Jump to content

ఎర్తా

వికీపీడియా నుండి
డిలోర్మి భవనం వెలుపల నుండి ఎర్తా
రెండు మోటార్లతో ఒక కాంటిలివర్ ఆర్మ్‌ ఉపయోగించిన బేస్ వద్ద ఎర్తా మౌటింగ్ (సెట్టింగు).

ఎర్తా అనేది ప్రపంచములోనే అతిపెద్ద గ్లోబు, ఇది అమెరికాలోని యార్‌మౌత్ ప్రాంతంలో ఉన్న డిలోర్మి మ్యాపింగ్ కార్పొరేషన్ యొక్క ప్రధాన కార్యాలయంలోని మూడంస్తుల గాజు మందిరంలో ఉంది, ఈ గ్లోబు యంత్రముల సహాయంతో భ్రమణం, పరిభ్రమణం చెందుతూ ఉంటుంది. 1998లో దీని నిర్మాణాన్ని ప్రారంభించారు, తరువాత ఇది ప్రపంచంలో అతిపెద్ద తిరిగే గ్లోబుగా గిన్నిస్ పుస్తకంలో రికార్డు సాధించింది. ఈ గ్లోబుపై ఒక్క మిల్లీమీటరు పొడవు భూమిపై ఒక కిలోమీటరుకు సమానంగా ఉండేలా దీనిని తయారు చేశారు. ఈ గ్లోబు యొక్క బరువు సుమారు 5,600 పౌండ్లు (2,500 కిలోలు),, 41 అడుగుల (12.5 మీటర్ల) వ్యాసాన్ని, 131 అడుగుల చుట్టుకొలతను కలిగి ఉంది. దేశదేశాల మ్యాపులను తయారు చేసే డీలోర్మే కంపెనీ దీనిని కచ్చితమైన కొలతలతో, వివిధ ప్రాంతాల గుర్తింపుతో త్రిమితీయ డైమెన్సల్‌లో రూపొందించింది. భూమిపై పర్వతాలు, కొండలు, లోయలు, ఎత్తుపల్లాలు ఉన్నట్లుగానే దీనిపై ఎత్తుపల్లాలు చాలా సహజంగా ఉంటాయి. భూ అసలు పరిమాణంలో పది లక్షలో వంతులో దీన్ని త్రిమీతియ డైమన్సన్‌లో రూపొందించటం వలన దీని యొక్క ఏ భాగానైనా పది లక్షల రెట్లు పెంచుకున్నట్లయితే ఆ భాగపు భూ విస్తీర్ణం తెలుస్తుంది, అనగా ఈ గ్లోబుపై ఒక అంగుళం దూరం భూమిపై 16 మైళ్ళకు (25 కిలోమీటర్లు) సమానమని చెప్పవచ్చు.

మూలాలు

[మార్చు]
  • సాక్షి దినపత్రిక - 22-08-2015 (గ్లోబ్‌లకే రారాజు..)