Jump to content

గట్టిఫెరె

వికీపీడియా నుండి

క్లూసియేసి లేదా గట్టిఫెరె
Hypericum tetrapterum
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
క్లూసియేసి

Lindl. 1836

గట్టిఫెరె లేదా క్లూసియేసి కుటుంబం పుష్పించే మొక్కలలోనిది.

చరిత్ర

[మార్చు]

గట్టిఫెరె తేమలో తేలికగా పెరుగుతుంది, పూర్తి ఎండలో బాగా ఎండిపోయిన నేలలలో ఉంటాయి. జాతుల మొక్కలు ఎండ ప్రాంతాలలో ఇసుక , కంకర నేలలలో ఉండగలవు. ఒకసారి పెరిగిన తరవాత మొక్క కాడలతో నాటుతారు. స్వీయ విత్తనాల ద్వారా కూడా మొక్క లను పెంచుతారు. ఒక మొక్క సంవత్సరానికి 100,000 విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. మట్టిలో పాతిపెట్టిన విత్తనాలు 10 సంవత్సరాలు ఉండవచ్చు. కాలిఫోర్నియా, కొలరాడో, మోంటానా, నెవాడా, ఒరెగాన్, సౌత్ డకోటా, వాషింగ్టన్,దేశాలలో ఈ జాతుల మొక్కలను విషపూరిత కలుపు మొక్కల వాటిలో లో చేర్చినారు. ఐరోపాకు చెందినది, పశ్చిమ ఆసియా ఉత్తర ఆఫ్రికా.మొక్కలను మొట్టమొదట 1696 లో ఉత్తర అమెరికాకు తీసుకువచ్చారు , తర్వాత ఖండంలోని చాలా ప్రాంతాలలో సహజసిద్ధముగా పెరిగినాయి [1]

పెరుగుదల భూమిలో 12-18 అంగుళాలు (30-45 సెం.మీ.) ఎత్తులో పెరగగలదు. ఆకులు అండాకార-దీర్ఘచతురస్రాకార, 5-10 సెం.మీ. పువ్వులు పసుపు, 7.5 సెం.మీ వెడల్పు, వేసవి ప్రారంభంలో రాగలవు. తరచుగా పార్కింగ్ స్థలాలు ,వాణిజ్య భవనాల చుట్టూ కనిపిస్తుంది. ఆగ్నేయ యూరప్ , ఆసియా ‌కు చెందినది. దీనిని సెయింట్ జాన్స్ వోర్ట్ లేదా క్లామత్ వీడ్ అని కూడా పిలుస్తారు. ఒక జంతువు హైపెరికం పెర్ఫొరాటమ్ తిన్నప్పుడు, మొక్కలోని విషం లోపల నుండి (కడుపు నుండి రక్తం నుండి చర్మానికి) చర్మానికి చేరుకుంటుంది [2]

ఉపయోగములు

[మార్చు]

ఈ జాతి మొక్కలను గ్రీకుల కాలం 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ జాతి మొక్కలను ఉపయోగం గా పేర్కొన్నారు.. మొదటి శతాబ్దానికి చెందిన గ్రీకు వైద్యులు ఇది మానసిక ఆందోళన, నిరాశ, కాలిన గాయాలకు చికిత్సగా ఉపయోగించే వారు. వివిధ రకాల అంతర్గత,బాహ్య రోగాలకు చికిత్స చేయడానికి ఈ జాతిని మూలికాను వాడేవారు. ప్రస్తుతము క్యాన్సర్, కడుపులో మంట,సంబంధిత వ్యాధులు ,బ్యాక్టీరియా, వైరల్ వ్యాధులతో సహా ఇతర రోగాలకు చికిత్స చేయడంలో యాంటీఆక్సిడెంట్ , న్యూరోప్రొటెక్టివ్ ఏజెంట్‌గా ఈ మొక్క ఉపయోగం ఇటీవలి పరిశోధనలలో తెలుస్తున్నది [3]

కొన్ని ముఖ్యమైన ప్రజాతులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Hypericum perforatum - Plant Finder". www.missouribotanicalgarden.org. Retrieved 2020-09-05.
  2. "Hypericum calycinum | Landscape Plants | Oregon State University". landscapeplants.oregonstate.edu. Retrieved 2020-09-05.
  3. "Medical Attributes of St. John's Wort (Hypericum perforatum)". ncbi.nlm.nih.gov/books. 2020-09-05. Retrieved 2020-09-05.{{cite web}}: CS1 maint: url-status (link)


మూలాలు

[మార్చు]