Jump to content

బనస్కాంత జిల్లా

వికీపీడియా నుండి
బనస్ కాంతా జిల్లా
district
బలరామ్ నది
బలరామ్ నది
Location of Banskantha in the Northeast of Gujarat
Location of Banskantha in the Northeast of Gujarat
Country India
రాష్ట్రంగుజరాత్
ప్రధాన కార్యాలయంPalanpur
Government
 • District CollectorateSri.Dilip Rana I.A.S
విస్తీర్ణం
 • Total10,400.16 కి.మీ2 (4,015.52 చ. మై)
జనాభా
 (2001)
 • Total25,04,244
 • జనసాంద్రత233/కి.మీ2 (600/చ. మై.)
భాషలు
 • అధికారగుజరాతీ, హిందీ
Time zoneUTC+5:30 (IST)

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో బనస్‌కాంతా జిల్లా ఒకటి. పాలన్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ( జిల్లాలో పెద్ద నగరంగా) ఉంది. ఇది గుజరాత్ రాష్ట్ర ఈశాన్య భూభాగంలో ఉంది. ఆదవల్లీ పర్వతావళిలో ఉన్న మౌంట్ అబూ నుండి ప్రవహిస్తున్న పశ్చిమ బనాస్ నది ఈ జిల్లాలో ప్రవహిస్తున్నందున ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఈ నది ఇక్కడి నుండి కచ్ వైపు ప్రవహిస్తుంది. జిల్లాలో ఉన్న అంబాజీ ఆలయం, బలరాం ఆలయం అనేకమంది యాత్రీకులను ఆకర్షిస్తూ ఉంది.

భౌగోళికం

2001 గణాంకాలను అనుసరించిబనస్‌కాంతా జనసంఖ్య 2,504,244. వీరిలో నగరంలో నివసిస్తున్నవారు 11%. జిలా వైశాల్యం 10,751. రాష్ట్రంలో వైశాల్యపరంగా పరగా రండవ స్థానంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రం, తూర్పు సరిహద్దులో సబర్‌కాంతా జిల్లా, పశ్చిమ సరిహద్దులో కచ్ జిల్లా దక్షిణ సరిహద్దులో పఠాన్ జిల్లా, మహెసనా ఉన్నాయి.

ఆర్ధికం

జిల్లా ఆర్థికరంగం ప్రధానంగా వ్యవసాయం, రెడీమేడ్ ఆహార తయారీ, పర్యాటకం, వస్త్రాల తయారీ, ఖనిజాలు మీద ఆధారపడిన పరిశ్రమలు, సెరామిక్ తయారీ ఉంది. పారిశ్రామిక పెట్టుబడులు 57% ఆహారతయారీ పరిశ్రమలలో, 17.67% కూరగాయల ఉత్పత్తి రంగలో ఉన్నాయి. గత 2 దశాబ్ధాలుగా ఈ జిల్లా టమేటా ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో బజ్రి, మొక్కజొన్న, పొగాకు, ఆముదపు గింజలు, జొన్నలు మొదలైనవి పండించబడుతున్నాయి. జిల్లాలో లైంస్టోన్, పాలరాయి, గ్రానైట్, బిల్డింగ్ రాళ్ళు, చైనా క్లే మొదలైన ఖనిజాలు లభ్యమౌతున్నాయి. రాష్ట్రంలో పాలరాయి ఉతత్తులో 99.3%, లైంస్టోన్ ఉతపత్తిలో 15% ఈ జిల్లాలో ఔతుంది. జిల్లాలో ఉన్న సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ గుజరాత్ రాష్ట్రంలో ప్రధానమైన కో ఆపరేటివ్ బ్యాంక్ లలో ఒకటిగా గురించబడుతుంది. జిల్లాలో ప్రధానంగా సజ్జలు అధికంగా పండించబడుతున్నాయి.జిల్లాలో అగ్రికల్చరల్ యూనివర్శిటీ, సరదార్ క్రుషినగర్ దంతెవాడ అగ్రికల్చరల్ యూనివర్శిటీ, సరదార్ క్రుషినగర్ వంటి వంటి విద్యాసంస్థలు ఉన్నాయి.[1] 2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బనస్‌కాంతా జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న గుజరాత్ రాష్ట్ర 6 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

విభాగాలు

తాలూకాలు

జిల్లాలో 12 తాలూకాలు ఉన్నాయి.

