ఎక్స్‌ప్లెసివ్ వెల్డింగు
ఎక్స్‌ప్లెసివ్ వెల్డింగు (explosive welding) లేదా ఎక్స్‌ప్లోసన్ (explosion) వెల్డింగు విధానంలో పేలుడు పదార్థాన్ని ఉపయోగించి రెండు లోహ పలకలను అతికెదరు.Explosive అనే ఆంగ్ల పదానికి తెలుగులో పేలుడు అనే అర్థం.ఎక్స్‌ప్లెసివు/ఎక్స్‌ప్లోసన్ వెల్డింగు పద్ధతిలో సజాతీయ లోహాలనే కాకుండ విభిన్నమైన లోహాలను కూడా అతుకవచ్చును.మందమైన పలకనుకూడా అతుకవచ్చును.ఒకే పర్యాయం పెద్దశబ్దంతో మండుటను పేలుడు అంటారు.ఉదాహరణ టపాకాయను కాల్చినప్పుడు ఏర్పడు చర్య.ఈ వెల్డింగు విధానంలో అతుక వలసిన లోహ పలకలను ఒకదానిమీద మరొకటి వుండేలా అమర్చి (రెండు పలకమధ్యకొంత ఖాళి వుండేలా వుంచెదరు) పై పలకమీద పేలుడు పదార్థాన్ని వుంచి పేల్చుట ద్వారా అతికెదరు.
చరిత్ర
[మార్చు]పేలుడు పదార్థాలను పేల్చడం వలన లోహాలను అతుకవచ్చుననే విషయాన్ని అనుకోకుండ మొదటి ప్రపంచయుద్ధకాలంలో గుర్తించడం జరిగింది.యుద్ధంలో పిరంగి గుండులను బాంబులను ప్రయోగించినప్పుడు వాటి లోహపు తొడుగులు అతుక్కుపోవడం గమనించారు.1944 లో కార్ల్ చే గుర్తించబడినదని భావించబడింది.అలాగే అమెరికాకు చెందిన పియర్‌సన్ ఈ వెల్డింగు ప్రధాన్యతను గుర్తించాడు.1957 నుండి ఎక్స్‌ప్లోసివ్ వెల్డింగు పై అమెరికా, రష్యాలలో ప్రయోగాలు జరిపి వెల్డింగు విధానాన్ని మెరగు పరచారు[1] 1962 లో ద్యూపాంట్ (dupont) ఈ వెల్డింగు పై సన్నదు/ప్రత్యేక హక్కు (patent) కై దరఖాస్తు చేసుకోగా ఆయబకు ఈ వెల్డింగు విధానంపై 1964 లో ప్రత్యేక హక్కును మంజూరుచెయ్యడమైనది.డేటక్లాడ్ అను వ్యాపార నామంతో వ్యాప్తి చెయ్యబడింది.1996 జూలై 22 న డైనమిక్ కార్పోరెసన్ వారు వెల్డింగు పై సర్వహక్కులను హక్కులను కొనుగోలు చేసారు [2]
ఎక్స్‌ప్లెసివ్ వెల్డింగు
[మార్చు]నిర్వచనం: ఎక్స్‌ప్లెసివ్ వెల్డింగు లేదా ఎక్స్‌ప్లెసివ్ క్లాడింగు అనే వెల్డింగు విధానం లోహాలను ఘనస్థితిలో వుండగానే, ప్రత్యేకంగా వేడి చెయ్యడంకాని, లోహాలపై బాహ్యపీడనం/బలం వంటివి ఉపయోగించకుండ కేవలం పేలుడు పదార్థాలను లోహ పలకలమీద మండించడం/పేల్చుటద్వారా అతికే విధానం[3] కార్బను ఉక్కు పలకలను క్షయీకరణ (corrosion) ను బాగా నిలువరించే గుణమున్న స్టెయిన్‌లెస్ స్టీల్, నికెల్, దాని మిశ్రధాతువులతో, జిర్కోనియం లోహాలతో అతుకుటకు ఎక్కువగా ఎక్స్‌ప్లెసివ్ వెల్డింగు పద్ధతిని వాడెదరు.[4]
ఎక్స్ప్లెసివ్ వెల్డింగులో అతుకబడు లోహాలలో క్రింది లోహాన్నిపీఠలోహము లేదా ఆధార లోహము (base metal) అంటారు.ఆధార లోహ పలక పైన వుంచు లోహాన్ని పరివేస్టిత లేదా కప్పివుంచు లోహం (cladding metal) అంటారు.పీఠ/ఆధార లోహ పలకలుగా ఉక్కు మిశ్రధాతువులను, అల్యూమినియం, కార్బను ఉక్కును, స్టెయిన్‌లెస్ స్టీల్ ను వాదెదరు.అలాగే కప్పివుంచు లేదా పరివేస్టిత లోహాలుగా అల్యూమినియం, రాగి, రాగియొక్క మిశ్రధాతువు, నికెల్ మిడ్ర ధాతువు, స్టెయిన్‌లెస్ స్టీల్, టాంటలం, టైటానియం, జిర్కోనియం లను ఉపయోగిస్తారు [5]
ఎక్స్‌ప్లోసన్ వెల్డింగు చెయ్యులొహాలు
[మార్చు]ఈ దిగువన పేర్కొన్న లోహాలను, వాటి మిశ్రధాతువులను సాధారణంగా ఎక్స్‌ప్లోసివ్ వెల్డింగ్/క్లాడింగ్ చెయ్యుదురు[6]
- తుప్పుపట్టని ఉక్కు
- డ్యూప్లెక్షుస్టీల్
- టైటానియం
- అల్యూమినియం
- రాగి, దాని మిశ్రధాతువులు
- నికెల్ దాని మిశ్ర ధాతువులు
- టాంటాలం
- జిర్కోనియం
ఇవికూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- [1][permanent dead link] ఎక్స్‌ప్లోసివ్ వెల్డింగు నకు సంబంధించిన చిత్రాలు
- [2] U Tube లో ఎక్స్‌ప్లోసివ్ వెల్డింగు వీడియో
సూచికలు
[మార్చు]- ↑ welding technology by O.P.khanna
- ↑ "Explosion welding". reference.com. Retrieved 7 March 2014.[permanent dead link]
- ↑ "What Is Explosion Welding?". wisegeek.com. Retrieved 7 March 2014.
- ↑ "Explosion Welding". weldmyworld.com. Archived from the original on 22 అక్టోబరు 2014. Retrieved 7 March 2014.
- ↑ "EXPLOSION WELDING BIMETAL TRANSITIONS FOR WEIGHT MANAGEMENT,PAPER#3492" (PDF). dynamicmaterials.com. Retrieved 7 March 2014.
- ↑ "Explosive Cladding". smt-holland.com. Retrieved 7 March 2014.