Jump to content

ఇత్తడి

వికీపీడియా నుండి
Aఇత్తడి పేపర్ వెయిట్ లేదా ఆటలకు వాడు గుండు, జింక్, కాపర్ యొక్క సాంపిల్స్
దస్త్రం:Copper decorative article .JPG
తయారు కాబడి ఉన్న వివిధ రకాల ఇత్తడి (ఇస్త్రీ పెట్టెలు, పళ్లెములు, పూజా బల్లలు, అలంకరణ సామగ్రి) వస్తువులు
దస్త్రం:Brass articles.JPG
రకరకాలైన ఇత్తడి బిందెలు

ఇత్తడి (Brass) ఒక మిశ్రమ లోహము. దీనిలో ముఖ్యంగా రాగి, జింకు ఉంటాయి. ఇత్తడి లోహమును ముద్దలుగా మార్చి దానినుండి పలుచటి రేకులుగా మార్చి తదుపరి వస్తువుల తయారీ కొరకు ఉపయోగిస్తారు. ఇత్తడి వాడుకలో భారతదేశము, ఆసియా దేశాలు ముందున్నాయి. ఈ దేశాలలో నిత్యము వాడు వస్తువులతో పాటుగా దేవాలయాలలో దీని వినియోగం అధికం

ఇత్తడి తయారీలో ఉపయోగించు ధాతువులు

[మార్చు]

రాగి, జింకు/యశదం లోహాలను మిశ్రం చేసి బట్టి పెట్టి రెండింటిని ద్రవీకరించి సమ్మేళనము చెయ్యడం వలన ఈరెండింటి మిశ్రమ ధాతువు ఇత్తడి ఏర్పడుతుంది. ఇత్తడిలో జింకు శాతం 37 నుండి 45 % వరకు ఉంటుంది[1].ఇత్తడికి కొంచెం దృఢత్వం, సులభంగా తరణి పట్టునట్టు చేయుటకై సీసాన్ని స్వల్ప ప్రమాణంలో కలుపుతారు.రాగిలో 37 % వరకు జింకును కలిపినప్పుడు ఒకేదశలో చేత/దుక్క విధానంలో చేయుదురు. ఒకేదశలో పోత పోసిన లోహానికి పలకలుగా సాగేగుణం అధికంగా ఉంటుంది.రాగిలో 37 % కన్న ఎక్కువ ప్రమాణంలో జింకును కలిపి తయారుచేయవలసిన దానిని రెండంచల పద్ధతిలోచేయుదురు.రెండంచల విధానంలో ఉత్పత్తి చేసిన ఇత్తడికి దృఢత్వం ఎక్కువ ఉంటుంది, కాని సాగే గుణం తక్కువ. రెండంచల పద్ధతిలో ఇత్తడిని పోత విధానము (cast ing) పద్ధతిలో తయారు చేయుదురు.

ఇత్తడినిగృహ నిర్మాణ అవసరాలకు వాడెదరు..పాత్రలను పాత్ర భాగాలను తయారు చేయుటకు వాడెదరు.తలుపు గడియలు, ప్లగ్గులు, విద్యుత్ ఉపకరణాలు, తాళాలు, పంపులకు లోపలి భాగాలు, బోల్టులు, నట్టులు, ల్యాంప్ ఫిట్టింగులు, రేడియేటర్ అంతర్భాగాలు చేయుటకు ఉపయోగిస్తారు.సాధారణంగా ఇత్తడిని రెండు రకాలుగా విభజింప/వర్గికరించ వచ్చును.[2]

  • అల్పా మిశ్రమ ధాతువు .ఇందులో 37 %కన్న తక్కువగా జింకును కలుపుతారు.ఈ రకం మిశ్రమ ధాతువు సాగే గుణం కలిగిఉండును.
  • బీటా లేదా డుప్లెక్షు మిశ్రమ ధాతువు, ఇందులో జింకు శాతం 37 -45 % మధ్యలో కలుపబడి ఉండును.వీటికి దృఢత్వం ఎక్కువ వుంది, పలకలుగా సాగు లక్షణం తక్కువగా ఉండును.

రాట్ (దుక్క) పద్ధతిలో చేసిన ఇత్తడిని 3 వర్గాలుగా వర్గించవచ్చును.

  • రాగి-జింకు మిశ్రమం
  • రాగి-జింకు-తగరం మిశ్రమం
  • రాగి-జింకు-సీసం మిశ్రమం

పోత విధానం (casting ) లో ఉత్పత్తి చేసిన ఇత్తడిని స్తూలంగా 4 రకాలుగా వర్గీకరించవచ్చును.

