Jump to content

కేయూరబాహుచరిత్ర

వికీపీడియా నుండి

కేయూరబాహుచరిత్ర

కవి, కాలాదులు,

[మార్చు]

కేయూర బాహుచరిత్రము ఒక రసవత్తరమైన ప్రబంధము. నాలుగశ్వాసములతో నున్న ఈ గ్రంథాన్ని మంచన అను కవి రచించి నండూరి గుండమత్రి అంకిత మిచ్చెను. మంచన తన గ్రంథంలో తన గురించి ఏమియును చెప్పుకొన లేదు. కనుక అతని కులము, గోత్రము, ఎక్కడ నివసించిన వాడో తెలుసుకొనుట కష్టము. సాధారణంగా కవులందరూ తమ గ్రంథ అవతారికలో గాని, ఆశ్వాసాంతములో గాని తమ గురించి, తమ కుల గోత్రాల గురించి చెప్పుకొనుట సాంప్రదాయం. దాని వలన అయా కవుల వివరాలు తెలుస్తాయి. కానీ మంచన మాత్రము, కారణమేమైనా... అటువంటి వివరాలను పూర్తిగా విస్మరించారు. ఈ కావ్యంలో తన పేరును మాత్రము ప్రస్తావించిన రెండుసందర్భాలు మాత్రము ఉన్నాయి.

క. తన యిష్టసఖుని విద్య
జ్జన మాన్యుని నుభయకావ సరణిజ్ఞని మం
చన నామదేయు నన్నుం
గనుగొని యిట్లనిఎ వినయ, గౌరవ మెసగల్.

, అశ్వాసాంతములో..... ఇది సకలజన విధేయ ప్రణీతంబైన కేయూరబాహుచరిత్రం బను మహా ప్రబంధము నందు ........... అని మాత్రమే వ్రాసుకొన్నాడు.

కనుక ఈ కవి పేరు తప్ప తక్కిన వివరాలు తెలియకున్నవి. కృతి భర్త యగు గుండన మంత్రి ధనద పుర నివాసి యగుట వలన.... మంచన కీతడు యిష్ట సఖుడగుటను బట్టి మంచన కూడా ఆ ప్రాంతము వాడై వుండును. మంచన, తన కృతి భర్థ గురుంచి మాత్రము చాల విషయాలను చర్చించారు. వాటి ఆధారముగా కవి కాలాదులను నిర్ణయించడానికి చాల మంది లాక్షనికులు పలు విధాల ప్రయత్నించారు.

కావ్య ఇతి వృత్తము

[మార్చు]

మంచన తన కేయూరబాహుచరిత్రము లోని ఇతివృత్తమును రాజశేఖార కవి సంస్కృతమున రచించిన విద్దసాలభంజిక అని నాటిక నుండి గ్రహించి నట్లు తెలియుచున్నది. కాని మంచన కవి మాత్రము తన కావ్య ఇతివృత్తాన్ని ఎక్కడినుండి గ్రహించినది చెప్పలేదు. ఇతి వృత్తాన్ని సంస్కృత నాటిక నుండి గ్రహించినను మంచన తన గ్రంథంలో సందర్బోచితంగా అనేక మార్పులు చేసి, అనేక నీతి కథలను చేర్చి గ్రంథ విస్తారమును పెంచారు. మంచన చేసిన కొన్ని మార్పులు సముచితముగానూ, సరసములుగ నున్నవని శ్రీ బులుసు వెంకటరమణయ్యగారన్నారు.

మార్పులు చేర్పులు

[మార్చు]

మంచన సంస్కృత నాటిక నుండి కథను కైకొని కొన్ని మార్పులు చేయుటేగాక అనవసరమైన పిట్ట కథలను చొప్పించెనని కొందరంటున్నారు. కృతిపతి యగు గుండయ కోరిక మేరకే ఈ మార్పులు చేసినట్లు కొందరి అభిప్రాయము. కృతి పతి గుండ... మంచనతో అన్నట్లు ఈ పద్యంలో చూడ వచ్చు.

