ఇమామ్-ఉల్-హక్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | [1] ముల్తాన్,[2] పంజాబ్, పాకిస్తాన్ | 1995 డిసెంబరు 22|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | ఇమామ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 9 అం. (175 cమీ.)[3] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | టాప్-ఆర్డర్ బ్యాటర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | ఇంజమామ్-ఉల్-హక్ (మామ) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 231) | 2018 మే 11 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 24 జులై - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 215) | 2017 18 అక్టోబర్ - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 10 సెప్టెంబర్ - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 81) | 2019 మే 5 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2019 8 నవంబర్ - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/13 | Lahore Shalimar | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014/15–2015/16 | ఖాన్ ల్యాబ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016/17–2017/18 | హబీబ్ బ్యాంక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019–2022 | పెషావర్ జాల్మి (స్క్వాడ్ నం. 26) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019–2023 | బలూచిస్తాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | సోమర్సెట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 7 సెప్టెంబర్ 2023 |
ఇమామ్-ఉల్-హక్ (జననం 1995, డిసెంబరు 22) పాకిస్తానీ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు.[4] శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే ఇంటర్నేషనల్ లో, పాకిస్తాన్ తరపున రెండవ బ్యాట్స్‌మన్‌గా,అరంగేట్రంలోనే సెంచరీ చేసిన మొత్తం మీద పదమూడవ బ్యాట్స్‌మన్ గా నిలిచాడు.[5][6] 2018 ఆగస్టులో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ద్వారా 2018–19 సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన 33 మంది ఆటగాళ్ళలో ఇతను ఒకడు.[7][8]
దేశీయ క్రికెట్
[మార్చు]2016–17 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ ఫైనల్‌లో, హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ తరపున బ్యాటింగ్ చేస్తూ 200 పరుగులు చేశాడు.[9] 2017–18 నేషనల్ టీ20 కప్ ఫైనల్‌లో, లాహోర్ బ్లూస్ తరపున 59 నాటౌట్ బ్యాటింగ్ చేశాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.[10]
2022 జూలైలో, ఇంగ్లాండ్‌లోని కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో తమ చివరి నాలుగు మ్యాచ్‌లలో ఆడేందుకు సోమర్‌సెట్‌తో సంతకం చేశాడు.[11]
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]2017 అక్టోబరులో, శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం పాకిస్తాన్ వన్డే జట్టులో అతను ఎంపికయ్యాడు.[12] 2017 అక్టోబరు 18న శ్రీలంకతో జరిగిన వన్డే అరంగేట్రంలో, తన వన్డే సెంచరీని సాధించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.[13] సలీమ్ ఇలాహి తర్వాత అరంగేట్రంలోనే వన్డే సెంచరీ చేసిన రెండో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.[14]
2018 మే జరిగిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం 2018 ఏప్రిల్ లో పాకిస్తాన్ టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. 2018 మే 1న ఐర్లాండ్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు.[15] [16] మ్యాచ్ చివరి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.[17]
2018 జూలై 20న, జింబాబ్వేతో జరిగిన నాల్గవ వన్డేలో ఫఖర్ జమాన్ తో కలిసి304 పరుగులతో వన్డేలలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.[18] పాకిస్థాన్ ఒక వికెట్ నష్టానికి 399 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది, ఇది వన్డేల్లో శ్రీలంక అత్యధిక స్కోరు.[19] జమాన్, ఇమామ్ సిరీస్‌లో కలిసి 705 పరుగులు చేశారు.[20]
2019 జనవరిలో, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డే సమయంలో, ఇమామ్ తన 19వ ఇన్నింగ్స్‌లో వన్డేలలో 1,000 పరుగులు చేసిన రెండవ అత్యంత వేగంగా బ్యాట్స్‌మెన్ అయ్యాడు.[21]
2019 ఏప్రిల్ లో, 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[22][23] 2019 మే 5న ఇంగ్లాండ్‌పై పాకిస్తాన్ తరపున తన ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు.[24] క్రికెట్ ప్రపంచ కప్‌కు ముందు, ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో, మూడో వన్డే మ్యాచ్‌లో ఇమామ్ 151 పరుగులు చేశాడు. వన్డే ఇంటర్నేషనల్‌లో ఇంగ్లండ్‌పై పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.[25]
2020 జూన్ లో, కరోనా-19 మహమ్మారి సమయంలో ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ పర్యటన కోసం 29 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు.[26][27] జులైలో, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల కోసం పాకిస్థాన్ 20 మంది సభ్యుల జట్టులో అతను షార్ట్‌లిస్ట్ చేయబడ్డాడు.[28][29] 2021 జూలైలో, ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో, వన్డే క్రికెట్‌లో తన 2,000వ పరుగును సాధించాడు.[30]
2022 మార్చిలో, ఆస్ట్రేలియాతో సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో, ఇమామ్ టెస్ట్ క్రికెట్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు.[31] రెండో ఇన్నింగ్స్‌లో, మరో సెంచరీని సాధించాడు, టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన పాకిస్థాన్ తరఫున పదో బ్యాటర్ అయ్యాడు.[32]
2023 ఆగస్టు 22న, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన 3 వన్డేల సిరీస్‌లో ప్రారంభ మ్యాచ్‌లో, ఇమామ్ 61 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు, శ్రీలంకలోని హంబన్‌తోటలోని మహీంద రాజపక్స ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, సోరియవేవాలో పాకిస్తాన్ బ్యాటింగ్ లైన్ అంతా కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 142 పరుగుల తేడాతో విజయం సాధించగా, ఇమామ్ అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[33]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఇతను 1995, డిసెంబరు 22న ముల్తాన్‌లో జన్మించాడు. ఇతను పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ మేనల్లుడు.[34][35] ఇతని పూర్వీకులు[36] 1947లో ప్రస్తుత భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని హన్సి నగరం నుండి పాకిస్తాన్‌కు వలస వచ్చారు.