  • రాగి-తగరము-జింకుల మిశ్రమ ధాతువు (ఎరుపు, మధ్యస్త ఎరుపు, పసుపు రంగు ఇత్తడి .
  • మాంగనీసు- కంచుల ధాతువు.ఎక్కువ దృఢంగా ఉండి, పసుపు వర్ణంలో ఉండును
  • రాగి-జింకు –సిలికానులమిశ్రమ లోహం .వీటిని సిలికాన్ ఇత్తడిలేదా కంచు అంటారు.
  • రాగి –బిస్మతుల మిశ్రమ లోహం లేదా రాగి –బిస్మతు-సేలియం ల మిశ్రమ లోహం

రాగిలో జింకులో వివిధ నిష్పత్తిలో కలుపగా ఏర్పడిన ఇత్తడిమిశ్రమ ధాతువుకు వాడుకలో వివిధ పేర్లుకలవు.అలా వివిధ వాడుక పేర్లు ఉన్న కొన్ని ఇత్తడి మిశ్రమ ధాతువులు వాటిలో కలుపబడిన జింకు లేదా ఇతర లోహాల నిష్పత్తి పట్టికను దిగువన ఇవ్వడమైనది[3]

వాడుకపేరు మిశ్రమ నిష్పత్తి
పసుపురంగు ఇత్తడి 33 %జింకు ఉన్నమిశ్రమ ధాతువు (అమెరికాలో )
తెల్ల ఇత్తడి 50 % మించి జింకు కలుపబడింది.పెళుసుగా వుండును.
రాగి +జింకు+తగరం, రాగి+నికెల్ మిశ్రమ ధాతువును కూడా తెల్ల ఇత్తడి అంటారు
ఎర్ర ఇత్తడి ఇందులో రాగి 8 5 %, తగరం 5 %, సీసం 5 %, జింకు 5% కలుపబడి ఉండును
నికెల్ ఇత్తడి రాగి 70 %, +జింకు 24 .5 %+5.5%నికెల్, నాణెములతయారిలో వాడెదరు.
TOM BAC ఇత్తడి 15 % జింకు కలుపబడి ఉండును .ఆభరణాల తయారీలో వాడెదరు .
నోర్డిక్ గోల్డ్ రాగి 8 9%, జింకు 5 %, అల్యూమినియం 5%, తగరం 1%, యూరో నాణేల తయారీలో
ఉపయోగిస్తారు.
నావల్ ఇత్తడి ఇందులో 40 % జింకు, 1 % తగరం, మిగిలినది రాగి
మాంగనీస్ ఇత్తడి రాగి 70, జింకు 29 % వరకు, మాంగనీస్ 1.3 % వరకు మిశ్రమం చెయ్యబడి ఉండును.
అల్ఫా ఇత్తడి 35 % కన్న తక్కువ నిష్పత్తిలో జింకు కలుపబడి ఉండును.
సాధారణ ఇత్తడి 37 % జింకు కలుపబడి ఉండును, దీనిని రివెట్ ఇత్తడి అనికూడా అంటారు .
గిల్దింగు లోహం 95 % రాగి, 5 % జింకు కలిగిన మిశ్రమ ధాతువు
మందు గుండుల వెలుపలి కవచాలు తయారు చేయుదురు.
cartrige ఇత్తడి 30% జింకు కలుపబడి ఉంది.

ఇత్తడితో చెయ్యు వస్తువులు

[మార్చు]

వస్తువుల తయారీ కొరకు ఇత్తడి రేకులను కాల్చి సుత్తులతో మోదుతూ వెదలుచేసుకుంటూ కావలసిన ఆకారానికి మార్చి వాటిని అతికించి ఫాలీష్ చేసి అమ్ముతారు.

  • పెళ్ళి, శుభకార్యక్రమములకు తప్పని సరిగా ఇత్తడి బిందెలు, పళ్ళెము పెట్టడం మన సంప్రదాయముగా వస్తున్నది.
  • బట్టల చలువచేయుటకు వాడు ఇస్త్రీ పెట్టెలు ఇత్తడి వాడుతారు.
  • ఆస్తి పరుల ఇళ్ళలో అలంకార సామగ్రి, వస్తు సముదాయాలు,
  • పరిశ్రమలలో యంత్ర పరికరాల తయారీ,

నిత్యావసర వస్తువులు, తయారీ

  • ఆహార పాత్రలు, గ్లాసులు, పళ్ళెములు ఇతర వంట పాత్రలు.
  • పూజా పాత్రలు, పూజా సంభంద ఇతర వస్తువులు.
  • దేవుడి ప్రతిమలు, మండపములు

దేవాలయాలలో

[మార్చు]
  • దేవాలయాలలో తప్పని సరిగా ఉండే ఘంట కొరకు ఇత్తడి వాడుతారు.
  • దేవాలయాల ద్వారముల మొదలు శిఖరాల వరకూ ఇత్తడి వినియోగం జరుగుతున్నది.
  • ప్రతి దేవాలయములో ధ్వజస్తంభము ఉండును. వాటికి వాడు ప్రధాన లోహము ఇత్తడి.

ఇతర విశేషాలు

[మార్చు]
  • ఇత్తడి వస్తువుల తాయారీలో మన రాష్ట్రములోని అజ్జరం గ్రామం ప్రసిద్ధి చెందినది. ఇక్కడ అనేక ఇత్తడి, కంచు, రాగి వస్తువుల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట గ్రామం కూడా ఇత్తడి, రాగి వస్తువులు, పూజాసామాగ్రి తయారీలో శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది.

ఇవికూడా చూడండి

[మార్చు]

ఉల్లేఖనములు

[మార్చు]
  1. "What Is Brass?". wisegeek.com. Retrieved 2015-03-04.
  2. "Classification and Properties of Copper Alloys". keytometals. Retrieved 2014-03-03.
  3. "Brass Alloys". chemistry.about. Archived from the original on 2015-04-02. Retrieved 2015-03-04.