కావున నాకు నొక్క కృతి గైకొన ల్నిష్ంఅము నీవు పజ్ఞ సం
భావిత కావ దక్షుడవు భవ్యమతిన్ ద్విజదేవ నిర్మితం
బైవిలసిల్లు తంత్రము ప్రియంబున జూచిన నందు కర్ణ సౌ
ఖ్యావహమై ప్రబంధ రచనాశ్రయ మయ్యెడు మార్గమూతగన్.

'కం. స్థాయి రసము శృంగారం
బైయలవడ గథలు నీతులై యెడనేరా
గేయూర బాహు చరితము
సేయుము నీ వట్టి కావ్యశిల్పము మెఱయన్.

అని కోరెను. కృతి పతి ఆదేశానుసారము శృంగారము స్థాయి రసముగా, పంచతంత్ర హితోపదేసములలోను, తన కాలమునందు వాడుకలో వున్న నీతి కథలను మంచన తన కావ్యమున చేర్చెను. ఆ విధముగా ఈ కావ్యములో 22 నీతి కథలున్నవి.

కావ్యంలో శైలి

[మార్చు]

మంచెన నన్నె చోడు ననుకరించెనని కొందరనగా నన్నెచోడుడే మంచనను అనుకరించారని కొండరంటారు.

కుమార సంభవము లోని నన్నెచోడుని పద్యం,

దుగ్దాంబు నిధినిట్త దోచెనో యని శేషు బాంపుగా హరినీట బవ్వడింప
నొదని సుధారస ముప్పొంగెనో యని దేవతల్ తనివోవ ద్రాన దలప
దొలకాడు మెన్నేఱు వెలి విఫ్రిసెనియని లీల ల్సురాంగన లోలలాడ
బాదరంవుర్వి బరగెనో యని సిద్ద నికరంబు కలశముల్ నించి కొనగ

మంచన అనుకరణము.

అంజనగిరి తనయద్రి బోలుడు నీలకంతుండు తోరణ కట్టబనుప
ననిమిషనది వెల్లియనియగస్త్యాదులు బయల నెచ్చటనైన బాఱి క్రుంక
వనజజగుహులు వాహనములు దడ బడ్డ నలిగి వాదడాచి సత్యముల కరగ
వికికిల ప్రనవఆంబు వెదదెడితేటి తమాలపు విరులందు మసలుచుండ
గ్రీతి విసనాళములు గొని పీల్చ గలిగి తగిన దోయిల్లలోనించి త్రావ జాలి
ముట్టి కుండలు నిండంగ ముంప గలిగి నిఖిల ల్దిక్కుల బండు వెన్నెలలు వెలిగె.

మంచన చక్కని సామెత్గలను, తెలుగు పలుకు బడులని విరివిగా వాడినాడు. బమ్మెర పోతన చెప్పినట్లుగా ప్రసిద్ధి బొందిన ఈ క్రింది పద్యమును మంచన తన గ్రంథములో ఇముడ్చుకున్నాడు.

బాలారాసాల పుష్ప నవపల్లవ మోమల కావ్వకన్యకం
గూళల కిచ్చి యప్పడుపు గూడు భుజించుట కంటె సవ్కివుల్
హాలికులైన నేమి మఱియంగకు నాయాతి లేని నాడు గౌ
ద్ధాలికులైన నేమి నిసజార సుతోదర పోషణార్తమై (1......13)

మొత్తం మీద ఈ కావ్యము చక్కని నీతి కథలతో, ప్రాచీనమగు తెలుగు నుడికారములతో సరళ శైలితో నున్నందున అందరికిని ఆవశ్య పఠనీయము.

ప్రచురణ

[మార్చు]

ప్రాచీన తెలుగు కావ్వములను ఈ నాటి తెలుగు పాఠకునికి సక్రమంగా, సరసమైన ధరకి అందరికి అందుబాటులోనికి తేవడానికి సంకల్పించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారు ఈ కావ్వాన్ని ప్రచురించారు. దీని వెల అందరికి అందుబాటులో వుండు విధంగా కేవలం ఒక్క రూపాయి మాత్రము గానె నిర్ణయించారు. ఈ గ్రంథానికి నిర్మాణాత్మకమైన పీఠిక వ్రాసిన వారు శ్రీ గడియారం రామకృష్న శర్మ గారు.

బయటి లంకెలు

[మార్చు]