Jump to content

కన్యాదానం (1955)

వికీపీడియా నుండి
కన్యాదానం (1955)
(1955 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కన్యాదానం 1955 లో విడుదలైన నలుపు-తెలుపు చలన చిత్రం. ఇది కాంతారావు కథానాయకునిగా బి.విఠలాచార్య నిర్మించిన తొలిచిత్రం. జానపద చిత్రాలలో ఒరవడి సృష్టించిన ఈ జంట తొలిచిత్రం సాంఘికం కావటం విశేషం. ఈ చిత్రం విజయవంతం కాలేదు. ఈ చిత్రం తర్వాత కాంతారావుని కథానాయకునిగా 'జయ విజయ' అనే జానపద చిత్రాన్ని తొలిసారిగా విఠలాచార్య నిర్మించారు. అది విజయవంతమయ్యింది. విఠల్ ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమాను బి.విఠలాచార్య స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. షాపుకారు జానకి నటించిన ఈ సినిమాకు రాజన్-నాగేంద్ర సంగీతాన్నందించాడు.[1]

బి.విఠలాచార్య

తారాగణం

[మార్చు]

కాంతారావు

జానకి

సి.సీతారామాంజనేయులు

రాజనాల కాళేశ్వరరావు

బాలసరస్వతి

హేమలత .

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాత,దర్శకుడు: బి.విఠలచార్య
  • స్టూడియో: వైటల్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: బి. విట్టలచార్య;
  • స్వరకర్త: రాజన్-నాగేంద్ర
  • విడుదల తేదీ: జూలై 14, 1955
  • IMDb ID: 0280823

పాటలు

[మార్చు]
  1. అంతా మోసమురా బాబు అంతా మోసమురా ఈ జగమంతా - జిక్కి, రచన:
  2. ఓరోరి తెలుగువాడ వయ్యారి తెలుగువాడా దేశమంటే - జిక్కి, రచన:కొసరాజు రాఘవయ్య
  3. మురళీధరుని ముఖము కంటినే మది మురసిపోయి - పి.లీల, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు
  4. వన్నియలో లేదు విలువ కన్నియ గుణమే కనుచలువ - ఎ.ఎం. రాజా, రచన:కొసరాజు
  5. దేవీ గతి నీవే కావవే జనని, రచన: శ్రీ శ్రీ
  6. పతిసేవయే సతికి గతి చూపెడు గీతం, రచన: శ్రీ శ్రీ
  7. లేనేలేదా దారి నేనెలా ఇక బ్రతకాలి , రచన: శ్రీ శ్రీ
  8. వివేకమీయవే వినాయక నవీన బావానంద , రచన: శ్రీ శ్రీ .

మూలాలు

[మార్చు]
  1. "Kanyadhanam (1955)". Indiancine.ma. Retrieved 2020-08-23.

. 2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

[మార్చు]