మూలాలు
[మార్చు]- ↑ "Imam-ul-Haq". Pakistan Cricket Board. Retrieved 22 December 2020.
- ↑ "Imam-ul-Haq reveals special connection with Multan ahead of West Indies ODIs". Samaa. Retrieved 11 June 2022.
- ↑ Imam-ul-Haq's profile on Sportskeeda
- ↑ "Meet the new faces in the Pakistan Test squad". International Cricket Council. Retrieved 22 May 2018.
- ↑ "Records / One-Day Internationals / Batting records / Hundred on debut". ESPN Cricinfo. Retrieved 19 October 2017.
- ↑ "Hasan five-for, he debut ton sink Sri Lanka". ESPN Cricinfo. Retrieved 18 October 2017.
- ↑ "PCB Central Contracts 2018–19". Pakistan Cricket Board. Retrieved 6 August 2018.
- ↑ "New central contracts guarantee earnings boost for Pakistan players". ESPN Cricinfo. Retrieved 6 August 2018.
- ↑ "Quaid-e-Azam Trophy, Final: Habib Bank Limited v Water and Power Development Authority at Karachi, Dec 10–15, 2016". ESPN Cricinfo. Retrieved 14 December 2016.
- ↑ "Final (D/N), National T20 Cup at Rawalpindi, Nov 30 2017". ESPN Cricinfo. Retrieved 30 November 2017.
- ↑ "Imam-ul-Haq roped in by Somerset County Cricket club". Geo News. Retrieved 4 July 2022.
- ↑ "Imam-ul-Haq called up to Pakistan's ODI squad". ESPN Cricinfo. Retrieved 6 October 2017.
- ↑ "3rd ODI (D/N), Sri Lanka tour of United Arab Emirates and Pakistan at Abu Dhabi, Oct 18 2017". ESPN Cricinfo. Retrieved 18 October 2017.
- ↑ "Imam-ul-Haq becomes 2nd Pakistani to score century on debut". www.geo.tv (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 19 October 2017.
- ↑ "Only Test, Pakistan tour of Ireland, England and Scotland at Dublin, May 11-15 2018". ESPN Cricinfo. Retrieved 12 May 2018.
- ↑ "Ireland win toss, opt to bowl in historic Test against Pakistan". Geo TV. Retrieved 12 May 2018.
- ↑ "Fakhar, Imam receive maiden call-ups to Ireland, England Tests". ESPN Cricinfo. Retrieved 15 April 2018.
- ↑ "Fakhar Zaman, Imam-Ul-Haq Break All-Time Opening Partnership Record In ODIs". NDTV. Retrieved 20 July 2018.
- ↑ "Records galore as Pakistan rewrite history in Bulawayo". The Express Tribune. Retrieved 20 July 2018.
- ↑ "Fakhar Zaman, Imam-ul-Haq march into the record books". International Cricket Council. Retrieved 22 July 2018.
- ↑ "Imam outpaces Kohli and Azam, reaches 1000 ODI runs". Business Recorder. Retrieved 25 January 2019.
- ↑ "Mohammad Amir left out of Pakistan's World Cup squad". ESPN Cricinfo. Retrieved 18 April 2019.
- ↑ "Amir left out of Pakistan's World Cup squad". International Cricket Council. Retrieved 18 April 2019.
- ↑ "Only T20I, Pakistan tour of England at Cardiff, May 5 2019". ESPN Cricinfo. Retrieved 5 May 2019.
- ↑ "Imam century powers Pakistan to 358-9 in third ODI against England". Yahoo! Sports. Archived from the original on 14 మే 2019. Retrieved 14 May 2019.
- ↑ "Haider Ali the new face as Pakistan name 29-man touring party for England". ESPN Cricinfo. Retrieved 12 June 2020.
- ↑ "Haider Ali named in 29-player squad for England tour". Pakistan Cricket Board. Retrieved 12 June 2020.
- ↑ "Pakistan shortlist players for England Tests". Pakistan Cricket Board. Retrieved 27 July 2020.
- ↑ "Wahab Riaz, Sarfaraz Ahmed in 20-man Pakistan squad for England Tests". ESPN Cricinfo. Retrieved 27 July 2020.
- ↑ "James Vince trumps Babar Azam's 158 as England seal stunning 332 chase". ESPN Cricinfo. Retrieved 13 July 2021.
- ↑ "Imam-ul-Haq seizes second Australia chance". Shepparton News. Retrieved 4 March 2022.
- ↑ "Imam, Shafique hit tons as Test ends in tame draw". ESPN Cricinfo. Retrieved 9 March 2022.
- ↑ "afghanistan-v-pakistan-2023-1392508/afghanistan-vs-pakistan-1st-odi". ESPN Cricinfo. Retrieved 22 August 2023.
- ↑ "Imam-ul-Haq: Pakistan great Inzamam's nephew hits debut 100 against Sri Lanka". BBC Sport. Retrieved 18 October 2017.
- ↑ "Imam-ul-Haq set for 'dream' Pakistan Test debut". ESPN Cricinfo. Retrieved 9 May 2018.
- ↑ "Inzamam-ul-Haq, 28 May 1997". Outlook India. Retrieved 4 February 2020.