Jump to content

జరిగిన కథ

వికీపీడియా నుండి
జరిగిన కథ
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. బాబురావు
తారాగణం కృష్ణ,
కాంచన,
జగ్గయ్య,
విజయలలిత,
రాజనాల,
బేబి రోజారమణి,
చిత్తూరు నాగయ్య
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ విజేత ప్రొడక్షన్స్
భాష తెలుగు

జరిగిన కథ విజేత ఫిలిమ్స్ బ్యానర్‌పై 1969, జూలై 4వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.దర్శకుడు కె. బాబూరావు దర్సకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, కాంచన, జగ్గయ్య, విజయ లలిత, నాగయ్య, ప్రభాకర్ రెడ్డి తదితరులు నటించారు.సంగీతం ఘంటసాల వెంకటేశ్వర రావు సమకూర్చారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, స్క్రీన్‌ప్లే: కె బాబూరావు
  • మాటలు: పినిశెట్టి
  • సంగీతం: ఘంటసాల
  • నృత్యం: పసుమర్తి, శేషు, రాజు
  • కళ: ప్రభాకర్
  • కెమెరా: మాధవ్ బుల్‌బులే
  • పోరాటాలు: మాధవన్
  • కూర్పు: కల్యాణ సుందరం
  • దర్శకత్వం: కె బాబూరావు
  • నిర్మాత: కె ప్రభాకర్.

తన భార్య సంధ్యారాణి, తన బావతో చనువుగా మాట్లాడటం విని అపార్థం చేసుకొని అంతం చేయాలనుకున్న ఓ భర్త ప్రభాకర్‌రెడ్డికి, నాగయ్య (జగన్నాథం) చెప్పిన ఓ జరిగిన కథతో సినిమా మొదలవుతుంది. ప్రసాద్ (జగ్గయ్య), రఘు (కృష్ణ) జమీందారీకి చెందిన అన్నదమ్ములు. వీరి తల్లి ఉమాదేవి (జూ శ్రీరంజని). ప్రసాద్ శాంతం, సహనం, మంచితనంవంటి లక్షణాలు కలవాడు. రఘు తొందరపాటు, పట్టుదల, ఆవేశంకల వ్యక్తి. పట్నంలోవుండే భూపతి (రాజనాల) మంజుల (విజయ) నృత్యగానాలతో కాలం గడుపుతుంటాడు. చిన్న కొడుకు మీద బెంగతో అతడిని జాగ్రత్తగా చూసుకోమని ప్రసాద్‌కు చెప్పి ఉమాదేవి మరణిస్తుంది. ఇంటికి వచ్చిన రఘు అన్నకోరికమీద, ఆ ఊళ్లోనే ఉండి తల్లి పేరునవున్న ఉమా కళానిలయంలో మంజుల బృందంతో నృత్య ప్రదర్శనలు ఇప్పిస్తుంటాడు. గొప్ప కుటుంబంలో పుట్టి తమ్ముడు బాబు తప్ప మరెవరూ లేని అనాధ శాంత (కాంచన). ప్రసాద్ వాళ్లింట ఆశ్రయం పొంది కళానిలయంలో నృత్య ప్రదర్శనలు ఇస్తుంది. ప్రసాద్ ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. కాని శాంత, రఘు ప్రేమించుకుంటున్నారని తెలిసి వారికి వివాహం జరిపిస్తాడు. వారిరువురూ అన్యోన్యంగా జీవిస్తుంటారు. వారికొక పాప జన్మిస్తుంది. ఎలాగైనా రఘును పొందాలనుకున్న మంజుల కుట్రల కారణంగా చెప్పుడు మాటలు నమ్మి, పాపతో ఇంటినుంచి వెళ్లిపోతాడు రఘు. భూపతి, మంజుల స్నేహంతో కూతురితో జీవిస్తుంటాడు. రఘు జాడ తెలియక సతమతమవుతూ యాక్సిడెంటులో కాలుపోగొట్టుకుంటాడు ప్రసాద్. భర్త, కూతురి జాడ తెలీక బెంగతో కాలం గడుపుతుంటుంది శాంత. కూతురు ఉమ (బేబీ రోజారమణి) పాడిన ఓ పాట ద్వారా శాంత, రఘును కలుసుకోవటం, తిరస్కారానికి గురై వెనక్కి రావటం జరుగుతుంది. ఈలోపు రఘును అంతం చేయాలనుకున్న భూపతి చేతిలో మంజుల మరణిస్తూ, శాంత, ప్రసాద్ నిర్దోషులు, మంచివారని రఘుకు నిజం చెబుతుంది. పశ్తాత్తాపంతో రఘు ఇంటికి తిరిగి రావటం, మనోవ్యధతో చివరి దశలోవున్న ప్రసాద్‌ను క్షమించమని కోరటం, శాంత, రఘుల చేతులు కలిపి ప్రసాద్ మరణిస్తాడు. ఈ కథ చెప్పిన జగన్నాథం (నాగయ్య)కి సంధ్యారాణి, ప్రభాకర్‌రెడ్డిలు కృతజ్ఞతలు తెలియచేయటంతో చిత్రం ముగుస్తుంది[1].

పాటలు

[మార్చు]
  1. ఇదిగో మధువు ఇదిగొ సొగసు వేడి వేడి వలపు తీయని - ఎల్.ఆర్. ఈశ్వరి ,రచన: దాశరథి
  2. ఉన్నారా ఉన్నారా మీలో ఎవరైనాగాని ఉన్నారా ఒంటరిగా సుందరాంగి - ఎల్. ఆర్. ఈశ్వరి, రచన: కొసరాజు
  3. ఏనాటికైనా ఈ మూగవీణా రాగాలు పలికి రాణించునా - పి.సుశీల ,రచన : దాశరథి
  4. చినవాడా మనసాయెరా విచ్చిన జాజి పొదనీడ నిను చూడ చూడ - ఎస్. జానకి ,రచన: సి నారాయణ రెడ్డి
  5. తోడుగ నీవుంటే నీ నీడగ నేనుంటే ప్రతి ఋతువు మధుమాసం ప్రతి రేయీ మనకోసం - పి.సుశీల, ఘంటసాల . రచన: సి. నారాయణ రెడ్డి.
  6. నిన్నే నిన్నే నిన్నే కోరుకున్న చిన్నదిరా నిన్ను కన్నులలో దాచుకున్నదిరా - ఎస్. జానకి , రచన: సి నారాయణ రెడ్డి
  7. భలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు - ఘంటసాల . రచన: సి. నారాయణ రెడ్డి.
  8. లవ్ లవ్ లవ్‌మి నెరజాణా నౌ నౌ కిస్‌మి చినదాన - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి . రచన: ఆరుద్ర.

మూలాలు

[మార్చు]
  1. సి.వి.ఆర్.మాణికేశ్వరి (29 June 2019). "ఫ్లాష్ బ్యాక్ @50 జరిగిన కథ". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 3 ఆగస్టు 2019. Retrieved 9 September 2019.

వనరులు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.

బయటి లింకులు

[మార్చు]