో పాడేది.[4][6] పట్టంమల్ కర్ణాటక సంగీతంలో కొన్ని విప్లవాత్మక పోకడలను ప్రారంభించారు.[4] ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుండొచ్చి స్టేజెక్కి కర్ణాటక సంగీత కచేరీలిచ్చిన మొట్ట మొదటి మహిళ పట్టమ్మాళ్. ఎం ఎస్ సుబ్బులక్ష్మి పదేళ్ళ వయసులో ఉండగా 1926లో మొదటి రికార్డ్ ఇచ్చినా మొదటి కచేరీ మాత్రం పట్టమ్మాళ్ ఇచ్చిన తరువాతే ఇచ్చారు. అంత వరకూ సంగీత కచేరీల్లో మగవాళ్ళదే పైచేయిగా ఉండేది. ఆడవాళ్ళ సంగీతాన్ని పెళ్ళి సంగీతంగానే అందరూ జమకట్టేవారు. వారందరి అభిప్రాయాలూ తప్పని రుజువు చేస్తూ కర్ణాటక సంగీతంలో ఓ నూతనాధ్యాయాన్ని సృష్టించిన తొలి మహిళ పట్టమ్మాళ్. రాగం,తానం,పల్లవి కచేరీలను ప్రదర్శించిన మొదటి మహిళ ఆమె.[7] పట్టమాళ్ చెప్పిన ప్రకారం[7] ప్రతీ సంవత్సరం నైనా పిళ్ళై త్యాగరాజ ఉత్సవాలను కాంచీపురంలో నిర్వహిస్తారు[5]. రాగం తానం పల్లవి కచేరీలను చేయుటలో ఆయన ప్రముఖుడు కూడా.

1929లో తన పదేళ్ళ వయసులో ఉండగా మొట్టమొదటి సారి గ్రాంఫోన్ రికార్డు కంపెనీ వాళ్ళకి పాడే అవకాశమొచ్చింది. ఈ గ్రామ్‌ఫోన్ రికార్డులో పాడడమన్న విషయం ప్రతీ వార్తా పత్రికా అప్పట్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాసాయి. ఇది తెలిసి మద్రాసు రేడియో కార్పరేషన్ వాళ్ళు పిలిచారు. ఇది జరిగిన మూడేళ్ళ తరువాత 1932లో మద్రాసు రసిక రంజని సభలో మొట్టమొదటి కచేరీ ఇచ్చింది.[5]

ఒక సంవత్సరం తరువాత ఆమె చెన్నై వెళ్ళి మహిళా సమాజం వద్ద మొదటి ప్రదర్శననిచ్చింది.[4] 1939లో ఆమె ఆర్.ఈశ్వరన్ ను వివాహమాడారు.[4] తరువాత ఆమె సంగీత ప్రపంచంలో ఒక ధ్రువతారగా 65 యేండ్లు కొనసాగారు.

సినిమా సంగీతం

[మార్చు]

పట్టమ్మాళ్ కచేరీకి విచ్చేసిన పాపనాశనం శివన్ ఆమె ప్రతిభ చూసి సంగీతం నేర్పడానికి ముందుకొచ్చారు. ఆయన వద్దే ఎన్నో దీక్షితార్ కృతులూ, సుబ్రహ్మణ్య భారతి పాటలూ నేర్చుకున్నారు. ఈ పాపనశనం శివన్ ద్వారానే ఆమె సినీ నేపథ్య సంగీత ప్రవేశం కూడా జరిగింది. త్యాగ భూమి అనే చిత్రం ద్వారా 1939లో మొట్టమొదటి సారిగా సినిమాలో పాడిన కర్ణాటక సంగీత విద్వాసురాలీమె. కేవలం భక్తి గీతాలకే పరిమితమయ్యి అప్పట్లో శృంగార గీతాలు పాడడానికి సుముఖత చూపించలేదు. సుమారు 1951 వరకూ అనేక చిత్రాల్లో పాటలు పాడారు. ఆమె పాడిన చిట్ట చివరి సినిమా పాట కమలహాసన్ నిర్మించిన హే రామ్ చిత్రంలోది. మహాత్మా గాంధీకి ఇష్టమైన వైష్ణవ జనతో ఆమె పాడిన చివరి సినిమా పాట. తమిళ వెర్షన్లో పట్టమ్మాళ్ పాడిన పాట వుంచారు.[8]