పట్టణాలు

జిల్లాకేంద్రంగా పలంపూర్ ఉంది. ఇది జిల్లాలో పెద్ద నగరంగా ఉంది.

  • పలంపుర్
  • దీస
  • థరద్
  • ధనెర
  • థర
  • భభర్
  • దియోదర్ (విధాన్ సభ నియోజకవర్గం )

రాజకీయం

బనస్కాంతా జిల్లాలో 9 అసెంబ్లీ నియోజక వర్గాలు మరుయు ఒక పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది.

9 అసెంబ్లీ నియోజక వర్గాలు.

  • వవ్
  • థరద్
  • ధనెర
  • దంత
  • పలంపుర్
  • దీస
  • ద్యోదర్
  • వద్గం
  • కంక్రెజ్

ప్రయాణ సౌకర్యాలు

జిల్లాలోని పాలంపూర్, దీస నగరాలు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలతో చక్కగా అనుసంధానించబడి ఉన్నాయి. .

రహదారి

  • జాతీయరహదారి 15 జిల్లాను పఠాన్‌కోట్, అమృత్సర్, భంతిడ, గంగానగర్, బికనీర్, కండ్ల, జైసల్మేర్ జిల్లాలతో అనుసంధానిస్తూ ఉంది.
  • జాతీయరహదారి 14 జిల్లాను (రాజస్థాన్ రాష్ట్రం లోని బీవార్ - రథాన్‌పూర్ ) ఈ జిల్లా మీదుగా పయనిస్తుంది.
  • రాష్ట్రీయ రహదారి 7 జిల్లాను అహమ్మదాబాదు, పటాన్ జిల్లా లతో అనుసంధానిస్తూ ఉంది.
  • రాష్ట్రీయ రహదారి 9 జిల్లాను ప్రముఖ యాత్రా గమ్యస్థానం అంబాజీతో అనుసంధానిస్తూ ఉంది.
  • జిల్లాలో 41, 54, 56, 63, 72, 127, 128, 129, 130 and 132 రహదార్లు జిల్లాను రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ ఉంది.

రైలు మార్గం

పాలన్‌పూర్ జంక్షన్ జిల్లాలో పెద్దదిగానూ, ప్రధానమైనదిగానూ ఉంది. ఇది జిల్లాను ముంబై - అహమ్మదాబాదు - జైపూర్ - ఢిల్లీ వంటి దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తూ ఉంది. ఇక్కడ నుండి జిల్లాలోని దీసా, డియోదర్, ధనెరా, భభర్‌లకు చేరుకోవచ్చు..

వాయు

  • దీస విమానాశ్రయం, దీస, బనస్ కాంతా.
  • జిల్లాలోని పాలంపూర్ వద్ద " ఎయిర్ స్ట్రిప్ " ఉంది.
  • జిల్లాకు సమీపంలో ఉన్న అంర్జాతీయ విమానాశ్రయాలు :అహమ్మదాబదు వద్ద ఉన్న సర్ధార్ వల్లభాయ్ పఠేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టులు

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,116,045,[3]
ఇది దాదాపు. మంగోలియా దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. లోవా నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 111 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 290 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 24.43%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 936:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 66.39%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

ప్రముఖులు

  • లేట్ శ్రీశ్రీ పాలన్పూర్ నవాబ్ సాహెబ్ దివాన్ ఖాన్ మహాఖన్ శ్రీ టలెయ్ ముహమ్మద్ ఖంజి జలోరీ.
  • కీ.శే తాకోరే సాహెబ్ ఖాన్ శ్రీ గులాబ్ ఖంజి కేసర్ ఖంజి మందొరి జలోరీ డీస.
  • చంద్రకాంత్ బక్షి (1932-2006) రచయిత. పాలన్పూర్ లో జన్మించారు.
  • షూని పలంపురి, గుజరాతీ కవి
  • Late Galbabhai Nanjibhai Patel - Founder Chairman of Banas Dairy, Palanpur

మూలాలు

  1. "Sardarkrushinagar Dantiwada Agricultural University". Archived from the original on 2015-01-18. Retrieved 2014-11-13.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Mongolia 3,133,318 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Iowa 3,046,355

వెలుపలి లింకులు

మూలాలు

వెలుపలి లింకులు

మూస:గుజరాత్ లోని జిల్లాలు