Jump to content

కనకదాసు

వికీపీడియా నుండి
కనకదాసు
ಕನಕದಾಸ
జననం
తిమ్మప్ప నాయకుడు

6 నవంవరు,1509
బాద, షిగ్గావ్, హవేరీ జిల్లా, కర్ణాటక రాష్ట్రం, భారత దేశము
మరణం1609 (100 సం.లు)
ఇతర పేర్లుకనకదాసు
వృత్తిగొప్ప భక్తుడు, ఆధునిక కవి, తత్వవేత్త, సంగీతకారుడు, స్వరకర్త
తల్లిదండ్రులుబీరప్ప (తండ్రి),బాచమ్మ (తల్లి)
కనకదాసు

కనకదాసు (1509-1609) కర్ణాటకలోని గొప్ప భక్తుడు, ఆధునిక కవి, తత్వవేత్త, సంగీతకారుడు, స్వరకర్త. [1] కనకదాసు కర్ణాటక సంగీతం కోసం కన్నడ భాషలో రచించిన కీర్తనలు, ఉపభోగాల వలన బాగా ప్రాచుర్యం పొందాడు. [2] ఇతర హరిదాసుల్లాగే ఇతను కీర్తనల్లో సాధారణ కన్నడ భాషను ఉపయోగించాడు.

జీవితం

[మార్చు]

కర్ణాటక రాష్ట్రంలో హవేరీ జిల్లా, బాద గ్రామంలో బీరప్ప (బీర్ గౌడ),బాచమ్మ దంపతులకు కనకదాసు 1509 సం.లో జన్మించాడు. కనకదాసు అసలు పేరు తిమ్మప్ప నాయకుడు. ఇతను బాగా చదువుకొని సమాజాన్ని అన్ని కోణాలలో సూక్ష్మ పరిశీలన చేశాడు. చిన్న వయస్సులోనే ఇతను నరసింహ స్తోత్రం, రామధ్యాయ మంత్రం, మోహన తరింగిణి అనే కవిత్వాలను రచించాడు. కనకదాసు సామాన్యులకు అర్ధమయ్యే విధంగా కన్నడ భాషలో రచనలు చేస్తూ, కీర్తనలు రాస్తూ, వేదాంతాన్ని అభ్యసించి గొప్ప కృష్ణ భక్తుడయ్యాడు.

అతని కీర్తనల్లో ఒకదాని ప్రకారం కనకదాసు ఒక యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు. అద్భుతమైన రీతిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నట్లుగా వ్యాఖ్యానించాడు. తరువాత తన సైనిక వృత్తిని విడిచిపెట్టి, తత్వజ్ఞానాన్ని పామరులకు అర్థమయ్యేలా సంగీత సాహిత్యాలతో కూర్చి అందించేందుకు తన జీవితాన్ని అంకితం చేశాడు.[3]

ఉడిపి

[మార్చు]

కనకదాసుకు ఉడిపితో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఎవరైననూ శ్రీకృష్ణుని ప్రసిద్ధ భక్తుడు కనకదాసును తలచకుండా ఉడిపి కృష్ణుని గురించి ఆలోచించలేరు. ఉడిపిలో కార్ స్ట్రీట్లో ప్రవేశించినప్పుడు, గంభీరమైన "కనక గోపురం" ప్రతివారి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ గోపురం క్రింద "కనకన కిండి" లేదా కనకన కిటికీ ఉంటుంది.[4] శ్రీ కృష్ణ దేవరాయలకు గురువైన వ్యాసరాయలకు (వ్యాసరాయ స్వామిజీ) కనకదాసు అనుచరుడు. వ్యాసరాజా మఠానికి చెందిన వ్యాసరాయ స్వామిజీ యొక్క అభ్యర్థనపై కనకదాసు ఉడిపికి వచ్చాడు. అయినప్పటికీ, కుల ప్రాతిపదికపై వివక్షత అనేది అది శిఖర స్థాయిలో ఉన్న కాలం అది. బ్రాహ్మణ పూజారులు కనకదాసును "తక్కువ" కులం నుండి వచ్చి ఉన్నందున అతనిని ఆలయంలోకి ప్రవేశించనివ్వలేదు. అయినప్పటికి వ్యాసరాయ స్వామిజీ వారితో సంప్రందించి కనుకదాసుని ఆలయంలోనికి రమ్మని ఆహ్వానం తెలపమని పూజారులను కోరాడు. వ్యాసరాయ స్వామిజీ చెప్పినా కూడా బ్రాహ్మణ పూజారులు కనకదాసుకు శ్రీ కృష్ణ దర్శనానికి అనుమతి నిరాకరించారు .[5] కనకదాసు గుడి బయట కూర్చుని భక్తి పారవశ్యంతో శ్రీకృష్ణ కీర్తనలు గానం చేశాడు. ఈ విధంగా కొన్ని వారాలపాటు గుడి బయటనే స్వంతంగా వంట వండుకుని తింటూ కాలం గడిపాడు.