పర్యటనలు

[మార్చు]

ఆమె అన్ని రాష్ట్రాలలో ప్రదర్శనలిచ్చింది. భారతదేశంలో అనేక సంగీత సభలలో కచేరీలు చేసారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా కచేరీలు చేసారు. ఆమె అమెరికా,కెనడా,ఫ్రాన్స్,జర్మనీ,స్విడ్జర్లాం,శ్రీలంక వంటి దేశాలలో ప్రదర్శనలనిచ్చారు.[9]

శిష్యులు

[మార్చు]

ఆమె సంగీత శైలి అనేక మంది సంగీత అభిమానులను,విద్యార్థులము ఆకర్షించింది. అందులో ఆమె సోదరుడు డి.కె.జయరామన్ ఆమెతో పాటుగా అనేక కచేరీలను చేసాడు. ఆయన 1990లో సంగీత కళానిథి అవార్డు పొందారు. ఆమె యొక్క యితర శిష్యులలో ముఖ్యులు ఆమె కోడలు లలితా శివకుమార్,[10] సుశీలా రామన్, గీతా రాజశేఖర్,[11] ఆమె,మనుమరాలు నిత్యశ్రీ మహదేవన్,[12] ఆమె మునిమనుమరాలు లావణ్య సుందరరామన్, సాయి మదాన మోహన్ కుమార్ (మలేషియా)[13]

మరణం

[మార్చు]

ఆమె జూలై 16 2009 న సహజంగా మరణించింది. ఆమె భర్త ఆర్.ఈశ్వరన్ ఏప్రిల్ 2 2010 న మరణించారు.[1]

అవార్డులు,బిరుదములు

[మార్చు]

ఆమె అనేక అవార్డులను,బిరుదాలను తన సంగీత ప్రస్థానంలో పొందారు:

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "The Hindu: Front page: Pattammal passes away". The Hindu. 17 July 2009. Archived from the original on 19 జూలై 2009. Retrieved 11 April 2015.
  2. "Profile – Sangita Kalanidhi D.K.Pattammal". Archived from the original on 2006-10-06. Retrieved 2015-08-02.
  3. "The Hindu : Chords and Notes". The Hindu. 4 August 2003. Archived from the original on 30 ఆగస్టు 2009. Retrieved 11 April 2015.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 Lakshmi Ramakrishnan (April 1998), "Music with feeling", Frontline, vol. 15, no. 8, The Hindu Group, archived from the original on 2009-06-25, retrieved 2015-08-02
  5. 5.0 5.1 5.2 D Ram Raj (18 July 2009). "Enough if I get 100 discerning listeners". Daily News and Analysis. Retrieved 11 April 2015.
  6. 6.0 6.1 "Pattammal passes away". Deccan Chronicle. 16 July 2009. Retrieved 11 April 2015.
  7. 7.0 7.1 Asha Krishnakumar & N. Ravikiran (August 1999), "A lifetime for Carnatic music", Frontline, vol. 16, no. 16, The Hindu Group, retrieved 11 April 2015
  8. కంచి పట్టు కచేరీ
  9. Sleeman (2002), p438
  10. "The Hindu : Friday Review Chennai / Columns : Life time bond with music". Archived from the original on 2013-09-14. Retrieved 2015-08-02.
  11. "The Hindu : Pattammal touch evokes nostalgia". Archived from the original on 2003-10-19. Retrieved 2015-08-02.
  12. Sangeetha (31 July 2009). "Musical legacy - The Hindu". The Hindu. Retrieved 11 April 2015.
  13. [1]
  14. 14.0 14.1 14.2 14.3 14.4 14.5 14.6 "D. K. Pattammal". Archived from the original on 2015-09-12. Retrieved 2015-08-02.
  15. "The Hindu : Friday Review Chennai / Tribute : Perfect and aesthetic". Archived from the original on 2013-09-14. Retrieved 2015-08-02.
  16. "The Hindu : Karnataka / Bangalore News : 'A momentous occasion for the music fraternity'". Archived from the original on 2013-09-14. Retrieved 2015-08-02.
  • Sleeman, Elizabeth (2002). The International Who's Who of Women 2002. London: Routledge.

ఇతర లింకులు

[మార్చు]