Jump to content

కల్మాషపాదుడు

వికీపీడియా నుండి
కల్మాషపాదుడు
Kalmashapad
Vashistha stops an attacking Kalmashapada (left), before ending his curse (a scene from the epic Mahabharata)
Information
RaceIkshvaku dynasty
కుటుంబంSudasa (father)
దాంపత్యభాగస్వామిMadayanti
పిల్లలుAsmaka (acknowledged son, born by Vashistha)

హిందూ గ్రంథాలలో, కల్మషపాదుడు (సౌదాస (सौदास), మిత్రసహ (मित्रसह), మిత్రసహా, కల్మశంఘ్రి (కల్మసంఘ్రి) అని కూడా పిలుస్తారు) ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఒకప్పుడు కల్మషపాదుడు వేఁటకై వనమునకు ఏగి అచట ఒక రక్కసుని చంపఁగా వాని తమ్ముఁడు ఇతనిపై మత్సరమున ఇతని యింట వంటవాని వేషముధరించి వసించి వశిష్ఠమహామునికి ఒక్కనాడు భోజనము పెట్టుసమయమున నరమాంసము తెచ్చి వండిపెట్టెను. అది చూచి ఆ ముని కోపగించి రాజును రాక్షసుఁడవు కమ్ము అని శపించెను. అందుకు అతఁడు తనయందు దోషములేనిది తెలిసికొనక తనకు శాపము ఇచ్చెను అని ప్రతిశాపము ఇయ్య జలము ఎత్తెను. అది అతనిభార్య చూచి బ్రాహ్మణుఁడు కోపించినను మనము కోపించుట ధర్మము కాదు అని రాజును ఉడిగించెను. అప్పుడు అతఁడు ఆజలమును ఎక్కడను చల్లను ఒల్లక తన పాదములపై విడుచుకొనెను. దానిచేత పాదములయందు కల్మషము కలిగి కల్మషపాదుఁడు అను పేరు పొందెను. అంత వసిష్ఠుడు కోపము చల్లాఱి అతనిని అనుగ్రహించి పండ్రెండు సంవత్సరములకు శాపమోక్షము అగునట్లు ప్రసాదించెను.

కల్మషపాదుఁడు తనకు రాక్షసత్వము రాఁగానే వసిష్ఠుని జ్యేష్ఠపుత్రుఁడును పరాశరుని తండ్రియును అగు శక్తిని మ్రింగెను. కొందఱు ఇతనికి ఈశాపము శక్తి ఇచ్చెను అని చెప్పెదరు.[2]

మూలాలు

[మార్చు]
  1. Mani, p. 377
  2. పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879