అప్పుడు గుడి గోడ పడి పోయి, స్వామి విగ్రహం కనకదాసు ఉన్న వైపుకు తిరిగింది. గుడి ఆవరణ చుట్టూ ఉన్న ప్రహరీకి ఒక పగులు ఏర్పడింది. ఆ పగులు గుండా కనకదాసు, స్వామిని దర్శించుకున్నాడు. ఈ కారణంగానే ఉడిపి దేవాలయం తూర్పు ముఖంగా ఉన్నప్పటికీ, శ్రీకృష్ణ విగ్రహం మాత్రం పడమర ముఖంగా ఉంటుంది.

ప్రధాన రచనలు

[మార్చు]
కనకదాసు యొక్క కాంస్య విగ్రహం, బడా, బాంకపూర్

కనకదాసు ఈ క్రింద సూచించిన ప్రధాన రచనలు కన్నడంలో రచించాడు.

  1. నలచరిత్ర (ನಳಚರಿತ್ರೆ)
  2. హరిభక్తిసార (ಹರಿಭಕ್ತಿಸಾರ)
  3. నృసింహస్తవ (ನೃಸಿಂಹಸ್ತವ)
  4. రామధ్యాన చరిత్రే (ರಾಮಧಾನ್ಯಚರಿತೆ) వర్గ పోరాటంపై అరుదైన రచన
  5. మోహన తరంగిణి (ಮೋಹನತರಂಗಿಣಿ)

కనకదాస జయంతి

[మార్చు]
కనకదాసు ఫోర్ట్ ప్యాలెస్, బాద

కర్ణాటక ప్రభుత్వం ఒక గొప్ప సాధువుకు నివాళిగా కనక దాస జయంతిని సెలవు దినంగా ప్రకటించింది. దీన్ని ప్రభుత్వ కార్యక్రమంగా ప్రతి ఏడాదీ నిర్వహిస్తుంది. శ్రీ కనక దాసు జన్మ వార్షికోత్సవాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు కళాశాలలూ జరుపుకుంటాయి.

కన్నడ చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖ కన్నడ నటుడు, గాయకుడు డాక్టర్ రాజకుమార్ భక్త కనకదాస చిత్రంలో కనకదాసుగా నటించాడు. ఈ చిత్రం ప్రజల నుంచి మంచి ఆదరణ, ప్రతిస్పందనను పొందింది.

చలనచిత్ర దర్శకుడు, నాటక రచయిత గిరీష్ కర్నాడ్ కర్ణాటకలోని రెండు మధ్యయుగ భక్తి కవులపై కనక పురందర (ఇంగ్లీష్, 1988) అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రం తీసాడు. [6][7]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Karnatakada Mahasant Kanakadasa by M. Basavaraj,(2007) The Publications Division of the Ministry of Information and Broadcasting, Govt of India, http://www.publicationsdivision.nic.in/b_show.asp?id=857 Archived 2015-09-24 at the Wayback Machine
  2. Medieval Indian Literature, A Anthology (1997) by Shiva Prakash H.S., edited by Ayyappapanicker, Sahitya Akademi ISBN 8126003650, pages 198–200
  3. గబ్బిట, దుర్గాప్రసాద్. "భక్త కనకదాసు". సరసభారతి ఉయ్యూరు. Retrieved 30 April 2018.
  4. http://www.thehindu.com/todays-paper/tp-features/tp-editorialfeatures/a-peep-into-the-legend-of-kanakana-kindi/article13368669.ece
  5. http://www.thehindu.com/todays-paper/tp-opinion/for-human-resolve-not-miracles/article5954786.ece
  6. Kanaka-Purandara IMDB
  7. AWARDS: The multi-faceted playwright Frontline (magazine), Vol. 16, No. 03, January 30 - February 12, 1999.