గాండీవము
స్వరూపం
గాండీవం ఒక దివ్యమైన ధనుస్సు. ఇది పాండవులలో అర్జునుని ముఖ్య ఆయుధము. దీనిని బ్రహ్మ తయారుచేశాడు. ఈ గాండీవాన్ని బ్రహ్మ శతసహస్ర వర్షములును, ప్రజాపతి చతుష్షష్టి సహస్ర వర్షములును, ఇంద్రుడు పంచశత హాయనంబులును, వరుణుడు కొన్ని వందల సంవత్సరములు ధరించారు.[1][2] వరుణుని వద్దనుండి అగ్ని దేవుడు పుచ్చుకున్నాడు. దీనిని ఖాండవ వనాన్ని దహించే సమయంలో అగ్ని అర్జునునకు యిచ్చాడు.
పురాణ కథనం
[మార్చు]అగ్ని దేవుడు, ఖాండవవనాన్ని దహనం చేసి, తన శక్తిని, వైభవాన్ని తిరిగి పొందాలని అనుకున్నాడు. దానికొరకు కృష్ణుడు, అర్జునుడిని సహాయం చేయమన్నాడు. అర్జునుడు తనసహాయానికి ప్రతిగా అగ్నిదేవుని నుండి శక్తివంతమైన ధనుస్సును కోరాడు. అగ్నిదేవుడు అర్జునునికి గాండీవం అనబడే ధనుస్సును ఇచ్చాడు. కురుక్షేత్ర యుద్ధంలో చాలా మంది గొప్ప యోధులను, దేవతలను ఈ ఆయుధంతో ఓడించాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ Vyasa's Mahabharatam (in ఇంగ్లీష్). Academic Publishers. 2008. ISBN 9788189781682.
- ↑ The Mahabharata of Krishna-Dwaipayana Vyasa: Adi parva. Sabha parva (in ఇంగ్లీష్). Bharata Press. 1883. p. 624.
Gandiva.
- ↑ The Mahabharata of Krishna-Dwaipayana Vyasa: Adi parva. Sabha parva (in ఇంగ్లీష్). Bharata Press. 1883. p. 623.
Gandiva.
- ↑ Vyasa's Mahabharatam (in ఇంగ్లీష్). Academic Publishers. 2008. ISBN 9788189781682.
బాహ్య లంకెలు
[మార్చు]- http://www.sacred-texts.com/hin/m01/m01228.htm
- http://www.sacred-texts.com/hin/m04/m04043.htm
English Wikisource లో ఈ వ్యాస విషయానికి సంబంధించిన మూల పాఠ్యం ఉంది. కింది లింకు చూడండి: